Skoda Rapid
-
స్కోడా ‘‘ర్యాపిడ్ స్పెషల్ ఎడిషన్’’
ముంబై: చెక్ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో సోమవారం ‘‘రాపిడ్ మ్యాటే ఎడిషన్’’ అనే పేరుతో స్పెషల్ ఎడిషన్ కార్లను విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా ఉంది. ఫీచర్లు ఆటోమేటిక్, మ్యానువల్ ట్రాన్స్మిషన్స్ వేరియంట్లలో లభించనుంది. కార్బన్ స్టీల్ మ్యాటే రంగులో ఉంది. ఒక లీటరు పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. బ్లాక్ డోర్ హ్యాండిల్ సహా మౌల్డింగ్, ట్రంక్ లిప్ గార్నిషా లాంటి సరికొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్లాక్ అలాయ్ వీల్స్, రేర్ పార్కింగ్ సెన్సార్స్‌తో వస్తోంది. డ్యుయెల్ ఎయిర్‌బ్యాగ్, యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. చదవండి : టాటా మోటార్స్ చిన్న ఎస్యూవీ పంచ్ -
మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్’ లిమిటెడ్ ఎడిషన్
న్యూఢిల్లీ: ప్రముఖ యూరోపియన్ కార్ల తయారీ సంస్థ ‘స్కోడా’... భారత మార్కెట్లో తన మిడ్–సైజ్ సెడాన్ ‘రాపిడ్’ స్పెషల్ ఎడిషన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.99 లక్షలుగా (ఎక్స్–షోరూం) కంపెనీ ప్రకటించింది. యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి అత్యవసర భద్రతా ఫీచర్లను కలిగిన ఈ పరిమిత ఎడిషన్.. 1.6 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇతర ఫీచర్ల పరంగా.. వెనుక పార్కింగ్ సెన్సార్లు, యాంటీ గ్లేర్ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్, విండ్‌స్క్రీన్ డీఫాగర్, రఫ్ రోడ్ ప్యాకేజ్, ఫ్లోటింగ్ కోడ్ సిస్టమ్‌తో కూడిన ఇంజిన్ ఇమ్మొబిలైజర్ ఉన్నట్లు వెల్లడించింది. -
స్కోడా కార్లపై భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: కారును సొంతం చేసుకోవాలని కలలు కంటున్నవారికి సువర్ణావకాశం. డ్రీమ్ కార్‌ను సొంతం చేసుకునే సమయం ఇది. తొలకరి జల్లుల కంటే ముందే ప్రముఖ కార్ల కంపెనీ స్కోడా ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. వివిధ లగ్జరీ మోడళ్ల కార్ల కొనుగోళ్లపై నగదు డిస్కౌంట్, లాయల్టీ బోనస్, క్యాష్‌బ్యాక్ , బై బ్యాక్ లాంటి అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. రాపిడ్, ఆక్టావియా, కొడియాక్ తదితర కార్లపై దాదాపు రూ.1. 75 వరకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అవకాశం మే 31 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నగదు లాభాలు, లాయల్టీ బోనస్ ఇతర ప్రయోజనాలు రాపిడ్ ( ఆంబిషన్ ఎంటీ డీజిల్, ఆంబిషన్ ఏటీ పెట్రోల్, స్టైల్ ఎంటీ ప్రెటోలు తప్ప) రూ. 50వేల వరకు డిస్కౌంట్ , దీంతోపాటు రూ .25వే లాయల్టీ బోనస్ ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు ఆంబిషన్ ఎంటీ డీజిల్ ఆంబిషన్ ఏటీ, పెట్రోల్, స్టైల్ ఎంటీ ప్రెటోల్ మోడల్స్ పై రూ. 25వేల లాయల్టీ బోనస్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు రాపిడ్ మై 2018 రూ .1 లక్ష వరకు డిస్కౌంట్, దీంతోపాటు 10వేల రూపాయల మెయింటినెన్స్ ప్యాకేజీ కూడా లభ్యం. ఆక్టావియా రూ. 50వేల వరకు డిస్కౌంట్ (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) మరో రూ .50వేల లోయల్టీ బోనస్ సూపర్బ్ మై 2019 రూ .50వేల డిస్కౌంట్ వరకు (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) 3 సంవత్సరాల తర్వాత 57 శాతం బై బ్యాక్ ఆఫర్ సూపర్బ్ మై -2018 కారుపై రూ .1.75 లక్షల డిస్కౌంట్ కోడియాక్ రూ .50వేల డిస్కౌంట్ (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) రూ .50వేల లోయల్టీ బోనస్. ఈ ఆఫర్లు భారతదేశం అంతటా వర్తిస్తాయి. -
స్టైలిష్ లుక్‌లో స్కోడా ర్యాపిడ్
ఆటోమొబైల్ తయారీదారు స్కోడా తన తాజా స్కోడా ర్యాపిడ్ ను న్యూ లుక్ లో భారత మార్కెట్ లో గురువారం లాంచ్ చేయనుంది. ర్యాపిడ్ ఫేస్ లిఫ్ట్ లో పూర్తిగా అభివృద్ది చేసిన ఇంటీరియర్ అండ్ అప్డేటెడ్ డీజల్ ఇంజన్‌ను అందిస్తోంది. ఫోక్స్ వ్యాగన్ ప్లాట్ పాంలో ని వెంటో మోడల్ ఆధారంగానే దీన్ని రూపొందించినప్పటికీ, అప్ డేటెడ్ వెర్షన్ లో స్కోడాకు అద్భుతమైన స్టైలిష్ లుక్ జతచేసింది. స్కోడా ఆటో ఇండియా 2011 లో లాంచ్ చేసిన ర్యాపిడ్ స్కోడాను భారీ మార్పులతో మొదటి సారిగా ఫేస్‌లిఫ్ట్ రూపంలో నేడు పరిచయం చేస్తోంది. స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిప్ట్ లో హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ డిజైన్‌తో ఆక్టావియా, సూపర్బ్ మోడల్స్ కంటే లుక్స్ లో ఆకట్టుకోనుంది. చాలావరకు స్కోడా ఫీచర్లనే పోలి ఉన్న ర్యాపిడ్ క్యాబిన్ లో కూడా భారీ మార్పులు చేసింది. హైట్ ఎడ్జస్టబుల్ సీట్, స్టీరింగ్ కోసం టిల్ట్ అండ్ టెలీ స్కోపిక్ ఎడ్జస్ట్ ఫెసిలిటీ అలాగే సెంట్రల్ హ్యాండ్ రెస్ట్ లతో పాటు టచ్ స్క్రీన్ ఆడియో సిస్టం విత్ మిర్రర్ లాక్, ప్రస్తుత వేగం, పెట్రోల్ నిల్వ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి మల్టీ ఇన్ ఫర్మేషన్ ను అందిస్తుంది. అలాగే కొత్తగా డిజైన్ చేసిన రియర్ బంపర్ , ఇండికేటర్స్ తో కూడిన కొత్త వింగ్ మిర్రర్స్, యాంటెన్నా ప్రత్యేక ఆకర్షణ. దీనిప్రారంభ ధరను రూ.8.27 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా కంపెనీ ప్రకటించింది. యాక్టివ్, యాంబిషన్ అండ్ స్టైల్ అనే మూడు వేరియంట్లలో వస్తున్న స్కోడా ర్యాపిడ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.8.27 -రూ.11. 36 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) డీజిల్ వేరియంట్ రూ.9.48 -12. 67 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉండనుంది. 1.6 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ వెర్షన్ లో 5 స్పీడ్ మాన్యుల్ ట్రాన్స్ మిషన్ ఇంజీన్ అమర్చగా, పెట్రోల్ ఇంజీన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ , డీజిల్ లో 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ డీఎస్ జీ అమర్చింది. న్యూ లుక్ లో వస్తున్న ఈ స్కోడా రాపిడ్ మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా లతో పాటు సొంత ఫోక్స్ వ్యాగన్ కు గట్టి పోటీ ఇవ్వనుంది