
'వైఖరి' ఆరోగ్యం విషమం, హెల్త్ సెంటర్ కు తరలింపు
హైదరాబాద్ : హెచ్సీయూ విద్యార్థులు చేస్తున్న ఆమరణ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు శనివారం యత్నించారు. దీక్ష చేస్తున్న వారిలో ఓ విద్యార్థిని ఆరోగ్యం విషమించడంతో ఆమెను చికిత్స నిమిత్తం వర్సిటీలోని హెల్త్ సెంటర్కు తరలించారు.
పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా ఏడుగురు విద్యార్థులు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కాగా దీక్ష చేస్తున్న 'వైఖరి' అనే విద్యార్థిని ఆరోగ్యం విషమించడంతో బలవంతంగా హెల్త్ సెంటర్ కు తరలించారు. అంతకు ముందు రోహిత్ కుటుంబసభ్యులు ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులను పరామర్శించి, సంఘీభావం తెలిపారు.