hatchback segment
-
అద్భుతమైన ఫీచర్లతో టాటా ఆల్ట్రోజ్
సాక్షి, ముంబై : ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన నూతన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'ఆల్ట్రోజ్' కారును బుధవారం లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో, ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్‌తో టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారును తీర్చిదిద్దింది. బీఎస్-6 ఉద్గార నిబంధనలకనుగుణంగా రెండు వేరియంట్ల ఇంజీన్ ఆప్షన్లతో 5-స్పీడ్ మ్యాన్యువల్ స్టాండర్డ్ గేర్‌బాక్స్‌తో లాంచ్ చేసింది. దేశంలో అతి భద్రమైన తమ ఆల్ట్రోజ్ వినియోగదారులకు బంగారం లాంటి అనుభవాన్ని ఇస్తుందని, హాచ్బ్యాక్ సెగ్మెంట్లో ఈ వాహనం తమకు మంచి గుర్తింపునివ్వనుందని కంపెనీ పేర్కొంది. టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లోని 1.2 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 86 బీహెచ్‌పి పవర్, 113ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ 90 బీహెచ్‌పి పవర్, 200ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది ఎల్ఈడీ డీఆర్ఎల్స్ గల ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, సమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, 7.0 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, లెదర్ ఫినిషింగ్‌తో మల్టిపుల్ కంట్రోల్ బటన్స్ స్టీరింగ్ వీల్, విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ ఈ, ఎక్స్ఎం, ఎక్స్‌టీ, ఎక్స్ జెడ్, ఎక్స్జెడ్(ఒ) నాలుగు వేరియంట్లలో లభించనుంది. ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే..మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. ధరలు ఎక్స్ ఈ వెర్షన్ పెట్రోల్ వెర్షన్ ధర రూ. 5.29 లక్షలు డీజిల్ వెర్షన్ ధర రూ.6.99 లక్షలు Now, every drive will feel like a golden experience, with Altroz- India's Safest Car, starting at Rs 5.29 Lakh*. Book #TheGoldStandard today pic.twitter.com/mrwiklOLwM — Tata Motors Cars (@TataMotors_Cars) January 22, 2020 -
హ్యుందాయ్ ‘ఆరా’.. ఆగయా
చెన్నై: హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన కొత్త కాంపాక్ట్ సెడాన్ ‘ఆరా’ను ఆవిష్కరించింది. ఈ సెడాన్‌ను వచ్చే నెలలో మార్కెట్లోకి ప్రవేశపెడతామని హ్యుందాయ్ ఇండియా తెలియజేసింది. ఈ సెగ్మెంట్లో ఎక్సెంట్ తర్వాత ఈ కంపెనీ అందిస్తున్న మరో కారు ఇది. స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్యూవీ), కాంపాక్ట్ హ్యాచ్‌బాక్ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు సాధిస్తున్నామని కంపెనీ ఎమ్డీ, సీఈఓ ఎస్.ఎస్. కిమ్ పేర్కొన్నారు. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో వెనకబడి ఉన్నామని, కొత్త ఆరా కారుతో ఆ సెగ్మెంట్లో కూడా మంచి అమ్మకాలు సాధించగలమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బీఎస్ 6 పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూపొందించామని, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇది లభ్యమవుతుందని చెప్పారాయన. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, వైర్లెస్ చార్జింగ్, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్, స్వెప్ట్‌బ్యాక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, బూమరాంగ్ షేప్‌లో ఉండే ఎల్ఈడీ డే రన్నింగ్ లైట్స్ తదితర ఫీచర్లున్నాయని తెలియజేశారు. కాగా ఈ కారు ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల (ఎక్స్‌షోరూమ్ ధరలు) శ్రేణిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ కారు మారుతీ డిజైర్, హోండా అమేజ్, ఫోక్స్‌వ్యాగన్ అమియో, ఫోర్డ్ ఆస్పైర్, టాటా టిగొర్, టొయోటా యారీలకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
మారుతీ సుజుకీ.. బాలెనో ఆర్ఎస్
ధర రూ. 8.69 లక్షలు న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ బాలెనో ఆర్ఎస్ మోడల్‌ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. దీంతో మారుతీ కంపెనీ అధిక పనితీరు హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి ప్రవేశించినట్లయింది. పరిచయ ధరగా రూ.8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించామని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. 1.0 లీటర్ బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారును రూపొందించామని కంపెనీ ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. తమ ప్రీమియమ్ హ్యాచ్‌బాక్ బాలెనోకు ఈ కొత్త కారు స్పోర్టీ వెర్షన్ అని పేర్కొన్నారు. ఈ కొత్త మోడల్ కారణంగా బాలెనో అమ్మకాలు అదనంగా 10 శాతం పెరుగుతాయని అంచనాలున్నాయని చెప్పారు. ఈ బాలెనో ఆర్ఎస్లో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, డ్యుయల్ ఏర్బ్యాగ్స్, అన్ని వీల్స్‌కు డిస్క్ బ్రేక్‌లు, తదితర ప్రత్యేకతలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కారు పోలో జీటీ, ఫియట్ పంటో అబర్త్ కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఈ కార్ల ధరలు రూ.9.11 లక్షల నుంచి రూ.10.31 లక్షల రేంజ్లో ఉన్నాయి.