బాలీవుడ్ మారుతోంది.. | Kareena Kapoor Khan: I am both a star and an actress | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ మారుతోంది..

Published Tue, Aug 12 2014 10:28 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ మారుతోంది.. - Sakshi

బాలీవుడ్ మారుతోంది..

  ‘బాలీవుడ్‌లో మార్పు కనిపిస్తోంది.. ఒకప్పుడు హీరోయిన్ పెళ్లి చేసుకుంటే అక్కడితో ఆమె  కెరీర్ ముగిసిపోయినట్లే.. కాని ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్లకు కొత్త, పాత అనే తేడా లేకుండా అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయి.. ఇది శుభ పరిణామం..’అని బాలీవుడ్ అందాల నటి కరీనా కపూర్ ఖాన్ వ్యాఖ్యానించింది. పెళ్లయిన తర్వాత హీరోయిన్లకు మంచి అవకాశాలు రావనేది అవాస్తవం.. నా పెళ్లయిన తర్వాత కూడా సల్మాన్, ఆమిర్, అజయ్ దేవగన్ వంటి అగ్రహీరోలతో నటించా.. నటిస్తున్నా.. అని ఆమె పేర్కొంది. కరీనా 20102లో హీరో సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంది. అయినా ఆమె సినీ కెరీర్‌కు ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు.
 
 పెళ్లయిన వెంటనే అమీర్‌ఖాన్‌తో తలాష్, సల్మాన్ ‘తబాంగ్-2’లో ఐటమ్ సాంగ్, అమితాబ్,అజయ్‌దేవగన్ కలిసి నటించిన ‘సత్యాగ్రహ్’లో ప్రధాన భూమికలను పోషించింది. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగన్ హీరోగా త్వరలో విడుదల కానున్న సింగమ్ రిటర్న్స్ సినిమాలో హీరోయిన్‌గా అలరించనుంది. ‘ పెళ్లి చేసుకోవడం నేరం కాదు కదా.. నా కెరీర్‌కు పెళ్లి ఆటంకం కాలేదు. పెళ్లయిన తర్వాత కూడా పెద్ద బ్యానర్‌లలో, పెద్ద హీరోలతో కలిసి నటించే అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో మార్పు వస్తోంది, చిన్న, పెద్ద.. కొత్త, పాత అనే తేడా లేకుండా మంచి నటులందరికీ అవకాశాలు లభిస్తున్నాయి.. ఇది ఆహ్వానించదగ్గ విషయమ’ని ఆమె పేర్కొంది.
 
 సింగమ్ రిటర్న్స్ ఈ నెల 15వ (శుక్రవారం) తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గత ఐదు నెలలుగా తాను సినీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నానని, తన భర్తతో కూడా సరిగా మాట్లాడేందుకు కూడా సమయం చిక్కలేదని అంది. అందుకే తనకు సరిగా సమయం కేటాయించడంలేదని సైఫ్ రోజూ ఫిర్యాదుచేస్తున్నాడని ఆమె నవ్వుతూ చెప్పింది. అందుకే ఈ సినిమా తర్వాత నెలన్నర పాటు బ్రేక్ తీసుకుని సైఫ్‌తో పాటు ప్రపంచాన్ని చుట్టివచ్చేస్తానని ఆమె వ్యాఖ్యానించింది. గతంలో అజయ్, కరీనా జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో విడుదలైన గోల్‌మాల్-2, గోల్‌మాల్-3 సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ అదే కాంబినేషన్‌లో సింగమ్ రిటర్న్స్ వస్తోంది.. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement