మారుతీ సుజుకీ.. బాలెనో ఆర్‌ఎస్
ధర రూ. 8.69 లక్షలు
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ బాలెనో ఆర్‌ఎస్ మోడల్‌ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. దీంతో మారుతీ కంపెనీ అధిక పనితీరు హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి ప్రవేశించినట్లయింది. పరిచయ ధరగా రూ.8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించామని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. 1.0 లీటర్ బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారును రూపొందించామని కంపెనీ ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. తమ ప్రీమియమ్ హ్యాచ్‌బాక్ బాలెనోకు ఈ కొత్త కారు స్పోర్టీ వెర్షన్ అని పేర్కొన్నారు.
ఈ కొత్త మోడల్ కారణంగా బాలెనో అమ్మకాలు అదనంగా 10 శాతం పెరుగుతాయని అంచనాలున్నాయని చెప్పారు. ఈ బాలెనో ఆర్‌ఎస్‌లో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, డ్యుయల్ ఏర్‌బ్యాగ్స్, అన్ని వీల్స్‌కు డిస్క్ బ్రేక్‌లు, తదితర ప్రత్యేకతలున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కారు పోలో జీటీ, ఫియట్ పంటో అబర్త్ కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఈ కార్ల ధరలు రూ.9.11 లక్షల నుంచి రూ.10.31 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.