కాపుల సహనాన్ని పరీక్షిస్తే ఫలితాలు తీవ్రం
కాపుల సహనాన్ని పరీక్షిస్తే ఫలితాలు తీవ్రం
Published Thu, Feb 23 2017 11:26 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM
రాష్ట్ర కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ
కొత్తపేట : కాపుల సహనాన్ని పరీక్షిస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.గురువారం సాయంత్రం రామకృష్ణ కొత్తపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో కాపులను బీసీలలో చేరుస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయమని కోరితే కాపులను ఉగ్రదవాదుల్లా పరిగణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా అది శాంతియుత కార్యక్రమమేనని స్పష్టం చేశారు. సత్యాగ్రహ దీక్షకు పిలుపు ఇస్తే హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జరగనీయమంటున్నారు. ఎలా జరగనీయరో చూస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు ద్వారా తమ వ్యక్తిగత ప్రయోజనాలు కోసం రాజప్ప లాంటి కాపు మంత్రులు, కొందరు కాపు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాపు ఉద్యమాన్ని, ఉద్యమ నాయకులను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.
Advertisement