car sell
-
లగ్జరీ కార్లకు పండుగ జోష్.. రికార్డ్ స్థాయిలో అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది అత్యుత్తమ పనితీరును సాధించగలమని లగ్జరీ కార్ల పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఓనం నుండి దీపావళి వరకు ఈ పండుగ సీజన్ గత సంవత్సరాల కంటే మెరుగ్గా ఉంది. అనేక కొత్త మోడళ్లు, ఆకర్షణీయమైన పోర్ట్‌ఫోలియో, బలమైన కస్టమర్ సెంటిమెంట్ ఈ జోష్‌కు కారణమని మెర్సిడెస్–బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. దసరా, ధన్తేరస్, దీపావళి సందర్భంగా రికార్డు స్థాయిలో డెలివరీలు జరగడం కస్టమర్ల ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. సానుకూల పరిశ్రమ దృక్పథంతో కొనసాగుతున్నామని, ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌యూవీల ఉత్పత్తి, లభ్యతను ప్రభావితం చేస్తూ సరఫరా సంబంధిత ఆటంకాలు కొనసాగే అవకాశం ఉందని వివరించారు. భారత్‌లో 2023 ఆగస్టు 17 నుంచి నవంబర్ 14 మధ్య మొత్తం ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు 10 లక్షల మార్కును దాటాయి. ఏడేళ్లలో గరిష్టం.. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌లో 5,530 యూనిట్ల అమ్మకాలతో కంపెనీ 88 శాతం వృద్ధిని సాధించిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఇటీవలి కాలంలో అత్యధిక ఆర్డర్ బుక్‌తో కొనసాగుతున్నట్టు వెల్లడించారు. ఈ పండుగ సీజన్ ఆడి ఇండియాకు పెద్ద వేడుకగా నిలిచిందన్నారు. గత ఏడు సంవత్సరాలతో పోలిస్తే అత్యధిక అమ్మకాలను ఈ సీజన్లో నమోదు చేశామన్నారు. ఏ4, క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్, క్యూ5, ఎస్5 స్పోర్ట్బ్యాక్లతో సహా ఉత్తమ విక్రయాలతో నిరంతర డిమాండ్ కారణంగా వృద్ధి నమోదైందని ధిల్లాన్ చెప్పారు. పండుగల సీజన్లో కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్‌లో ఢిల్లీ, ముంబై ముందంజలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌ల నుండి కూడా మంచి డిమాండ్‌ను చూస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది భారత్‌లో లగ్జరీ కార్ల పరిశ్రమ 2018 స్థాయి అమ్మకాలను అధిగమిస్తుందని, 46,000–47,000 యూనిట్ల మార్కును చేరుకుంటుందని జోస్యం చెప్పారు. ఆడి ఇండియా అధిక రెండంకెల వృద్ధితో 2023ను ముగించాలని చూస్తోందని వివరించారు. 2027 నాటికి 1.54 బిలియన్ డాలర్లు.. పండుగ సందర్భంగా కొన్ని శక్తివంతమైన కార్లు, మోటార్‌సైకిళ్లను విడుదల చేశామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. ఈ వేగాన్ని కంపెనీ కొనసాగిస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటి. అలాగే మిలియనీర్ల సంఖ్య పరంగా 3వ అతిపెద్ద దేశమని లంబోర్గీని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. ‘2021లో భారతీయ లగ్జరీ కార్ మార్కెట్ విలువ 1.06 బిలియన్ డాలర్లు. 2027 నాటికి 1.54 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 2022–2027 అంచనా కాలంలో 6.4 శాతం కంటే ఎక్కువ సగటు వార్షిక వృద్ధి నమోదవుతుంది’ అని పేర్కొన్నారు. కస్టమర్ అభిరుచి, ప్రాధాన్యతలు ఈ వృద్ధిని నడిపిస్తాయని చెప్పారు. దీంతో అధునాతన సాంకేతికత, భద్రతా ఫీచర్లతో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌తో ఆటోమొబైల్ రంగం గణనీయంగా విస్తరణను చూస్తోంది’ అని అగర్వాల్ తెలిపారు. మెరుగైన రోడ్లు వృద్ధికి మరింత మద్దతునిస్తోంది. నగరాలు ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా అనుసంధానం అవుతున్నాయి. దీంతో అధిక ఆకాంక్షలతో పాటు ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల్లో డిమాండ్‌ను పెంచుతున్నాయని చెప్పారు. లంబోర్గీని మొత్తం అమ్మకాల్లో 25 శాతానికి పైగా మెట్రోయేతర నగరాల నుండి జరుగుతున్నాయని అన్నారు. -
టాప్ గేర్ లో కార్ల అమ్మకాలు.. కారణం ఇదే..
-
ఈ కార్ని ఇప్పుడు బుక్ చేసుకుంటే..డెలివరీ అయ్యేది రెండేళ్ల తర్వాతే!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా సంస్థకు చెందిన ఎక్స్‌యూవీ 700 అమ్మకాల్లో దుమ్ము లేపుతోంది. గతేడాది అక్టోబర్ 7న ప్రారంభమైన బుకింగ్స్‌లో కొనుగోలు దారులు కేవలం రెండు రోజుల్లో 70వేల వెహిక్సల్ను బుక్ చేసుకోగా.. ఇప్పుడా వెహికల్ బుక్ చేసుకుంటే డెలివరీ అయ్యేందుకు మరో రెండేళ్ల వరకు ఎదురు చూడాల్సి ఉంది. ఎస్. మీరు చదివేది నిజమే. మహీంద్రా ఎక్స్‌యూవీ 700ను ఈరోజు బుక్ చేసుకుంటే డెలివరీ 2024కి అవుతుంది. నివేదిక ప్రకారం..ఏఎక్స్7ఎల్ వేరియంట్ వెహికల్ వేటింగ్ పిరియడ్ రెండేళ్లు. ►ఏఎక్స్ 7 ట్రిమ్ వెహికల్ బుక్ చేసుకుంటే 20నెలల తర్వాత డెలివరీ అవుతుంది. ►ఏక్స్5 వేరియంట్ పెట్రోల్ వెహికల్ డెలివరీ అయ్యేందుకు 5నెలల సమయం పట్టనుంది. అదే డీజిల్ వెహికల్ అయితే 11నెలల సమయం పట్టనుంది. ►ఏఎక్స్3 ట్రిమ్‌తో పాటు ఏఎక్స్ 5 వేరియంట్ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ ఒకేసారి డెలివరీ కానున్నాయి. ►చిప్షార్టేజ్, సప్లయ్ చైన్ క్రైసిస్, ప్రపంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కోవిడ్, మార్కెట్లో ఈకారుకున్న డిమాండ్ వంటి ఇతర కారణాల ఎక్స్‌యూవీ 700ను డెలివరీ అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహీంద్రాకు చెందిన మహీంద్రా థార్, హోందాయ్ క్రెటా కోసం ఎదురు చూడాల్సి ఉంది. చదవండి👉 నా భార్య కోసం ఆర్డర్ చేశా.. Qలో ఉన్నా: ఆనంద్ మహీంద్రా -
జాగ్వార్ ల్యాండ్ రోవర్..డిస్కవరీ కొత్త ఎడిషన్ బుకింగ్స్ షురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా సరికొత్త డిస్కవరీ ఎస్యూవీ మెట్రోపాలిటన్ ఎడిషన్ బుకింగ్స్ ప్రారంభించింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.26 కోట్ల నుంచి మొదలు. పి360 ఇంజెనియం పెట్రోల్ ఇంజన్, డి300 ఇంజెనియం డీజిల్ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. టాప్ వేరియంట్‌కు 31.24 సెంటీమీటర్ల ఇంటెరాక్టివ్ డ్రైవర్ డిస్ప్లే, ఫోన్ సిగ్నల్ బూస్టర్‌తో వైర్లెస్ చార్జింగ్, ఫోర్ జోన్క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ స్టీరింగ్ వీల్ వంటి హంగులు ఉన్నాయి. ల్యాండ్ రోవర్ డిస్కవరీ భారతీయ మార్కెట్లో అత్యంత బహుముఖ ఏడు సీట్ల ఎస్యూవీ అని కంపెనీ తెలిపింది. -
హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టాటా ఎలక్ట్రిక్ కార్లు! వెహికల్స్ డెలివరీలో రికార్డ్‌లు!
టాటా మోటార్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టాటా మోటార్స్ రెండు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. విడుదలైన ఆ కార్ల అమ్మకాలు భారీ ఎత్తున జరగుతున్నాయి. కేవలం ఒక్కరోజులోనే 712మంది కస్టమర్లకు డెలివరీ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. టాటా మోటార్స్ సంస్థ నెక్సాన్ ఈవీ, టైగర్ ఈవీ' అనే రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. దీంతో ఆ రెండు కార్లను సొంతం చేసుకునేందుకు వాహనదారులు ఉత్సాహా చూపిస్తున్నారు. దీంతో ఆ కార్లు పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహరాష్ట్రకు 564 నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లు, గోవాకు 148 టైగర్ ఈవీ' లను డెలివరీ చేసినట్లు టాటా పాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటి హెడ్ వివేక్ శ్రీవాత్సవ తెలిపారు. దీంతో కార్ల విభాగంలో ఒక్కరోజే పెద్ద మొత్తంలో కార్లు డెలివరీ చేయడంలో టాటా మోటార్స్ రికార్డ్‌లు నమోదు చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. టాటా ఎలక్ట్రిక్ కార్ల ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? టైగర్ ఈవీ : ఆటోమోటీవ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) సర్టిఫైడ్ రేంజ్ 306 కిలోమీటర్లు. 26 కేడబ్ల్యూ హెచ్ హై ఎనర్జీ డెన్సిటీ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి 55 కేడ్ల్యూ గరిష్ట పవర్ అవుట్‌పుట్, 170ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 5.7 సెకన్లలో 0 నుండి 60 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. నెక్సాన్ ఈవీ: ఎస్యూవీ వెహికల్స్ ఇన్స్పిరేషన్తో టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీని డిజైన్ చేసింది. ఈ కారు ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్ 312 కిలోమీటర్లు ఉండగా 30.2 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో ఆధారితమైన 129 పీఎస్ శాశ్వత మ్యాగ్నెట్ ఏసీ మోటార్‌ను అమర్చబడింది. టాటా గ్రూప్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ఎంతంటే? టాటా గ్రూప్ కంపెనీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 11 నెలల్లో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో 87 శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పటి వరకు 21,500 టాటా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను అమ్మినట్లు టాటా తెలిపింది. టాటా పవర్, టాటా కెమికల్స్, టాటా ఆటో కాంపోనెంట్స్, టాటా మోటార్స్ ఫైనాన్స్, క్రోమాతో సహా ఇతర టాటా గ్రూప్ కంపెనీలతో కలిసి ఎలక్ట్రిక్ ఎకోసిస్టమ్, టాటా యూనిఎవర్స్ ద్వారా దేశ వ్యాప్తంగా వేగంగా ఎలక్ట్రిక్ కార్లను అందిస్తుంది. చదవండి: మొత్తం మీరే చేశారు! టాటా చేతికి ఎయిర్ ఇండియా, లోక్ సభలో ఆసక్తికర చర్చ! -
ఈ తరహా కార్లను కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు..ఎందుకంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత కార్ల మార్కెట్ 2025–26 నాటికి దేశంలో 82 లక్షల యూనిట్లకు చేరుతుందని గ్రాంట్ థాంటన్ భారత్ తన నివేదికలో తెలిపింది. ‘2020–21లో ఈ సంఖ్య 40 లక్షల యూనిట్లుగా ఉంది. చిన్న పట్టణాల నుంచి డిమాండ్, నూతన వాహనాల ధరలు పెరుగుతుండడం, వినియోగదార్లలో వస్తున్న ధోరణి వెరశి పాత కార్ల జోరుకు కారణం. 14.8 శాతం వార్షిక వృద్ధితో 2030 నాటికి పరిశ్రమ విలువ రూ.5.3 లక్షల కోట్లకు చేరుతుంది. కొత్త కారుతో పోలిస్తే పాత వాహనం కొనుగోలు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. 2020–21లో కొత్త వాహన వ్యవస్థ ఆర్థిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక మార్పులను చూసింది. అదే సమయంలో వినియోగదార్ల ప్రాధాన్యతలలో మార్పు పాత కార్ల మార్కెట్‌ను వృద్ధి మార్గంలో వేగంగా నడిపించింది. ప్రస్తుతం పాత కారు కొనేందుకు కస్టమర్లు ఎప్పుడూ లేనంత ఉత్సాహం చూపిస్తున్నారు. చిన్న పట్టణాలు పరిశ్రమను ముందుకు నడిపిస్తాయి. మెట్రోయేతర ప్రాంతాల వాటా ప్రస్తుతమున్న 55–70 శాతానికి చేరుతుంది. కొత్త కార్లతో పోలిస్తే 2024–25 నాటికి పాత కార్ల మార్కెట్ రెండింతలు ఉండనుంది’ అని నివేదిక వివరించింది. చదవండి: 2021లో విడుదలైన దిగ్గజ కంపెనీల టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..! -
ఆ పాపులర్ మోడల్ కార్ల ధరలు పెరిగాయ్!
ముంబై: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ సెప్టెంబర్ 1 నుంచి పలు మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. వీటిలో హ్యాచ్‌బ్యాక్ పోలో, మిడ్ సైజ్ సెడాన్ వెంటో ఉన్నాయి. 3 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. తయారీ వ్యయం అధికం అవుతున్నందునే ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. పోలో జీటీ మినహాయిస్తున్నట్టు వివరించింది. ఆగస్ట్ 31 నాటికి కార్లను బుక్ చేసుకున్న వినియోగదార్లపై ఎటువంటి ధరల భారం ఉండబోదని స్పష్టం చేసింది. -
వామ్మో.. వీడు మాములు దొంగ కాదు
న్యూఢిల్లీ: వ్యాపారంలో నష్టపోయిన ఢిల్లీ యువ వ్యాపారవేత్త వక్రమార్గం పట్టాడు. మింటూ కుమార్ (28) అనే బీసీఏ గ్రాడ్యుయేట్ ఓ కారును అద్దెకు తీసుకుని.. దాని యజమానిగా పేర్కొంటూ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు. నకిలీ రికార్డులు తయారు చేసి ఓ వ్యక్తికి ఆ కారును అమ్మేశాడు. కాగా మింటూ అదే రోజు రాత్రి కొత్త యజమాని నుంచి డూప్లికేట్ తాళంతో కారును దొంగలించాడు. మింటూ ఇలాగే మోసం చేసి ఇదే కారును మరొకరికి అమ్మాడు. చివరకు మింటూ పథకం బెడిసికొట్టడంతో జైలుపాలయ్యాడు. మింటూ తండ్రి ఆర్మీలో రిటైర్డ్ కెప్టెన్. ఫరీదాబాద్‌లో వ్యాపారం నిర్వహించేవాడు. అందులో నష్టాలు రావడంతో నేరాలబాట పట్టాడు. గతవారం ద్వారకా సెక్టార్‌కు చెందిన ఓ వ్యక్తి తన కారును దొంగలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కారు రికార్డులు పరిశీలించగా, దాన్ని అమ్మిన వ్యక్తి, అసలు యజమాని కాదని అని తేలింది. ఇదే కారును ద్వారకా సెక్టార్లోనే మరొకరికి అమ్మినట్టు కనుగొన్నారు. పోలీసులు దర్యాప్తులో అసలు నిందితుడు మింటూ దొరికిపోయాడు. మింటూ మోసాలు విని సీనియర్ పోలీసు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.