
సాక్షి, కడప: వైఎస్‌ఆర్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికార దుర్వనియోగం తారాస్థాయికి చేరింది. కడపలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే సీఎం రమేశ్‌ను పరామర్శించేందుకు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తున్నారు. దీంతో జనాల తరలింపుకు సగానికి పైగా ఆర్టీసీ బస్సులను చంద్రబాబు టూర్‌కు కేటాయించారు. అంతేకాకుండా నియోజక వర్గాల ఇంచార్జిల పేర్లు రాసి మరీ బస్సులు తరలించారు. ఈ క్రమంలో బస్సులు లేక బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. 300లకు పైగా బస్సులు బాబు పర్యటనకు వెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రభుత్వ తీరుపై వారు మండిపడుతున్నారు.
భద్రతా వలయంలో జెడ్పీ ఆవరణం
చంద్రబాబు, ఆయన కుమారుడుచ మంత్రి లోకేశ్ పర్యటన సందర్భంగా నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
- రిమ్స్, ఎక్రముక్కపల్లె వైపు నుంచి వచ్చే వాహనాలు ఎల్‌ఐసీ, అంబేద్కర్ సర్కిల్ మీదుగా కడప నగరంలోకి రావాలి.
- కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ - ఎర్రముక్క పల్లె - రాయచోటి వైపుకు వెళ్లాలి.
- రాయచోటి వైపు నుంచి వచ్చే వాహనాలు చైతన్య సర్కిల్, ఎర్రముక్కపల్లె, ఎల్‌ఐసీ సర్కిల్ నుంచి కడపలోకి ప్రవేశించాలన్నారు.
- పులివెందుల నుంచి వచ్చే వాహనాలు బిల్టప్, రెండవ గాంధీబొమ్మ మీదుగా కడపలోకి ప్రవేశించాలి.
- జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఇర్కాన్ జంక్షన్ మీదుగా, దేవుని కడప నుంచి కడప నగరానికి చేరుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment