'సింగమ్ రిటర్న్స్' భారీ వసూళ్లు! | Box office report, 'Singham Returns' roars big, makes Rs 30 crore on Day 1 | Sakshi
Sakshi News home page

'సింగమ్ రిటర్న్స్' భారీ వసూళ్లు!

Published Sat, Aug 16 2014 3:34 PM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

'సింగమ్ రిటర్న్స్' భారీ వసూళ్లు!

'సింగమ్ రిటర్న్స్' భారీ వసూళ్లు!

ముంబై: స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలైన బాలీవుడ్ సినిమా  'సింగమ్ రిటర్న్స్' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.  తమిళ నటుడు సూర్య చేసిన సింగం 2 కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఒక్క రోజులోనే బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు ఒక శుక్రవారమే సింగమ్ రిటర్న్స్ రూ.30 కోట్లను వసూలు చేసి సరికొత్త రికార్డును దక్కించుకుంది. ఒక స్టార్ హీరో, ఒక స్టార్ హీరోయిన్ కాంబినేషన్లో  తెరకెక్కిన ఈ చిత్రంపై ఆది నుంచి భారీ అంచనాలే ఉన్నాయి.
 

అజయ్ దేవ్గన్  'సింగం' లో ఎక్కువగా మహీంద్రా స్కార్పియో వాహనంలోనే కనిపిస్తే.. ఆ సినిమాకు సీక్వెల్గా వచ్చిన  'సింగం రిటర్న్స్'లో మాత్రం ఆయన  టాటా సఫారీలో అలరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement