సాక్షి, ముంబై : ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన నూతన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'ఆల్ట్రోజ్' కారును బుధవారం లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో, ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్‌తో టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారును తీర్చిదిద్దింది. బీఎస్-6 ఉద్గార నిబంధనలకనుగుణంగా రెండు వేరియంట్ల ఇంజీన్ ఆప్షన్లతో 5-స్పీడ్ మ్యాన్యువల్ స్టాండర్డ్ గేర్‌బాక్స్‌తో లాంచ్ చేసింది. దేశంలో అతి భద్రమైన తమ ఆల్ట్రోజ్ వినియోగదారులకు బంగారం లాంటి అనుభవాన్ని ఇస్తుందని, హాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఈ వాహనం తమకు మంచి గుర్తింపునివ్వనుందని కంపెనీ పేర్కొంది.
టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లోని 1.2 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 86 బీహెచ్‌పి పవర్, 113ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ 90 బీహెచ్‌పి పవర్, 200ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది ఎల్ఈడీ డీఆర్ఎల్స్ గల ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, సమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, 7.0 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెదర్ ఫినిషింగ్‌తో మల్టిపుల్ కంట్రోల్ బటన్స్ స్టీరింగ్ వీల్, విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ ఈ, ఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్ జెడ్, ఎక్స్‌జెడ్(ఒ) నాలుగు వేరియంట్లలో లభించనుంది. ఇక మార్కెట్‌లో పోటీ విషయానికి వస్తే..మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా.
ధరలు
ఎక్స్ ఈ వెర్షన్
పెట్రోల్ వెర్షన్ ధర రూ. 5.29 లక్షలు
డీజిల్ వెర్షన్ ధర రూ.6.99 లక్షలు
Now, every drive will feel like a golden experience, with Altroz- India's Safest Car, starting at Rs 5.29 Lakh*. Book #TheGoldStandard today pic.twitter.com/mrwiklOLwM
— Tata Motors Cars (@TataMotors_Cars) January 22, 2020
Comments
Please login to add a commentAdd a comment