deeksha
-
కొడంగల్‌లో కేటీఆర్ ‘రైతు దీక్ష’: పట్నం నరేందర్‌రెడ్డి
సాక్షి,నారాయణపేటజిల్లా: కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఈనెల 10వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఆరు గ్యారెంటీల పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.‘సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. జనవరి 26 తేదీ నుంచి రైతులకు రైతు భరోసా ఇస్తానంటూ ప్రజలను మోసం చేశాడు. కేవలం మండలానికి ఒక గ్రామానికి మాత్రమే రైతు భరోసా వేశారు. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తమైంది. హామీలు నెరవేర్చాలంటూ కోస్గిలో నిర్వహించబోయే రైతు దీక్షను విజయవంతం చేయాలి’అని నరేందర్‌రెడ్డి కోరారు. -
పాపాల భోపాల్‌లో పారా తారలు.. విషం కాటేసినా ఆటై మెరిశారు
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 40 ఏళ్లు. డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి మొదలై డిసెంబర్ 3 వరకూ కొనసాగిన విష వాయువులు ఆ ఒక్క రాత్రితో తమ ప్రభావాన్ని ఆపేయలేదు. అవి జన్యువుల్లో దూరి నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన వారికి నేటికీ అవకరాలతో పిల్లలు పుడుతున్నారు. ఏనాటి ఎవరి పాపమో ఇప్పటికీ వీళ్లు అనుభవిస్తున్నారు. అయితే వీరిలో కొందరు పిల్లలు పారా స్పోర్ట్స్‌లో ప్రతిభ చూపుతుండటం ఒక ఆశ. కాని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పడమే వీరు మనకు కలిగిస్తున్న చైతన్యం.పదిహేడేళ్ల దీక్షా తివారి ‘ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ డిజార్డర్’ (ఐడిడి) రుగ్మతతో బాధ పడుతోంది. ఆ అమ్మాయిని బాల్యంలో గమనించిన తల్లిదండ్రులు మహేష్ తివారి, ఆర్తి తివారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆయన ‘ఇది భోపాల్ గ్యాస్ విష ఫలితం’ అనంటే ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. ‘అదెప్పటి సంగతో కదా’ అన్నారు. ‘అవును... ఇప్పటికీ వెంటాడుతోంది’ అన్నాడు డాక్టర్. దానికి కారణం భోపాల్ ఘటన జరిగినప్పుడు మహేష్ వయసు 5 ఏళ్లు, ఆర్తి వయసు 3 సంవత్సరాలు. వారు భోపాల్‌లో ఆ గ్యాస్‌ని పీల్చారు. కాని అది జన్యువుల్లో దూరి సంతానానికి సంక్రమిస్తుందని నాడు వాళ్లు ఊహించలేదు.అదృష్టం ఏమిటంటే దీక్షా తివారి 2023 స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బాస్కెట్ బాల్లో రజత పతకం తేవడం. ఈ అమ్మాయే కాదు భోపాల్ విష వాయువు వెంటాడుతున్న చాలా మంది బాలలు భోపాల్‌లోని జేపీ నగర్ప్రాంతంలో అత్యధికం ఉన్నారు. వీరంతా తమ శారీరక, మానసిక లోపాలను, రుగ్మతలను జయించడానికి స్పోర్ట్స్‌ను ఎంచుకున్నారు. అథ్లెటిక్స్, సైక్లింగ్, ఫుట్‌బాల్ తదితర ఆటల్లో ప్రతిభ చూపుతున్నారు. బతుకు జీవచ్ఛవం కాకుండా ఉండేందుకు క్రీడలు వారిని కాపాడుతున్నాయి. కాని ప్రభుత్వం వీరికి చేయవలసింది చేసిందా?40 టన్నుల గ్యాస్డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి అత్యంత ప్రాణాంతకమైన ‘మిథైల్ ఐసొసైనెట్’ విడుదలవడం మొదలయ్యి మరుసటి రోజు సాయంత్రం వరకూ వ్యాపించింది. దాదాపు 40 టన్నుల విషవాయువు విడుదలైంది. దీని వల్ల చనిపోయిన వారు అధికారికంగా 2,259 కాని 20 వేల నుంచి 40 వేల వరకు మరణించి ఉంటారని సామాజిక కార్యకర్తల అంచనా. ఆ సమయంలో బతికున్నవారు జీవచ్ఛవాలుగా మారితే కొద్దిపాటి అస్వస్థతతో బయటపడిన వారూ ఉన్నారు. విషాదం ఏమంటే ఈ ఘటన జరిగినప్పుడు చంటిపాపలు, చిన్న పిల్లలుగా ఉన్నవారు ఆ ఘటన నుంచి బయట పడి అదృష్టవంతులం అనుకున్నారు కానీ వారికి యుక్తవయసు వచ్చి పిల్లలు పుట్టాక వారిలో అధిక శాతం దివ్యాంగులుగా, మానసిక దుర్బలురుగా మిగిలారు.1300 మంది దివ్యాంగులు‘‘భోపాల్ విషవాయువులు భోపాల్‌లోని 42 వార్డుల మీద ప్రభావాన్ని చూపాయి. ఆ 42 వార్డుల్లో దివ్యాంగ శిశువులు జన్మిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య అధికారికంగా 1300. వీరిలో అత్యధికులు అంధత్వం, సెరిబ్రల్ పాల్సీ, డౌన్ సిండ్రోమ్, మస్క్యులర్ డిస్ట్రఫీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి సమస్యలతో బాధ పడుతున్నారు.వీరికి రెగ్యులర్‌గా థెరపీ అవసరం. కాని మా వద్ద వున్న వనరులతో కేవలం 300 మందికే సేవలు అందించగలుగుతున్నాం. మిగిలినవారికీ ఏ థెరపీ అందడం లేదు. వీరిలో చాలామంది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు. ఈనాటికీ వీరికి నష్టపరిహారం అందలేదు’’ అని ‘చింగారి’ ట్రస్ట్ బాధ్యుడొకరు తెలిపారు. భోపాల్ విషవాయువు బాధిత దివ్యాంగ శిశువులకు ఈ సంస్థ వైద్య సహాయం అందిస్తుంది.కల్లాకపటం లేని పిల్లలుభోపాల్లోని జేపీనగర్‌లో కల్లాకపటం లేని అమాయక బాలలు చాలామంది కనిపిస్తారు. ముద్దొచ్చే మాటలు మాట్లాడుతూ అందరిలాగా ఆటలాడాలని, స్కూలుకు వెళ్లాలని, కబుర్లు చెప్పే వీరంతా చాలామటుకు బుద్ధిమాంద్యంతో బాధపడే పిల్లలే. కొందరు శరీరం చచ్చుబడ్డ వారే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన వీరంతా నిరసన కార్యక్రమం జరుపుతుంటారు. న్యాయం కోరుతుంటారు. కానీ దుర్ఘటన జరిగి 40 ఏళ్లు అవుతున్నా వీరు రోడ్ల మీదకు వస్తూనే ఉండాల్సి రావడం బాధాకరం.నీరు తాగిభోపాల్ విషవాయులు భూమిలోకి ఇంకడం వల్ల కొన్ని చోట్ల ఇప్పటికీ ఆ నీరు విషతుల్యం అయి ఉంది. వేరే దిక్కు లేక పేదలు ఆ నీరే చాలాకాలం తాగి ఇప్పుడు దివ్యాంగ శిశువులకు జన్మనిస్తున్నారు. ‘ఆటలాడే ఉత్సాహం ఉన్నా వీరికి ఆటవస్తువులు లేవు. హెల్త్ కార్డులు లేవు’ అని తల్లిదండ్రులు భోరున విలపిస్తుంటే ఏ పాపానికి ఈ శిక్ష అనిపిస్తుంది. -
Big Question: మా పాపాలు క్షమించు దేవుడా.. అంటూ పవన్ ప్రాయశ్చిత్త దీక్ష
-
మా పాపాలు క్షమించు దేవుడా.. అంటూ పవన్ ప్రాయశ్చిత్త దీక్ష
-
దీక్ష ముసుగులో సినిమా షూటింగ్‌లు
-
ప్రాణత్యాగం అడగటం లేదు పవన్
-
బాబు చేసే పాపాలకు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష...
-
Deeksha Juneja: గ్లామర్ ఫీల్డ్ తనకు వర్కవుట్ అవుతుందో కాదో అనుకుంటూనే
దీక్షా జునేజా.. సిననిమ్ ఆఫ్ టాలెంట్. అరుదైన ఆర్టిస్ట్! ఆమె స్వస్థలం.. చండీగఢ్. సెటిల్డ్ ప్లేస్.. ముంబై. మిగిలిన వివరాలు..దీక్ష తల్లిదండ్రులు శశి జునేజా, అశోక్ జునేజాకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ఆర్టిస్ట్ అవ్వాలని దీక్షా అనుకోలేదు. మాస్ కమ్యూనికేషన్స్‌లో పీజీ చేసింది. చదువైపోగానే చండీగఢ్‌లోని 94.3 మై ఎఫ్ఎమ్లో ఇంటర్న్‌గా చేరింది. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ ఉద్యోగంలోకి మారింది.రేడియో కొలువులో ఉన్నప్పుడు కంటెంట్ రైటర్‌గానూ పనిచేసింది. ఆ టైమ్‌లోనే ఆమెను ముంబై పిలిచింది మోడలింగ్‌లో చాన్స్ ఉంది రమ్మంటూ! గ్లామర్ ఫీల్డ్ తనకు వర్కవుట్ అవుతుందో కాదో అనుకుంటూనే ముంబై చేరింది.టీవీ కమర్షియల్స్‌తో మోడల్‌గా రాణిస్తున్నప్పుడే ‘ఘుమక్కడ్’ అనే మూవీలో అవకాశం వచ్చింది. తర్వాత చాలా చిత్రాల్లోనే కనిపించినా నటిగా ఆమెకు గుర్తింపు తెచ్చినవి మాత్రం ‘ద జోయా ఫ్యాక్టర్’, ‘రాజ్మా చావల్’ సినిమాలే.సిల్వర్ స్క్రీన్ మీది ఆమె పెర్ఫార్మెన్స్ వెబ్ స్క్రీన్ ఆపర్చునిటీస్నీ తెచ్చిపెట్టింది. అలా ‘గర్ల్‌ఫ్రెండ్ చోర్’, ‘గిల్టీ మైండ్స్’, ‘యునైటెడ్ కచ్చే’ వంటి వెబ్ సిరీస్‌లు చేసి ఓటీటీ వీక్షకులనూ తన వీరాభిమానులుగా మార్చేసుకుంది. ఆమె నటించిన ‘పిల్’ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం ‘జియో సినిమా’లో స్ట్రీమ్ అవుతోంది.దీక్షా మంచి కవయిత్రి కూడా. తన కవితలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. దీక్షా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌కి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.పేరు, ప్రతిష్ఠల మీద నాకు మోహం లేదు. చేసే పనిపట్ల నిబద్ధత, గౌరవం ఉంది. పనే దైవం అనే మాటను నమ్ముతాను, ఫాలో అవుతాను! – దీక్షా జునేజా -
1500 మీటర్ల విభాగంలో దీక్ష జాతీయ రికార్డు
న్యూఢిల్లీ: సౌండ్ రన్నింగ్ ట్రాక్ ఫెస్టివల్ అథ్లెటిక్స్ మీట్లో భారత మహిళా అథ్లెట్ కేఎం దీక్ష 1500 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. లాస్ ఏంజెలిస్‌లో జరిగిన ఈ మీట్లో దీక్ష 1500 మీటర్ల దూరాన్ని 4ని:04.78 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో 2021 నుంచి హర్మిలన్ బైన్స్ (4ని:05.39 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును దీక్ష బద్దలు కొట్టింది. సుజీత్, జైదీప్లకు నిరాశ.. ఇస్తాంబుల్: వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ చివరి రోజు భారత ఫ్రీస్టయిల్ రెజ్లర్లు సుజీత్ (65 కేజీలు), జైదీప్ (74 కేజీలు) ఒలింపిక్ బెర్త్‌లను దక్కించుకోవడంలో విఫలమయ్యారు. మూడో స్థానం కోసం జరిగిన బౌట్లో రూథర్‌ఫర్డ్ (అమెరికా) చేతిలో సుదీప్ ఓడిపోగా... కాంస్య పతక బౌట్లో జైదీప్ 1–2తో దెమిర్తాస్ (టర్కీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి పురుషుల విభాగంలో ఒక్క రెజ్లర్ (అమన్; 57 కేజీలు) మాత్రమే పోటీపడనున్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Ponnam Prabhakar: 14న కరీంనగర్లో దీక్ష చేస్తాం
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఈనెల 14న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దీక్ష చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి, అధికార ప్రతినిధి కోట శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి పొన్నం మాట్లాడారు. గత పదేళ్లలో తెలంగాణకు ఏమీ చేయకుండా విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెర వేర్చకుండా ఏ మొహం పెట్టు కుని బీజేపీ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లడుగుతారని వారు ప్రశ్నించారు. దేశంలోని నవరత్నాల కంపెనీలను అమ్మే స్తున్న బీజేపీకి ఒక ఎజెండా లేదని, కేవలం రాము డుపేరిట అక్షింతలు, కుంకుమలను ప్రజలకిచ్చి ఓట్లడుగుతున్నారని మండిపడ్డారు. దళితులు, బీసీలు, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమంలో యువత బలిదానాలను బీజేపీ అవహేళన చేసిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్య లకు బీజేపీనే కారణమని విమర్శించారు. కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. -
టిప్పర్ యూటర్న్ తీసుకుంటుండగా..
కరీంనగర్: మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట శివారు వరదకాల్వ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం పాలైంది. కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన వెలుమల దీక్ష(23) నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలోని తన అక్క వద్దకు వెళ్లింది. సోమవారం సాయంత్రం తిరుగు ప్రయాణమైంది. తన అక్క భర్త దిలీప్ ద్విచక్రవాహనంపై మెట్పల్లి వైపు వస్తుండగా.. ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్ వైపు నుంచి వరదకాల్వ మీదుగా బండరాళ్ల లోడుతో వస్తున్న టిప్పర్ రాజేశ్వర్రావుపేట బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న దీక్ష, ఆమె బావ తప్పించుకునే క్రమంలో దీక్ష టిప్పర్ టైర్ కింద పడిపోయింది. టైర్ ఆమైపె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. టిప్పర్ అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగిందని గుర్తించిన పోలీసులు టిప్పర్‌ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దిలీప్ ఫిర్యాదు మేరకు మధ్యప్రదేశ్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్ ప్రియాంకసింగ్‌పై కేసు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ తెలిపారు. ఇవి చదవండి: డిగ్రీ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య.. -
Diksha Singhi: భారీ సక్సెస్
ఢిల్లీ కేంద్రంగా వ్యాపార సంస్థను స్థాపించింది దీక్షా సింఘి. ఆమె స్థాపించిన స్టార్టప్ పేరు ‘ఎ లిటిల్ ఎక్స్ట్రా’. వినడానికి తేలికగానే ఉంది. కానీ ఈ పేరు వెనక చాలా బరువైన కథ ఉంది. అంతకంటే బరువైన ఆవేదన ఉంది. బాల్యం నుంచి ఎదుర్కొన్న అవహేళనలే ఆమెలో అక్షరవాహినికి విషయాంశాలయ్యాయి. ఆ తర్వాత రోజూ ఏదో ఒకటి రాయకపోతే తోచని స్థితికి చేరింది. అచ్చంగా స్వచ్ఛంగా సాగే ఆమె అక్షరాలకు అభిమానులు లక్షలకు మించిపోయారు. బాడీ పాజిటివిటీ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొందింది దీక్ష. ఆ తర్వాత ఆమె స్థాపించిన అంకుర సంస్థ అనతి కాలంలోనే విజయపథంలో దూసుకుపోవడానికి ఆమెకు ఆమే బ్రాండ్ అంబాసిడర్. ఇంతకీ ఎ లిటిల్ ఎక్స్ట్రా పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తి ఏమిటంటే... ఫ్యాషన్ ఆభరణాలు. ఇరవై తొమ్మిదేళ్ల దీక్షా సింఘి తన విజయగాథను ఇలా వివరించారు. ‘‘మాది అస్సాం రాష్ట్రం, గువాహటి. చిన్నప్పటి నుంచి బొద్దుగానే ఉండేదాన్ని. తోటి పిల్లలు వేళాకోళం చేసేవారు. బోర్డింగ్ స్కూల్లో కూడా ఇదే పరిస్థితి. లావుగా ఉండడంతో పరుగెత్తలేనని వాళ్లే నిర్ణయించి ఆటల్లో కలుపుకునే వాళ్లు కాదు. పాఠశాల వార్షికోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల్లో కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. దుస్తులు కూడా ఆడవాళ్ల సెక్షన్లో నా సైజువి ఉండేవి కాదు. మగవాళ్ల సెక్షన్లో దొరికేవి. అబ్బాయిల దుస్తులు... పైగా వదులుగా ఉన్నవి «ధరించేదాన్ని. దాంతో స్కూలు పిల్లలతోపాటు బంధువులు కూడా అల్లరి చేస్తూ టామ్‌బాయ్ అనేవాళ్లు. ఇదిలా ఉంటే లావు తగ్గడం కోసం స్విమ్మింగ్ కెళ్లాను. అక్కడి కోచ్ నా స్విమ్ సూట్ విషయంలో కొన్ని నిబంధనలు పెట్టారు. అప్పటి నుంచి స్విమ్మింగ్ మీద కూడా విరక్తి కలిగింది. ఇలాంటి అనుభవాలతో స్కూలు ముగించుకుని కాలేజ్‌లో చేరాను. కొత్త శకం మొదలైంది! కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం 2013లో ఢిల్లీకి వచ్చాను. కాలేజ్‌లో కొత్త స్నేహితులు కలిసే లోపు బ్లాగ్ నా తొలి స్నేహితురాలయింది. బ్లాగ్ రాయడం మొదలు పెట్టిన తర్వాత నాకు తెలియకుండానే నన్ను కదిలించిన ఒక్కో సంఘటన అక్షరరూపం దాల్చింది. అందులో మానవీయ కోణాల కోసం నేను ప్రయత్నం చేసిందేమీ లేదు. కానీ నా బాల్యపు ఆవేదన నా బ్లాగ్ చదువరులను కదిలించివేసింది. నన్ను అభిమానించడం మొదలైంది. క్రమంగా బ్లాగ్‌లో నా ఆవేదనలే కాకుండా ఆలోచనలు, సమాజం గురించిన ఆందోళనలు, నా పర్యటన వివరాలను కూడా పంచుకోవడం మొదలుపెట్టాను. బాడీ షేమింగ్ ఒక వ్యక్తిని ఎంతగా బాధిస్తుందో తెలిసి వాళ్ల మనసు ద్రవించేది. కొంతమంది మహిళలు తమకూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని పంచుకునేవారు. ఈ క్రమంలో నా రచనలు దేహాకృతి కారణంగా ఎదురయ్యే మానసిక సమస్యల నుంచి సాంత్వన పొందేవిధంగా ధైర్యం చెబుతూ సాగాయి. బాడీ పాజిటివిటీ ఇన్ఫ్లూయెన్సర్ గా నా రచనలను ఆదరించేవారు పెరిగారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారిప్పుడు. వ్యాపార కుటుంబ నేపథ్యం చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగమో, వ్యాపారమో చూసుకోవాల్సిన సమయంలో నేను వ్యాపారాన్నే ఎంచుకున్నాను. ఎందుకంటే మాది వ్యాపార కుటుంబం. ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ‘ఎ లిటిల్ ఎక్స్ట్రా’ పేరుతో ఆభరణాల తయారీ ప్రారంభించాను. మొదట ఇదే టైటిల్‌తో దుస్తుల వ్యాపారం చేయాలనుకున్నాను. కానీ దుస్తులకు సైజ్ పరిమితులుంటాయి. ఆభరణాలకు ఆ పరిమితి ఉండదు కదా! అందుకే ఆభరణాలతో మొదలుపెట్టాను. ఆభరణాలనగానే ఖరీదైన వ్యాపారం అనుకోవద్దు. చంకీ ఆభరణాలే ఎక్కువ. ఇప్పటికే మార్కెట్లో వందలాది ఆభరణాల తయారీదారులున్నారు. నా ఆభరణాలనే ఎందుకు కొనాలి? అంటే... నా ఆభరణాలు సందర్భాన్ని బట్టి ధరించేవిధంగా ఉంటాయి. ఉదాహరణకు నవరాత్రి సందర్భంగా పూసలతో చేసిన దుర్గాదేవి చెవి జూకాలు ధరిస్తే అందరి దృష్టి మీ చెవుల మీదే ఉంటాయి. కాదంటారా? అలాగే ఫుట్‌బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్లేటప్పుడు ఫుట్‌బాల్ చెవి రింగులు, క్రికెట్ బ్యాట్ లాకెట్‌తో దండలు... ఇలాగన్నమాట. ఈ ప్రయోగాన్ని 2020 ఆగస్టులో ఐదు వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించాను. ఇప్పుడు ఐదు వందల డిజైన్లతో అరవై లక్షల టర్నోవర్‌తో వ్యాపారం సాగుతోంది. దేశంలో ఉన్న రకరకాల ఆభరణాల తయారీదారులు (కారీగారీ) నాతో కలిసి పని చేస్తున్నారు. నేను ఇచ్చిన డిజైన్ని ఆభరణం రూపంలో తీసుకువచ్చే అద్భుతమైన కళ వారి చేతిలో ఉంది. సందర్భానుసారంగా సేల్ అయ్యే డిజైన్లను రూపొందించే చురుకైన ఆలోచనలు నా బుర్రలో ఉన్నాయి. ఇదే నా సక్సెస్’’ అన్నారు దీక్షా సింఘి. -
మోదీ కఠోర దీక్ష విరమణ
-
23 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై నవంబర్ 23 నుంచి భవానీ మండల దీక్షలు ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో కేఎస్.రామారావు తెలిపారు. ఆలయం మహామండపం ఆరో అంతస్తులో ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, వైదిక కమిటీ సభ్యులతో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దీక్షలు 27 వరకు స్వీకరించవచ్చన్నారు. 23న మూలవిరాట్‌కు పూజలు నిర్వహించి పగడాల మాలాధారణ చేస్తారని, అనంతరం ప్రధాన ఆలయం నుంచి ఉత్సవమూర్తిని మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకువచ్చి అఖండ జ్యోతి ప్రజ్వలనతో దీక్ష స్వీకరణ మహోత్సవం ప్రారంభమవుతుందని వివరించారు. అర్ధమండల దీక్షలు డిసెంబర్ 13–17 వరకు స్వీకరించవచ్చన్నారు. 26న అమ్మవారి కలశజ్యోతి మహోత్సవం సత్యనారాయణపురంలోని శ్రీశివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతుందన్నారు. జనవరి 3–7 వరకు దీక్ష విరమణలు కొనసాగుతాయని తెలిపారు. 14 నుంచి కార్తీక మాసోత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఈ నెల 14 నుంచి డిసెంబర్ 12 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం మల్లేశ్వర స్వామి, నటరాజ స్వామి వారి ఆలయాల వద్ద ఆకాశదీపాన్ని వెలిగించనున్నారు. 26న కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం, 27న కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షణ, బిల్వార్చన చేపడతారు. 15న దుర్గమ్మను గాజులతో అలంకరిస్తారు. 16న సరస్వతి యాగాన్ని, 17న నాగుల చవితి నిర్వహిస్తారు. -
విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస దీక్ష విరమణ
-
నేనంటే కేసీఆర్‌కు భయం
సాక్షి, హైదరాబాద్: తనను చూసి కేసీఆర్ భయపడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలో దళిత బంధు అక్రమాలపై నిరసన తెలపడానికి బయలుదేరిన ఆమెను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయంటూ జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామస్తులు ఇటీవల ఆందోళన చేశారు.ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్న షర్మిలను, అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల పోలీసులకు హారతి ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. గజ్వేల్‌లో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసులు సీఎం కేసీఆర్ తొత్తుల్లా పని చేయడం మానుకోవాలన్నారు. తనను అడ్డుకున్నందుకు నిరసనగా లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు కొనసాగిన ఆమె దీక్షను తీగుల్ గ్రామస్తులు వచ్చి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. షర్మిల నిరాహార దీక్షకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మద్దతు తెలిపారు తొమ్మిదేళ్లుగా గుడిసెల్లోనే.. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తాను వెళ్లాలనుకున్న తీగుల్ గ్రామంలో దళితులు తమ ఇళ్ల ఫొటోలు పంపి, వారి కోసం కొట్లాడాలని వినతి పత్రం పంపించారన్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు ఓట్లేసి గెలిపించినా.. తొమ్మిదేళ్లుగా ఈ ప్రజలు ఇంకా గుడిసెల్లోనే ఉంటున్నారన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్‌లోనే దళిత బంధు ఇంత దరిద్రంగా అమలవుతుంటే ఇతర నియోజకవర్గాల్లో ఎలా అమలవుతుందో ఊహించుకోవచ్చన్నా రు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలుంటే.. ఇప్పటి వరకు 38 వేల కుటుంబాలకే దళిత బంధు అమలైందన్నారు. ప్రతి ఒక్కరికీ దళితబంధు పథకం అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. -
మీ సాయం కోరే చిన్నారులం
సాక్షి, హైదరాబాద్: నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే చేపట్టాలని సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆవేదన దీక్ష తల్లిదండ్రులతో పాటు చిన్నారుల, వృద్ధుల వేడుకోళ్లతో ఉద్విగ్నవాతావరణంలో సాగింది. 13 జిల్లాల నుంచి ఉపాధ్యాయ దంపతులతో పాటు వారి పిల్లలు, వయోధికులైన వారి తల్లిదండ్రులు కూడా దీక్షకు తరలివచ్చారు. స్పౌజ్ బదిలీలు నిర్వహించి తమ తల్లిదండ్రులను, కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆవేదన చెందడం అందరినీ కలచివేసింది. తమ తల్లిదండ్రుల బదిలీలు జరగకపోవడంతో వారి కుటుంబాలు అనుభవిస్తున్న ఇబ్బందులను పిల్లలు కన్నీటి రోదనల మధ్య వివరించారు. ఇప్పటికైనా తమ తల్లిదండ్రులను కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆ సభ ద్వారా ముఖ్యమంత్రిని వేడుకున్నారు. బోనాలతో ప్రత్యేక ర్యాలీ.. బోనాలతో తెలంగాణ అంతటా పండుగ వాతావరణం ఉన్న ఈ సందర్భంలోనూ.... తమ బదిలీలు జరగక ఆవేదనలో ఉన్నామని.. అమ్మవారికి ప్రత్యేక బోనాలను తయారు చేయించి.. మహిళా ఉపాధ్యాయులు ర్యాలీగా అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. బదిలీలు వెంటనే చేపట్టాలని.. భార్య ఒక జిల్లాలో, భర్త మరొక జిల్లాలో 18 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి స్పౌజ్ బదిలీలు జరిపించాలని అభ్యర్థిం చారు. ప్రగతిభవన్ ముట్టడికి సైతం వెనుకాడం: ఉపాధ్యాయ సంఘాలు ఈ ఆవేదన సభకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. యుటీఎఫ్, టీపీటీఎఫ్, తపస్, ఎస్టీయూ, ఆర్.యూ.పీ.పీ, పీఆర్టీయూ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి చేరుకొని తమ మద్దతును ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, అవసరమైతే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని, ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా వెనకాడమని నాయకులు హెచ్చరించారు. -
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే ప్రభుత్వం అరెస్ట్‌లు చేస్తోంది: షర్మిల
-
YS Sharmila Deeksha: నేను ఎందుకు వెనక్కి తగ్గాలి?: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో ‘టీ–సేవ్’ నిరుద్యోగ దీక్షను ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ఇందిరాపార్కు వద్ద చేపట్టారు. ఈ దీక్షలో ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, ‘‘నేను ఎందుకు వెనక్కి తగ్గాలి. రాజకీయాలంటేనే చీదరించుకునే దానిని.. మాకు పోలీసులతో గొడవ పెట్టుకోవడానికి ఏం అవసరం. తెలంగాణ యువత కోసం పోరాడుతున్నా. నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తేవడానికి వైఎస్ హయాంలో పోలీసులు పనిచేశారు. సెల్ఫ్ డిఫెన్స్‌లో చేశాను తప్ప.. పోలీసులను కించపరచాలని కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘బంగారు తెలంగాణ ఎక్కడ?. కల్వకుంట్ల కుటుంబం బంగారు తెలంగాణగా మారింది. సిట్ విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టే విధంగా ఉంది. సిట్ విచారణలో సూత్రధారులను వదిలేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వ శాఖల్లో సమాచారం తీసుకోవడం అంత సులభమా?. ఐపీ అడ్రస్, పాస్వర్డ్ తెలిస్తే చాలా?. కేటీఆర్ తనకేమీ సంబంధం అంటున్నారు. ఐటీశాఖ బాధ్యతలు ఏంటో మీకు తెలుసా?. ఐటీ చట్టం-2000 వరకు అన్ని శాఖల్లో వాడే కంప్యూటర్లకు ఐటీ శాఖదే బాధ్యత. 2018లో టీఎస్పీఎస్సీలో కంప్యూటర్లు కొన్నారు.. ఐటీశాఖ సైబర్ సెక్యూరిటీ ఆడిట్ ఎప్పుడైనా చేసిందా?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘సైబర్ సెక్యూరిటీ ఆడిట్ జరిగి ఉంటే పేపర్ లీకేజీ జరిగేది కాదు. సిట్ అధికారులను ప్రగతిభవన్ గుప్పెట్లో పెట్టుకున్నారు. తీగలాగితే ఐటీ డొంక కదులుతుంది. కేటీఆర్‌ను కాపాడటానికే సిట్ ప్రయత్నం చేస్తుంది. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు కోరండి. కేసీఆర్‌కు 10 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం పంపుతున్నా’’ అని షర్మిల అన్నారు. చదవండి: TS: వాతావరణశాఖ హెచ్చరిక.. ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన -
కాంగ్రెస్ పార్టీ తలపెట్టబోయే నిరుద్యోగ నిరసనపై సమాచారం లేదు
-
కవిత దీక్షకు బీఆర్ఎస్ నేతలు
-
ఢిల్లీ జంతర్ మంతర్ లో కవిత దీక్ష
-
నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష
-
30న ‘అనాథల అరిగోస’ పేరుతో దీక్ష
పంజగుట్ట: అనాథలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలు గుర్తు చేసేందుకు 30వ తేదీన ఇందిరాపార్క్ వద్ద ‘అనాథల అరిగోస’ పేరుతో దీక్ష నిర్వహిస్తున్నట్లు అనాథల హక్కుల పోరాట వేదిక వ్యవ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. పోరాట వేదిక ఆధ్వర్యంలో సోమవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అనాథ హక్కుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు గుర్తుచేస్తూ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రొఫెసర్ హరగోపాల్, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, అద్దంకి దయాకర్, రాములు నాయక్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆప్ నేత ఇందిరా శోభన్, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములుతోపాటు పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. మందకృష్ణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనాథలకు ఎన్నో హామీలు ఇచ్చి నేటికి ఏడు సంవత్సరాల ఏడు నెలలు అయ్యిందని ఇప్పటికీ అవి నెరవేర్చకుండా మోసం చేశారని విమర్శించారు. -
పేపర్ మిల్లు ఎదుట ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దీక్ష
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రా పేపర్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులతో యాజమాన్యం ముందస్తుగా పదవీ విరమణ చేయిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలను అందనీయకుండా యాజమాన్యం, కార్మిక సంఘం నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యంతో చర్చించడానికి సోమవారం ఉదయం 11 గంటల సమయంలో రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లు వద్దకు రాజా వెళ్లారు. అయితే యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆందోళన నిర్వహించారు. అనంతరం కోటిలింగాలపేట పంప్‌హౌస్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేత శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో కొందరు యువకులు పంప్‌హౌస్ పైకి ఎక్కి గోదావరిలో దూకేస్తామంటూ నినాదాలు చేయడంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పంప్‌హౌస్ నుంచి తిరిగి పేపర్ మిల్లు గేటు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే రాజా అక్కడే బైఠాయించి అర్ధరాత్రి కూడా నిరసన కొనసాగిస్తున్నారు. పేపరు మిల్లు యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ కదలబోమని స్పష్టం చేశారు. యాజమాన్య నిరంకుశ ధోరణికి నిరసనగా కార్మికులు సైతం సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీయడానికి పేపర్ మిల్లు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయకృష్ణ, గుర్తింపు పొందిన కార్మిక సంఘం నేత పనిచేస్తున్నారని మండిపడ్డారు. మూడున్నరేళ్లుగా వేతన ఒప్పందం కుదరకపోవడంతో కార్మికులు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లులో పనిచేస్తున్న సీనియర్ కార్మికులను బలవంతంగా వీఆర్ఎస్ పేరిట బయటకు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. వారి స్థానంలో నైపుణ్యం లేని కొత్త యువకులను నియమించుకుంటున్నారని విమర్శించారు. -
నేటి నుంచి విశాఖ శ్రీ శారదా పీఠం చాతుర్మాస్య దీక్ష
-
మూడేళ్ల కిందట మాటలు బంద్.. మూగవాడికి మాటలొచ్చాయ్!
కేశంపేట: ఓ ప్రమాదంలో మాట కోల్పోయిన వ్యక్తికి తిరిగి మాటలు వచ్చాయన్న ఉదంతం రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆదివారం చర్చనీయాంశమైంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట గ్రామానికి చెందిన బ్రహ్మచారి మూడేళ్ల కిందట ప్రమాదవశాత్తు ఇంట్లో కిందపడ్డాడు. బ్రెయిన్‌కు గాయాలవ్వడంతో అతడు మాట కోల్పోయాడు. వైద్యులను సంప్రదించగా రూ.3లక్షలకు పైగా ఖర్చవుతుందన్నారు. (చదవండి: స్టంట్లు చేస్తున్నారా.. జర జాగ్రత్త.. పోలీసులు ఇంటికే వచ్చేస్తారు!) అంత మొత్తం చెల్లించే స్థోమత లేకపోవడంతో కుటుంబసభ్యులు అలాగే వదిలేశారు. ఈ క్రమంలో గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులతో కలిసి బ్రహ్మచారి సైతం వీరబ్రహ్మేంద్రస్వామి దీక్ష చేపట్టాడు. దీక్షలో ఉన్న బ్రహ్మచారి ఆదివారం ఉదయం ఆలయ గర్భగుడిని శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు ఊగిపోయి మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదటగా గర్భగుడిలో ఉంటేనే మాటలు రావడం.. బయటికి వస్తే రాకపోవడం గమనించారు. దీంతో స్వామివారికి 11బిందెలతో అభిషేకం చేయడంతో మాటలు పూర్తిగా రావడం మొదలైంది. గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేయడంతో ఈ అద్భుతం జరిగిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గతంలో మాటలు రాలేదని.. తిరిగి రావడం వాస్తవమేనని పలువురు స్థానికులు ధ్రువీకరిస్తున్నారు. కాగా, దీనిపై డిప్యూ టీ డీఎంహెచ్ఓ దామోదర్ వివరణ కోరగా బ్రెయిన్‌కు గాయం అయినప్పుడు ఇలా మాటలు కోల్పోయే అవకాశం ఉంటుందని.. గాయం మానినప్పుడు అనుకోని పరిణామాల్లో తిరిగి రావచ్చని అభిప్రాయపడ్డారు. (చదవండి: వాలీబాల్ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి) -
మాల వేసుకున్నారని తరగతిలోకి రానివ్వలేదు!
బోథ్: హనుమాన్ దీక్షలో ఉన్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం తరగతిలోకి అనుమతించిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చరలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సోమవారం జరిగింది. బోథ్ మండలంలోని పొచ్చర క్రాస్ రోడ్డు వద్ద గల సెయింట్ థామస్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న వినయ్, 7వ తరగతి చదువుతన్న రోహిత్ ఇటీవల హనుమాన్ దీక్ష తీసుకున్నారు. రోజూ లాగానే సోమవారం వారు పాఠశాలకు వచ్చారు. యాజమాన్యం వారిని అడ్డుకుని కాషాయ దుస్తులు తీసి యూనిఫాంలో రావాలని ఆదేశించింది. యూనిఫాం లేకపోతే పరీక్షలు రాయనివ్వమని స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. వెంటనే వారి తల్లిదండ్రులకు, హనుమాన్ దీక్షాపరులకు సమాచారం అందించారు. విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు, హనుమాన్ దీక్షాపరులు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయులు ఇమన్యూయల్‌ను నిలదీశారు. ఆందోళన నిర్వహించారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. క్రిస్టియన్ పాఠశాల అయినందునే దీక్షలో ఉన్న హిందూ విద్యార్థులను రానివ్వలేదని ఏబీవిపీ నాయకులు ఆకాశ్ ఆరోపించారు. డీఈవో ప్రణీతకు ఫోన్ చేసి పాఠశాలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాషాయ జెండాలను పాఠశాలపై ఎగురవేశారు. పాఠశాలపై చర్య తీసుకుంటామని డీఈవో చెప్పడంతో విద్యార్థులను తరగతిలోకి అనుమతించారు. ఈ విషయమై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాçపురావ్ స్పందించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా విద్యాధికారి ప్రణీతను కోరారు. మరోసారి ఇలాంటి సంఘటనలు çపునరావృతం కాకుండా చూడాలని సూచించారు. -
ఇక్కడ కొనకుండా అక్కడ దొంగ దీక్షలా?
గార్ల/బయ్యారం: రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోలు చేయకుండా సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి దొంగ దీక్షలు చేస్తున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం మండలాల్లో సోమవారం ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా గార్ల మండలం పెద్దకిష్టాపురం గ్రామంలో రైతుదీక్షలో షర్మిల మాట్లాడారు. యాసంగిలో వరి పంట సాగు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించడంతో, 17 లక్షల ఎకరాలను బీళ్లుగా వదిలేసిన రైతుల ఉసురు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగులుతుందన్నారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీని సాధించకుండా బయ్యారం ఉక్కుపరిశ్రమ ఏర్పాటు విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. బయ్యారం మండలంలోని నారాయణపురం పంచాయతీ కార్యదర్శి ఈసం వెంకటేశ్వర్లు పంచాయతీ అభివృద్ధికోసం అప్పు తెచ్చి పనులు చేయాల్సి వచ్చిందని, ఆ అప్పును తీర్చే పరిస్థితి లేక చివరకు ప్రాణం తీసుకోవడం బాధాకరమని అన్నారు. ఇదే బయ్యారానికి చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదన్న ఆవేదనతో రైలుకింద పడి మృతి చెందాడని, అయినా ప్రజా సమస్యలపై కేసీఆర్ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. -
కేంద్రమే కొనాలి..
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సామరస్యంగా పరిష్కరించాలనుకున్నా.. కేంద్ర వైఖరి ఏమాత్రం మారలేదని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి విమర్శించారు. అందుకే కేంద్రంతో తేల్చుకొనేలా ఢిల్లీలో దీక్ష చేపట్టామన్నారు. ప్రస్తుతం యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనే పరిస్థితి ఏమాత్రం లేదని, కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు. ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వరి దీక్ష ఏర్పాట్లను శనివారం టీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామా, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, ఇతర నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అహంకారంతో మాట్లాడారని.. ఇటీవల పార్లమెంటును కూడా తప్పుదోవ పట్టించారని రంజిత్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తోందన్నారు. రైతుల కష్టాలను చూపేందుకే: కేకే కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, రైతుల కష్టాలను చూపించడానికే ఢిల్లీలో ధర్నా చేపట్టామని ఎంపీ కె.కేశవరావు తెలిపారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ గొంతుపై కత్తిపెట్టి బాయిల్డ్ రైస్ పంపించొద్దని ఒప్పందం చేయించుకుందని ఆరోపించారు. ప్రత్యామ్నాయ పంటలు వచ్చేవరకు ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలన్నారు. ధాన్యం కొనేవరకు వదలం: నామా కేంద్రం తెలంగాణ రైతులపై కక్ష కట్టిందని, ధాన్యం కొనే వరకు కేంద్రాన్ని వదిలే ప్రసక్తి లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్‌కి తెలుసని, ధాన్యం సేకరణ కోసం చివరివరకు పోరాడుతామని చెప్పారు. రాష్ట్రప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. ఢిల్లీలో లొల్లికి రెడీ! యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే సేకరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 11న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అక్కడి తెలంగాణ భవన్లో కేసీఆర్, కేటీఆర్ సహా టీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో వరి దీక్ష ప్రాంగణం ముస్తాబవుతోంది. శనివారం దీక్షాస్థలాన్ని టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, మరికొందరు రాష్ట్ర నేతలు పరిశీలించారు. వేదిక, టెంట్లు, బారికేడ్లు, సీటింగ్, భోజనం, ఇతర వసతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఢిల్లీలో ‘ఒకే దేశం.. ఒకే ధాన్యం సేకరణ’అంటూ టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన హోర్డింగులు, పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. -
250వ రోజు..250 మందితో 25 గంటల దీక్ష ప్రారంభం
విశాఖ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన దీక్షలు 250వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా కూర్మన్నపాలెం గేటు వద్ద 250 మంది కార్మికులు ఇరవై ఐదు గంటల నిరవధిక దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా హక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు. ఎట్టి పరిస్థితిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్మిక సంఘం నాయకులు. హెచ్చరించారు చదవండి: ఇదో రియల్ సస్పెన్స్ కథ: బెడ్రూమ్లోని రూ.55 లక్షలు మాయం! Visakhapatnam: 7 వండర్స్ ఇన్ వైజాగ్ -
నేటి నుంచి రేవంత్ దీక్ష
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి 48 గంటల దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్రంలోని దళిత, గిరిజన కుటుంబాలన్నింటికీ దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లిలో జరిగే ఈ దీక్షలో రేవంత్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలోని దళిత, గిరిజన వర్గాలకు చెందిన ముఖ్య నేతలు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొంటారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లను సోమవారం టీపీసీసీ నేతలు పరిశీలించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌తో పాటు పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు, స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్‌పై వ్యతిరేకతకు నిదర్శనం: మల్లు రవి రాష్ట్రంలోని దళిత, గిరిజన వర్గాలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలనే డిమాండ్‌తో రేవంత్‌రెడ్డి 48 గంటల దీక్షా కార్యక్రమానికి దిగుతున్నారని మల్లు రవి చెప్పారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. దళితులు, గిరిజనులకు కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. -
వైఎస్సార్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం
హుజూరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. సీఎం కేసీఆర్ పాల నలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగిందన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌దేనని చెప్పారు. భరోసా ఇవ్వని సర్కారు దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మనది ఒకటని షర్మిల తెలిపారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఇప్పుడున్న ప్రభుత్వం తామున్నామన్న ధైర్యం ఎందుకు ఇవ్వ డం లేదని ప్రశ్నించారు. అమాయక యువత ఉద్యోగాలు రాక నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. దొర బాంచన్ బతుకులకు స్వస్తి చెప్పండి తెలంగాణలో పథకాలు రావాలంటే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని షర్మిల చెప్పారు. దొర బాంచన్ బతుకులకు స్వస్తి చెప్పి ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చా రు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళితుల బంధువుగా మారినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని దళితులంతా హుజూరాబాద్‌కు వచ్చి ఓటు నమోదు చేసుకొని రూ.10 లక్షల కోసం డిమాండ్ చేయాలన్నారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, తాము అండగా ఉంటామని చెప్పారు. దీక్షకు ముందు.. ఉద్యోగం రాకపోవడంతో ఇటీవల రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సిరిసేడు గ్రామానికి చెందిన మహ్మద్ షబ్బీర్ కుటుంబసభ్యులను షర్మిల పరామర్శించారు. ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబంలో చదువుకున్న వారికి ప్రైవేట్‌గా మంచి ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మెలో పాల్గొననున్న షర్మిల లక్డీకాపూల్: రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యల పరిష్కారానికి తలపెట్టిన సమ్మెకు వైఎస్ షర్మిల సంఘీభావం తెలిపారు. బుధవారం ఉద యం 10.30కి ఆమె ఇందిరాపార్కులో నిర్వహించనున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మెలో పాల్గొననున్నారు. -
పుల్లెంలలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష
సాక్షి, నల్లగొండ: దేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. చుండూరు మండలం పుల్లెంలలో ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్ (26) కుటుంబాన్ని మంగళవారం ఆమె పరామర్శించారు. అనంతరం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి ఎన్నో పథకాలను వైఎస్సార్ నాడు ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణలో ఎవరిని కదిలించినా అప్పులేనని, తెలంగాణలో ప్రతి కుటుంబం అప్పులపాలైందని విమర్శించారు. ఇళ్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని షర్మిల ధ్వజమెత్తారు. -
పెనుబల్లిలో వైఎస్ షర్మిల ‘నిరుద్యోగ దీక్ష’
-
దొంగ దీక్షలు... కొంగ జపాలు మెప్పిస్తాయా?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పక్షాల పనితీరును ఎల్ల వేళలా నిశితంగా గమని స్తూనే ఉంటారు. పార్టీల గెలుపు, ఓటములు దాని మీదే ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం 2019 ఎన్నికలలో తమ రాజకీయ పరిపక్వతను చాటుకొన్న ఫలితంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు లభించగా, టీడీపీకి 23 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఓటమి చవిచూశాక సహజంగానే ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకొంటారు. కానీ అధి కారంలో ఉండగా పొరపాట్లు చేశానన్న పశ్చాత్తాపం చంద్రబాబులో ఏ కోశానా కనబడటంలేదు. ప్రభుత్వానికి ప్రతి దశలో ఇబ్బందులు కలుగ జేయకుండా కొంతకాలం వేచిచూద్దామన్న ప్రజా స్వామిక లక్షణమూ లేదు. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే తప్పు పట్టాల్సిందేమీ లేదు. కానీ, మీడియాలో హడావుడి చేయడానికి కృత్రిమమైన కార్యక్రమాలు చేపడితే జనంలో నవ్వుల పాలవుతారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ చేసిన ‘3 గంటల దీక్ష’ (ఉదయం అల్పాహార సమయం నుండి మధ్యాహ్నం భోజనం చేసేవరకు) అభాసు పాలయింది. ఓ రాజకీయ పార్టీ కేవలం 3 గంటల పాటు దీక్ష చేయడం గతంలో ఎన్నడూ లేదు. తెలుగుదేశం చేపట్టిన దీక్షలో వారు చేసిన తీర్మా నాలు చూస్తే 1) రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాగా కోవిడ్ బాధితులకు రూ. 10,000 చొప్పున ఇవ్వాలి. 2) కోవిడ్‌తో మరణించిన పేషెంట్ల కుటుంబాలకు రూ. 10 లక్షలు అందించాలి. 3) ఆక్సిజన్ అందక మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలి. బాధితులకు పరిహారంగా ఎంత మొత్తం ఇచ్చినా తప్పులేదు. కానీ, తను అధికారంలో ఉన్నప్పుడు సమంజసమైన నష్టపరిహారం ఇవ్వడానికి ముప్పతిప్పలు పెట్టిన చంద్రబాబుకు ఇప్పుడు భారీ ఎక్స్‌గ్రేషియా డిమాండ్ చేయడానికి ఏమి నైతిక హక్కు ఉంది? ఆశ్చర్యం ఏమిటంటే, జాతీయ పార్టీకి అధ్యక్షుడినని చెప్పుకొనే చంద్రబాబు కోవిడ్ బాధితులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు. ప్రతి దేశం కోవిడ్‌ను జాతీయ విపత్తుగానే పరిగణించాయి. దేశంలో విపత్తులు సంభవించినపుడు వాటి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని సాయం అందించడం కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత. తన బాధ్యతను విస్మరించిన కేంద్రాన్ని తప్పుపడుతూ న్యాయం చేయాలంటూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టులో దాఖలైంది. అయితే, కేంద్రం ‘కోవిడ్ మరణాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి మా వద్ద నిధులు లేవు’ అంటూ ఓ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి చేతులు దులుపుకుంది. కేంద్రం మాదిరిగా ప్రత్యేకంగా విరాళాలు సేకరించే వెసులుబాటు రాష్ట్రాలకు లేదు. ‘సీఎం రిలీఫ్ ఫండ్’కు అందే అరకొర నిధులతోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సరిపెట్టుకొంటున్నాయి. ఒకవైపు అని వార్యంగా లాక్డౌన్లు విధించడం వల్ల రాబడి పడిపోయింది. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాన్ని నిలుపుదల చేయకుండానే, వైద్య ఆరోగ్య రంగానికి అదనపు నిధులు సమకూర్చి ప్రజల్లో భరోసా నింపుతూ వస్తోంది. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిన కేంద్రం ఆ బాధ్యత నుండి తప్పుకున్నప్పటికీ, ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేయిస్తామని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. సంక్షేమంలో చంద్రబాబునాయుడా పాఠాలు చెప్పేది? అప్పుల ఊబిలో కూరుకొని గత్యంతరంలేక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడితే ‘ఎక్స్‌గ్రేషియా ఇస్తే దానికోసం రైతులు ఆత్మ హత్యలు చేసుకొంటారు’ అని రైతాంగాన్ని కించ పర్చేవిధంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడిన అమాన వీయ చరిత్ర చంద్రబాబుకు గుర్తులేదా? 1996లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు చేపట్టిన చర్యలేమిటి? సబ్సిడీ బియ్యం ధరను ఎన్టీఆర్ నిర్ణయించిన రూ. 2 నుంచి రూ. 5.50కు పెంచారు. తెల్లరేషన్ కార్డులను ఏరివేశారు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేశారు. సబ్సిడీలలో కోత పెట్టారు. సంపన్నులను శిక్షించి సామాన్యులను ఆదుకోవడం ప్రభుత్వాల ధర్మం అని చాణక్యుడు చెప్పాడు. క్రాస్ సబ్సిడైజేషన్కు మూలం ఈ సూత్రం. కానీ, అభినవ చాణక్యుడిగా చెప్పదగ్గ చంద్రబాబు అందుకు భిన్నంగా పేదలను శిక్షించి సంపన్న వర్గాలకు మేలు చేశారు. పారిశ్రామికీ కరణ పేరుతో, ఐటీ పేరుతో ప్రభుత్వ భూములను అస్మదీయులకు అప్పనంగా అందించారు. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తానన్న రైతుల రుణమాఫీని ఎన్ని విధాలుగా కుదించారో ప్రత్యే కంగా ప్రస్తావించనక్కర్లేదు. ఆయన నిఘంటువులో సంక్షేమం అనే పదానికి భిన్నమైన అర్థం కనపడుతుంది. సంక్షేమ హాస్టళ్లను మెరుగు పర్చడానికి రూ. 100 కోట్లు కోరితే, దానిని పక్కన బెట్టి 400 కోట్లతో ఆఫ్రో ఆసియన్ క్రీడలను నిర్వహించడం ద్వారా తనకు ప్రచారం తప్ప ప్రజల కష్టాలు పట్టవని చంద్రబాబు చాటుకున్నారు. అధికారంలో ఉండగా చేయగలిగిన పనులను కూడా చేయకుండా ప్రతిపక్షంలోకి వచ్చాక దొంగ దీక్షలు, కొంగ జపాలు చేయడం చంద్ర బాబుకే చెల్లింది. - డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీమంత్రి -
చంద్రబాబు సాధన దీక్షలో ఆసక్తికర ఘటనలు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం చేపట్టిన సాధన దీక్షలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. దీక్షకు వచ్చిన కార్యకర్తల్లో కొందరు ‘ఈ దీక్ష దేనికి చేస్తున్నాం. ఏం సాధించడానికి చేస్తున్నాం’ అంటూ భోరుమనగా.. నాయకులు తెల్లమొహాలు వేశారు. ఉదయం టిఫిన్ చేసి దీక్షలో కూర్చోమన్నారని, మధ్యాహం భోజన సమయం ఒంటి గంటకు దీక్ష విరమించేలా ఏర్పాటు చేసినప్పుడు ఖర్చు కూడా ఏమీ కాదు కదా.. ఓ మూడు గంటల పాటు కూర్చుంటే ఏంపోతుందంటూ ఓ నేత వ్యాఖ్యానించడం కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేసింది. దీక్షలో కూర్చున్న నాయకులు ప్రసంగాలు ప్రారంభించగా.. కొందరు కార్యకర్తలు, నాయకులు తలొంచుకుని దిగాలుగా కూర్చోవడం గమనార్హం. ‘పార్టీ లేదు.. బొక్కా లేదు’ అని పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడే చెప్పారని, ఏదో పత్రికల్లో ఫొటోల కోసం షో చేస్తున్నామని మరో నాయకుడు వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
వైఎస్ షర్మిల దీక్ష భగ్నం
-
వైఎస్ షర్మిల దీక్ష భగ్నం
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇచ్చిన గడువు ముగియడంతో దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినప్పటికీ ఆమె దీక్ష కొనసాగించడంతో పోలీసులు వైఎస్ షర్మిలను బలవంతంగా లోటస్‌పాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఇందిరాపార్క్ నుంచి లోటస్‌పాండ్‌కు పాదయాత్రగా బయల్దేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, షర్మిల అభిమానులకు మధ్య జరిగిన తోపులాటలో ఆమె కొద్దిసేపు స్పృహతప్పి పడిపోయారు. దీంతో పోలీసులు ఆమెను వాహనంలో లోటస్‌పాండ్‌కు తరలించారు. కాగా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : ‘ఉద్యోగ దీక్ష’ చేపట్టిన వైఎస్ షర్మిల వైఎస్సార్ జయంతి రోజున కొత్త పార్టీ: వైఎస్ షర్మిల -
‘ఉద్యోగ దీక్ష’ చేపట్టిన వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి.. నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం ఆమె దీక్షకు ఉపక్రమించారు. సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ షర్మిల దీక్ష కొనసాగనుంది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ పట్టించుకోవటం లేదన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యమాలు చేస్తే అణచివేస్తున్నారని.. నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగిస్తామని వైఎస్ షర్మిల వెల్లడించారు. చదవండి: జరిమానా తప్పించుకోవడానికి...క్యా ఐడియా సర్ జీ ప్రమోషన్లు వదులుకుని మరీ తిష్ట? ఎవరా అధికారులు? -
ముగిసిన షోడశదిన సుందరకాండ దీక్ష
సాక్షి, తిరుమల : లోక సంక్షేమం కోసం కరోనా వ్యాప్తిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ చేపట్టిన షోడశదిన సుందరకాండ దీక్ష నేటితో ముగిసింది. తిరుమలలోని వసంత మండపంలో సెప్టెంబరు 29న ఈ దీక్ష ప్రారంభమైంది. "రాఘవో విజయం దద్యాన్మమ సీతా పతిఃప్రభుః " అనే మహామంత్రం ప్రకారం సుందరకాండలోని మొత్తం 68 సర్గల్లో గల 2,821 శ్లోకాలను 16 మంది సుందరకాండ ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయణం చేసారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి ఒక గంట పాటు ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. వసంత మండపంలో శ్లోక పారాయణంతోపాటు ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు జప, హోమ కార్యక్రమాలు నిర్వహించి,నేడు పూర్ణాహుతి నిర్వహించారు. నూతనంగా భాద్యతలు చేపట్టిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీక్షలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మహా సంకల్పంతో దీక్ష చేపట్టిన అదనపు ఈవో ధర్మారెడ్డిని అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు విరాళాలు అందించిన దాతలకు జవహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దేవదేవుని ఆశీస్సులతో కరోనా మహమ్మారి పూర్తిగా అంతం అవుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. (ఏకాంతంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు) -
మద్యాన్ని నిషేధించాలి
కవాడిగూడ: భావితరాల భవిష్యత్ కోసం మద్యపానాన్ని నిషేధించాలని బీజేపీ నాయకుడు పరిపూర్ణానంద స్వామి అన్నారు. భావితరాల్లో పెనుమార్పు కోసం కడుపు మాడ్చుకుని దీక్ష చేస్తే కానీ ప్రభుత్వానికి కనువిప్పు కలగదేమోనని వ్యాఖ్యానించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో మద్యాన్ని నిషేధించాలంటూ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ తలపెట్టిన 48 గంటల మహిళా సంకల్ప దీక్షను పరిపూర్ణానంద స్వామి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి దిశ పాపం తగలకుండా ఉండాలంటే మద్యపాన నిషేధం చేయాలని కోరారు. ఎన్కౌంటర్ ప్రభుత్వం, పోలీసుల గొప్పతనం కాదు, ఇది ప్రజల తీర్పు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విడతల వారీగా మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. డీకే అరుణ చేస్తున్న దీక్ష బీజేపీ కోసం కాదని, ఇది తెలంగాణ మహిళల కోసం తలపెట్టిన దీక్షని అన్నారు. మద్యంతోపాటు డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మద్యం ఏరులైపాతుందని విమర్శించారు. డీకే అరుణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే మద్యం నిషేధించలేరా అని ప్రశ్నించారు. దిశ సంఘటనతోనైనా సీఎంకు కనువిప్పుకలగాలని అన్నారు. దీక్షకు మాజీ మంత్రి ఇంద్రాసేనారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, గజ్జుల రామకృష్ణారెడ్డి, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ సంఘీభావం తెలిపారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష
రిషికేశ్: లోక కల్యాణం కోసం విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చేపట్టిన చాతుర్మాస్య దీక్ష ముగిసింది. గత పదేళ్లుగా రిషికేశ్‌లో స్వరూపానందేంద్ర దీక్ష చేపడుతున్నారు. ఈ ఏడాది స్వరూపానందేంద్రతో కలిసి ఉత్తరాధికారి స్వాత్మానంద్రేంద్ర దీక్షలో పాల్గొన్నారు. దీక్షలో భాగంగా శారదా చంద్రమౌళీశ్వరులు, రాజశ్యామల అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. దీక్ష ముగియడంతో త్వరలో పీఠాధిపతులు విశాఖకు పయనం కానున్నారు. -
జీవితమంటే ఆట కాదు
రాఘవసాయి, నాగబాబు, చాణక్య హీరోలుగా స్నేహాల్‌కామత్, మమతారెడ్డి, దీక్ష హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖేల్’. ‘లైఫ్ ఈజ్ నాట్ ఏ గేమ్’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమాతో శరత్ కుమార్. ఆర్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. గ్లోబల్ మోషన్ పిక్చర్స్ సమర్పణలో మాన్సీ మూవీస్ పతాకంపై గొట్టిముక్కల పాండురంగారావు, పులి అమృత్‌గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో హైదరాబాద్ సినిమా హబ్‌గా మారనుంది. షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాల కోసం సినిమా పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ‘ఖేల్’ సినిమా విజయవంతం కావాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు యు. సత్యనారాయణ, కూకట్పల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్ సాధనాల, సంగీతం: ఆనంద్ అవసరాల, సహ నిర్మాత: పులి అమృత్‌గౌడ్. ∙పి. మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బి. వినోద్ కుమార్, పులి అమృత్ గౌడ్, జి. పాండురంగా రావు -
గండం నుంచి గట్టెక్కిన దీక్ష?
కర్ణాటక ,యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాలలో ప్రేమికుడు చేతిలో కత్తిపోట్లకు గురై ఆస్పత్రి చికిత్స పొందుతున్న ఎంబీఎ విద్యార్థిని దీక్షా ఆస్పత్రిలో కోలుకోంటోంది. దాడి చేసిన నిందితుడు సుశాంత్ పోలీసుల అదుపులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శక్తినగరకు చెందిన సుశాంత్, దీక్షాల మధ్య ప్రేమ వైఫల్యంగా కారణంగానే ఆమెపై దాడి చేసిన్నట్లు పోలీసులకు చెబుతున్నాడు. డ్యాన్స్ శిక్షణకు వెళ్తుండగా వీరిద్దరి మధ్య ప్రమాయణం సాగింది. అయితే 2016లో ఒక ఘర్షణలో సుశాంత్ తప్పు చేసిన్నట్లు రుజువు కావటంతో జైలుకు వెళ్ళివచ్చాడు. దీంతో దీక్ష అతనికి దూరంగా ఉండగా, అతడేమో వెంటపడి వేధిస్తున్నాడు. ఆమె సుశాంత్‌పై కార్కళ మహిళ పోలీసుస్టేషన్లో కేసు పెట్టింది. దీంతో కక్ష పెంచుకొని దీక్షపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు సుశాంత్‌పై మంగళూరు బందరు స్టేషన్లో రౌడీషీట్‌ను తెరిచినట్లు మంగళూరు డీసీపీ హనుమంతరాయ తెలిపారు. 2016లో జపాన్ మంగయానె రాజేశ్, సుభాష్ పడీల్ గుంపుల మధ్య గలాటాల్లో కూడా సుశాంత్ ప్రధాన నిందితుడు. హత్య చేయాలనే దాడి : శుక్రవారం మధ్యాహ్నం సుశాంత్ దీక్షాను హత్య చేయాలని ప్లాన్ వేసుకున్నారు. అప్పుటికే తన ముబైల్ వాట్సాఫ్ స్టేటస్‌లో లవ్ యు దీచు...మిస్ యు బాబా...లవ్ యు లాట్ అని రాసి ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను స్టేటస్‌లో పెట్టాడు. అనంతరం మద్యం తాగి దేరళకట్టె క్షేమ ఆస్పత్రి వద్ద కాపుకాశాడు. సాయంత్రం కాలేజీ ముగించుకొని వస్తున్న దీక్షను అడ్డగించి చాకుతో 12 సార్లు పొడిచాడు. కాగా, ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న దీక్ష ప్రాణగండం నుంచి బయటపడినట్లేనని వైద్యులు తెలిపారు. గొంతు, శ్వాసనాళంకి బలమైన గాయం తాగిలాయి. రక్తస్రావం అధికం కావటంతో 20 బాటిళ్ల రక్తంను ఎక్కించారు. నర్సు సాహసం ఘటన జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ అక్కడికి వస్తుండగానే అందులో వచ్చిన నర్సు యువతి దీక్ష వద్దకు వెళ్తుండగా స్థానికులు అడ్డుకోబోయారు. నిందితుడు కత్తితో అక్కడే ఉన్నందున దాడి చేస్తాడేమోనని భయపడ్డారు. కానీ నర్సు ధైర్యంగా వెళ్లి బాధితురాలికి సపర్యలు చేయడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నర్సును నెటిజన్లు అభినందిస్తున్నారు. నర్సు ఆ యువకుడిని పక్కకు నెట్టి యువతిని ఎత్తుకొంటున్న దృశ్యాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. రూ. 50 వేలు ఆర్థిక సాయం దీక్ష కుటుంబాని దక్షిణ కన్నడ ఇన్చార్జ్ మంత్రి యుటీ ఖాదర్ రూ. 50 వేలును అర్థిక సాయంగా అందించారు. ఆదివారం దేరళకట్టె కేఎస్ హెగ్డే ఆస్పత్రిలో ఆమెను పరామర్శించారు. యువతిపై దాడి జరుగుతుండగా జనం ఆమెను రక్షించకుండా వీడియోలు తీయటం దారుణమన్నారు. -
భట్టి దీక్ష భగ్నం, నిమ్స్‌కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు సోమవారం ఉదయం భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా నిమ్స్‌కు తరలించారు. భట్టి విక్రమార్క బీపీ, షుగర్ లెవల్స్, ఎర్ర రక్తకణాలు పడిపోవడంతో తక్షణమే వైద్యం అందించాలని ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు ...ఆయనను అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించగా, వైద్యం చేయించుకునేందుకు భట్టి నిరాకరిస్తున్నారు. -
చెన్నారెడ్డినే తరిమిన వాళ్లం.. చంద్రబాబు మాకెంత..!
తాడేపల్లిగూడెం: దమ్ముంటే తెలుగుదేశం పార్టీ సభను అడ్డుకోవాలని టీడీపీ నాయకుడు ఒకరు ఛాలెంజ్ చేశారు. మర్రి చెన్నారెడ్డిని తరిమిన ఘనత మాది. ఆఫ్ట్రాల్ చంద్రబాబును తరమడం పెద్ద కష్టం కాదని ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. విమానాశ్రయ భూముల నిర్వాసితులకు పట్టాలు ఇవ్వాలని, చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో మౌన పోరాట దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టే ముందు విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ రెచ్చగొట్టే విధంగా టీడీపీ నాయకులు మాట్లాడితే వెనుకడుగు వేయమని హెచ్చరించారు. శనివారం ధర్మపోరాట దీక్షలో గూడెంకు ఇచ్చిన హామీల అమలులో అధికార పార్టీ నాయకుల స్పందనపై మా పోరాటం ఆధారపడి ఉంటుందన్నారు. తాడేపల్లిగూడెంలో ధర్మపోరాట దీక్ష చేసుకోడానికి ఈ ప్రాంతం పనికొచ్చింది కాని, ప్రభుత్వ వైద్య కళాశాల ఇవ్వడానికి పనికిరాదా అన్నారు. 2015 ఆగస్టులో నిట్ వేదికపై నుంచి ఇచ్చిన హామీలకు అతీగతీ లేదన్నారు. కేంద్రం ఈ రాష్ట్రానికిచ్చిన హామీలు 95 శాతం పూర్తిచేస్తే, మిగిలిన ఐదు శాతం హామీల అమలు కోసం ధర్మపోరాటం చేయడం ఎందుకని ప్రశ్నించారు. గూడెం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయని సీఎంపై ఏ పోరాటం చేయాలన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఇచ్చిన హామీలకు సమాధానం చెప్పి సభ నిర్వహించుకోవాలన్నారు. మౌనపోరాటం చేస్తామని ప్రకటించాక విమానాశ్రయ భూముల్లో 1800 మందికి పట్టాలు ఇస్తామని టీడీపీ నాయకులు ప్రకటించారు. విమానాశ్రయ భూముల్లో 5300 మంది పట్టాదారులుంటే కేవలం 1800 మందికి ఇస్తాననడం సరికాదు. అందరికీ పట్టాలిస్తానని సభలో ప్రకటించాలని మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర చేస్తూ టీడీపీ వారిని ప్రశ్నిస్తున్నారని ఆయనపై దాడికి రెక్కీ నిర్వహిస్తే ప్రభుత్వం కళ్లు తేలేసి చూస్తుందా అన్నారు. అభిమాన నటుడుగా ఉన్న పవన్‌కల్యాణ్‌కు అన్యాయం జరిగితే మూల్యం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిం చారు. శాంతియుతంగా మౌనదీక్ష చేస్తున్న మమ్మల్ని రెచ్చగొడితే మేము కూడా కర్ర చేత్తో పట్టుకోడానికి సిద్ధమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు కోడూరి లక్షీనారాయణ, మహిళా మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి శరణాల మాలతీరాణి, పార్టీ నాయకులు ఈతకోట తాతాజీ, యెగ్గిన నాగబాబు, నరిశే సోమేశ్వరరావు, ధనలక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. సాధిద్దాం.. పట్టాలు సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మౌన పోరాట దీక్ష సాగింది. ఎమ్మెల్యే సతీమణి సూర్యకుమారి కూడా దీక్షలో పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యం శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలే దీనికి నిదర్శనమని మాణిక్యాలరావు అన్నారు. ఇంటెలిజెన్సు వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం దీనికి కారణమన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దాడికి రెక్కీ నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు రక్షణ కొరవడిందన్నారు. పసుపు తమ్ముళ్ల రక్షణకే పోలీసు బలగం సరిపోతుందన్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు, ప్రతిపక్ష నేతల రక్షణకు ప్రత్యేక వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
అధికారమత్తులో అమరులను యాది మరిచారా?
సాక్షి, హైదరాబాద్: త్యాగాల పునాదుల మీద సాధించుకున్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అధికారం మత్తులో అమరులను యాది మరిచారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలను అధికారం వచ్చాక కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఒక్కసారైనా కలవలేదని దుయ్యబట్టారు. ఇలాంటి కేసీఆర్‌కు ఇప్పుడే కాదు, ఈ జన్మలో మళ్లీ అధికారం రాదన్నారు. తెలంగాణ అమరవీరులకు స్తూపం నిర్మించాలంటూ టీజేఎస్ కార్యాలయంలో బుధవారం అమరుల స్మృతి దీక్ష నిర్వహించారు. దీక్ష ముగింపు సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఉద్యోగాలు, బీడు భూములకు నీళ్లు వస్తాయని, సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఎంతో మంది యువకులు, విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారని చెప్పా రు. కానీ కేసీఆర్‌కు అధికారం, కాంట్రాక్టర్లు, కమీషన్లు ఇచ్చేవాళ్లు, ఉద్యమకారులపై తెగబడి దాడులు చేసిన వాళ్లే దగ్గరి వాళ్లయ్యారని ఆరోపించారు. ధర్నా చౌక్ ఎత్తేశారని, పోలీసుల రాజ్యంగా తెలంగాణను చేశారని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా, మానవహక్కులను హరించేలా నియంతలాగా రాష్ట్రాన్ని కేసీఆర్ పాలిస్తున్నారని విమర్శించారు. పదవుల్లో తెలంగాణ ద్రోహులు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, తెలంగాణ ద్రోహులను పదవుల్లో కూర్చోబెడుతున్నారని కేసీఆర్‌పై కోదం డరాం నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అశాంతి, టీఆర్ఎస్పై అసంతృప్తి, ఆగ్రహం పెరుగుతోందన్న భయంతో కేసీఆర్ ముందే దిగిపోయారన్నారు. ప్రజలకు దూరంగా గడీల్లో ఉంటూ, పోలీసు రాజ్యంగా మారిన పాలన కూలాలన్నారు. గడీల పాలనను కూల్చడానికి ఎవరితోనైనా కలసి పనిచేస్తామని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో ఎవరూ తమను పట్టించుకోవడం లేదని అమరుల కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు. ద్రోహులు మంత్రులయ్యారు: చాడ బుధవారం తెలంగాణ అమరుల స్మృతి దీక్ష ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరుల స్మారక స్తూపం వద్ద టీజేఎస్, టీడీపీ, సీపీఐ పార్టీల నేతలు నివాళులర్పించారు. రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులు మంత్రుల య్యారని, తెలంగాణ ఉద్యమ కారులు ద్రోహులయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఫిరాయింపులతో రాజకీయాలను టీఆర్ ఎస్ కలుషితం చేస్తోందని విమర్శించారు. సామాజిక తెలంగాణ సాధన కోసం కృషి చేద్దామని టీజేఎస్ నేత దిలీప్‌కుమార్ అన్నారు. -
నేను దీక్ష చేస్తా : మాజీ మంత్రి రావెల
సాక్షి, గుంటూరు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తీర్పుకు నిరసనగా ఈ నెల 23న దీక్ష చేయనున్నట్లు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు వల్ల చట్టం బలహీన పడిందని, కోరలు పీకిన పులి లాగా అట్రాసిటీ చట్టం తయారైందన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో, దేశ వ్యాప్తంగా దళితులలో అభద్రతభావం ఏర్పడిందని చెప్పారు. ఏపీలో కూడా దళితులపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఆందోళనలో ఉన్న గిరిజనులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో అట్రాసిటీ చట్టానికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తాను దీక్షకు కూర్చోనున్నట్లు రావెల ప్రకటించారు. -
చంద్రబాబు టూర్‌కు ఆర్టీసీ బస్సులు ; ప్రజలకు ఇక్కట్లు
-
తారాస్థాయికి టీడీపీ అధికార దుర్వినియోగం
సాక్షి, కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికార దుర్వనియోగం తారాస్థాయికి చేరింది. కడపలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే సీఎం రమేశ్‌ను పరామర్శించేందుకు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తున్నారు. దీంతో జనాల తరలింపుకు సగానికి పైగా ఆర్టీసీ బస్సులను చంద్రబాబు టూర్‌కు కేటాయించారు. అంతేకాకుండా నియోజక వర్గాల ఇంచార్జిల పేర్లు రాసి మరీ బస్సులు తరలించారు. ఈ క్రమంలో బస్సులు లేక బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. 300లకు పైగా బస్సులు బాబు పర్యటనకు వెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రభుత్వ తీరుపై వారు మండిపడుతున్నారు. భద్రతా వలయంలో జెడ్పీ ఆవరణం చంద్రబాబు, ఆయన కుమారుడుచ మంత్రి లోకేశ్ పర్యటన సందర్భంగా నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. - రిమ్స్, ఎక్రముక్కపల్లె వైపు నుంచి వచ్చే వాహనాలు ఎల్ఐసీ, అంబేద్కర్ సర్కిల్ మీదుగా కడప నగరంలోకి రావాలి. - కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ - ఎర్రముక్క పల్లె - రాయచోటి వైపుకు వెళ్లాలి. - రాయచోటి వైపు నుంచి వచ్చే వాహనాలు చైతన్య సర్కిల్, ఎర్రముక్కపల్లె, ఎల్ఐసీ సర్కిల్ నుంచి కడపలోకి ప్రవేశించాలన్నారు. - పులివెందుల నుంచి వచ్చే వాహనాలు బిల్టప్, రెండవ గాంధీబొమ్మ మీదుగా కడపలోకి ప్రవేశించాలి. - జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఇర్కాన్ జంక్షన్ మీదుగా, దేవుని కడప నుంచి కడప నగరానికి చేరుకోవాలి. -
ఇది వింతైన పెళ్లి దీక్ష..
సాక్షి, అనకాపల్లిటౌన్ (విశాఖపట్నం): పెళ్లి చేసుకోవాలని వృద్ధులైన మేనమామలు, పెద్దమ్మలు ఒక యువకుడిని కోరుతున్నా.. తాను పెళ్లి చేసుకోనంటూ దీక్ష బూనిన ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా గత ఆరురోజులుగా కేవలం పండ్లను మాత్రమే తింటూ పెళ్లికి నిరాకరిస్తున్న యువకుడిని చూసి అక్కడి వారు విస్తుపోతున్నారు. తాను పెళ్లి చేసుకుంటే పెద్దమ్మలను, మేనమామలను వచ్చే భార్య సరిగా చూసుకోదంటూ యువకుడు అంటుంటే.. కనీసం నీ బాగోగుల కోసమైనా పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువకుడిని వీరంతా కోరుతున్నారు. అనకాపల్లి పట్టణంలోని గాంధీనగరం కోర్టువీధిలో ఉంటున్న మణికంఠ రామలింగేశ్వరరావు ఆరు రోజులుగా పండ్లను మాత్రమే తింటూ దీక్ష చేస్తున్నాడు. తనపై ఆధారపడిన తన బంధువులైన ఐదుగురు వృద్ధులు.. తాను పెళ్లి చేసుకుంటే ఆధారం లేనివారవుతారని రామలింగేశ్వరరావు అంటున్నాడు. అందువల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఈ వృద్ధులకు ప్రభుత్వం ఏదైనా దారి చూపాలని కోరుతున్నాడు. ఈ ఐదుగురు వృద్ధులకు ప్రతి నెలా రూ.1500 విలువైన మందులను సామాజిక కార్యకర్త గోల్డ్ వాసు అందిస్తున్నారు. -
గోప్యంగా బ్లడ్ రిపోర్టులు
సాక్షి ప్రతినిధి, కడప: విభజన చట్టంలోని అంశాల మేరకు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఆ మేరకు అధికార టీడీపీ మినహా తక్కిన రాజకీయపార్టీలన్నీ ప్రత్యక్ష ఉద్యమం చేపట్టాయి. కడప గడపలో స్వయంగా ముఖ్యమంత్రి 2015 ఆగస్టు 17న అఖిలపక్షాన్ని అవమానించారు. పైగా పోలీసులతో ఉద్యమంపై అణిచివేత ధోరణి ప్రదర్శించారు. నాలుగేళ్లుగా కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఉక్కు పరిశ్రమ నెలకొల్పే విషయమై మాట మాత్రం మాట్లాడలేదు. కాగా తాజాగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ దీక్షకు దిగారు. ముందుగా రాజకీయ పార్టీల మద్దతు కోరారు. రాజకీయ పక్షాలు తిరస్కరించడంతో ప్రజామద్దతు దక్కలేదు. అధికారం ప్రయోగించి కలెక్టర్, జేసీ ద్వారా ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు సంఘీభావం ప్రకటించేలా చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఇలా ఒక్కోక్క ప్రభుత్వ విభాగం ఒక్కోక్క రోజు దీక్షకు సంఘీభావం తెలిపేలా చర్యలు తీసుకున్నారు. ఆయా మంత్రులు సందర్శించిన రోజున ఆయా శాఖలకు చెందిన యంత్రాంగం దీక్షలకు వెళ్తోంది. అయితే బీటెక్ రవి దీక్షను బుధవారం పోలీసులు భగ్నం చేశారు. కడపకు క్యూకట్టిన మంత్రివర్గం కడపలోని జెడ్పీ ఆవరణంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు రాష్ట్ర మంత్రివర్గం క్యూకట్టింది. దీక్ష ప్రారంభం నాటి నుంచి ప్రతిరోజు మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు దీక్షాశిబిరం సందర్శించేలా ప్రణాళిక రచించారు. ఆమేరకు సీఎంఓ ఆదేశిస్తే అధికారపక్షం ఆచరిస్తోందనే విషయం తెలిసిందే. 9 రోజులుగా 21మంది మంత్రులు, 14 మంది ఎంపీలు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ప్రతిరోజు వీఐపీలను దీక్షకు పిలిపించడం, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు, ప్రముఖులు ప్రజానీ కాన్ని తరలించడం సర్వసాధారణమైంది. టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల మధ్య దీక్ష పోటీ పెంచుతోంది. కమలాపురం, జమ్మలమడుగు, రాయచోటి నియోజకవర్గాల్లో ఇలాంటి తంతు చోటుచేసుకుంది. ఆయా ప్రాంతాల నాయకులు ప్రతిరోజు వాహనాలను పెట్టి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రొటోకాల్ ఖర్చులు, జన సమీకరణ ఖర్చులు అంచనా వేస్తే ప్రతిరోజు దాదాపు రూ.1 కోటి ఖర్చవుతోన్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా జిల్లాలో నాయకులు ఎవ్వరెవరు ఎంత మందిని తరలించినా, రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది మంత్రులు సంఘీభావం ప్రకటించి నా, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మా త్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. ‘పోట్లదుర్తికి చెందిన రమేష్‌నాయుడు పంచాయతీకి ఎక్కువ–మండలానికి తక్కువ స్థాయి కల్గిన వ్యక్తిగా వరద ఇదివరకే ప్రకటించడం పాఠకులకు తెలిసిందే. ఆ మేరకు ఆయన కట్టుబడి ఉన్నారని పలువురు వివరిçస్తున్నారు. గోప్యంగా బ్లడ్ రిపోర్టులు ‘రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణదీక్ష ఓ బూటకం’ అనేందుకు అనేక కారణాలున్నాయి బలపడుతున్నాయి. జిల్లా పరిషత్ ఆవరణంలో చేపట్టిన దీక్షాస్థలి నుంచి సమావేశ మందిరం పక్కలో ఏర్పాటు చేసిన కలెక్టర్ విశ్రాంతి గదికి నిత్యం వెళ్తూ లోపల గంటల తరబడి మకాం వేసేవారు. కాలకృత్యాలను తీర్చుకునేందుకు వెళుతున్నారని మీడియా ప్రతినిధులు సైతం అభిప్రాయపడ్డారు. కాకపోతే ఆమరణదీక్ష ప్రారంభమయ్యాక ఐదురోజులు వరకూ అటు సీఎం రమేష్, ఇటు బీటెక్ రవి ఇద్దరు ఏమాత్రం నీరశించలేదు. చాలా హుషారుగా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. సభ నిర్వహణ సైతం పర్యవేక్షిస్తున్నారు. స్వతహాగా ఎమ్మెల్సీ బీటెక్ రవి షుగర్ పేషెంట్. ఆ విషయం తెలుగుతమ్ముళ్లే స్పష్టం చేస్తున్నారు. షుగర్ పేషెంట్‌గా ఉండీ ఆమరణదీక్ష చేపట్టారని కొనియాడారు కూడా. షుగర్ పేషెంట్ ఐదు రోజులుగా ఆహారం తీసుకోకపోతే కోమాలోకి వెళ్తారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బ్లడ్ రిపోర్టులో 22వ తేదీ(మూడవ రోజు) 77కిలోలు బరువు ఉన్నట్లుగా నమోదైంది. 24వ తేదీ (5వ రోజు) కూడా 77కిలోలు బరువు ఉన్నట్లుగా నమోదైంది. అంటే ఏమి తినకుండా దీక్ష చేస్తున్న వ్యక్తి రెండురోజులకు ఒక్క గ్రాము కూడా తగ్గకుండా ఉన్నారు. దీనిని బట్టి రమేష్ దీక్షలో చిత్తశుద్ధి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 25, 26వ తేదీల వరకూ బ్లడ్ రిపోర్టు బహిర్గతం చేస్తూ వచ్చిన రిమ్స్ వైద్య బృందం తర్వాత గోప్యత పాటిస్తోంది. 25వ తేదీ బ్లడ్ షుగర్ 56ఎంజీ నమోదు కాగా, 28వ తేదీ 58ఎంజీ ఉన్నట్లుగా రిమ్స్ వైద్య బృందం అనధికారికంగా వెల్లడిస్తోంది. బ్లడ్ నివేదిక నేరుగా కలెక్టర్‌కు అందిస్తున్నామని, కలెక్టర్ గోప్యత పాటించాల్సిందిగా సూచించారని రిమ్స్ యంత్రాంగం చెప్పడం విశేషం. ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమిస్తోన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ 9 రోజులుగా ఆమరణదీక్ష చేస్తుంటే బ్లడ్ రిపోర్టుల పట్ల అత్యంత గోప్యత పాటిస్తున్నారు. బ్లడ్ రిపోర్టుల వల్ల అంతా ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉండడంతోనే రహస్యాన్ని పాటిస్తున్నారని పలువురు వెల్లడిస్తున్నారు. నాలుగేళ్లుగా కడపకు రిక్తహస్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగేళ్లుగా జిల్లాకు రిక్తహస్తమే చూపించాయి. వివిధ సందర్భాల్లో దాదా పు 22సార్లు సీఎంగా చంద్రబాబు పర్యటించారు. చెప్పిందే చెప్పడం, ఇచ్చిన హామీలే ఇవ్వడం మిన హా ప్రత్యేకించి ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని జిల్లావాసులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రప్రభుత్వంపై నెపం వేస్తూ ఉక్కు పరిశ్ర మ కోసం టీడీపీ దీక్షను రచించింది. పాత్రదారు డు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అయినప్పటికీ వ్యవహారాన్ని సీఎంఓ రక్తికట్టిస్తోంది. కాగా ఆమరణ దీక్షలో చిత్తశుద్ధి లోపం తెరపైకి రావడంతో టీడీపీ వ్యవహారం ‘బూడిదలో పోసిన పన్నీరు’లా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నా రు. ఆ మేరకే ప్రజాదరణ కరువై ప్రభుత్వ యం త్రాంగం సాయంతో నెట్టుకురావాల్సి వస్తోందని వారు అభిప్రాయపడుతోండడం విశేషం. ‘కడప ఉక్కు’కు బీజేపీ అడ్డంకులు కడప రూరల్: ‘కడప ఉక్కు’కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని రాష్ట్రమంత్రి నారాయణ ఆరోపించారు. జెడ్పీ కార్యాలయం ఆవరణలో ‘కడప ఉక్కు’ కోసం రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ చేపట్టిన ఆమరణ దీక్ష గురువారం నాటికి 9వ రోజుకు చేరింది. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీల అమలు బిల్లులో కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ప్రధానమైందని తెలిపారు. ప్రధాని మోదీ హమీల అమలును ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ నెల 30న సీఎం చంద్రబాబు కడపకు వచ్చి, దీక్షా శిబిరాన్ని సందర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. దీక్షకు పెద్ద ఎత్తున డ్వాక్రా సభ్యుల తరలింపు టీడీపీ కార్యక్రమాలకు డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలను తరలించడం పరిపాటిగా మారింది. గురువారం దీక్షా శిబిరానికి స్థానిక ఆ పార్టీ నేతల సూచనలతో హరిత హోటల్ మీదుగా డ్వాక్రా సభ్యులను ర్యాలీగా తరలించారు. -
చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదు
-
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో స్టీల్‌ప్లాంట్
గసాక్షి ప్రతినిధి, కడప/జమ్మలమడుగు: రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. శంకుస్థాపన చేసిన రెండేళ్లలో ఉత్పత్తి కూడా మొదలయ్యేలా కృషి చేస్తామని వారు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మంగళవారం వైఎస్సార్సీపీ నేతలు ఉక్కు సంకల్పదీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ బీజేపీతో కేంద్రంలో నాలుగేళ్లు అధికారం పంచుకున్న చంద్రబాబు విభజన హామీల అమలుకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆయనకు స్వప్రయోజనాలే ముఖ్యమని, పదవిపై వ్యామోహమే తప్ప ప్రజలకు మేలు చేయాలన్న యావ ఉండదని వారు దుయ్యబట్టారు. దీక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ కూడా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ప్రత్యేకించి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. జమ్మలమడుగు సమీపంలో 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేయగా దాదాపు రూ.1,300 కోట్ల విలువైన పనులు పూర్తి అయ్యాయన్నారు. దేశంలో అత్యధికంగా స్టీల్ ఉత్పత్తి చేసే జిందాల్ పరిశ్రమకు దీటుగా ఉండాలని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బ్రహ్మణీని రూపొందించారన్నారు. ఆయనే బతికి ఉంటే నేడు జమ్మలమడుగు రూపురేఖలు పూర్తిగా మారిపోయేవని వివరించారు. బ్రహ్మణీ స్టీల్స్ పూర్తి అయి ఉంటే ఇప్పటికే కోటి టన్నుల సామర్థ్యం కలిగిన పరిశ్రమగా ఉండేదన్నారు. వైఎస్ మరణానంతరం చంద్రబాబు కుటిల రాజకీయాల కారణంగా పరిశ్రమ పూర్తికాలేదన్నారు. ఆయన జీవితమే కుట్రలమయం టీడీపీ అధినేత చంద్రబాబు జీవితమే కుట్రలమయం.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యంలేక ప్రతిసారి ఏదో ఒక పార్టీ సహకారంతో గెలిచారని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏనాడైనా నిజాయితీగా మాట్లాడారా.... చిత్తశుద్ధితో ప్రజలకేమైనా మేలు చేశారా అని నిలదీశారు. చంద్రబాబు వ్యక్తిత్వం పరిశీలిస్తే అవలక్షణాలున్న విలనే కన్పిస్తాడని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వం పరిశీలిస్తే అసలుసిసలు హీరో కన్పిస్తారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్ సమయం పూర్తి అవుతోండగా, ఎగువ రాష్ట్రమైన కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడంతోపాటు ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మించినా అడ్డుకోలేకపోయారని ఆరోపించారు. భవిష్యత్ తరాలకు ప్రశ్నార్థకంగా కానున్న ఆ ప్రాజెక్టులను కర్ణాటక నిర్మిస్తుంటే చూస్తూ ఊరుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలనే తపన వైఎస్‌లో మెండుగా ఉండేదని, అందుకే ముఫ్పైఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలనే సంకల్పం తీసుకున్నారని తెలిపారు. మీ ముంగిట గండికోట ప్రాజెక్టులో నీరు నిల్వ ఉన్నాయంటే అదీ వైఎస్సార్ పుణ్యమేనని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోనికి రాగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం ఆరునెలల్లోనే శంకుస్థాపన చేసి రెండు సంవత్సరాల్లో ఉత్పత్తి ప్రారంభించేలా చేస్తామని హమీ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ దీక్షలు: ఎంపీ అవినాశ్‌రెడ్డి విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయాలని ఏనాడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపైనే ఒత్తిడి తీసుకురాలేదని తాజా మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2014 డిసెంబర్లోనే స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అనుకూలంగా లేదని తేల్చిచెప్పినా, మూడున్నరేళ్లుగా తెలుగుదేశం నాయకులు, సీఎం స్పందించలేదన్నారు. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతుండటంతో రాజకీయ ప్రయోజనాల కోసమే దీక్షల పేరుతో నాటకం ఆడుతున్నారన్నారు. అదే సమయంలో విభజన చట్టంలోని ప్రతి హామీని అమలు చేయాలని వైఎస్సార్సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. 2014లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి విభజన హామీలను నెరవేర్చాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి విన్నవించామన్నారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రం చెబుతోందన్నారు. దీనికి టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. విభజన హామీలు అమలు చేయని కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము పదవులకు రాజీనామా చేశామన్నారు. టీడీపీ నాయకుల మాదిరి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం మోసపూరిత పోరాటాలు చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము 14నెలల ముందే ఎంపీ పదవీకి రాజీనామాలు చేశామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో టీడీపీకి, బీజేపీకి ప్రజలు తగ్గిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్ రఘురామిరెడ్డి, ఎస్బీ అంజద్‌బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, జమ్మలమడుగు, కమలాపురం సమన్వయకర్తలు సుధీర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డి.శంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీపి.సుబ్బారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ఆనాడే దీక్ష చేస్తే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ వచ్చేది’
సాక్షి, కడప : ఎన్నికల కోసమే టీడీపీ దీక్ష చేస్తోంది కానీ జిల్లా ప్రజలపై ప్రేమతో కాదని వైఎస్సార్ సీసీ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో చేపడుతున్న పోరాటంలో భాగంగా జమ్మలమడుగులో వైఎస్సార్ పీపీ ఆధ్వర్యంలో ఉక్కు సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశంతో ప్రత్యేక హోదా, విభజన హామీలైన ఉక్కు పరిశ్రమ కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేశామన్నారు. ఆనాడే తమతోపాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే కేంద్రం దిగొచ్చెదన్నారు. టీడీపీ ఇప్పుడు దీక్ష చేస్తే ఏం ఫలితం ఉంటుందని విమర్శించారు. ఉపఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి బుద్ది వచ్చేలా తీర్పునివ్వాలని ప్రజలను కోరారు. సీఎం రమేష్‌ది కార్పొరేట్ దీక్ష : అంజాద్ బాషా ఆనాడు వైయస్సార్ తలపెట్టిన స్టీల్ ప్లాంట్ అడ్డుకోకుండా ఉంటే లక్ష మందికి ఉపాధి లభించేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ అన్నారు.దీక్షలో ఆయన మాట్లాడుతూ..సీఎం రమేష్ రోజుకు రూ. కోటి ఖర్చు పెట్టి దీక్ష చేస్తున్నారని..అది కార్పొరేట్ దీక్ష అని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ తప్పా ఎవరికీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీజేపీతో వైఎస్సార్సీపీ జతకట్టే ప్రసక్తే లేదన్నారు. కొద్ది రోజుల్లో మైరారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. కప్పం కట్టందే పథకం రాదు : రఘురామి రెడ్డి జన్మభూమి కమిటీకి కప్పం కట్టందే సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని మైదుకూరు ఎమ్మెల్యే రుఘురామి రెడ్డి ఆరోపించారు. టీడీపీ వాళ్ల సొంత అభివృద్ధి తప్పా రాష్ట్రం అభివృద్ధే లేదని ఎద్దేవా చేశారు. జమ్మలమడుగు అభివృద్ధి ఉక్కు ఫ్యాక్టరీతో ముడిపడి ఉందన్నారు. వైయస్సార్ బతికి ఉండిఉంటే జమ్మలమడుగు పరిస్థితి ఇలా ఉండకపోవునని వ్యాఖ్యానించారు. టీడీపీకి బుద్ది చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు -
కడప ఉక్కు రాయలసీమ హక్కు
-
ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్సార్సీపీ పోరాటం ఉధృతం
-
ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం ఉధృతం
వైఎస్సార్ జిల్లా (ప్రొద్దుటూరు) : కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్సార్సీపీ పోరాటం ఉధృతం చేసింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మంగళవారం దీక్ష ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమ పేరుతో ఆడుతున్న డ్రామాలపై ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ రెండు కలిసి ద్రోహం చేశాయని, కడప ఉక్కు రాయలసీమ హాక్కు అని నినదించారు. ప్రత్యేక హోదా హామీలు నెరవేర్చకపోతే పోరాడతాం అనకుండా టీడీపీ నాయకులు లాలూచీ పడ్డారని మండిపడ్డారు. ఎన్నికల కోసం ఏ అస్త్రం లేక ఇప్పుడు టీడీపీ నాయకులు ప్రత్యేక హోదా, ఉక్కు అంటూ కపట నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. రామేశ్వరం రోడ్డులో ఉన్న బుశెట్టి కల్యాణ మండపం నుంచి మంగళవారం ఉదయం రాచమల్లు దాదాపు 10వేల మందితో ర్యాలీగా రామేశ్వరం రోడ్డు, గాంధీ రోడ్డు, టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్ మీదుగా పుట్టపర్తి సర్కిల్‌కు చేరుకున్నారు. ర్యాలీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ నేత అమర్నాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న దీక్షకు మద్దతుగా పట్టణంలోని వ్యాపారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. అపహాస్యం, అవహేళన చేసిన సందర్భాల్లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యే హోదా కోసం అలుపెరగని పోరాటాలు చేశారని గుర్తు చేశారు. 48గంటల దీక్షతో ఆగేది లేదని, గల్లీ స్థాయికి పోరాటాన్ని తీసుకెళతామని స్పష్టం చేశారు. విభజన హామీల్లో ఇచ్చిన ప్రకారం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాల్సిందేనని డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో కలిసుండి, టీడీపీ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలు పొందారన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేత సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేస్తానంటున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాలు పొంది ఎన్నికల ముందు మీరు చేసే పోరాటాలను ఉక్కు పోరాటం అనరని, తుక్కు పోరాటం అంటారని మండిపడ్డారు. -
ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం ఉధృతం
-
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాచమల్లు దీక్ష
వైఎస్ఆర్ జిల్లా : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మంగళవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దీక్ష చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమ పేరుతో ఆడుతున్న డ్రామాలను నిరసిస్తూ దీక్ష చేయాలని నిర్ణయించారు. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్లో దీక్షా వేదికను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం రామేశ్వరం రోడ్డులో ఉన్న బుశెట్టి కల్యాణ మండపం నుంచి ఎమ్మెల్యే దాదాపు 10వేల మందితో భారీ ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ రామేశ్వరం రోడ్డు, గాంధీ రోడ్డు, టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్ మీదుగా పుట్టపర్తి సర్కిల్‌కు చేరుకుంటుంది. ఎమ్మెల్యే చేస్తున్న దీక్షకు మద్దతుగా పట్టణంలోని వ్యాపారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలపనున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, జనసేన, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలన్నీ మద్దతు ఇవ్వనున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలతోపాటు వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్లు దీక్షలో పాల్గొని ఎమ్మెల్యేకు మద్దతు పలకనున్నారు. -
రసాభాసగా విజయవాడ కౌన్సిల్ సమావేశం
సాక్షి, విజయవాడ: విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. గురువారం జరిగిన కౌన్సిల్ మీటింగ్‌లో ప్ర్యతేక హోదాపై చంద్రబాబు అవలంభిస్తున్న రెండు నాలుకల ధోరిణిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నిలదీశారు. దీంతో ఇద్దరు కార్పొరేటర్లను కౌన్సిల్ నుంచి మేయర్ కోనేరు శ్రీధర్ సస్సెండ్ చేశారు. దీంతో సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మున్సిపల్ హాల్లోనే వైఎస్సార్సీపీ సభ్యులు షేక్ బీజన్ బీ, జమల పూర్ణమ్మ దీక్ష చేపట్టారు. వారికి మద్దతుగా మిగిలిన కార్పొరేటర్లు దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ.. తమకు మేయర్ క్షమాపణ చెప్పే వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు. హోదాపై చంద్రబాబు తప్పులను ఎత్తిచూపుతామనే భయంతోనే తమను సస్పెండ్ చేశారన్నారు. హోదాకు వెన్నుపోటు పొడిచిన టీడీపీనే.. నేడు కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మానం చేస్తామంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. తీర్మానం చేసే ముందు హోదాపై కౌన్సిల్లో చర్చ జరగాలన్నారు. నాలుగు సంవత్సరాల పాటు హోదాను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు, ఈ రోజు హోదా గురించి మాట్లాడడం ప్రజలను మోసాగించడమేనని దుయ్యబట్టారు. హోదా కోసం పోరాటం చేసిన వైఎస్పార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించిన బాబు, ఇప్పుడు హోదా కోసం మాట్లాడటం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. హోదాపై అనేక సార్లు యూ టర్న్ తీసుకున్న చంద్రబాబు ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
బాబు పాలనలో అంతా ప్రచార ఆర్భాటమే
-
ధర్మపోరాట దీక్షలో పాల్గొననున్న మంత్రులు
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదాకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం చేపట్టనున్న దీక్షకు ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన దీక్షకు మద్దతుగా 13 జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్షల్లో పాల్గొననున్నారు. మిగతా మంత్రులు చంద్రబాబు దీక్షా శిబిరంలో పాల్గొననున్నారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు, విజయనగరంలో సజయ, విశాఖలో అయ్యన్న, తూర్పుగోదావరిలో చిన్నరాజప్ప, పశ్చిమగోదావరిలో జవహర్, గుంటూరులో పత్తిపాటి, ప్రకాశంలో శిద్దా, నెల్లూరులో సోమిరెడ్డి, కర్నూలులో కేఈ, అఖిల ప్రియ, కడపలో ఆదినారాయణ రెడ్డి, అనంతరపురంలో పరిటాల సునిత, చిత్తూరులో అమర్నాధ్ రెడ్డిలు దీక్షలో పాల్గొననున్నారు. కృష్ణా జిల్లా మంత్రులు దేశినేని, కొల్లు రవీంద్రలు చంద్రబాబుతో కలిసి దీక్షలో కూర్చోనున్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు 12 గంటల దీక్షకు దిగుతున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలవరకు విజయవాడలోని బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ దీక్షను చేపట్టనున్నారు. -
‘చంద్రబాబుది నయవంచన దీక్ష’
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తోంది ధర్మ దీక్ష కాదు.. నయవంచన దీక్ష అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్నందునే చంద్రబాబు దీక్షల డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. నాలుగేళ్లు బీజేపీకి మద్దుతు ఇచ్చి, ఇపుడు ఉద్యమాలు చేస్తామంటే ప్రజలు నమ్మరని రఘువీరా తెలిపారు. -
ప్రజాస్వామ్యానికి తప్పుడు భాష్యం
సాక్షి, హైదరాబాద్: అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ దీక్షల పేరిట కొత్త సమస్యలను సృష్టించడం ప్రజాస్వామ్యానికి తప్పుడు భాష్యం చెప్పడమే అవుతుందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. దీక్షల పేరిట బీజేపీ డ్రామాలు ఆడటం సరికాదని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి చీడలాంటివని చెప్పారు. ఆయన గురువారమిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను సజావుగా జరగనీయలేదని ప్రధాని అనడాన్ని ఖండిస్తోందన్నారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశం లేకుండా ఏఐఏడీఎంకేతో రచ్చ చేయించింది బీజేపీయేనని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్లో చర్చ జరిగితే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏవిధంగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించేందుకు కారణమయ్యాయో, ఏయే హామీలు ఇచ్చి మోసం చేశాయో అవన్నీ ప్రజలకు తెలిసేవన్నారు. ‘‘రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతిని రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 14న అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, వినతిపత్రాలు సమర్పించి రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. నాలుగేళ్లుగా హోదా అనే మాటకు సమాధి కట్టారు. హోదా కోసం పోరాడిన వారిపై కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రత్యేక హోదాకు తానే హీరో అయినట్లు ప్రచారం చేసుకుంటున్నారు’’ అని ఎద్దేవా చేశారు. -
దీక్షకు దిగిన బీజేపీ ఎంపీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాలను విపక్షాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఒకరోజు నిరాహారదీక్షకు దిగినట్లు సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఢిల్లీలో బీజేపీ చెపట్టిన దీక్షకు మద్దతుగా ఖైరతాబాద్‌లోని శ్రీధర్ ఫంక్షన్ హాల్లో గురువారం ఆయన శాంతియుతంగా నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్బంగా దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ... పార్లమెంట్‌ను అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. అనేక సంవత్సరాల్లో జరగని అభివృద్ధి నాలుగు సంవత్సరాలలో బీజేపీ చేపట్టిందనన్నారు. దీక్షలో ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, చింతల రామాచంద్రా రెడ్డి, పలువురు పార్టీనేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు. -
మూడేళ్ల తర్వాత అన్నం ముద్ద
వేములవాడ: వేములవాడ రాజన్ననే నమ్ముకుని మూడేళ్లపాటు అన్నం ముట్టకుండా దీక్ష చేపట్టిన డాక్టర్ (డెంటల్) అనుమోలు అర్పిత శుక్రవారం దీక్షను విరమించారు. ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరులో ప్రాక్టీస్ చేస్తున్న అర్పిత.. వేములవాడ రాజన్నకు అన్నపూజ నిర్వహించిన అనంతరమే దీక్ష విరమిస్తానని మూడేళ్ల క్రితం మొక్కుకున్నట్లు చెప్పారు. శుక్రవారం సోదరి అపర్ణ, స్నేహితురాలు మంజులతో కలసి వేములవాడకు వచ్చారు. స్వామివారికి అన్నపూజ నిర్వహించిన తర్వాత భోజనం చేశారు. తన కుటుంబం బాగుకోసం రాజన్నకు మొక్కుకుని దీక్ష చేపట్టినట్లు చెప్పారు. మూడేళ్లపాటు పండ్లు, ఇతర పదార్థాలు స్వీకరించినట్లు తెలిపారు. తిరువూరులోనే పిల్లల వైద్యులుగా విధులు నిర్వహిస్తున్న తన భర్త నాగభూషణం, ఇద్దరు కుమారులు అఖిల్రాజు, ఆకాశ్ సైతం తన దీక్షకు మద్దతు ప్రకటించారని ఆమె సంతోషంగా చెబుతున్నారు. -
దీక్ష భగ్నం చేయడం దుర్మార్గం
ఒంగోలు సెంట్రల్: యాదవ జాతి అభిభ్యున్నతి కోసం, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు కోసం శాంతి యుతంగా దీక్ష చేస్తుంటే భగ్నం చేయడం దుర్మార్గమని యాదవ జేఏసీ జిల్లా కన్వీనర్ మిరియం శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం స్థానిక అంకమ్మపాలెంలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యాదవుల సమస్యలపై స్పందించి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో దీక్షలు మొదలు పెడతామని చెప్పారు. కాపులకు బీసీ రిజర్వేషన్ ఆలోచన విరమించుకుని యాదవులు, బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెంచాలని డిమాండ్ చేశారు. తమ దీక్షకు మద్దతు తెలిపిన ప్రజాసంఘాల నాయకులకు మిరియం కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సంఘ నాయకులు కుట్టుబోయిన కోటి, మల్లెబోయిన రాజు, తుమ్మకూరి దొర, మల్లవరపు లక్ష్మి, జాజుల కృష్ణ, దూళ్ల అప్పారావు, పిన్నిక శ్రీనివాస్, మిరియం శ్రీను పాల్గొన్నారు. -
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు దీక్ష
సాక్షి, ప్రొద్దుటూరు: పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి దీక్ష చేపట్టారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం సమీపంలో మంగళవారం ప్రారంభమైన దీక్ష 36 గంటల పాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, చంద్రబాబు సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వివిధ సంఘాలతో కలిసి అనేక పర్యాయాలు రాచమల్లు పోరుబాట పట్టారు. తాజాగా ప్రజలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఇంకోమారు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అందిస్తున్న మొదటి రకం గృహాలకు సంబంధించి రూ. 3.25 లక్షలు రుణం కాగా, సబ్సిడీ కింద కేంద్రం రూ. 1.50 లక్షలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు కలుపుకుని మొత్తం రూ. 6.25 లక్షలు మంజూరు చేస్తున్నారు. అయి తే ఆ సొమ్మును 30 ఏళ్లలోపు చెల్లించేలా ఒప్పందం రాసుకుంటున్నారు. అయితే 30 ఏళ్లకు దాదాపు లెక్కలు వేస్తే రూ. 18 లక్షలు అవుతోంది. అంటే ప్రతినెల కంతు కింద రూ. 3500-4000 వరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి కాకుండా దివంగత సీఎం వైఎస్సార్ తరహాలోనే ప్రజలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి అందించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే దీక్షకు దిగారు. -
కోదండరాం 24 గంటల నిరసన దీక్ష
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆయన మంగళవారం తన నివాసంలో దీక్షకు దిగారు. ఉద్యోగాల్లేక రోడ్డున పడ్డ యువతకు న్యాయం చేయాలని కోరుతూ ‘కొలువుల కొట్లాట సభ’కు అనుమతి కోరితే నిరాకరించడంతో కోదండరాం నిరసన దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై మౌనంగా ఉండలేక...విధి లేని పరిస్థితిలో దీక్ష చేపట్టానని ఆయన తెలిపారు. కాగా కోదండరాం నిరసన దీక్షకు జేఏసీ నేతలతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ సంఘీభావం తెలిపారు. -
ఆక్వా ఫుడ్ బాధితుల దీక్షలు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రు వద్ద తలపెట్టిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తుందుర్రులో రిలే నిరాహార దీక్షలను గ్రామస్తులు సోమవారం ప్రారంభించారు. అయితే వీరికి టెంట్లు, కుర్చీలు వంటివి ఇవ్వొద్దని పోలీసులు ఆంక్షలు విధించడంతో బాధితుల దీక్షలకు టెంట్లు, కుర్చీలు దొరకలేదు. దీంతో రామాలయం ప్రాంగణంలో రిలే దీక్షలను ప్రారంభించారు. -
‘పొన్నం’ ఆమరణ దీక్ష భగ్నం..
- అరెస్టు చేసిన పోలీసులు.. వెల్లువెత్తిన నిరసనలు - ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానంటున్న ‘పొన్నం’ సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తానన్న హామీని కేసీఆర్ సర్కారు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఈనెల 5 నుంచి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను మంగళవారం తెల్లవారుజామున 4.50 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. మూడు రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న పొన్నం ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారిందనే సాకుతో పోలీసులు దీక్ష భగ్నానికి ఒడిగట్టారు. పొన్నంను అదుపులోకి తీసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే సెలైన్, ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ప్రభాకర్ నిరాకరించగా, బలవంతంగా సెలైన్ బాటిల్ ఎక్కించి వైద్య సేవలందించారు. అయినా.. మెడికల్ కాలేజీపై ప్రకటన చేసే వరకు దీక్ష కొనసాగిస్తానని పొన్నం స్పష్టం చేశారు. నాటకీయ పరిణామాల మధ్యన.. పొన్నం ప్రభాకర్ దీక్షను సోమవారం రాత్రే భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. రాత్రి 11 గంటల నుంచే దీక్షా శిబిరం ప్రాంతంలో మాటువేసి అదును కోసం వేచి చూశారు. పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు దీక్ష శిబిరం చుట్టూ ఉండడంతో చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది. అర్ధరాత్రి 2 గంటలకు ఓసారి ప్రయత్నం చేసినా వీలుకాలేదని తెలిసింది. అయితే.. తెల్లవారితే పొన్నం దీక్షను విరమింపజేయడం సాధ్యం కాదని భావించిన పోలీసులు పెద్ద ఎత్తున స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దింపి 4.50 గంటలకు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నిరసనలు.. విద్యాసంస్థల బంద్.. పొన్నం ప్రభాకర్ దీక్షను భగ్నం చేయడంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టాయి. రాజీవ్ రహదారిని దాదాపుగా దిగ్బంధం చేసినట్లయింది. సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో పెద్దఎత్తున చేరిన కాంగ్రెస్ శ్రేణులు «రాస్తారోకో, ధర్నా నిర్వహించాయి. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. దీక్షకు మద్దతుగా యువజన కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ పాటించాయి. ఒక రోజు ముందే బంద్‌కు పిలుపునివ్వడంతో ముందస్తుగానే పేరెంట్స్‌కు మెస్సేజ్‌లు పంపించి పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు బంద్‌కు సహకరించారు. పొన్నంను టీజేఏసీ చైర్మన్ కోదండరాం పరామర్శించి న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జైపాల్‌రెడ్డి, కుంతియా, విజయశాంతి తదితరులు ఫోన్లో పరామర్శించారు. దీక్ష కొనసాగిస్తా.. తనను ఆసుపత్రికి తరలించినా దీక్షను కొనసాగిస్తున్నానని పొన్నం వెల్లడించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు దీక్ష విరమించబోనని అన్నారు. ఆసుపత్రిలో సెలైన్లు ఎక్కిస్తున్నా ఎలాంటి ఆహా రంగానీ, జ్యూస్‌లు గానీ తీసుకోవడం లేదన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుపై ప్ర భుత్వం ప్రకటించే వరకు ఆమరణ దీక్ష చేస్తానన్నారు. -
పొన్నం ప్రభాకర్ దీక్ష భగ్నం
-
'పొన్నం సుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి'
కరీంనగర్: కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష మూడో రోజుకు చేరింది. పొన్నం ఆరోగ్యం క్రమేణా క్షీణిస్తున్నది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజేశం ఆయనకు వైద్య పరీక్షలు చేసి షుగర్ లెవెల్స్ పడిపోయాయని, నీళ్లు తాగుతుండాలని, దీక్ష విరమించుకోవాలని సూచించారు. లేకుంటే మూత్రపిండాలు, గుండెపై ప్రభావం చూపుతుందన్నారు. వైద్య పరీక్షల నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని డాక్టర్ రాజేశం తెలిపారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదని పొన్నం స్పష్టం చేశారు. -
నల్లగా ఉందని ఆమెను పట్టించుకోలేదట..!
బెంగళూరు: నల్లగా ఉందన్ని టీచర్లు పక్షపాతం చూపటంతో ఓ బాలిక కసితో జిమ్నాస్టిక్స్‌లో కఠోర సాధన చేసింది. అసాధారణ ప్రతిభ చూపి దేశంలోనే ప్రప్రథమంగా జిమ్నాస్టిక్స్‌లో గిన్నిస్ రికార్డు సృష్టించింది. బెంటళూరు నగరానికి చెందిన గిరిశ్, మంజుల దంపతుల కుమార్తె దీక్ష(8) గంట సమయంలోనే 2,776 ఫార్వర్డ్ రోలింగ్‌తో 4.5 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. గతంలో అమెరికాకు చెందిన అశ్రితా ఫర్మాన్ చేసిన 1,330 ఫార్వర్డ్ రోలింగ్, 3.5 కిలోమీటర్ల రికార్డును బద్దలు కొట్టింది. శుక్రవారం నగర ప్రెస్‌క్లబ్‌లో మీడియా ముందు జిమ్నాస్టిక్స్ లో తనకు అందిన గిన్నిస్ రికార్డు పత్రాన్ని దీక్ష ప్రదర్శించింది. తల్లిదండ్రుల, వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల సమక్షంలో దీక్షా జిమ్సాస్టిక్స్లో ఫార్వర్డ్ రోలింగ్‌ను ప్రదర్శించింది. తండ్రి గిరీశ్ మాట్లాడుతూ.. తన కుమార్తె ఈ రికార్డు సృష్టించేందుకు ప్రధానమైన కారణం పట్టుదలే అన్నారు. అందరితో పాటు చక్కగా జిమ్నాస్టిక్ చేయగలిగిన దీక్షా నల్లగా ఉందన్న కారణంతో ఆమె తరగతిలోనే అందంగా ఉన్న మరో విద్యార్థిని ఎంపిక చేశారు. ప్రతిభను పట్టించుకోకుండా తన కూతురును అవమానపరిచారని విచారం వ్యక్తం చేశారు. దీంతో దీక్షాను ఉన్నత స్థాయిలో ఉన్న రికార్డును చేధించాలని సుమారు ఏడాది పాటు కఠిన శిక్షణ ఇప్పించానని ఆయన తెలిపారు. తన కూతురు కూడా పట్టుదలతో శిక్షణ తీసుకుని గిన్నిస్ రికార్డు సృష్టించి కర్ణాటకకు గౌరవం తెచ్చిందని చెప్పారు. ఈ సందర్భగా దీక్షా గిరీశ్‌ను వివిధ జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు అభినందించారు. -
ధర్నాచౌక్‌లో నిరవధిక దీక్షలు
-
మూడోదీ హిట్టే!
‘‘చిత్ర పరిశ్రమలోకి రాక ముందు ప్రేక్షకుల్లో ఒకడిగా ఉండేవాణ్ణి. ఇప్పుడు స్క్రీన్‌పై కనిపిస్తున్నా. అందుకు కారణం స్టార్ హీరోల అభిమానులే. వాళ్లు నన్ను ఆదరించారు’’ అని హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. సంపూర్ణేష్ బాబు హీరోగా, విదిశా రెడ్డి, దీక్ష హీరోయిన్లుగా ఎస్.ఆర్. కృష్ణ దర్శకత్వంలో పుల్లరేవు రామచంద్రా రెడ్డి సమర్పణలో సలీమ్, శ్రీనివాస్ వంగ నిర్మించిన చిత్రం ‘వైరస్’. మీనాక్షి భుజంగ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను నిర్మాత మల్కాపురం శివకుమార్ ఆవిష్కరించారు. సంపూర్ణేష్ మాట్లాడుతూ–‘‘నా మొదటి సినిమా ‘హృదయ కాలేయం’, రెండో సినిమా ‘సింగం 123’ నాకు మంచి పేరు తెచ్చాయి. నేను చేసిన మూడో సినిమా ‘వైరస్’ కూడా హిట్టవుతుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ‘వెన్నెల’ కిశోర్ చేసిన విలన్ పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా బాగా రావడానికి కారణం నిర్మాతలే. సంపూర్ణేష్ సహకారం మరువలేనిది’’ అని కృష్ణ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. -
ప్రజలకు ‘పన్ను’పోటు
ప్రజల సంక్షేమం పట్టని చంద్రబాబు సర్కార్ ప్రజలపై మోయలేని భారం వైఎస్సార్ సీపీ నేత విజయలక్ష్మి విమర్శ ఇంటి పన్ను పెంపును నిరసిస్తూ నాయకుల నిరసన దీక్ష ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్) : పన్ను పోటుతో ప్రభుత్వం ప్రజల వెన్ను విరుస్తోందని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. అడ్డుగోలుగా పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని కోరుతూ ధవళేశ్వరం పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరసన దీక్ష చేశారు. దీక్షలో దుర్గేష్‌తో పాటు రాజమహేంద్రవరం రూరల్ కో–ఆరి్డనేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల వీర్రాజు (బాబు) కూర్చున్నారు. ముఖ్య అతిథిగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఇంటి పన్నులు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేశారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. పింఛన్ల కోసం అనేక సార్లు దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకోవడంలేదన్నారు. భర్త ఉన్నప్పటికీ వితంతు పింఛన్లు ఇస్తున్న దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ అడ్డుగోలుగా ఇంటి పన్నులు పెంచడం దారుణమన్నారు. 3 నుంచి 5 రెట్లు ఇంటి పన్నులు పెరగడంతో ప్రజలపై మోయలేని భారం పడిందన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, అయితే చినబాబుకు మాత్రమే ఎమ్మెల్సీ జాబు వచ్చిందని ఎద్దేవా చేశారు. పార్టీ రూరల్ కో–ఆరి్డనేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ప్రజలపై భారీగా పన్నుల భారం వేస్తున్నారని విమర్శించారు. పార్టీ రూరల్ కో–ఆరి్డనేటర్ గిరజాల వీర్రాజు(బాబు) మాట్లాడుతూ గ్రామ సభలతో సంబంధం లేకుండా వివిధ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, జన్మభూమి కమిటీల పేరుతో సర్పంచుల అధికారాలను కాలరాస్తున్నారని విమర్శించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. దీక్షలో కూర్చున్న నేతలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, రావిపాటి రామచంద్రరావు సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. అనంతరం వారు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా కాట¯ŒS బ్యారేజ్ సెంటర్‌కు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగర కో–ఆరి్డనేటర్ రౌతు సూర్యప్రకాశరావు, నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాలరావు, జక్కంపూడి గణేష్, కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్, బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి దాసరి శేషగిరి, కోస్టల్ పేపర్ నేషనల్ ఎంప్లాయీస్ యూనియ¯ŒS నాయకులు, ఫ్రూట్స్, లెమ¯ŒS మర్చంట్స్ అసోసియేష¯ŒS సభ్యులు, దివ్యాంగ్ మహాసంఘట¯ŒS నాయకులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు కుచ్చుటోపీ సీతానగరం (రాజానగరం) : రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబులు ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌కు ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చి తన హామీ నెరవేర్చుకున్నారని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు తమకు ఉద్యోగాలు ఇస్తారని నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. వారందరికీ కుచ్చుటోపీ పెట్టిన చంద్రబాబు తన కుమారుడికి ఏకంగా ఎమ్మెల్సీ పదవినే ఇచ్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని, ప్రత్యేక హోదాను సాధించలేని నిస్సహాయ స్థితిలో పడ్డారని దుయ్యబట్టారు. ఒక్క హామీని కూడా అమలు చేయలేని ఏకైక అసమర్ద సీఎంగా మిగిలిపోయారని ఆక్షేపించారు. ఎందరో సీనియర్ నాయకులు ఉండగా, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్‌కు పదవి ఇవ్వడం వెనుక ఉద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు. -
భక్తిశ్రద్ధలతో దీక్ష విరమణ
అహోబిలం(ఆళ్లగడ్డ): మండలం (41) రోజులు నియమ నిష్టలతో కఠోరమైన దీక్ష చేపట్టిన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి దీక్ష స్వాములు శుక్రవారం భక్తి శ్రద్ధలతో దీక్ష విరమణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది దీక్ష పరులు ఇరుముడిలతో కాలినడకన నవనరసింహ క్షేత్రం చేరుకున్నారు. తెల్లవారు జామున ఎగువ అహోబిల దేవస్థానంలో చివరి పుణ్యస్నానం ఆచరించి మాలోల నరసింహస్వామి ఆలయం సమీపంలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.