tata safari
-
రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా!
Shantanu Naidu New Tata Safari Facelift: దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే భారతీయ మార్కెట్లో హారియర్, సఫారీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేసింది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ల మాదిరిగానే అద్భుతంగా ఉన్న ఈ మోడల్స్ చాలా మంది కొనుగోలుదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. ఇటీవల రతన్ టాటా మేనేజర్, గుడ్‌ఫెలోస్ వ్యవస్థాపకుడు 'టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్' (Tata Safari Facelift) కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గతంలో టాటా నానో కారుని ఉపయోగించే రతన్ టాటా మేనేజర్ 'శంతను నాయుడు' (Shantanu Naidu) తాజాగా ఖరీదైన సఫారీ ఫేస్‌లిఫ్ట్ సొంతం చేసుకున్నారు. వైట్ కలర్లో ఆకర్షణీయంగా ఉన్న ఈ కారులో ఇప్పటికే 1000 కిమీ ప్రయాణించినట్లు, దానికి 'యుకీ' అని పేరు కూడా పెట్టుకున్నట్లు సమాచారం. టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ రూ. 16.19 లక్షల ప్రారంభ ధరలో దేశీయ విఫణిలో లాంచ్ అయిన సఫారీ ఫేస్‌లిఫ్ట్ మొత్తం 10 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 27.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. సఫారీ ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 170 హార్స్ పవర్, 350 న్యూటన్ మాటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. కాస్మిక్ గోల్డ్, గెలాక్సీ సఫైర్, లూనార్ స్లేట్, స్టార్‌డస్ట్ యాష్, స్టెల్లార్ ఫ్రాస్ట్, సూపర్నోవా కాపర్ వంటి ఆరు కలర్ ఆప్సన్లలో లభించే ఈ కారు ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. -
స్టార్ క్రికెటర్ కోహ్లీ, ఫస్ట్ కారు ఏదో తెలుసా? దుమ్మురేపే లగ్జరీ కార్ల కలెక్షన్
సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిక్రికెటర్గా తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అలాగే తన గ్యారేజీలో ఖర్జీదైన కార్ల విషయం, స్పోర్ట్స్ కార్లంటే కోహ్లికి ఉన్న పిచ్చి ప్రేమ కూడా తెలిసిన సంగతే. విదేశీ కార్లు, స్వదేశీ కార్లతో ఈ విషయంలో చాలా స్పెషల్‌గా ఉంటాడు. కింగ్ కోహ్లీగా పాపులర్ అయిన కోహ్లీ తనకిష్టమైన, ఫస్ట్ కారు గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీనిపై ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ చర్చించుకుంటున్నారు. రూ.1,000 కోట్లకు పైగా నికర విలువతో టాప్‌లో ఉన్న కోహ్లీ తొలి కారేంటో తెలుసా? మెర్సిడెస్ బెంజో , బీఎండబ్ల్యూనో, ఆడి కాఓ కాదు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన టాటా సఫారీ. అవును ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. ఈ కారును తన సొంత డబ్బుతో కొనుగోలు చేశాడట. సఫారీని ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా స్టార్ స్పోర్ట్స్‌తో కోహ్లీ వెల్లడించాడు. కేవలం ఫీచర్లే కాదు, దీని గుర్తింపు ఆధారంగా ఈ కారుపై మనసు పడినట్టు విరాట్ తెలిపాడు. ఒక సందర్భంలో ఈ కారులో డీజిల్‌కి బదులుగా పెట్రోల్ నింపడం, ఆతరువాత విషయం తెలిసి ట్యాంకుని ఖాళీ చేసిన సంగతులను కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. (కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్) జర్మన్ ఆటోమేకర్ ఆడికి బ్రాండ్ అంబాసిడర్‌గా అన్నవిరాట్ కోహ్లీ ఎక్కువ స్పేస్ ఉన్న కార్లంటే ఇష్టమని చెప్పాడు. ప్రస్తుతం కోహ్లీ చేతిలో ఆధునాతన కార్లులిస్ట్ ఒకసారి చూద్దాం. భారతదేశపు అత్యంత సంపన్న క్రీడాకారుడు, ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్ ఆటగాళ్ళలో ఒకరైన విరాట్ కోహ్లీ 22 కోట్లకుపై విలువైన ఆడి A8 L W12, బెంట్లీ కాంటినెంటల్ GT , ల్యాండ్ రోవర్ వోగ్‌తో సహా ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లను సొంతం చేసుకున్నాడు. (ప్రియుడి బర్త్‌డే బాష్: మలైకా డ్రెస్ ఖరీదెంతో తెలుసా?) కోహ్లి గ్యారేజీలోని అత్యంత ఖరీదైన కార్లు బెంట్లీ కాంటినెంటల్ GT, రూ. 4.04 కోట్లు బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ రూ. 3.41 కోట్లు ఆడి R8 LMX లిమిటెడ్ ఎడిషన్, రూ. 2.97 కోట్లు ఆడి ఆర్8 వి10 రూ. 2.97 కోట్లు అత్యంత వేగవంతమైన కారు ఆడి A8L W12 క్వాట్రో ధర: రూ. 1.87 కోట్లు -
అదిరిపోతున్న టాటా మోటార్స్ ఆఫర్లు, ఈ కార్లపై భారీ తగ్గింపు!
పండుగ సీజన్ వస్తూ వస్తూ దాని వెంట డిస్కౌంట్లు, ఆఫర్లను కూడా తీసుకువస్తుంది. అందులో దసరా, దీపావళి సీజన్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. ఇప్పటికే కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు బోలెడు ఆఫర్లతో ప్రకటిస్తున్నాయి. తాజాగా పండుగ సందర్భంగా కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ (TATA Motors). టాటా మోటార్స్ వివిధ కార్లపై బెస్ట్ ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ నెలలో తమ కంపెనీ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 40,000 వరకు బెనిఫిట్స్ ఇస్తున్నట్లు తెలిపింది. డిస్కౌంట్లు ప్రకటించిన కార్ల మోడళ్లపై ఓ లుక్కేద్దాం! టాటా టియాగో (TATA Tiago) టాటా టిగోర్ కొనుగోలుపై రూ. 20,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కొనుగోలుదారులు రూ. 10,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్, రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ కారులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్.. 86PS వపర్‌ను, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా టిగోర్ CNG (TATA tigor CNG) ఈ నెలలో టాటా టిగోర్ CNG కారును కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 25,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. వీటిలో క్యాష్ డిస్కౌంట్ రూ. 10,000, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ రూ. 15,000గా ఉంది. ఈ కారులోని 1.2-లీటర్ ఇంజిన్ 73PS పవర్, 95Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా హారియర్(Tata Harrier) టాటా హారియర్ అన్ని టాటా కార్లలో అధికంగా తగ్గింపును ప్రకటించింది. తాజా సేల్‌లో ఈ SUVపై కస్టమర్లు రూ. 40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్చేంజ్ బెనిఫిట్‌తో కలిసి ఈ మేరకు ధర తగ్గుతుంది. ఇంజన్ విషయానికి వస్తే, టాటా హారియర్ 2.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ (1956cc), గరిష్ట 350Nm టార్క్, 170PS పవర్‌ని విడుదల చేస్తుంది. SUV బూట్ స్పేస్ 425 లీటర్లు కాగా, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్లుగా ఉంది. టాటా సఫారి(Tata Safari) టాటా సఫారీని రూ. 40,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ ఆఫర్లో రూ. 40,000 ఎక్స్ఛేంజ్ తగ్గింపు ఉంటుంది. అయితే, టాటా అందించే ఈ అత్యంత ప్రీమియం SUVపై ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ లేదు. టాటా సఫారి 2.0-లీటర్, టర్బో-డీజిల్ ఇంజన్‌తో 170 PS పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. చదవండి: ఆర్ఆర్ఆర్ మేనియా: ఆనంద్ మహీంద్ర కొత్త కారు నిక్‌నేమ్ ‘భీమ్’కే ఓటు -
వారెవ్వా టాటా ! ‘డార్క్’ దద్దరిల్లిపోతుందిగా !!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్ ప్రీమియం ఎస్యూవీ సఫారీ డార్క్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.19.05 లక్షల నుంచి ప్రారంభం. బుకింగ్స్ మొదలయ్యాయని, అన్ని డీలర్షిప్ కేంద్రాల్లో ఈ వాహనం అందుబాటులో ఉందని కంపెనీ సోమవారం తెలిపింది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఫీచర్లు 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్, తొలి, రెండవ వరుసల్లో వెంటిలేటెడ్ సీట్స్, ఎయిర్ ప్యూరిఫయర్, 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 6/7 సీట్లు, 18 అంగుళాల అలాయ్ వీల్స్, 8.8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, జేబీఎల్ ఆడియో, వైర్లెస్ చార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి హంగులు ఉన్నాయి. కస్టమర్లకు డార్క్ శ్రేణి ఒక ప్రముఖ ఎంపికగా మారిందని కంపెనీ వివరించింది. హారియర్ డార్క్ ప్రజాదరణ పొందిందని తెలిపింది. గతేడాది నుంచి ఇప్పటి వరకు 16,000 సఫారీ ఎస్‌యూవీలు రోడ్డెక్కాయి. -
ఐపీఎల్ 2021.. టాటా సఫారీ సర్ప్రైజ్ ఎంట్రీ!
త్వరలో దుబాయ్‌లో జరగబోతున్న ఐపీఎల్ 2021 సందర్భంగా ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేందుకు టాటా సఫారీ సిద్ధమైంది. గత రెండు దశాబ్ధాలుగా భారతీయ రోడ్లపై పరుగులు పెడుతున్న ఈ కారు సరికొత్త రూపంలో దర్శనం ఇచ్చేందుకు బీ రెడీ అంటోంది. గోల్డ్ ఎడిషన్ రెండు దశాబ్దాలుగా ఇండియన్ రోడ్లపై టాటా సఫారీలు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఈ ఇరవై ఏళ్లలో ఏన్నో కొత్త కార్లు వచ్చినా సఫారీ స్థానం చెక్కు చెదరలేదు. అలాంటి టాటా సఫారీ ఈసారి బంగారు రూపం సంతరించుకోనుంది. గతానికి భిన్నంగా గోల్డ్ ఎడిషన్‌ను తెస్తోంది టాటా మోటార్స్. కొత్త రంగుల్లో ఇరవై ఏళ్లలో టాటా సఫారీలు కేవలం ఐదు రంగుల్లోనే మార్కెట్లోకి వచ్చాయి. అందులో రాయల్ బ్లూ, ట్రోపికల్ మిస్ట్, డేటోనా గ్రే, ఓర్కస్ వైట్, ట్రోపికల్ మిస్ట్ అడ్వెంచర్ వంటి ఐదు రంగుల్లోనే అభిమానులను అలరించింది. కానీ ఈ సారి ఏకంగా పూర్తిగా బంగారు రంగులో రాబోతుంది. ఐపీఎల్ 2021కి టాటా మోటార్స్ అఫీషియల్ స్పాన్సర్‌గా ఉంది. దీంతో ఐపీఎల్ వేదికగా గోల్డ్ ఎడిషన్‌ను పరిచయం చేనుంది. స్పెషల్ ఎడిషన్స్ ఇప్పటికే టాటా సంస్థ ఆల్ట్రోజ్‌లో గోల్డ్ ఎడిషన్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత సఫారీకి ఈ ఎడిషన్‌ను విస్తరించనుంది. గోల్డ్ ఎడిషన్‌తో పాటు హారియర్ కార్లలో డార్క్ ఎడిషన్‌ను కూడా ప్రత్యేకంగా తెచ్చింది టాటా మోటార్స్. టాటా సఫారీలో 2 లీటర్ టర్బో ఛార్జెడ్ కైరోటీ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ 1750 నుంచి 2500 రేంజ్లో ఆర్‌పీఎంని అందిస్తుంది. టాటా సఫారీ ఎక్స్‌షోరూం ధరలు రూ.14.99 లక్షల నుంచి ప్రారంభం అవుతున్నాయి. Tata Safari is officially sponsor of Vivo IPL 2021 and likely to unveiled its GOLD edition in this festive season.@TataMotors @TataSafariIndia @tatasafarigold @IPL#TataSafari #TataSafariGold pic.twitter.com/HsfPCXQVTZ — Team Ignition (@TeamIgnition2) September 14, 2021 చదవండి : Neeraj Chopra: ‘టాటా ఏఐఏ’ బ్రాండ్ అంబాసిడర్‌గా నీరజ్ చోప్రా -
Fact Check: ఉచితంగా టాటా సఫారీని గెలుచుకోండి!
మీకు 'కంగ్రాచ్యులేషన్' మేం అడిగిన నాలుగు ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పారు. త్వరలో మీకు టాటామోటార్స్ తరుపు నుంచి ఉచితంగా టాటా సఫారీ వాహనాన్ని అందిస్తాం’ అంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే వైరల్ అవుతున్న ఈ మెసేజ్ ఫ్యాక్ట్ చెక్ చేస్తే సైబర్ మోసగాళ్లు ఈ నయామోసానికి తెరలేపినట్లు తేలింది. ఇప్పటి వరకు టాటామోటార్స్ కు చెందిన 30మిలియన్ల వాహనాలు సేల్ అయ్యాయి. ఇందులో భాగంగా టాటామోటార్స్ ఓ ఆఫర్ ను ప్రకటించినట్లు ఓ మెసేజ్ చక్కెర్లు కొడుతుంది. ఆ మెసేజ్ లో ఓ అనధికారిక సైట్ ఓపెన్ అవుతుంది. ఆ సైట్ పైన టాటామోటార్స్ పేరుంటుంది. తప్పా ఊరు, అడ్రస్ ఉండదు. ఇక సైట్ లో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది. ఆ సమాధానం చెబితే టాటా సఫారీని సొంతం చేసుకోవచ్చు అంటూ ఊరించడంతో ఇప్పటి వరకు 4 వేల మందికి పైగా ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మరికొంతమందికి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. దీని గురించి ఆరా తీస్తే సైబర్ నేరస్తులు ఐపీ అడ్రస్, వ్యక్తిగత సమాచారం దొంగిలించేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్ అధికారిక వెబ్ సైట్ లో ఎలాంటి ఆఫర్లు లేవు. కాబట్టి ఇది పక్కా ఫ్రాడ్ అని టెక్ నిపుణులు తేల్చారు. పొరపాటున ఆ మెసేజ్ మీకు వస్తే లింక్ ఓపెన్ చేసి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయోద్దని, అలా చేస్తే వ్యక్తిగత భద్రతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా, వైరల్ అవుతున్న లింక్స్ పై పలువురు నెటిజన్లు ఆ అవును మా ఇంటికి టాటా సఫారీ వాహనం వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Mahindra : మహీంద్ర బంపర్ ఆఫర్ -
టాటా సఫారీ.. బుకింగ్స్ ప్రారంభం
ముంబై: టాటా మోటార్స్ కంపెనీ సఫారీ ఎస్‌యూ పేరిట ఫ్లాగ్షిప్ కారును మంగళవారం ఆవిష్కరించింది. మొత్తం ఆరు వేరియంట్లలో లభ్యమయ్యే ఈ మోడల్ బుకింగ్స్ ఫిబ్రవరి 4న ప్రారంభమవుతాయి. ల్యాండ్ రోవర్ డీ8 ఆర్కిటెక్చర్‌పై భారతీయ పరిస్థితులకు అనుగుణంగా టాటా సఫారీని రూపొందించారు. ఎక్స్జెడ్ ప్లస్, ఎక్స్జెడ్ఏ ప్లస్ వేరియంట్లు ఆరు సీట్ల సామర్థ్యాన్ని, మిగిలిన వేరియంట్లు ఏడు సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో 168 హార్స్పవర్ సామర్థ్యం, 350ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే రెండు లీటర్ల డిజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఆరు స్పీడ్ మ్యానువల్, ఆటో ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, రెండో వరుసలో రిక్లైనింగ్ సీట్ల సదుపాయం, ఎంబెంట్ మూడ్ లైటింగ్ వ్యవస్థ, ఏసీ సదుపాయంతో పాటు మల్టీ డ్రైవ్ (సీటీ/స్పోర్ట్స్/ఎకో) మోడ్స్ లాంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధరను తర్వలో ప్రకటిస్తామని ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ తెలిపింది. చదవండి: ఇక 15 ఏళ్ల ప్రభుత్వ వాహనాలు తుక్కుతుక్కే! -
సఫారీ వాహనాన్ని వదిలివెళ్లిన దుండగులు
వికారాబాద్: జిల్లాలోని దరూర్ మండలం నాగసందర్ గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి టాటా సఫారీ వాహనాన్ని వదిలేసి వెళ్లారు. రోడ్డు పక్కన వాహనం ఆగి ఉండటం గుర్తించిన స్థానికులు అక్కడ ఎవరూ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి వేలిముద్రలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాహనం మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వాహనం సమీపంలోనే ఖాళీ మద్యం సీసాలతో పాటు కొన్నిదుస్తువులు చిందర వందరగా పడేసి ఉండటం అనుమానులకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
జిప్సీ అవుట్.. సఫారీ ఇన్
న్యూఢిల్లీ : ఆర్మీ వాహనాలుగా గత 25 ఏళ్లుగా సేవలందిస్తున్న మారుతీ జిప్సీ రిటైర్ కాబోతుంది. ఈ ఐకానిక్ మారుతీ జిప్సీ స్థానంలో కొత్త రేంజ్‌లోని ఎస్‌యూవీలు ఆర్మీ కొత్త వాహనాలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. వీటికోసం టాటా సఫారీ స్టోర్మ్లను తమ కొత్త వాహనాలుగా ఆర్మీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొదటగా 3198 వాహనాలకు టాటా మోటార్స్‌కు ఆర్మీ ఆర్డర్ ఇచ్చిందని... వచ్చే ఏళ్లలో వీటిని 10 సార్లు పెంచబోతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆర్మీకి వాహనాలు అందించడానికి మహింద్రా అండ్ మహింద్రా, టాటా మోటార్స్ పోటాపోటీగా తలపడ్డాయి. మహింద్రా అండ్ మహింద్రా తన స్కార్పియో ఎస్‌యూవీలను ఆర్మీకి ఆఫర్ చేసింది. కానీ ఈ బిడ్‌ను టాటా మోటార్స్ కైవసం చేసుకుంది. కొత్త వాహనాల కోసం ఆర్మీ 2013లో మొదటి బిడ్ జారీచేసింది. ఆర్మీ నిర్వహించిన అన్నీ టెక్నికల్ ట్రయల్స్‌లో ఈ రెండు కంపెనీలు మెరుగైన ప్రదర్శననే కనబర్చాయి.. అయితే టాటా గ్రూప్ మంచి ఫైనాన్సియల్ డీల్‌ను ఆర్మీ ముందుంచడంతో టాటా మోటార్స్ వెహికిల్స్‌కే ఆర్మీ మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. దీంతో జిప్సీ స్థానంలో టాటా సఫారీలు ఆర్మీ వాహనాలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇంకా దీనిపై ఆర్మీ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ డీల్ టాటా మోటార్స్‌కు ఈ ఏడాదిలో రెండో మేజర్ డీల్ కాబోతుంది. ఇప్పటికే ఆర్మీకి అత్యాధునికమైన మిలటరీ ట్రక్కులను అందించడానికి జనవరిలో రూ.1,300 కోట్లను డీల్‌ను టాటా మోటార్స్ కుదుర్చుకుంది. ప్రస్తుతం 30,000 మారుతీ జిప్సీలు ఆర్మీ వాహనాలుగా సేవలందిస్తున్నాయి. -
ఇంట్లోకి దూసుకెళ్లిన సఫారీ, 3 బైక్‌లు ధ్వంసం
-
ఇంట్లోకి దూసుకెళ్లిన సఫారీ, 3 బైక్‌లు ధ్వంసం
హైదరాబాద్ : నగరంలోని తుకారం గేట్ వద్ద టాటా సఫారీ బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం ఓ ఇంట్లోకి సఫారీ దూసుకెళ్లడంతో 3 బైక్‌లు సహా ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
తప్పుడు ప్రకటనతో మోసపోయిన విద్యార్థి
రాయదుర్గంటౌన్: ‘టీవీలో వచ్చిన ప్రకటనలో మా ప్రశ్నకు నీవు సరైన సమాధానం చెప్పావు. లక్కీ కంటెస్ట్‌లో టాటా సఫారీ కారు గెలుచుకున్నావు. నీకు కారు కావాలా? లేదా నగదు రూ.12.50 లక్షలు కావాలా?’ అని వచ్చిన ఫోన్‌కాల్‌కు స్థానిక డిగ్రీ కళాశాల విద్యార్థి ఒకరు రూ.15,500 చెల్లించి మోసపోయాడు. తీరా తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు మోసపూరిత ప్రకటన ప్రసారం చేసిన టీవీ ఛానల్, గ్లోబల్ ఇండియన్ లక్కీ కంటెస్ట్ గౌహతి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడైన గుమ్మఘట్ట మండలం గోనబావికి చెందిన శర్మస్‌బేగ్ కుమారుడు ఇర్ఫాన్‌బేగ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 13న మధ్యాహ్నం 1.20 గంటలకు ఓ హిందీ ఛానల్లో ప్రసారమైన ప్రకటనలో గ్లోబల్ ఇండియన్ లక్కీ కంటెస్ట్ గౌహతి వారు నిర్వహిస్తున్న పోటీలో గెలుపొందిన వారికి బహుమతిగా ఇవ్వనున్న కార్లు ఇవేనని టాటా కార్లను కూడా చూపించారు. తాము చూపించిన చిత్రంలో ఉన్న వ్యక్తిని గుర్తించిన వారికి టాటా సఫారీ కారు ఇస్తామని ప్రకటించారు. దీంతో చిత్రంలో ఉన్న వ్యక్తిని క్రికెటర్ ధోనీగా గుర్తించిన ఇర్ఫాన్‌బేగ్... వెంటనే కంటెస్ట్ నిర్వాహకులకు ఫోన్ చేసి సమాధానం చెప్పాడు. అనంతరం లక్కీ కంటెస్ట్ నిర్వాహకులమంటూ మహేంద్రసింగ్, రాఘవేంద్ర అనే వ్యక్తులు ఇర్ఫాన్‌బేగ్‌కు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పిన నీవు టాటా సఫారీ కారు గెలుచుకున్నావు. నీకు కారు కావాలా, లేక డబ్బు కావాలా అని ప్రశ్నించగా కారు కావాలని సమాధానమిచ్చాడు. దీంతో ట్రాన్స్‌పోర్టు చార్జీల కింద రూ.12,500 తమ అకౌంట్లో చెల్లించాలని స్టేట్‌బ్యాంక్ ఖాతా నంబర్ ఇచ్చారు. వెంటనే అదేరోజు ఇర్ఫాన్‌బేగ్ ఆ మొత్తాన్ని వారు సూచించిన అకౌంట్‌కు జమచేశాడు. మరోసారి ఫోన్ చేసి కారు గురించి ఆరా తీయగా బీమా కోసం మరో రూ.3 వేలు చెల్లించాలని చెప్పారు. దీంతో 18వ తేదీన రూ.1,000 అదే ఖాతాకు జమ చేశాడు. శుక్రవారం నిర్వాహకులే ఫోన్ చేసి తక్కువ మొత్తం అకౌంట్లో వేశావేమిటని ప్రశ్నించగా మరో రూ.2 వేలను వెంటనే బ్యాంక్‌లో జమ చేశాడు. అనంతరం ఇర్ఫాన్ వారికి ఫోన్ చేసి తనకు కారు వద్దని, బహుమతి మొత్తం చెల్లించాలని కోరాడు. దీంతో వారు మరో రూ.7 వేలు చెల్లిస్తే బహుమతి మొత్తం పంపుతామని సమాధానమిచ్చి ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. ఫలితంగా తాను మోసపోయానని గ్రహించిన ఇర్ఫాన్‌బేగ్ స్థానిక ఎస్ఐ రాఘవరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనలాగా ఇతరులు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. -
'సింగమ్ రిటర్న్స్' భారీ వసూళ్లు!
ముంబై: స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలైన బాలీవుడ్ సినిమా 'సింగమ్ రిటర్న్స్' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. తమిళ నటుడు సూర్య చేసిన సింగం 2 కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఒక్క రోజులోనే బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు ఒక శుక్రవారమే సింగమ్ రిటర్న్స్ రూ.30 కోట్లను వసూలు చేసి సరికొత్త రికార్డును దక్కించుకుంది. ఒక స్టార్ హీరో, ఒక స్టార్ హీరోయిన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంపై ఆది నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అజయ్ దేవ్గన్ 'సింగం' లో ఎక్కువగా మహీంద్రా స్కార్పియో వాహనంలోనే కనిపిస్తే.. ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'సింగం రిటర్న్స్'లో మాత్రం ఆయన టాటా సఫారీలో అలరించాడు. -
స్కార్పియో వదిలి.. సఫారీలో వస్తున్న సింగం
హిందీ సినిమా 'సింగం'లో హీరో అజయ్ దేవ్‌గణ్ ఎక్కువగా మహీంద్రా స్కార్పియో వాహనంలోనే కనిపించారు. కానీ, ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'సింగం రిటర్న్స్'లో మాత్రం ఆయన ఆ వాహనాన్ని వదిలేసి.. టాటా సఫారీలో రాబోతున్నారు. ఈ సినిమాలో టాటా సఫారీ స్ట్రోమ్, సుమో, ఆరియా, సుమో గ్రాండ్, జెనాన్, నానో లాంటి టాటా బ్రాండ్లన్నీ కూడా కనిపిస్తాయి. ఈ చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టితో ఈ మేరకు టాటా మోటార్స్ సంస్థ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. రోహిత్‌కు వాహనాలంటే మహా ఇష్టం. అందుకే సింగంలో భారీ సంఖ్యలో స్కార్పియోలను ఉపయోగించాడు. ఈసారి వాటిని వదిలేసి టాటా సఫారీ స్ట్రోమ్ వాడుతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సినిమా హీరో, హీరోయిన్లు అజయ్ దేవ్‌గణ్, కరీనా కపూర్ ఇద్దరికీ అద్భుతమైన ఎనర్జీ, కరిష్మా ఉన్నాయని.. వాళ్లు తమ వాహనాలనే ఉపయోగిస్తారని టాటా మోటార్స్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ హెడ్ దేల్నా అవారీ తెలిపారు.