Gurkhas
-
అక్టోబరులో గూర్ఖా... ధర ఎంతంటే ?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ఎస్యూవీ కొత్త వెర్షన్ ధరను ప్రకటించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.13.59 లక్షల నుంచి ప్రారంభం. రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అక్టోబరు 15 తర్వాతి నుంచి డెలివరీలు మొదలు కానున్నాయి. ఇవి ఫీచర్స్ గూర్ఖా స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 2.6 లీటర్ 91 బీహెచ్పీ మెర్సిడెస్ డిరైవ్డ్ కామన్ రైల్, డైరెక్ట్ ఇంజెక్షన్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, 5 స్పీడ్ మెర్సిడెస్ జి–28 ట్రాన్స్మిషన్, రెండు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ పొందుపరిచారు. ఆరు రంగుల్లో లభిస్తుంది. టిల్ట్, టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో స్టీరింగ్, 500 లీటర్ల బూట్ స్పేస్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, రేర్ పార్కింగ్ సెన్సార్స్, వైపర్స్‌తో సింగిల్ పీస్ రేర్ డోర్, పూర్తి మెటల్ టాప్‌తో తయారైంది. చదవండి : దేశంలో 'ఈ' కార్ల అమ్మకాలు బంద్! -
నేపాలీలు తప్పించుకుంటే దొరకడం కష్టమే..
సాక్షి, సిటీబ్యూరో: పొట్టకూటి కోసమంటూ సరిహద్దులు దాటి వస్తున్నారు.. ఎక్కడ చూసినా సెక్యూరిటీ గార్డులుగా, సహాయకులుగా కనిపిస్తున్నారు.. చాలీచాలని వేతనాలకు పని చేస్తున్నారు.. అదను చూసుకుని ‘చేను మేసి’ ఉడాయిస్తున్నారు. ఇవీ నగరంలో చోటు చేసుకుంటున్న నేపాలీల క్రైమ్‌స్టోరీలు. తాజాగా బుధవారం నారాయణగూడ పరిధిలో వెలుగులోకి వచ్చిన రూ.30 లక్షల విలువైన బంగారు నగలు, వజ్రాభరణాలు, రూ.4 లక్షల నగదు ఎత్తుకుపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నేపాలీల ఘాతుకాలకు సంబంధించిన అంశాలు గతంలోనూ ఎన్నో చోటు చేసుకున్నాయి. ఒకసారి నేరం చేసి పారిపోతే.. వీరిని పట్టుకోవడం సైతం సవాల్‌గా మారుతోంది. గూర్ఖాల నుంచి గార్డులుగా.. ఒకప్పుడు నేపాల్, అసోంలకు చెందిన వారు కేవలం గూర్ఖాలుగానే కనిపిస్తుండేవారు. అయితే రాజధానిలో వర్తక, వాణిజ్య సంస్థలు కుప్పలు తెప్పలుగా పుట్టుకువచ్చాయి. వీటి రక్షణ కోసం సెక్యూరిటీ గార్డుల ఆవశ్యకత పెరిగింది. ఇబ్బడిముబ్బడిగా పుట్టుకువచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల ‘కక్కుర్తి’ పుణ్యమా అని వీరంతా సరిహద్దులు దాటి గార్డులుగా ప్రత్యక్షమవుతున్నారు. వ్యాపార సంస్థలు, కార్యాలయాలకు మాత్రమే కాకుండా అనేక మంది ప్రముఖుల ఇళ్ల వద్ద సైతం భద్రత వీరి బాధ్యతగానే మారింది. చివరకు పార్కులు, రెస్టారెంట్ల, రెసార్టుల్లోనూ వీరే కనిపిస్తున్నారు. ఇలా సరిహద్దు రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి సెక్యూరిటీగా పని చేస్తున్న వారి జీవితాలు దుర్భరమనే చెప్పాలి. ఏ రకంగా చూసుకున్నా వీరికి నెలకు అందే వేతనం రూ.10 వేలు దాటదు. అదే పని దగ్గరకు వచ్చేసరికి మాత్రం గొడ్డుచాకిరీనే. ఇలా వచ్చే జీతంలోనూ కమిషన్లు, ఇతరాలు పోగా వీరి చేతికి అందేది గొర్రెతోక చందమే. ఈ దుర్భర జీవితాన్ని గడుపుతున్న నేపాల్ వాసులు అదను చూసుకుని పంజా విసురుతున్నారు. నమ్మి ఉద్యోగం ఇచ్చిన వారినే నట్టేట ముంచుతున్నారు. వీరి ఘోరాలు ఎన్నో... ⇒ అదను చూసుకుని పంజా విసురుతున్న ఈ ‘పొరుగు’ వారు దోపిడీలు, దొంగతనాలతో పాటు హత్యలు సైతం చేస్తున్నారు. ⇒ 2006 ఏప్రిల్ 28న పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని ఆనంద్‌నగర్‌కాలనీలో చోటు చేసుకున్న జస్పీర్సింగ్ హత్యే ఇందుకు నిదర్శనం. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఇతని సోదరుడైన పరంజీత్ సింగ్ వారి దగ్గరే పని చేస్తున్న నేపాలీ సత్య ద్వారా హత్య చేయించాడు. ⇒ 1999లో నేపాల్ నుంచి వలసవచ్చి నగరంలో సెక్యూరిటీ గార్డు కమ్ డ్రైవర్‌గా పని చేసిన శంకర్ ఖడ్కా అలియాస్ నవీన్‌కుమార్ 2009లో జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో తాను పని చేస్తున్న ఇంటి యజమానురాలు సురేఖను దారుణంగా హత్య చేసి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ ఘాతుకంలో ఇతనికి అసోంకు చెందిన సురేష్, సంగమ్ సహకరించారు. డబ్బు కోసమే ఈ హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. ⇒ 2009లో పాయిజన్ పబ్‌లో చోటు చేసుకున్న సెక్యూరిటీ సూపర్వైజర్ హత్య సైతం నేపాల్‌కు చెందిన వారి పనే. ⇒ 2010లో బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.10లో ఉన్న శంకర్‌లాల్ అండ్ సన్స్ జ్యువెలర్స్‌లో దోపిడీకి ఒడిగట్టింది అక్కడ సెక్యూరిటీ గార్డులు గా పని చేస్తున్న నేపాలీ, అసోంకు చెందినవారే. ⇒ 2016లో కార్ఖానా పోలీసుస్టేషన్ పరిధిలో ఉండే ఆర్మీ మాజీ ఉన్నతాధికారి ఇంటి నుంచి రూ.3 కోట్ల విలువైన సొత్తు ఎత్తుకుపోయారు. ⇒ గత ఏడాది అబిడ్స్ పరిధిలో నివసించే వ్యాపారవేత్త ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాలీలు అదను చూసుకుని రూ.కోటి సొత్తుతో పరారయ్యారు. పోలీసులకు తల‘బొప్పులు’... వీరు నేరాలు చేసినప్పుడల్లా ఆ కేసుల దర్యాప్తు పోలీసులకు పెనుసవాలే. వీరికి ఉద్యోగాలు ఇస్తున్న సెక్యూరిటీ సంస్థలు తమ వద్ద పూర్తి వివరాలు ఉంచుకోకపోవడం, ఉన్న అరకొర వివరాలూ క్షేత్రస్థాయిలో క్రాస్ చెక్ చేసుకోకపోవడం వంటి కారణాలతో దర్యాప్తులు జటిలమతున్నాయి. మన పోలీసులు సరిహద్దులు దాటి వెళ్లినా... అక్కడి పోలీసుల సహకారం లేక నిందితులు చిక్కట్లేదు. 2016 నాటి కార్ఖానా కేసులో నిందితులకు సంబంధించి పోలీసులు వద్ద పూర్తి ఆధారాలు, నేరగాళ్ల చిరునామాలు ఉన్నాయి. అనేక ప్రత్యేక బృందాలు కొన్ని నెలల పాటు అక్కడ మకాం వేసి మరీ వచ్చాయి. అయినప్పటికీ ‘స్థానిక సహకారం’ లేని కారణంగా నిందితుల్ని పట్టుకోలేకపోయారు. అనుమానితుల విచారణలో భాష అనేది మరో ప్రధాన అడ్డంకిగా మారుతోంది. దేశ సరిహద్దులు దాటకుండా చిక్కితే మా త్రమే వీరి అరెస్టుకు ఆస్కారం ఉంటోంది. అలా కాకుండా వారి స్వస్థలాలకు చేరితే మాత్రం ఇక ఆ కేసు విషయం మర్చిపోవాల్సి వస్తోంది. దీనికి కొన్ని దౌత్యపరమైన అడ్డంకులు ఉంటున్నాయి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి... ⇔ ఎవరినైనా పనిలో పెట్టుకునే మందువారి వివరాలు, పూర్వాపరాలు తెలుసుకోవాలి. ⇔ అవతలి వారు చెబుతున్నది వాస్తవమా.. కాదా? అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ⇔ ఉద్యోగంలో చేరిన వారి ఫొటోలను తీసుకోవడం ఉత్తమం. ⇔ వారి సొంత ఊరితో పాటు బంధువుల వివరాలు, చిరునామాలు రికార్డు చేసిఉంచాలి. ⇔ వీటన్నింటికీ స్థానిక పోలీసుస్టేషన్లో అందించాలి. ⇔ గతంలో ఎక్కడ పని చేశారు? అక్కడ వీరి ప్రవర్తన ఏమిటి? అనేవి ఆరా తీయాలి. ⇔ సాధ్యమైనంత వరకు తెలిసిన వారు సిఫార్సు చేసిన వారినే పనిలో పెట్టు కోవాలి. ⇔ మార్కెట్ వాల్యూ, మినిమం కాస్ట్ ఆఫ్ లివింగ్‌ను దృష్టిలో పెట్టుకుని జీతం ఇవ్వాలి. ⇔ పని చేస్తున్న సందర్భంలో వారి వ్యవహారశైలిని నిశితంగా గమనించాలి. ⇔ వారి ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు తప్పనిసరిగా సేకరించాలి. ⇔ ఇళ్లను పనివాళ్లకు వదిలి ఎక్కడికైనా వెళితే విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో పెట్టుకోవడం ఉత్తమం. -
డార్జిలింగ్‌లో జంగ్: గూర్ఖా వర్సెస్ గూర్ఖా
పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ లోక్‌సభ స్థానంలో తొలిసారి ఇద్దరు గూర్ఖా నేతలు తలపడుతున్నారు. 21వ శతాబ్దం ఆరంభంలో గూర్ఖా ఆందోళన నడిపిన గూర్ఖా జన ముక్తి మోర్చా (జీజేఎం)లోని రెండు చీలిక వర్గాలకు చెందిన ఇద్దరు నాయకులు ఇప్పుడు రాష్ట్రంలో పాలక పక్షమైన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. జీజేఎంలో సీనియర్ నేత, డార్జిలింగ్ ఎమ్మెల్యే అమర్‌సింగ్ రాయ్ తృణమూల్ తరఫున, మరో జీజేఎం నేత రాజూ సింగ్ బిస్తా బీజేపీ టికెట్‌పై పోటీ పడుతున్నారు. జీజేఎం అధినేత బిమల్ గురుంగ్ వర్గం, ఆయన పూర్వ అనుచరుడు బినయ్ తమాంగ్ వర్గం బీజేపీ, తృణమూల్ తరఫున పరస్పరం తలపడుతున్నాయి. బిమల్ గురుంగ్ వర్గం బీజేపీతో, తమాంగ్ వర్గం తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపాయి. ఇక్కడ గూర్ఖాలు, తేయాకు తోటల్లో పనిచేసే ఇతర ఆదివాసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. పాగా వేసేందుకు తృణమూల్ ఎత్తులు.. మణిపూర్ నుంచి వచ్చి స్థిరపడిన యువనేత రాజూ బిస్తాను బీజేపీ అభ్యర్థిగా ఈసారి నిలబెట్టారు. గత రెండు ఎన్నికల్లోనూ డార్జిలింగ్ సీటును తృణమూల్ కైవసం చేసుకోలేదు. ఈ రెండు పార్టీలూ ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటుకు అనుకూలం కాదు. వాటి లక్ష్యాలు వేరు. గూర్ఖాల భూమి హక్కులకు గుర్తింపు, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత కోసం పోరాడతానని తృణమూల్ అభ్యర్థి అమర్‌సింగ్ రాయ్ చెబుతున్నారు. గూర్ఖాల ఆత్మగౌరవం కోసం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థి బిస్తా ప్రచారం చేస్తున్నారు. 2009లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రాజస్థాన్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌సింగ్, 2014లో ఝార్ఖండ్‌కు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి ఎస్ఎస్ అహ్లూవాలియా గెలిచారు. ఈసారి తప్పక డార్జిలింగ్‌లో పాగా వేయాలనే పట్టుదలతో తృణమూల్ పనిచేస్తోంది. గతంలో వరుసగా రెండుసార్లు బీజేపీ గెలిచిన కారణంగా కాషాయపక్షం ఈసారీ డార్జిలింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది. ప్రధాని మోదీకి, బీజేపీకి ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. -
‘ఈశాన్య’ అభ్యర్థుల ఎత్తు కుదింపు
న్యూఢిల్లీ: భారత పారామిలటరీ బలగాల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని ఆదివాసీ యువకులు, గూర్ఖాల చేరికను పెంచేందుకు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పారామిలటరీ బలగాల్లో కానిస్టేబుల్, సబ్ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసే పురుష అభ్యర్థుల కనీస ఎత్తును తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది. కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుకు ఆదివాసీ యువకుల కనీస ఎత్తును 162.5 సెంటిమీటర్ల నుంచి 157 సెంటిమీటర్లకు తగ్గించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం(సీఐఎస్ఎఫ్)లో ఏఎస్సై పోస్టుకు ఆదివాసీ, గూర్ఖా యువకుల కనీస ఎత్తు 162.5 సెం.మీ, సబ్ఇన్స్పెక్టర్ పోస్టుకు 157 సెంటిమీటర్లు ఉండాల్సిందిగా నిర్ధారించారు. ఈ నిబంధనలు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సామ్ రైఫిల్స్ వంటి సంస్థలకు వర్తిస్తాయి. -
గూర్ఖాల ఆగ్రహం
ఇది ఆధిపత్యాలను ప్రశ్నించే కాలం. అవతలివారి మనోభావాలతో, ఆకాంక్షలతో సంబంధం లేకుండా చిత్తానుసారం పెత్తనం చలాయిస్తామంటే జనం సహించే పరిస్థితి లేదు. సామాజిక మాధ్యమాల ప్రభావం విస్తరించడంవల్ల కావొచ్చు... రాజకీయ చైతన్యం పెరుగుతోంది. ప్రజలు దేన్నయినా నిలదీస్తున్నారు. తమ అసంతృప్తినీ, ఆగ్రహాన్నీ బాహాటంగా వ్యక్తంచేస్తున్నారు. ఈ సంగతి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియదనుకోలేం. అధికార భాషపై ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ మూడు నెలలక్రితం హిందీ అమలుకు సంబంధించి చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించినప్పుడు తీవ్రంగా వ్యతి రేకించినవారిలో ఆమె కూడా ఉన్నారు. కానీ తమ రాష్ట్రం వరకూ వచ్చేసరికి అచ్చం ఆ మాదిరే వ్యవహరించి ప్రశాంతంగా ఉన్న బెంగాల్ ఉత్తరభాగంలోని డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో చిచ్చుపెట్టారు. డార్జిలింగ్తోసహా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పదో తరగతి వరకూ బెంగాలీని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెనువెంటనే గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఆధ్వర్యంలో డార్జిలింగ్‌లో ఉద్యమం రాజుకుంది. దాన్ని చల్లార్చే ఉద్దేశంతో మమత ఆ నగరంలో రాష్ట్ర కేబినెట్ భేటీ ఏర్పాటు చేస్తే వీధులన్నీ రణరంగాన్ని తలపించాయి. వేలాదిమంది ఉద్యమకారులు ఒక ప్రభుత్వ కార్యా లయానికి నిప్పుపెట్టారు. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. పలువురు పోలీసులు గాయపడ్డారు. వేలాదిమంది టూరిస్టులు ప్రాణాలు అరచేతబట్టుకుని అక్కడినుంచి రావాల్సివచ్చింది. చివరకు పారా మిలిటరీ దళాలు రంగప్రవేశం చేశాయి. సోమ వారం నుంచి నిరవధిక బంద్ మొదలైంది. దాదాపు 14 లక్షలమంది జనాభా గల డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో అత్యధికులు నేపాలీ భాష మాట్లాడతారు. భిన్న సంస్కృతి, భాష ఉన్న తమపై ‘బయటి వ్యక్తుల’ పెత్తనం సహించబోమని వందేళ్లక్రితమే అప్పటి బ్రిటిష్ పాలకులకు గూర్ఖాలు తేల్చిచెప్పారు. పాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించడానికుద్దేశించిన మింటో–మార్లే కమిటీకి 1907లోనే కొండ ప్రాంతవాసుల పేరిట ఇందుకు సంబం ధించిన వినతిపత్రాన్నిచ్చారు. అనంతరకాలంలో సైతం ఆ డిమాండు వినిపిస్తూనే ఉంది. ఆ సమస్యపై రాజ్యాంగ నిర్ణాయక సభలో సైతం చర్చ జరిగింది. డార్జిలింగ్, సిక్కిం ప్రాంతాలతో ప్రత్యేక డార్జిలింగ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 1947లో ఆనాటి కమ్యూనిస్టు పార్టీ కోరింది. 80వ దశకం చివరిలో సుభాష్ ఘీషింగ్ ఆధ్వర్యాన గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(జీఎన్ఎల్ఎఫ్) ఏర్పడి ఉద్యమం ప్రారంభించింది. అది ఉధృతరూపం దాల్చి హింస చెలరేగాక డార్జిలింగ్ జిల్లా ప్రాంతానికి గూర్ఖా కొండప్రాంత మండలిని 1988లో ఏర్పాటుచేశారు. 2011లో జీజేఎం చేసిన పోరాట ఫలితంగా అది గూర్ఖాలాండ్ ప్రాదేశిక పాలనాసంస్థ(జీటీఏ)గా మారింది. డార్జిలింగ్ ప్రాంతానికి సంబంధించిన ఏ అంశంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం జీటీఏను సంప్ర దించాల్సి ఉంటుంది. బెంగాలీ భాషను తప్పనిసరి చేసే అంశంలో మమత ఆ పని చేయలేదు. డార్జిలింగ్ ప్రాంతంలో బెంగాలీని రుద్దే ఉద్దేశం లేదని, అక్కడ యధా విధిగా నేపాలీ భాషే కొనసాగుతుందని మమత వివరణ ఇవ్వకపోలేదు. కానీ అప్ప టికే ఆలస్యమైంది. నిజానికి భాషా సమస్య తక్షణ ఆగ్రహావేశాలకు కారణం కావొచ్చుగానీ అదే మూల కారణం కాదు. డార్జిలింగ్ కొండ ప్రాంతాలను గత కొన్నేళ్లుగా వేధిస్తున్న అనేకానేక సమస్యలపై జనంలో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి ఆ రూపంలో పెల్లుబికింది. వీటికితోడు జీజేఎంకూ, మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మధ్య దూరం పెరగడం, చివరికి అవి శత్రుపక్షాలుగా మారడం వల్ల కూడా ఆ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. తమను దెబ్బతీసే ఉద్దేశంతో గూర్ఖాలాండ్ అభి వృద్ధిని అడ్డుకుంటున్నారని జీజేఎం ఆరోపిస్తుంటే... సమృద్ధిగా నిధులిచ్చింది తానే నని మమత చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్–జీజేఎంల మధ్య ఆరేళ్లక్రితం చెలిమి ఏర్పడినప్పుడు ప్రత్యేక గూర్ఖాలాండ్‌కు తాను అనుకూలమని మమత ప్రకటించారు. కానీ అధికారంలోకొచ్చాక దాని సంగతి ఎత్తడం లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో డార్జిలింగ్ స్థానం నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి ఎస్ఎస్ అహ్లూ వాలియాకు జీజేఎం మద్దతిచ్చి ఆయనను గెలిపించింది. అప్పటినుంచీ తృణ మూల్–జీజేఎం కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. జీజేఎంను బలహీ నపర్చడం కోసం డార్జిలింగ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను విడగొట్టి మమత ప్రభుత్వం కలింపాంగ్ జిల్లానూ, కలింపాంగ్ మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న జీజేఎం బెంగాలీ భాషపై తీసుకున్న నిర్ణయాన్ని ఆసరా చేసుకుని ఉద్యమం లేవనెత్తింది. డార్జిలింగ్ కొండ ప్రాంతాలు నిజంగా అభివృద్ధి చెంది ఉంటే, అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభించి ఉంటే ఇదంతా టీఎంసీ–జీజేఎం తగువుగా మిగి లిపోయేది. కానీ ఉత్తరప్రాంత బెంగాల్ అభివృద్ధికి ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలు శూన్యం. ప్రారంభించిన ఎన్నో ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఆ ప్రాంతంలో టీ ఎస్టేట్లు అధికం. అవి సక్రమంగా పనిచేస్తే ఉపాధికి లోటుండదు. కానీ ఆ టీ ఎస్టేట్లు నానాటికీ కుంచించుకుపోతున్నాయి. కొన్ని మూతబడుతున్నాయి. చేతినిండా పని ఉన్నచోట కూడా వేతనాలు అంతంతమాత్రం. పర్యవసానంగా వేలాది కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. వీటన్నిటినీ పట్టించుకోవడానికి బదులు జీజేఎంను ఎలా బలహీనపర్చాలా అన్న అంశంపైనే మమత దృష్టి కేంద్రీకరించారు. డార్జిలింగ్ కొండ ప్రాంత సమస్యలపై నిజంగా అవగాహన ఉండి ఉంటే ఆమె బెంగాలీ భాషను రుద్దడం మాట అటుంచి కొత్త జిల్లా ఏర్పాటు యోచనే చేసి ఉండేవారు కాదు. ఇప్పుడు ఆ ప్రాంతమంటే తనకు ప్రత్యేకాభిమానమని చాటుకోవడం కోసం డార్జి లింగ్లో కేబినెట్ సమావేశాన్ని జరిపారు. మౌలిక సమస్యల పరిష్కారానికి కనీస ప్రయత్నం చేయనప్పుడు ఇలాంటివి పెద్దగా అక్కరకు రావు. ఇప్పటికైనా రాజకీయా లకు అతీతంగా ఆ ప్రాంత అభివృద్ధికి మమత ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. దానికి మించి ప్రత్యేక గూర్ఖాలాండ్ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి.