
ముంబై: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ సెప్టెంబర్ 1 నుంచి పలు మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. వీటిలో హ్యాచ్‌బ్యాక్ పోలో, మిడ్ సైజ్ సెడాన్ వెంటో ఉన్నాయి. 3 శాతం వరకు ధరలు పెరగనున్నాయి.
తయారీ వ్యయం అధికం అవుతున్నందునే ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. పోలో జీటీ మినహాయిస్తున్నట్టు వివరించింది. ఆగస్ట్ 31 నాటికి కార్లను బుక్ చేసుకున్న వినియోగదార్లపై ఎటువంటి ధరల భారం ఉండబోదని స్పష్టం చేసింది.