
ముంబై: టాటా మోటార్స్ కంపెనీ సఫారీ ఎస్‌యూ పేరిట ఫ్లాగ్‌షిప్ కారును మంగళవారం ఆవిష్కరించింది. మొత్తం ఆరు వేరియంట్లలో లభ్యమయ్యే ఈ మోడల్ బుకింగ్స్ ఫిబ్రవరి 4న ప్రారంభమవుతాయి. ల్యాండ్ రోవర్ డీ8 ఆర్కిటెక్చర్‌పై భారతీయ పరిస్థితులకు అనుగుణంగా టాటా సఫారీని రూపొందించారు. ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్‌ఏ ప్లస్ వేరియంట్లు ఆరు సీట్ల సామర్థ్యాన్ని, మిగిలిన వేరియంట్లు ఏడు సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
ఇందులో 168 హార్స్‌పవర్ సామర్థ్యం, 350ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే రెండు లీటర్ల డిజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఆరు స్పీడ్ మ్యానువల్, ఆటో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, రెండో వరుసలో రిక్లైనింగ్ సీట్ల సదుపాయం, ఎంబెంట్ మూడ్ లైటింగ్ వ్యవస్థ, ఏసీ సదుపాయంతో పాటు మల్టీ డ్రైవ్ (సీటీ/స్పోర్ట్స్/ఎకో) మోడ్స్ లాంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధరను తర్వలో ప్రకటిస్తామని ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment