satyagraha
-
ఇది మా వారసత్వం! ప్రియాంక ఉద్వేగభరిత ప్రసంగం
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై లోక్‌సభ అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం ఆ పార్టీ కార్యదర్మి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో కాంగ్రెస్ రాజ్‌ఘాట్ వద్ద సంకల్ప సత్యాగ్రహ దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియాంక ఆ కార్యక్రమంలో ఉద్వేగభరితంగా చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ ఆ ప్రసంగంలో.. "మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరించారు. సరిగ్గా 32 ఏళ్ల క్రితం మా నాన్న(రాజీవ్ గాంధీ) అంతక్రియల ఊరేగింపు తీన్‌మూర్తి భవన్ నుంచి బయలుదేరుతోంది. భద్రతా బెదిరింపులు ఉన్నప్పటికీ రాజ్‌ఘాట్‌కు వరకు తన తండ్రి అంత్యక్రియల ఊరేగింపుకి వెళ్లేందుకు ఎలా పట్టుబట్టారో తెలిపింది. అప్పుడూ మా నాన్న మృతదేహాన్ని త్రివర్ణ పతాకంలో చుట్టారు. అలాంటి అమరవీరుడి తండ్రిని పార్లమెంటులో అవమానించారు. ఆ అమరవీరుడి కుమారుడిని మీరు దేశ వ్యతిరేకి అంటారు. ఈ సందర్భంగా ప్రియాంక పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చను ప్రస్తావిస్తూ.. ఈ కుటుంబం నెహ్రూ ఇంటి పేరు ఉపయోగించేందుకు ఎందుకు సిగ్గుపడుతున్నారో అంటూ హేళన చేశారు. మోదీ తన వ్యాఖ్యలతో మొత్తం కుటుంబాన్నే గాక కాశ్మీర్ పండిట్ల సంప్రదాయాన్నే అవమానించారు. దీనికి మీపై ఎటువంటి కేసు లేదు. అలాగే రెండేళ్ల పదవీకాలంపై వేటు పడదు, అనర్హులుగా ప్రకటించరు కూడా. ఎందుకు ఇలా అని ప్రియాంక ఆగ్రహంగా ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ సత్యాగ్రహ దీక్షలో ప్రియాంక ప్రసంగించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తూ.. సత్యం, ధైర్యం, త్యాగం మా వారసత్వం. ఇదే మా బలం అని రాసుకొచ్చారు. కాగా, ఆమె ఆ ప్రసంగంలో.. అమరులైన ప్రధాని కుమారుడు, పైగా జాతీయ సమైక్యత కోసం వేలకిలోమీటర్లు నడిచిన మహోన్నత వ్యక్తి (రాహుల్) ఎప్పటికీ దేశాన్ని అవమానించలేడని ప్రియాంక గాంధీ నొక్కి చెప్పారు. అంతేగాదు ఈ దేశ ప్రధాని పిరికివాడని, అధికారం వెనక దాక్కున్నాడంటూ ఘాటుగా విమర్శించారు. ఈ దేశ ప్రజలు కచ్చితంగా అలాంటి దురహంకారి రాజుకి తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆమె అన్నారు. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) (చదవండి: తేజస్వీ యాదవ్‌కు పుత్రికోత్సాహం! పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన రాచెల్) -
Rahul Disqualification: సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహల్ గాంధీ అనర్హత వేటుకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. తొలుత మహాత్మా గాంధీ స్మారక చిహ్నం వద్ద నిరసన చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అనుమతనిపోలీసులు నిరాకరించారు. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నేతృత్వంలో నేతలంతా రాజ్‌ఘాట్ వెలుపల సంకల్ప సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు పి చిదంబరం, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్, ప్రమోద్ తివారీ, అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, అధిర్ రంజన్ చౌదరి తదితరలు పాల్గొన్నారు. ఢిల్లీ పోలీసులు ఈ ప్రాంతంలో గట్టి నిఘా ఉంచారు. పరిసర ప్రాంతంలోని పెద్ద సముహాలను నిషేధించారు. ఈ మేరకు ఈ దీక్షలో ప్రియాంక వాద్రా మాట్లాడుతూ..నా సోదరుడు రాహుల్‌ని అమరవీరుడి కూమారుడని, మీర్ జాఫర్ అని అన్నావు. రాహుల్‌కి తన తల్లి ఎవరో తెలియదంటూ తల్లిని అవమానించావు. ఒక ప్రధానిగా పార్లమెంటులో అందరి ముందు..ఈ కుటుంబం నెహ్రు పేరును ఎందుకు ఉపయోగించదంటూ నా కుటుంబాన్ని వెటకరించావు అని నాటి ఘటనను గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలతో మొత్తం కాశ్మీర్ పండిట్ల కుటుంబాన్ని అవమానించావని తెలియలేదా?. అయినా తండ్రి మరణం తర్వాత ఆచారం ప్రకారం ఆ పేరును ముందుకు తీసుకువెళ్లే కొడుకుని ఇలా వ్యగ్యంగా అవమానించి బాధపెట్టడం సబబేనా అంటూ ప్రియాంక బీజేపీపై విరుచుకుపడ్డారు. అలాగే కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాహుల్‌వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తూ.. "ఆయన ఓబీసీ కమ్యూనిటీని అవమానించారంటున్నారు కదా! అసలు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లలిత్ మోదీ వీరంతా ఓబీసీనా? అని నిలదీశారు. వారంతా దేశం విడిచి పారిపోయిన వారు. వాస్తవానికి రాహుల్ నల్లధనంతో పారిపోయి, పరారీలో ఉన్న వ్యక్తుల అంశాన్ని మాత్రమే లేవనెత్తితే..దాన్ని కమ్యూనిటీకి ఆపాదించారంటూ మండిపడ్డారు. అంతేగాదు రాహుల్‌కి బాసటగా నిలిచేందుకు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఇలాంటి నిరసనలు నిర్వహిస్తుంది. వాక్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతాం. అలాగే మా నాయకుడి రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచినందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలకు ధన్యావాదాలు అని అన్నారు". కాగా, దాదాపు దశాబ్ద కాలంగా ప్రధాన ప్రతిపక్షానికి వాస్తవాధినేతగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీ చేస్తున్న దాడులను నిరశిస్తున్నందుకే.. ఈ అనర్హత వేటు పేరుతో రాహుల్‌ని మౌనంగా ఉంచేలా చేసేందుకు పన్నిన కుట్రగా కాంగ్రెస్ అభివర్ణించింది. (చదవండి: ఎంపీ పదవికి ఎసరు.. ట్విటర్ బయోను వినూత్నంగా మార్చిన రాహుల్.. గళమెత్తిన కాంగ్రెస్) -
Agnipath Scheme: కాంగ్రెస్ సత్యాగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ సత్యాగ్రహం చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆదివారం నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా మాట్లాడుతూ... నకిలీ జాతీయవాదులను, నకిలీ దేశభక్తులను గుర్తించాలని యువతకు పిలుపునిచ్చారు. అసలైన దేశభక్తిని ప్రదర్శించే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. జైరాం రమేష్, రాజీవ్ శుక్లా, సచిన్ పైలట్, సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ్ సింగ్, హరీశ్ రావత్, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జేడీ శీలం, కొప్పుల రాజు, వంశీచంద్‌రెడ్డి, రుద్రరాజు పాల్గొన్నారు. నేడు కాంగ్రెస్ దేశవ్యాప్త శాంతియుత ర్యాలీలు అగ్నిపథ్ కార్యక్రమంతోపాటు, తమ నేత రాహుల్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా లక్షలాదిగా తమ కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీలు చేపడతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇదే విషయమైన పార్టీ ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆదివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. బిహార్‌లో 804 మంది అరెస్ట్ అగ్నిపథ్‌పై హింసాత్మక నిరసనలకు పాల్పడిన 804 మందిని అరెస్ట్ చేసినట్లు బిహార్ పోలీసులు తెలిపారు. 145 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. యూపీలో 34 కేసులు నమోదు చేసి, 387 మందిని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినట్లు గుర్తించిన 35 వాట్సాప్ గ్రూపులపై నిషేధం విధించినట్లు కేంద్రం తెలిపింది. ఆందోళనల కారణంగా దేశవ్యాప్తంగా 483 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. -
ఆ అవమానానికి 125 ఏళ్లు!
పీటర్‌మారిట్జ్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో రైలు నుంచి గెంటివేతకు గురైన తరువాత మహాత్మా గాంధీ ప్రారంభించిన సత్యాగ్రహ ఉద్యమానికి 125 ఏళ్లు నిండుతున్న సందర్భంగా మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం ‘మేకింగ్ ఆఫ్ మహాత్మ’ చిత్రాన్ని ప్రదర్శించారు. దక్షిణాఫ్రికాలో లాయర్‌గా పనిచేస్తున్న సమయంలో గాంధీ 1893, జూన్ 7న శ్వేతజాతీయులకు కేటాయించిన సీటును ఖాళీ చేయడానికి నిరాకరించడంతో పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో ఆయన్ని బలవంతంగా దించేశారు. ఈ ఘటన ప్రభావంతో దక్షిణాఫ్రికా, భారత్‌లో బ్రిటిష్ విధానాలను శాంతియుతంగా ఎదుర్కొనేందుకు, ప్రజలను సంఘటితపరచడానికి గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంతాలను రూపొందించారు. 1996లో శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన ‘మేకింగ్ ఆఫ్ మహాత్మ’ చిత్రాన్ని భారత్, దక్షిణాఫ్రికా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రాపంచిక వ్యవహారాలను వదులుకుని డర్బన్‌లో ఫీనిక్స్, జోహెన్నెస్‌బర్గ్‌లో టాల్‌స్టాయ్ ఫార్మ్‌ను నిర్మించాలని గాంధీ నిర్ణయించుకున్న తరువాత జరిగిన పరిణామాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రదర్శించిన అవలాన్ గ్రూప్ సినీ సెంటర్ సీఈఓ ఏబీ మూసా స్పందిస్తూ..తన పూర్వీకులకు గాంధీతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటే ఎంతో ఉద్వేగం కలుగుతోందని అన్నారు. తదుపరి రెండు రోజులపాటు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. -
కాపుల సహనాన్ని పరీక్షిస్తే ఫలితాలు తీవ్రం
రాష్ట్ర కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ కొత్తపేట : కాపుల సహనాన్ని పరీక్షిస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.గురువారం సాయంత్రం రామకృష్ణ కొత్తపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో కాపులను బీసీలలో చేరుస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయమని కోరితే కాపులను ఉగ్రదవాదుల్లా పరిగణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా అది శాంతియుత కార్యక్రమమేనని స్పష్టం చేశారు. సత్యాగ్రహ దీక్షకు పిలుపు ఇస్తే హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జరగనీయమంటున్నారు. ఎలా జరగనీయరో చూస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు ద్వారా తమ వ్యక్తిగత ప్రయోజనాలు కోసం రాజప్ప లాంటి కాపు మంత్రులు, కొందరు కాపు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాపు ఉద్యమాన్ని, ఉద్యమ నాయకులను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. -
అనుమతిలేని కార్యక్రమాలను అడ్డుకుంటాం
ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చర్యలు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : పోలీసుల నుంచి ముందస్తు అనుమతిలేకుండా నిర్వహించే కార్యక్రమాలను శాంతి భద్రతల రీత్యా అడ్డుకుంటామని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ స్పష్టం చేశారు. శనివారం సర్పవరం పోలీసు అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సున్నిత అంశాలపై జిల్లాలో 1994, 1998, 2016 సంవత్సరాల్లో చోటుచేసుకున్న పలు హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా సెక్షన్ 30 అమల్లో పెట్టినట్లు తెలిపారు. దీని ప్రకారం అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎటువంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టరాదని స్పష్టం చేశారు. సున్నిత అంశాలపై ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు నిర్వహించరాదని, ఇందుకు అన్ని రాజకీయపార్టీలు, నేతలు సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత వాతావరణంలో చేసుకునే కార్యక్రమాలకు పోలీసుల సహకారం ఉంటుందన్నారు. తొండంగిలో నిర్మించనున్న దివీస్ కర్మాగార స్థాపనకు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనను అడ్డుకోగా, కోర్టు ఉత్తర్వులతో సీపీఎం నేతలను అక్కడకు అనుమతించామన్నారు. ఈ నెల 25 నుంచి కాపు జేఏసీ ఆధ్వర్యంలో రావులపాలెం నుంచి అంతర్వేది దాకా ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్రకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. అనుమతి కోసం దరఖాస్తు రాలేదని, వస్తే పరిశీలిస్తామన్నారు. ఈనెల 28 నుంచి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ నుంచి అమలాపురం దాకా బైక్‌ర్యాలీ నిర్వహిస్తామని, ఇం దుకు అనుమతి కోరుతూ దరఖాస్తు వచ్చిందన్నారు. దీనిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. కోర్టుల నుంచి అనుమతులు తీసుకువస్తే, ఆమోదయోగ్యం గా చట్టానికి లోబడి నిర్వహించే కార్యక్రమాలకు అనుమతి ఇస్తామ న్నారు. ఇది అన్ని రాజకీయపార్టీలకు వర్తిస్తుందన్నారు. తునిలో జరిగిన కాపు గర్జనకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, అక్క డ అనుకోకుండా అరాచకశక్తులు చొరబడడంతో హింసాత్మక సంఘటన చోటుచేసుకున్నాయన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ప్రశాంతవరణం దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డీఎస్బీ డీఎస్పీ విజయభాస్కరరెడ్డి పాల్గొన్నారు. -
సత్యాగ్రహ యాత్ర సాగి తీరుతుంది
ముద్రగడను విమర్శించే అర్హత చినరాజప్పకు లేదు 25న రావులపాలెంలో మొదలై.. 30న అంతర్వేదిలో ముగుస్తుంది విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ చైర్మ¯ŒS వాసిరెడ్డి ఏసుదాసు రాజమహేంద్రవరం సిటీ : సత్యాగ్రహయాత్రకు కోర్టు అనుమతించినా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని, ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా యాత్ర కొనసాగుతుందని కాపు జేఏసీ చైర్మ¯ŒS వాసిరెడ్డి ఏసుదాసు స్పష్టంచేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాపుల ఉద్యమాన్ని అణగదొక్కడానికే సెక్ష¯ŒS 30 ఉందా అని ప్రశ్నించారు.రిజర్వేష¯ŒS మేము అడుక్కోవడం లేదని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని దాన్ని అమలు చేయని కోరుతున్నామన్నారు. ఏకులాన్ని ఇబ్బంది పెట్టకుండా ముద్రగడ ప్రశాంతంగా పాదయాత్ర చేపట్టారని దీన్నిఅందరూ స్వాగతించాలన్నారు. టీడీపీ కాపులకు ఎల్కేజీ నుండి పీజీ వరకూ ఉచిత విద్య, రూ.వెయ్యి కోట్ల కేటాయింపు, పాత రిజర్వేష¯ŒS విధానాన్ని పునరుద్ధరిస్తామంటూ హామీ ఇచ్చిందని దాన్ని అమలు చేయాలని కోరుతున్నామన్నారు. జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి చినరాజప్ప యాత్ర అపేస్తామంటూ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏడు నెలల్లో రిజర్వేష¯ŒS అమలు చేస్తామని ముదగ్రడ కు మాటిచ్చిన మంత్రులు, నాయకులు పత్తా లేకుండా పోయారన్నారు.కాపు కార్పొరేష¯ŒS చైర్మ¯ŒS కాపుల కోసం పనిచేయకుండా చంద్రబాబు తొత్తుగా పని చేస్తున్నారని ఆరోపించారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకు రావులపాలెం నుండి బయలు దేరిన కాపు సత్యాగ్రహ పాదయాత్ర 30వ తేదీకి అంతర్వేది చేరుతుందన్నారు, రోజుకు 18, 20 కిలోమీటర్ల చొప్పున దారిలో అయినవిల్లి, అమలాపురం మీదుగా 5 రాత్రులు ఒక పగలుగా యాత్ర కొనసాగనున్నదన్నారు. కాపులు వేలాదిగా తరలిరావాలన్నారు. కాపు నాయకులు, వైఎస్సార్సీపీ రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, నందెపు శ్రీనివాస్, ఉమామహేశ్వరి, వైకేఎల్, కొత్తపేట రాజా, మానే దొరబాబు తదితరులు పాల్గొన్నారు. కాపు పాదయాత్ర కోసం దరఖాస్తు చేసుకోవాలి అమలాపురం టౌ¯ŒS: ఈనెల 25 నుంచి కాపు జేఏసీ ఆధ్వర్యంలో కోనసీమలో చేపట్టనున్న పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేయాలని కాపు మిత్ర బృందం ప్రతినిధులు కాపు ఉద్యమ నేతలకు శుక్రవారం వినతి పత్రాలు అందజేశారు. ఆ మిత్ర బృందం చైర్మ¯ŒS డాక్టర్ జి.హరిచంద్రప్రసాద్ కోనసీమలో పర్యటించారు. అమలాపురంలో కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా పవన్, కల్వకొలను తాతాజీ, మిండగుదిటి మోహ¯ŒSలను స్వయంగా కలసి అనుమతికి దరఖాస్తు చేసుకునే విషయమై మాట్లాడి వినతి పత్రాలు అందజేశారు. త్వరలో రాష్ట్ర మంత్రులను కూడా కలిసి పాదయాత్రకు అనుమతి కోరతామని కాపు మిత్ర బృందం ప్రతినిధులు బండారు రామమోహనరావు, కరాటం ప్రవీణ్, ఏఎస్డీ ప్రసాదరావు, సత్తి బాపూజీ పేర్కొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట సత్యాగ్రహం
సమస్యలు పరిష్కరించాలని వైద్యుల డిమాండ్ ఆదిలాబాద్ అర్బన్ : డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట డాక్టర్లు సత్యాగ్రహం చేపట్టారు. ముందుగా పట్టణంలోని తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరి కుమ్రం భీం చౌక్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్ది సేపు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.ప్రకాశ్, కె.మనోహర్ మాట్లాడారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ న్యూఢిల్లీ కేంద్ర సంఘం పిలుపు మేరకు దేశంలో డాక్టర్లంతా సత్యాగ్ర హం చేపట్టినట్లు తెలిపారు. దేశంలో డాక్టర్లపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తున్నామన్నారు. వైద్యులపై దాడులు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని, ఇందుకు తగిన చట్టాన్ని తీసుకురావాలన్నారు. చిన్నచిన్న క్లినికల్ పొరపాట్లను సాకుగా చూపి డాక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం డాక్టర్లను అనవసరమైన కేసులలో ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. వైద్యవృత్తి మానవీయ కోణంతో ముడిపడి ఉన్నందున చట్టం నుంచి డాక్టర్లను మినహాయించాలన్నారు. అల్లోపతి డాక్టర్లు మాత్రమే అల్లోపతి మందులు ఇవ్వాలని, మరే డాక్టర్లు అల్లోపతి మందులు ఇచ్చినట్లరుుతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. వైద్యులు మనోహర్, శ్యామలారాణి, అనిల్ చిద్రాల, మహాభలేశ్వర్, లీనా గుజరాత్, తిప్పేస్వామి, నరోత్తమ్‌రెడ్డి, రవికాంత్, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘కాపు సత్యాగ్రహ యాత్ర’ పోస్టర్ ఆవిష్కరణ
బోట్‌క్లబ్ (కాకినాడ) : స్థానిక కాపు కల్యాణమండపంలో సోమవారం ‘కాపు సత్యాగ్రహ యా త్ర’ పోస్టర్‌ను కాపు జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, జిల్లా కాపు సద్భావన సంఘ అధ్యక్షులు వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చుతామని ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. తుని ఘటన కొన్ని దుష్టశక్తులు కారణంగా జరిగిందని స్పష్టం చేశారు. కాపు ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో తీసుకు వెళ్లేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కాపు జేఏసీ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ కాపు సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తున్నామని, అందరూ సహకరించాలన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలోను కాపు జేఏసీ ఏర్పాటుచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొనుల తాతాజీ, రావూరి వేంకటేశ్వర్ారవు, పసుపులేటి చంద్రశేఖర్, పేపకాయల రామకృష్ణ పాల్గొన్నారు -
కాపు సత్యాగ్రహ యాత్రను విజయవంతం చేయాలి
పి.గన్నవరం : ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ నెల 16న కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న కాపు సత్యాగ్రహ యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి పిలుపునిచ్చారు. పి.గన్నవరం గరుడేశ్వర స్వామివారి ఆలయం వద్ద మండల టీబీకే అధ్యక్షుడు కొమ్మూరి మల్లిబాబు అధ్యక్షతన బుధవా రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు రోజులపాటు రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఈయాత్ర జరుగుతుందన్నారు. రాష్ట్ర కాపు రిజర్వేషన్ జేఏసీ జాయింట్ కన్వీనర్లు ఆకుల రామకృష్ణ, నల్లా పవన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు, కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ మాట్లాడుతూ ముద్రగడ పోరాటం వల్లే టీడీపీలోని కాపు నేతలకు గుర్తింపు వచ్చిందన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారన్నారు. కాపు జాతి ముద్రగడ వెన్నంటి ఉన్నారని వారు స్పష్టం చేశారు. అనంతరం సత్యాగ్రహ యాత్రకు సంబంధించిన కరపత్రాలను విష్ణుమూర్తి ఆవిష్కరించారు. టీబీకే నాయకులు ఉలిశెట్టి బాబీ, జక్కంపూడి వాసు, అడ్డగళ్ళ వెంకట సాయిరామ్, ఆర్వీ నాయుడు, దాసరి కాశీ, తోలేటి బంగారు నాయుడు, వివిధ గ్రామాలకు చెందిన టీబీకే నాయకులు, యువకులు పాల్గొన్నారు. -
అయ్యో పాపం కరీనా!
అభిమానులకు ఎక్కువ ఆనందం వచ్చినా, ఆగ్రహం వచ్చిన సినీ తారలు తట్టుకోవడం కష్టమే. ఇక అగ్రతారలకు అభిమానుల నుంచి ఎదురయ్యే కష్టాలైతే ఇక చెప్పనక్కర్లేదు. తాజాగా బాలీవుడ్ తారలు కరీనా కపూర్‌కు ఇలాంటి సంఘటనే ఎదురైంది. కరీనా నటించిన సత్యగ్రహ చిత్రం ప్రమోషన టూర్లో భాగంగా దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సహనటుడు అజయ్ దేవగన్‌తో కలిసి వె ళ్లింది. ఓ నగల దుకాణాన్ని ప్రారంభించేందుకు చేరుకోగానే వందలాది మంది కరీనాను చూసేందుకు ఎగబడటంతో గందరగోళం నెలకొంది. అంతేకాకుండా ట్రాఫిక్ స్తంభించి.. తొక్కిసలాట వరకు వెళ్లి పరిస్థితి విషమించింది. అభిమానులతో పాటు ఫోటోగ్రాఫర్ల బృందం కూడా దాడి చేసినంత పనిచేయడంతో నిలుచునేందుకు స్థలం దొరక్క ఉక్కిరిబిక్కిరి కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. కరీనా, అజయ్ దేవగన్‌లను పోలీసులు ఎస్కార్ట్‌గా నిలిచి అక్కడి నుంచి కారు ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ కూడా అభిమానులు గుమిగూడటంతో కారేందుకు నానా అవస్థలు పడి కార్యక్రమం మధ్యలోనే చెక్కేశారు.