
వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న షర్మిల
సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాల తెలంగాణ ప్రజలకు మేలు జరిగేలా పార్టీ పెడుతున్నామని వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో మహానేత వైఎస్‌ఆర్ జయంతి రోజైన ఈ నెల 8న పార్టీని స్థాపించబోతున్నట్లు తెలిపారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఆమె టీం వైఎస్‌ఎస్‌ఆర్.కామ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. నూత న రాజకీయ పార్టీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ అభిమానులు, నేతలు, సోషల్ మీడియా వారియర్స్ కోసం ప్రత్యేకించి ఈ వెబ్‌సైట్‌ను రూ పొందించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ముందుగా అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృ ద్ధి, సంక్షేమం కోసం రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తేవడమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్లు చెప్పారు.
కార్యాలయం ముట్టడికి సీమ రైతుల యత్నం
వైఎస్ షర్మిల కార్యాలయాన్ని ముట్టడించేందుకు అమరావతి పరిరక్షణ సమితి యత్నించింది. బుధవారం లోటస్‌పాండ్‌లోని ఆమె కార్యాలయానికి ఆ కమిటీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ తన అనుచరులతో వచ్చి కృష్ణా జలాల విషయంలో షర్మిల స్పష్టమైన వైఖరి తెలపాలంటూ ఆందోళన చేపట్టడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment