అయ్యో పాపం కరీనా!
అభిమానులకు ఎక్కువ ఆనందం వచ్చినా, ఆగ్రహం వచ్చిన సినీ తారలు తట్టుకోవడం కష్టమే. ఇక అగ్రతారలకు అభిమానుల నుంచి ఎదురయ్యే కష్టాలైతే ఇక చెప్పనక్కర్లేదు. తాజాగా బాలీవుడ్ తారలు కరీనా కపూర్‌కు ఇలాంటి సంఘటనే ఎదురైంది. కరీనా నటించిన సత్యగ్రహ చిత్రం ప్రమోషన టూర్‌లో భాగంగా దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సహనటుడు అజయ్ దేవగన్‌తో కలిసి వె ళ్లింది. ఓ నగల దుకాణాన్ని ప్రారంభించేందుకు చేరుకోగానే వందలాది మంది కరీనాను చూసేందుకు ఎగబడటంతో గందరగోళం నెలకొంది.
అంతేకాకుండా ట్రాఫిక్ స్తంభించి.. తొక్కిసలాట వరకు వెళ్లి పరిస్థితి విషమించింది. అభిమానులతో పాటు ఫోటోగ్రాఫర్ల బృందం కూడా దాడి చేసినంత పనిచేయడంతో నిలుచునేందుకు స్థలం దొరక్క ఉక్కిరిబిక్కిరి కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. కరీనా, అజయ్ దేవగన్‌లను పోలీసులు ఎస్కార్ట్‌గా నిలిచి అక్కడి నుంచి కారు ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ కూడా అభిమానులు గుమిగూడటంతో కారేందుకు నానా అవస్థలు పడి కార్యక్రమం మధ్యలోనే చెక్కేశారు.