స్కార్పియో వదిలి.. సఫారీలో వస్తున్న సింగం | singham disassociates scorpio, now comes in safari | Sakshi
Sakshi News home page

స్కార్పియో వదిలి.. సఫారీలో వస్తున్న సింగం

Published Mon, Jul 7 2014 4:01 PM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

స్కార్పియో వదిలి.. సఫారీలో వస్తున్న సింగం

స్కార్పియో వదిలి.. సఫారీలో వస్తున్న సింగం

హిందీ సినిమా 'సింగం'లో హీరో అజయ్ దేవ్గణ్ ఎక్కువగా మహీంద్రా స్కార్పియో వాహనంలోనే కనిపించారు. కానీ, ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా వస్తున్న 'సింగం రిటర్న్స్'లో మాత్రం ఆయన ఆ వాహనాన్ని వదిలేసి.. టాటా సఫారీలో రాబోతున్నారు. ఈ సినిమాలో టాటా సఫారీ స్ట్రోమ్, సుమో, ఆరియా, సుమో గ్రాండ్, జెనాన్, నానో లాంటి టాటా బ్రాండ్లన్నీ కూడా కనిపిస్తాయి. ఈ చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టితో ఈ మేరకు టాటా మోటార్స్ సంస్థ ఓ ఒప్పందం కుదుర్చుకుంది.

రోహిత్కు వాహనాలంటే మహా ఇష్టం. అందుకే సింగంలో భారీ సంఖ్యలో స్కార్పియోలను ఉపయోగించాడు. ఈసారి వాటిని వదిలేసి టాటా సఫారీ స్ట్రోమ్ వాడుతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సినిమా హీరో, హీరోయిన్లు అజయ్ దేవ్గణ్, కరీనా కపూర్ ఇద్దరికీ అద్భుతమైన ఎనర్జీ, కరిష్మా ఉన్నాయని.. వాళ్లు తమ వాహనాలనే ఉపయోగిస్తారని టాటా మోటార్స్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ హెడ్ దేల్నా అవారీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement