Shantanu Naidu New Tata Safari Facelift: దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే భారతీయ మార్కెట్లో హారియర్, సఫారీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను విడుదల చేసింది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ల మాదిరిగానే అద్భుతంగా ఉన్న ఈ మోడల్స్ చాలా మంది కొనుగోలుదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. ఇటీవల రతన్ టాటా మేనేజర్, గుడ్‌ఫెలోస్ వ్యవస్థాపకుడు 'టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్' (Tata Safari Facelift) కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గతంలో టాటా నానో కారుని ఉపయోగించే రతన్ టాటా మేనేజర్ 'శంతను నాయుడు' (Shantanu Naidu) తాజాగా ఖరీదైన సఫారీ ఫేస్‌లిఫ్ట్ సొంతం చేసుకున్నారు. వైట్ కలర్లో ఆకర్షణీయంగా ఉన్న ఈ కారులో ఇప్పటికే 1000 కిమీ ప్రయాణించినట్లు, దానికి 'యుకీ' అని పేరు కూడా పెట్టుకున్నట్లు సమాచారం.
టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్
రూ. 16.19 లక్షల ప్రారంభ ధరలో దేశీయ విఫణిలో లాంచ్ అయిన సఫారీ ఫేస్‌లిఫ్ట్ మొత్తం 10 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 27.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే..
సఫారీ ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 170 హార్స్ పవర్, 350 న్యూటన్ మాటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. కాస్మిక్ గోల్డ్, గెలాక్సీ సఫైర్, లూనార్ స్లేట్, స్టార్‌డస్ట్ యాష్, స్టెల్లార్ ఫ్రాస్ట్, సూపర్నోవా కాపర్ వంటి ఆరు కలర్ ఆప్సన్లలో లభించే ఈ కారు ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment