
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదాకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం చేపట్టనున్న దీక్షకు ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన దీక్షకు మద్దతుగా 13 జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్షల్లో పాల్గొననున్నారు. మిగతా మంత్రులు చంద్రబాబు దీక్షా శిబిరంలో పాల్గొననున్నారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు, విజయనగరంలో సజయ, విశాఖలో అయ్యన్న, తూర్పుగోదావరిలో చిన్నరాజప్ప, పశ్చిమగోదావరిలో జవహర్, గుంటూరులో పత్తిపాటి, ప్రకాశంలో శిద్దా, నెల్లూరులో సోమిరెడ్డి, కర్నూలులో కేఈ, అఖిల ప్రియ, కడపలో ఆదినారాయణ రెడ్డి, అనంతరపురంలో పరిటాల సునిత, చిత్తూరులో అమర్నాధ్ రెడ్డిలు దీక్షలో పాల్గొననున్నారు. కృష్ణా జిల్లా మంత్రులు దేశినేని, కొల్లు రవీంద్రలు చంద్రబాబుతో కలిసి దీక్షలో కూర్చోనున్నారు.
ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు 12 గంటల దీక్షకు దిగుతున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలవరకు విజయవాడలోని బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ దీక్షను చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment