టాటా మోటార్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టాటా మోటార్స్ రెండు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. విడుదలైన ఆ కార్ల అమ్మకాలు భారీ ఎత్తున జరగుతున్నాయి. కేవలం ఒక్కరోజులోనే 712మంది కస్టమర్లకు డెలివరీ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
టాటా మోటార్స్ సంస్థ నెక్సాన్ ఈవీ, టైగర్ ఈవీ' అనే రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. దీంతో ఆ రెండు కార్లను సొంతం చేసుకునేందుకు వాహనదారులు ఉత్సాహా చూపిస్తున్నారు. దీంతో ఆ కార్లు పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహరాష్ట్రకు 564 నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లు, గోవాకు 148 టైగర్ ఈవీ' లను డెలివరీ చేసినట్లు టాటా పాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటి హెడ్ వివేక్ శ్రీవాత్సవ తెలిపారు. దీంతో కార్ల విభాగంలో ఒక్కరోజే పెద్ద మొత్తంలో కార్లు డెలివరీ చేయడంలో టాటా మోటార్స్ రికార్డ్‌లు నమోదు చేసిందని సంతోషం వ్యక్తం చేశారు.
టాటా ఎలక్ట్రిక్ కార్ల ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
టైగర్ ఈవీ : ఆటోమోటీవ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్‌ఏఐ) సర్టిఫైడ్ రేంజ్ 306 కిలోమీటర్లు. 26 కేడబ్ల్యూ హెచ్ హై ఎనర్జీ డెన్సిటీ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి 55 కేడ్ల్యూ గరిష్ట పవర్ అవుట్‌పుట్, 170ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 5.7 సెకన్లలో 0 నుండి 60 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది.
నెక్సాన్ ఈవీ: ఎస్‌యూవీ వెహికల్స్ ఇన్స్పిరేషన్‌తో టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీని డిజైన్ చేసింది. ఈ కారు ఏఆర్‌ఏఐ సర్టిఫైడ్ రేంజ్ 312 కిలోమీటర్లు ఉండగా 30.2 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో ఆధారితమైన 129 పీఎస్ శాశ్వత మ్యాగ్నెట్ ఏసీ మోటార్‌ను అమర్చబడింది.
టాటా గ్రూప్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ఎంతంటే?
టాటా గ్రూప్ కంపెనీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 11 నెలల్లో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో 87 శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పటి వరకు 21,500 టాటా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను అమ్మినట్లు టాటా తెలిపింది. టాటా పవర్, టాటా కెమికల్స్, టాటా ఆటో కాంపోనెంట్స్, టాటా మోటార్స్ ఫైనాన్స్, క్రోమాతో సహా ఇతర టాటా గ్రూప్ కంపెనీలతో కలిసి ఎలక్ట్రిక్ ఎకోసిస్టమ్, టాటా యూనిఎవర్స్ ద్వారా దేశ వ్యాప్తంగా వేగంగా ఎలక్ట్రిక్ కార్లను అందిస్తుంది.
చదవండి: మొత్తం మీరే చేశారు! టాటా చేతికి ఎయిర్ ఇండియా, లోక్ సభలో ఆసక్తికర చర్చ!
Comments
Please login to add a commentAdd a comment