సరికొత్తగా మారుతి బాలెనో ఆర్‌ఎస్‌ ఫేస్‌లిఫ్ట్‌ | Maruti Baleno RS facelift to get New Bumper, Alloy Wheels  | Sakshi
Sakshi News home page

సరికొత్తగా మారుతి బాలెనో ఆర్‌ఎస్‌ ఫేస్‌లిఫ్ట్‌

Published Mon, Jan 21 2019 6:03 PM | Last Updated on Mon, Jan 21 2019 6:25 PM

Maruti Baleno RS facelift to get New Bumper, Alloy Wheels  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ కారు బాలెనో ఆర్‌ఎస్‌ కొత్త హంగులతో ముస్తాబవుతోంది. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సరికొత్త అప్‌డేట్స్‌తో మారుతి బాలెనో ఆర్‌ ఎస్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను ఆకర్షణీయంగా  కంపెనీ తీసుకొస్తోంది. ఈ నెల చివరకు  మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇక ధర విషయానికి వస్తే..రూ.8.53లక్షలుగా (ఎక్స్‌షోరూం, ఢిల్లీ) ఉండవచ్చని అంచనా.

1.0 లీటర్‌ పెట్రోలు బూస్టర్‌ జెట్‌ టర్బో ఇంజీన్‌తో మరింత శక్తివంతంగా ఈ కారును  లాంచ్‌ చేయనుంది. ఫ్రంట్‌ బంపర్‌లో మార్పులతోపాటు పాత హెచ్‌ఐడీ ల్యాంప్స్‌కు బదులుగా కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ ప్రొజెక్టర్‌ ల్యాంప్స్‌  అమర్చింది. అలాగే రియర్‌ డిస్క్‌ బ్రేక్‌లను, బ్లాక్‌ అండ్‌ సిల్వర్‌ డ్యుయల్‌ టోన్‌ కొత్త అల్లోయ్‌ వీల్స్‌ను కొత్తగా జోడించింది. డార్క్‌ గ్రే కలర్‌లో ఇంటీరియర్‌ డిజైన్‌ను ఇచ్చింది. దీంతోపాటు స్మార్ట్‌ప్లే ఇన్‌ఫోటైన్‌మెంట్‌ సిస్టంను స్మార్ట్‌ఫోన్‌ నావిమాప్స్‌ నావిగేషన్‌ ఆప్‌తో అప్‌డేట్‌  చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement