అక్టోబరులో గూర్ఖా... ధర ఎంతంటే ? | Force Motors Announced The Price Of Upcoming SUV Gurkha | Sakshi
Sakshi News home page

Mahindra Force Gurkha: అక్టోబరులో గూర్ఖా... ధర ఎంతంటే ?

Published Tue, Sep 28 2021 10:25 AM | Last Updated on Tue, Sep 28 2021 11:41 AM

Force Motors Announced The Price Of Upcoming SUV Gurkha - Sakshi

వచ్చే నెల నుంచి గూర్ఖా డెలివరీలు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోర్స్‌ మోటార్స్‌ గూర్ఖా ఎస్‌యూవీ కొత్త వెర్షన్‌ ధరను ప్రకటించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.13.59 లక్షల నుంచి ప్రారంభం. రూ.25,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. అక్టోబరు 15 తర్వాతి నుంచి డెలివరీలు మొదలు కానున్నాయి.

ఇవి ఫీచర్స్‌
గూర్ఖా స్పెసిఫికేషన్స్‌ విషయానికి వస్తే.. 2.6 లీటర్‌ 91 బీహెచ్‌పీ మెర్సిడెస్‌ డిరైవ్డ్‌ కామన్‌ రైల్, డైరెక్ట్‌ ఇంజెక్షన్, టర్బోచార్జ్‌డ్‌ డీజిల్‌ ఇంజన్, 5 స్పీడ్‌ మెర్సిడెస్‌ జి–28 ట్రాన్స్‌మిషన్, రెండు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ పొందుపరిచారు. ఆరు రంగుల్లో లభిస్తుంది. టిల్ట్, టెలిస్కోపిక్‌ అడ్జస్ట్‌మెంట్‌తో స్టీరింగ్, 500 లీటర్ల బూట్‌ స్పేస్, పవర్‌ విండోస్, సెంట్రల్‌ లాకింగ్, స్పీడ్‌ సెన్సింగ్‌ డోర్‌ లాక్స్, రేర్‌ పార్కింగ్‌ సెన్సార్స్, వైపర్స్‌తో సింగిల్‌ పీస్‌ రేర్‌ డోర్, పూర్తి మెటల్‌ టాప్‌తో తయారైంది.


చదవండి : దేశంలో 'ఈ' కార్ల అమ్మకాలు బంద్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement