Baleno RS model
-
సరికొత్తగా మారుతి బాలెనో ఆర్ఎస్ ఫేస్‌లిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ : మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు బాలెనో ఆర్ఎస్ కొత్త హంగులతో ముస్తాబవుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సరికొత్త అప్డేట్స్తో మారుతి బాలెనో ఆర్ ఎస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఆకర్షణీయంగా కంపెనీ తీసుకొస్తోంది. ఈ నెల చివరకు మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇక ధర విషయానికి వస్తే..రూ.8.53లక్షలుగా (ఎక్స్‌షోరూం, ఢిల్లీ) ఉండవచ్చని అంచనా. 1.0 లీటర్ పెట్రోలు బూస్టర్ జెట్ టర్బో ఇంజీన్‌తో మరింత శక్తివంతంగా ఈ కారును లాంచ్ చేయనుంది. ఫ్రంట్ బంపర్‌లో మార్పులతోపాటు పాత హెచ్ఐడీ ల్యాంప్స్‌కు బదులుగా కొత్త ఎల్ఈడీ హెడ్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ అమర్చింది. అలాగే రియర్ డిస్క్ బ్రేక్‌లను, బ్లాక్ అండ్ సిల్వర్ డ్యుయల్ టోన్ కొత్త అల్లోయ్ వీల్స్‌ను కొత్తగా జోడించింది. డార్క్ గ్రే కలర్లో ఇంటీరియర్ డిజైన్‌ను ఇచ్చింది. దీంతోపాటు స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టంను స్మార్ట్‌ఫోన్ నావిమాప్స్ నావిగేషన్ ఆప్‌తో అప్డేట్ చేసింది. -
మారుతీ సుజుకీ.. బాలెనో ఆర్ఎస్
ధర రూ. 8.69 లక్షలు న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ బాలెనో ఆర్ఎస్ మోడల్‌ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. దీంతో మారుతీ కంపెనీ అధిక పనితీరు హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి ప్రవేశించినట్లయింది. పరిచయ ధరగా రూ.8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించామని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. 1.0 లీటర్ బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారును రూపొందించామని కంపెనీ ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. తమ ప్రీమియమ్ హ్యాచ్‌బాక్ బాలెనోకు ఈ కొత్త కారు స్పోర్టీ వెర్షన్ అని పేర్కొన్నారు. ఈ కొత్త మోడల్ కారణంగా బాలెనో అమ్మకాలు అదనంగా 10 శాతం పెరుగుతాయని అంచనాలున్నాయని చెప్పారు. ఈ బాలెనో ఆర్ఎస్లో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, డ్యుయల్ ఏర్బ్యాగ్స్, అన్ని వీల్స్‌కు డిస్క్ బ్రేక్‌లు, తదితర ప్రత్యేకతలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కారు పోలో జీటీ, ఫియట్ పంటో అబర్త్ కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఈ కార్ల ధరలు రూ.9.11 లక్షల నుంచి రూ.10.31 లక్షల రేంజ్లో ఉన్నాయి.