vemula rohit
-
సీఎం రేవంత్‌ను కలిసిన రోహిత్ వేముల తల్లి
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల తల్లి రాధిక వేముల శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొడుకు ఆత్మహత్య కేసులో తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన రేవంత్.. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.కాగా సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని హైకోర్టుకు పోలీసులు తెలియజేశారు. అలాగే అతను ఎస్సీ అనేందుకు ఎటువంటి ఆధారాలు కూడా లేవని, బీసీ వడ్డెర కులానికి చెందినవాడని పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పలు పిటిషన్లలో విచారణను ముగించింది.మరుసటి రోజే రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. విచారణ, దర్యాప్తు విధానంపై రోహిత్ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారని, దీంతో కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారుజతదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజి్రస్టేట్‌ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని డీజీపీ పేర్కొన్నారు. -
రోహిత్ వేములపై చిత్రానికి ‘నో ఎంట్రీ’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ దళిత విద్యార్థి నాయకుడు రోహిత్ వేములపై తీసిన చిత్రంతోపాటు ఇప్పటికే విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న పలు డాక్యుమెంటరీ చిత్రాలకు ముంబైలో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు ఫిల్మ్ డివిజన్ ఆధ్వర్యంలో కొనసాగనున్న ద్వైవార్షిక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఎంట్రీ దొరకలేదు. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ‘వియ్ హావ్ నాట్ కమ్ ఇయర్ టు డై’ పేరిట దీపా ధన్‌రాజ్ డాక్యుమెంటరీని నిర్మించారు. 2018లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో ‘బెస్ట్ ఫీచర్ లెన్త్ డాక్యుమెంటరీ అవార్డు’ను అందుకున్న ‘రీజన్’ చిత్రానికి కూడా ఎంట్రీ దొరక లేదు. కమ్యూనిస్టు నాయకుడు గోవింద్ పన్సారే, హేతువాది నరేంద్ర దాభోల్కర్ హిందుత్వ వాదులు హత్య చేయడంపై ప్రముఖ దర్శకుడు ఆనంద్ పట్వర్ధన్ ఈ డాక్యుమెంటరీని తీశారు. పట్వర్ధన్కు 2014లో ‘శాంతారామ్– జీవితకాలం పురస్కారం’ అవార్డు లభించిన విషయం తెల్సిందే. విశాఖపట్నంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తూ ప్రశంసలు అందుకుంటున్న గాయకురాలు, గేయ రచయిత్రి, మ్యూజిక్ కంపోజర్ సోన మొహాపాత్రపై దీప్తి గుప్తా తీసిన ‘షటప్ సోనా’కు, కళాకారుడు కౌషిక్ ముఖోపాధ్యాయ్పై అవిజిత్ ముకుల్ కిషోర్ తీసిన ‘స్క్వీజ్ లైమ్ ఇన్ యువర్ ఐ’ చిత్రానికి ఎంట్రీ లభించలేదు. రోహన్ శివకుమార్ తీసిన ‘లవ్లీ విల్లా’, అర్చనా పాడ్కే తీసిన ‘అబౌట్ లవ్’ చిత్రాలకు కూడా ఎంట్రీ దొరకలేదు. ఎంపిక చేసిన 800 డాక్యుమెంటరీల్లో విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాలకు ఎందుకు ఎంపిక చేయలేదని ఫిల్మ్స్ డివిజన్ డైరెక్టర్ జనరల్, ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ స్మితా వాట్స్ శర్మను మీడియా ప్రశ్నించగా, తమ ఎంపిక నిష్మక్షపాతంగా జరిగిందని, అందులో ఎలాంటి రాజకీయం లేదని సమాధానం చెప్పారు. -
జార్జిరెడ్డిని తల్చుకోవడం అంటే..!
రెండు దశాబ్దాల పాటు ఉస్మానియా క్యాంపస్‌లో యువవిద్యార్థుల మనస్సులపై జార్జిరెడ్డి వేసిన ప్రభావం అసాధారణమైనది. అతడి భావజాలం సామాజిక శాస్త్రాల విద్యార్ధులపై బలమైన ప్రభావం వేస్తూ వచ్చింది. సమాజంలోనూ, క్యాంపస్‌లోనూ ఛాందస, కులోన్మాద భావజాలాలతో ఘర్షించటంలో జార్జిరెడ్డి సాగించిన వీరోచిత పోరాటానికి సినిమా చిత్రికపట్టింది. 1970లలో జార్జిరెడ్డి, 2010లలో రోహిత్ వేముల ఈ కారణంతోనే వేలాదిమంది విద్యార్థులను కదిలించారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనే భావం ఇద్దరిలోనూ రగులుతుండేది. తిరుగుబాటు మనస్తత్వం కలిగిన వారితో చర్చించాలే తప్ప అణిచివేయకూడదు. సమాజంలో సమూల మార్పులను తీసుకొచ్చే మానసిక సమర్థతలను అణిచివేస్తే జాతికే నష్టం వాటిల్లుతుంది. జార్జి వంటి యువకులు పుట్టుకొస్తే వారిని పెంచి పోషించాలి తప్ప తుంచేయకూడదు. తెలుగు సినిమా ‘జార్జిరెడ్డి’ని ఎంతో ఆస క్తితో చూశాను. ప్రగాఢ అభినివేశంతో కూడిన అతడి అకడమిక్ పాండిత్య దృక్పథంతో ప్రభావితమైన వ్యక్తుల్లో నేనూ ఒకడిని. జార్జిరెడ్డిని పాశవికంగా హత్య చేసిన రెండేళ్ల తర్వాత అంటే 1974లో నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులో చేరాను. నేను చదివిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ.. జార్జిరెడ్డి అనే అసాధారణ మేధావి ఫైర్ బ్రాండ్ తరహా కార్యాచరణకు ప్రధాన ఆకర్షణగా మారింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అతడు ఫిజిక్స్ విద్యార్థి. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆ రోజుల్లో రాజకీయ చర్చలకు, క్రియాశీల ఆచరణకు కేంద్రస్థానమై వెలుగొందుతుండేది. మరణం తర్వాత కూడా జార్జిరెడ్డి భావజాలం అనేకమంది సామాజిక శాస్త్రాల విద్యార్ధులపై బలమైన ప్రభావం వేస్తూ వచ్చింది. తదనంతర కాలంలో వీరే అనేక రంగాల్లో నాయకత్వం వహించారు. ప్రకృతి శాస్త్రాలు, ఇంజనీరింగ్, న్యాయశాస్త్ర విద్యార్థులు సైతం జార్జిరెడ్డి భావాలతో ప్రభావితులయ్యారు. సామాజిక సమస్యలపట్ల బాధ్యత ప్రదర్శిం చిన అనేకమంది విద్యార్థులు ఈ జ్ఞాన విభాగాలనుంచి కూడా ఆవిర్భవించారు. మరణించాక రెండు దశాబ్దాల పాటు ఓయూ క్యాంపస్‌లో యువ మనస్సులపై జార్జిరెడ్డి వేసిన ప్రభావం అనన్యసామాన్యమైంది. ఆనాటికి పెద్దగా రచనలు కూడా చేసి ఉండని ఒక పాతికేళ్ల విద్యార్థి మూడు అంశాలలో రాటుదేలడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అవేమిటంటే, 1. జ్ఞానాన్ని ఆయుధంగా చేసుకోవడం. 2. దాన్ని అతి స్వల్ప కాలంలోనే పీడిత కులాల విముక్తికోసం ఉపయోగించడం. 3. తాను పోరాడిన పీడకుల చేతుల్లో అమరత్వం పొందడం. సోషలిస్టు విప్లవ సిద్ధాంతాన్ని పేదలకు, దిగువ కులాలకు అనుకూలమైనదిగా మల్చడంలో జార్జిరెడ్డి నిర్వహించిన పాత్ర సాధారణ ప్రజలను కూడా ఆకట్టుకునేలా చేయడంలో ‘జార్జిరెడ్డి’ సినిమా చక్కటి విజయం సాధించింది. సమాజంలోనూ, క్యాంపస్‌లోనూ సంఘ వ్యతిరేక, కులోన్మాద భావజాలాలతో భావోద్వేగంగా ఘర్షించ టంలో జార్జి సాగించిన వీరోచిత పోరాటానికి సినిమా చిత్రికపట్టింది. నాటి నుంచి నేటి దాకా ప్రభుత్వాలు, రాజకీయ శక్తులు సాగిస్తున్న విద్యా వ్యతిరేకమైన ఎజెండా నేటికీ అనేక క్యాంపస్‌లలో సమస్యగా కొనసాగుతూనే వస్తోంది. అలాంటి బాహ్య శక్తుల ప్రభావానికి సగటు విద్యార్థులు, కండబలం, అధికార బలం ఉన్న శక్తులు సులువుగా లోనయ్యేవారు. అయితే విద్యార్జనలో కానీ, భౌతిక పోరాటాల్లో కానీ అలాంటి శక్తులందరినీ జార్జిరెడ్డి తోసిపుచ్చేశాడు. ఆయనలోని ఈ మహామూర్తిమత్వాన్ని సినిమా చాలా చక్కగా ప్రదర్శించింది. 1970లలో జార్జిరెడ్డి, 2010లలో రోహిత్ వేముల ఈ కారణంతోనే యూనివర్సిటీ క్యాంపస్‌లలోని వేలాదిమంది విద్యార్థులను ప్రభావితం చేశారు. మనుషులను పీడించే వారి ఏజెంట్ల చేతుల్లో 1972 ఏప్రిల్ 14న హత్యకు గురయ్యేనాటికి జార్జి రెడ్డి వయస్సు సరిగ్గా పాతికేళ్లు. అదే పీడకుల దౌర్జన్యానికి నిరసన తెలుపుతూ రోహిత్ వేముల 2016 జనవరి 17న ఆత్మహత్య చేసుకున్నాడు. పీడన అనైతికం, సంఘ వ్యతిరేకమనే సామాజిక–ఆత్మిక, సాంస్కృతిక మూలాల విషయంలో ఈ ఇరువురి స్వభావం ఒక్కటే. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనే భావం ఇద్దరిలోనూ రగులుతుండేది. తమ తల్లుల్లోని సానుకూల ఆధ్యాత్మిక నైతిక భావజాలం ప్రభావంతో వీరిరువురు పేదలకు, పీడితులకు అనుకూలమైన ఉమ్మడి లక్ష్యాన్ని కలిగి ఉండేవారు. జార్జి తల్లి లీల, రోహిత్ తల్లి రాధిక ఇద్దరూ ఆ ఆధ్యాత్మిక నైతికతతోనే వారిని ఉగ్గుపాలనుంచి పెంచి పోషించారు. ఆ రోజుల్లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే జార్జిరెడ్డి అజెండాగా సినిమా ప్రదర్శించినప్పటికీ, పీడితుల పట్ల, పేదల పట్ల సానుభూతి చూపడంలో అతడి కుటుంబ నైతికత ఆ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా చెలరేగిన సోషలిస్టు భావతరంగాలతో మిళితమైంది. సోవి యట్ యూనియన్ అగ్రరాజ్యంగా ఎదగడం, చైనాలో సాంస్కృతిక విప్లవం.. ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా నాయకత్వంలో సాగిన క్యూబన్ విప్లవం వంటివి ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేస్తూ వచ్చాయి. ఇవి జార్జిరెడ్డిపై కూడా తీవ్రప్రభావం చూపాయి. ఆ రోజుల్లో ప్రపంచమంతటా విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లలో సాగిన వియత్నాం అనుకూల, అమెరికన్ వ్యతిరేక ఉద్యమాలు ప్రజాతంత్ర పౌర హక్కులకు, సోషలిస్టు ప్రచారానికి ప్రేరణనిచ్చాయి. తీవ్రమైన మేధోపరమైన అభినివేశం కలవారు తరగతి గదుల్లో, లైబ్రరీల్లో లోతైన అధ్యయనాలు, చర్చలు జరుపుతూనే వీధి పోరాటాల్లో కూడా పాల్గొనేవారు. జార్జిరెడ్డి అసాధారణ మేధోశక్తికి ఇదే ప్రాతిపదిక అయింది. తనలోని ఈ అసాధారణ శక్తే మాలో అనేకమందిని ప్రభావితం చేసింది. కానీ అతడి తర్వాత ఈ రెండు శక్తులను ఏ ఒక్కరూ తమలో నిలుపుకోలేకపోయారు. ఆయన అనుయాయుల్లో అనేకమంది తర్వాత నక్సలైట్ ఉద్యమాలవైపునకు తరలిపోయారు. కొంతమంది సీరియస్‌గా అధ్యయనంపై దృష్టిపెట్టి పాక్షిక విజయాలు మాత్రమే సాధించారు. మాలో ప్రతి ఒక్కరూ కొన్ని కొన్ని విడి విడి రంగాల్లో తమ ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ఒక్కరం కూడా జార్జిరెడ్డి తర్వాత అంతటి ప్రభావం కలిగించలేకపోయామన్నది వాస్తవం. జార్జిరెడ్డి ప్రతిభాపాటవాలను ప్రస్తుతతరం విద్యార్థుల ముందు ప్రదర్శించడానికి ఈ సినిమా గట్టి కృషి చేసింది. అంత చిన్న వయస్సులోనే అలాంటి అసాధారణ శక్తియుక్తులను ప్రదర్శించిన వారు మానవుల్లో చాలా తక్కువమందే ఉంటారు. వీరు ప్రపంచం దృష్టిలో అద్భుత వ్యక్తులుగా వెలుగొందుతుంటారు. అసాధారణమైన మానవుల్లో దేవుడు విభిన్నమైన బీజాలు నాటతాడు అని సామెత. సైన్స్, ఆర్ట్స్, నైతికత వంటివి ఇలాంటి వారి ద్వారానే ప్రకాశిస్తుంటాయి. ఇలాంటి అసాధారణమైన అమరుల జీవిత చిత్రాన్ని భారతీయ జీవిత చిత్రాల వారసత్వం చాలా అరుదుగా మాత్రమే చిత్రించింది. భారతీయ సినిమా పరిశ్రమ పాటలు, డ్యాన్స్ మాయాజాలానికి మించి ఎదగలేకపోయింది. జార్జిరెడ్డిపై వచ్చిన ఈ సినిమా ప్రాంతీయ చిత్రమే అయినప్పటికీ, అతి చిన్న బడ్జెట్‌తోనే పూర్తయినప్పటికీ, విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రంగా తన ముద్ర వేసింది. ఈ సినిమాలో గొప్పతనం ఏమిటంటే, బాల్యదశలో జార్జిరెడ్డిలో రూపొందిన విశిష్ట వ్యక్తిత్వంపై ఇది కేంద్రీకరించడమే. తన తల్లి నుంచి ప్రతివిషయంలోనూ అతడు సానుకూలమైన మానవీయ దృక్పథాన్ని పుణికిపుచ్చుకున్నాడు. అదే సమయంలో తనలో అంతర్లీనంగా ఉండిన అపారమైన మానవీయ సహజాతాన్ని పాటించడంలో తల్లి ఊహలను కూడా అతడు మించిపోయాడు. సామాజికంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా అలాంటి సహజాత గుణంతో పెరిగి పెద్దవడం జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. కుటుంబం నుంచి పాఠశాలకు, యూనివర్సిటీకి ఎదిగే క్రమంలో తనలోని సృజ నాత్మకమైన ప్రోత్సాహక గుణాన్ని, మంచితనాన్ని, మేధోపరమైన అభినివేశాన్ని అట్టిపెట్టుకుని పెంచుకుంటూ రావడం చాలా ముఖ్యమైన విషయం. పిల్లల వ్యక్తిత్వాలను చంపేయడం, లేదా ఇలాంటి వ్యక్తుల ప్రధాన స్ఫూర్తిని చంపేయడాన్ని భారతీయ పౌర సామాజిక నైతిక చట్రాలు ఒక ధోరణిగా కలిగి ఉంటున్నాయి. ఇలాంటి స్ఫూర్తిని వారిలో చంపేశాక మన సమాజంలో ఆడ, మగ వ్యక్తులు ఎక్కువ కాలం బతకవచ్చు కానీ చరిత్రను మాత్రం సృష్టించలేరు. చిన్నవయసులోనే హత్యకు గురైనప్పటికీ జార్జిరెడ్డి, రోహిత్ వేముల మన జీవిత కాలంలోనే చరిత్ర సృష్టించారు. స్వాతంత్య్రపోరాటంలో భగత్‌సింగ్ అదే పని చేశారు. వీరు వదిలివెళ్లిన చరిత్ర అత్యంత శక్తివంతమైన సానుకూలతను కలిగి ఉంది, అనేకమంది తరుణ మనస్కులు అనుసరించదగిన సృజనాత్మక కార్యదీక్షను వీరు చరిత్రలో నిలిపివెళ్లారు. క్యాంపస్‌లలో అలాంటి చురుకైన మనస్సు కలవారు అడుగుపెట్టకుండా చేయడానికి ఇప్పుడు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబం, పాఠశాల, విశ్వవిద్యాలయం ప్రతిచోటా సంప్రదాయ జీవన వాతావరణం ఉంటున్న పరిసరాలు సృజనాత్మక ప్రయోగాలను అనుమతించడం లేదు. నూతన విషయాలపై ప్రయోగాలు చేయదలిచిన యువత ప్రతి సంప్రదాయానికి, ఛాందసత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. తిరుగుబాటు మనస్తత్వం కలిగిన వారితో చర్చించాలే తప్ప అణిచివేయకూడదు. సమాజంలో సమూల మార్పులను తీసుకొచ్చే మానసిక సమర్థతలను అణిచివేస్తే జాతికే నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఏ మారుమూలైనా జార్జి వంటి యువకులు పుట్టుకొస్తే వారిని పెంచి పోషిం చాలి. చివరగా ఈ సినిమాను అన్ని భాషల్లోకీ డబ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త: ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
మార్చుకోలేని గుర్తింపు
యషికా దత్ నిదానియా రాసిన ‘కమింగ్ అవుట్ యాజ్ ఎ దళిత్’– దత్, తాను దళితురాలినని బయటపడిన కారణంతో మొదలవుతుంది. ‘‘ఇండియాలో, నేను నా దళిత ఉనికిని రుద్దిరుద్ది వదిలించుకున్నాను. రోహిత్ వేముల ఆత్మహత్యకు రెండు వారాలముందు అతను నాకు ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపినప్పుడు, నేను దాన్ని డిలీట్ చేశాను. నేను న్యూయార్క్‌లో ఉన్నప్పుడు, వైరల్ అయిన అతని ఆత్మహత్య లేఖ చదివి, ‘ఆ జీవితం నాదే అయి ఉండేది. సరైన కారణాల కోసం పోరాడేందుకు రెండో ఆలోచన కూడా చేయని అతని ధైర్యం– సంవత్సరాలుగా, నా దళిత ఉనికిని దాచుకుంటూ బతికిన నన్ను బయటకి లాగి, ఫేస్బుక్లో దళితురాలినని ప్రకటించుకునే నిర్ణయానికి చేర్చింది. అణచివేత గురించి సిగ్గు పడాలి. కులం గురించి కాదు’ అన్న గుర్తింపును అతను నాకు కలుగజేశాడు. దేశానికి దూరంగా ఉండటం వల్ల, వెల్లడించడం నాకు సులభం అయింది.’’ ‘‘నేను రాజస్తాన్ అజ్మీర్‌లో దళిత కుటుంబంలో పుట్టాను. కులం దాచడం నేర్చుకుంటూనే పెరిగాను. నా కాన్వెంట్ స్కూల్ చదువు, ‘చామనచాయగా ఉన్నా మురికిగా లేని నా చర్మపు రంగు’ వల్ల, ఉన్నత కులందానిగానే చలామణీ అయ్యాను. సోఫియా బోర్డింగ్ స్కూల్లో ఏడేళ్ళప్పుడు చేరి, పై కులాల అలవాట్లు నేర్చుకున్నాక, తక్కిన జీవితమంతా వాళ్ళతో కలిసిపోగలనని అనుకున్నాను’’ అంటారు దత్. ‘‘మంచి విద్య (ఇంగ్లిష్ మీడియం) మాత్రమే మనల్ని సమాజం అంగీకరించేట్టుగా చేస్తుందని, దాన్ని పొందేందుకున్న ఒకే దారి, కులాన్ని దాచుకోవడం అనేవారు మా తాతగారు. ఆయన 60 ఏళ్ళ కిందట వదిలేసిన ‘నిదానియా’ అన్న ఇంటిపేరుని మరచిపోయాను.’’ ‘‘ఎవరైనా ‘ఏమ్మా, మీదే కులం?’ అనడిగినప్పుడు, ‘పరాశర్ బ్రాహ్మిణ్’ అనడం, ఎంత తరచుగా, నమ్మకంగా చెప్పే అబద్ధం అయుండేదంటే, వాళ్ళనేకాక నన్ను నేనే మోసగించుకోగలిగాను. అయితే, ఎవరైనా ‘కులం కేటాయింపు’, ‘భంగీ’ (నా కులం అయిన పాకీవృత్తి) లాంటి మాటలు అన్నప్పుడల్లా అసౌకర్యం కలిగేది.’’ దత్ కుటుంబంలో ముత్తాతతో సహా, మూడు తరాలు చదువుకున్నవారే. తల్లి చదువుకున్నదే అయినప్పటికీ ఇంగ్లిష్ మీడియంలో కాకపోవడం వల్ల, భర్త అవమానపరుస్తుంటాడు. ఆమె ఐపీఎస్ కావాలనుకున్నా పడదు. చిన్న ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని ఆదుకుంటుంది. ప్రభుత్వాధికారైన ఆమె తండ్రి, తాగుడు అలవాటువల్ల ఉద్యోగం పోగొట్టుకుంటారు. రచయిత్రి తమ సమాజంలోని స్త్రీలు తమ పురుషులనుండే ఎదుర్కునే అణచివేత గురించి కూడా రాస్తారు. ఆమె తల్లీ, అమ్మమ్మా చర్మపు రంగు మార్చుకునేందుకు వాడే నలుగుపిళ్ళ వివరాలుంటాయి పుస్తకంలో. ఆమె కథనంలో స్పష్టంగా కనపడేది తల్లికి తన పిల్లలకు ఉన్నత కులపు చదువు, మధ్య తరగతి పెంపకం అందించాలన్న నిశ్చయం. రచయిత్రి సెయింట్ స్టీఫెన్స్ కళాశాల (ఢిల్లీ)లో మూడు వేల విద్యార్థి వేతనం పొంది చదువుకున్నారు. తరువాత, హిందుస్తాన్ టైమ్స్, ఏషియన్ ఏజ్ పత్రికల్లో ఉద్యోగం చేసినప్పుడు, తన కులం బయటపడకుండా– ఉన్నత వర్గాలకు సంబంధం కలిగుండే ఫాషన్, జీవనశైలి వంటి విషయాలే ఎన్నుకునేవారు. కథలో– ఆమె జీవితపు సంస్మరణ, సామాజిక వ్యాఖ్యానంతో పాటు దళిత ఉద్యమాల క్లుప్తమైన చారిత్రక శకలాలూ కనిపిస్తాయి. ‘మన దేశంలో ఇంచుమించు ప్రతీ వ్యవస్థలోనూ గేర్లు మార్చే అగోచరమైన చెయ్యి’ వంటి పరిశీలనలు ఉంటాయి. అమెరికా–కొలంబియా యూనివర్సిటీ నుండి జర్నలిజంలో మాస్టర్స్ చేశారు దత్. ‘‘రోహిత్‌ను అనుకరించాలనుకున్నాను. దళిత హక్కుల కోసం అతను వెలిగించిన బాటను అనుసరిస్తూ, ‘డాక్యుమెంట్స్ ఫర్ దళిత్ డిస్క్రిమినేషన్’ మొదలెట్టాను. అక్కడ నాలాంటి వారు తమ తమ కథలను చర్చించుకుంటూ, వారూ బయటకొచ్చే అవకాశం ఉంది’’ అంటారు. కులవ్యవస్థను– అంబేద్కర్, మహాత్మా గాంధీలు సమీపించిన విధానాల్లో ఉన్న కీలకమైన తేడాలను ఎత్తి చూపిన ఈ పుస్తకాన్ని ‘ఆలెఫ్ బుక్ కంపెనీ’ 2019 ఫిబ్రవరిలో ప్రచురించింది. _కృష్ణ వేణి -
వీసీ ఏవిధంగా ఏ1 అవుతారు: హైకోర్టు
హైదరాబాద్ : హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. వేముల రోహిత్ ఎఫ్ఐఆర్ ఆధారంగా వీసీ అప్పారావును తొలగించాలన్న పిటిషనర్ వాదనపై హైకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా వీసీ ఏవిధంగా A1 అవుతారని హైకోర్టు ప్రశ్నించింది. మనోభావాల ఆధారంగా విచారణ జరపలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం వీసీనీ ఏవిధంగా తొలగించాలో చెప్పాలని తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి సోమవారం విచారణకు రావాలని కోర్టు సూచించింది. వీసీతో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కూడా ఆయా పదవుల నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ స్టాండింగ్ కౌన్సిల్ దామోదర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన లేఖ వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని హెచ్‌సీయూ విద్యార్థులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అలాగే వైస్ ఛాన్సులర్ అప్పారావుపై కూడా కేసు నమోదు అయింది. ఏ1 వీసీ అప్పారావు, ఏ2 బండారు దత్తాత్రేయ, ఏ3 సుశీల్ కుమార్, ఏ4 విష్ణుపై సెక్షన్ 306 కింద కేసు నమోదు అయ్యాయి. -
దేశంలో మంచిరోజులు కనిపించడంలేదు: కన్హయ్య
విజయవాడ : వేముల రోహిత్ పోరాటాన్ని తాము కొనసాగిస్తామని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ స్పష్టం చేశారు. విజయవాడ ఐవీ ప్యాలెస్‌లో గురువారం జరిగిన యువజన శంఖారావం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్హయ్య కుమార్ మాట్లాడుతూ... ఈ దేశంలో మంచిరోజులు కరువయ్యాయి. దళితులకు రక్షణ లేకుండా పోయింది. చదువు కోసం దళితుడు పోరాటం చేయాల్సి వస్తోంది. రోహిత్ చట్టం కోసం పోరాటం చేస్తాం. దేశాన్ని హిందూ రాజ్యం చేస్తామంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన మనసులో మాట చెబుతారు కానీ, ప్రజల మనసులో మాట వినరు. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి. నల్లధనం తెస్తామన్నారు. అది ఏమైంది? ఓ వైపు నిత్యావసర ధరలు మండిపోతుంటే...బుల్లెట్ ట్రయిన్ తెస్తామంటున్నారు. ఇప్పుడు అభివృద్ధిని వదిలేసి మందిర నిర్మాణం అంటున్నారు. పేదల సబ్సిడీలు తగ్గించి పెద్దోళ్లకు రాయితీలు ఇస్తున్నారు. ఉద్యోగుల పీఎఫ్ డబ్బులను దోపిడీ చేసే యత్నం చేశారు. నేతల సొమ్ముతో కాదు.. జేఎన్‌యూ ఈ దేశ ప్రజల డబ్బుతో నడుస్తోంది' అని అన్నారు. -
ఎంతమంది రోహిత్‌లను చంపుతారు: కన్హయ్య
హైదరాబాద్ : లాఠీలతో తమ గొంతులు నొక్కలేరని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేరుకున్న ఆయనను బుధవారం సాయంత్రం పోలీసులు లోనికి అనుమతించలేదు. హెచ్‌సీయూ మెయిన్ గేటు వద్దే కన్హయ్య కుమార్ వాహనాన్ని అడ్డుకోవటంతో ఆయన వాహనం దిగి ఆవేశపూరితంగా ప్రసంగించారు. వేముల రోహిత్ కలలను సాకారం చేయడానికే తాము హెచ్సీయూకు వచ్చినట్లు చెప్పారు. అతనికి న్యాయం జరగాలని, రోహిత్ చట్టం వచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. యూనివర్సిటీలో భయానక పరిస్థితులు సృష్టించారన్నారు. తమను వర్సిటీలోనికి పోలీసులు అనుమతించడం లేదని, లాఠీలతో తమ గొంతులు నొక్కలేరన్నారు. లాఠీలు, తూటాలతో పోరాటాలు ఆపలేరని కన్హయ్య కుమార్ అన్నారు. ఇంకా ఎంతమంది రోహిత్‌లను చంపుతారని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. సామాజిక న్యాయం జిందాబాద్...యూనివర్సిటీలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటూ కన్హయ్య కుమార్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనతో పాటు విద్యార్థులు గొంతు కలిపారు. కాగా వేముల రోహిత్ తల్లి రాధిక, అతడి సోదరుడుతో కలిసి కన్హయ్య కుమార్ హెచ్సీయూకు వచ్చారు. కాగా తాము కన్హయ్య కుమార్ ను తాము అడ్డుకోలేదని, యూనివర్సిటీ భద్రతా సిబ్బందే అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. వీసీ అప్పారావు ఆదేశాల మేరకు వర్సిటీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. -
రోహిత్ దళితుడు కాదు: టీ.పోలీసుల నివేదిక
న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ స్కాలర్ వేముల రోహిత్ అంశంపై సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. రోహిత్ దళితుడు కాదంటూ తెలంగాణ పోలీసులు నివేదిక ఇచ్చారు. రోహిత్ దళితుడు కాదన్న తహశీల్దార్ నివేదికను పోలీసులు పేర్కొన్నారు. ఇదే రిపోర్టులోని అంశాలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో శుక్రవారం ప్రస్తావించారు. మరోవైపు రాజ్యసభలోనూ వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనపై దుమారం రేగింది. స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై సీపీఎం జాతీయ కార్యదర్శి, ఎంపీ సీతారాం ఏచూరీ అభ్యంతరం తెలిపారు. కేంద్రం తీరు వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. ఇక రోహిత్ మృతిపై వేసిన విచారణ కమిటీలో దళితులు లేరని బిఎస్పీ నేత మాయావతి వ్యాఖ్యానించారు. కమిటీలో దళితులను ఎందుకు నియమించలేదని ఆమె ప్రశ్నించారు. -
రోహిత్ ఘటనపై బస్సుయాత్ర ప్రారంభం
హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హెచ్‌సీయూ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయాల బస్సుయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఈ యాత్రను ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవివక్షకు వ్యతిరేకంగా పార్లమెంట్లో రోహిత్ చట్టం తీసుకువచ్చేందుకు విద్యార్థులు పోరాడాలన్నారు. ఈ నెల 16 వరకు కొనసాగే ఈ బస్సు యాత్రలో హెచ్‌సీయూ, ఓయూ, పలు తెలంగాణ వర్సిటీల విద్యార్థులు భాగస్వాములవుతారని చెప్పారు. అనంతరం హెచ్‌సీయూ నుంచి బస్సుయాత్ర నేరుగా ఉర్దూ వర్సిటీకి చేరుకుంది. అటు ఏపీలో శుక్రవారం నుంచి జేఏసీ బస్సుయాత్ర ప్రారంభమవనుంది. కాగా, మొదటిరోజు హెచ్‌సీయూ నుంచి మొదలైన బస్సుయాత్ర ఉర్దూ వర్సిటీ, వికారాబాద్మీదుగా పాలమూరు వర్సిటీ వరకు కొనసాగింది. శుక్రవారం మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మీదుగా నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ వరకు యాత్ర కొనసాగుతుంది. 13న కాకతీయ వర్సిటీకి, 14న ఆదిలాబాద్‌కు, 15న నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని జేఎన్టీయూకు బస్సుయాత్ర చేరుకుంటుంది. 16న జేఎన్టీయూతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, పొట్టి శ్రీరాములు, నిజాం కాలేజి, కోఠి ఉమెన్స్ కాలేజి, ఇఫ్లూ మీదుగా ఓయూకి చేరుకుంటుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓయూలో బస్సుయాత్ర ముగింపు సభ నిర్వహిస్తారు. -
నేడు హెచ్సీయూకు రానున్న రాహుల్
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రానున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌తో కలసి రాహుల్ శుక్రవారం రాత్రి హెచ్సీయూకు చేరుకుంటారు. రోహిత్ తల్లి రాధికతో కలసి రాహుల్, దిగ్విజయ్ దీక్ష చేయనున్నారు. పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఈ నెల 19న రాహుల్ హెచ్‌సీయూలో పర్యటించిన సంగతి తెలిసిందే. రోహిత్ తల్లి రాధికను పరామర్శించారు. రోహిత్ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అతని కుటుంబానికి పరిహారం చెల్లించడంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. -
'నా కుమారుడు ముమ్మాటికీ వడ్డెర కులస్తుడే'
విజయవాడ: తన కుమారుడు వేముల రోహిత్ మరణంపై అతడి తండ్రి మణికుమార్ నోరు విప్పారు. తన కుమారుడిది ఆత్మహత్యా కాదని, హత్య అని ఆరోపించారు. తన కొడుకు మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడు ముమ్మాటికీ వడ్డెర కులస్తుడేనని ఆయన స్పష్టం చేశారు. తాము ఎస్సీ కులానికి చెందినవారిమని తన భార్య ఎందుకు చెబుతుందో అర్థం కావడం లేదన్నారు. రోహిత్ మరణంపై రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యతో విడాకులు తీసుకున్నా ఆమెతో కలిసే ఉంటున్నట్టు వెల్లడించారు. ఇటీవలే తన చిన్న కుమారుడి నిశ్చితార్థం నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ చేస్తున్న రోహిత్ ఈ నెల 17న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
'వైఖరి' ఆరోగ్యం విషమం...
-
నా కులం గురించి ఇప్పుడెందుకు?
హైదరాబాద్ : ఇటీవల హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ కుల ప్రస్తావనపై వస్తున్న వార్తలను తల్లి రాధిక ఖండించారు. తాను మాల సామాజిక వర్గంలో జన్మించానని, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో తన వివాహం జరిగిందని ఆమె తెలిపారు. తనకు మగ్గురు సంతానమని... మూడో బిడ్డ పుట్టిన అనంతరం, కుటుంబ కలహాల నేపథ్యంలో తాము విడాకులు తీసుకున్నట్లు రాధిక తెలిపారు. తన కులం గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. మరోవైపు రోహిత్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయిదు రోజుల తర్వాత స్పందించడాన్ని రోహిత్ సోదరుడు తప్పుబట్టారు. భరతమాత ఓ బిడ్డను కోల్పోయిందని ప్రధానికి ఇప్పుడు అర్థమైందా అని అన్నారు. తన తమ్ముడు చావును కులంతో ముడిపెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
'వైఖరి' ఆరోగ్యం విషమం, హెల్త్ సెంటర్ కు తరలింపు
హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థులు చేస్తున్న ఆమరణ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు శనివారం యత్నించారు. దీక్ష చేస్తున్న వారిలో ఓ విద్యార్థిని ఆరోగ్యం విషమించడంతో ఆమెను చికిత్స నిమిత్తం వర్సిటీలోని హెల్త్ సెంటర్‌కు తరలించారు. పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా ఏడుగురు విద్యార్థులు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కాగా దీక్ష చేస్తున్న 'వైఖరి' అనే విద్యార్థిని ఆరోగ్యం విషమించడంతో బలవంతంగా హెల్త్ సెంటర్ కు తరలించారు. అంతకు ముందు రోహిత్ కుటుంబసభ్యులు ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులను పరామర్శించి, సంఘీభావం తెలిపారు. -
రోహిత్ మరణం తీరని లోటు: జైపాల్ రెడ్డి
హైదరాబాద్ : పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ మరణం తీరని లోటు అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం హెచ్‌సీయూ సందర్శించి, ధర్నా చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ హెచ్‌సీయూ యూనివర్సిటీలో దళతుల పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించిన వైస్ ఛాన్సరలర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను సంఘ విద్రోహుల్లా చిత్రీకరిస్తున్న తీరు బాధాకరమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ దళితులకు యూనివర్సిటీలో చట్ట రక్షణ కల్పించాలన్నారు. టీఆర్ఎస్కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ యూనివర్సిటీ ఘటనపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీలో దళితులకు రక్షణ కల్పించాలని, కేంద్రం ఈ విధంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. -
హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఆందోళన
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌కి న్యాయం జరగాలంటూ హెచ్‌సీయూలో విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష శనివారం నాలుగోరోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న విద్యార్థులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి బీపీ, షుగర్ లెవల్స్ తగ్గినట్టు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఆందోళకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థులు నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. -
ఒక సంఘటన,ఆరు వారాలు,ఆరు లేఖలు
-
నిజ నిర్థారణ కమిటీని వెనక్కి పంపారు..
-
నిజ నిర్థారణ కమిటీని వెనక్కి పంపారు..
హైదరాబాద్ : దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య, హెచ్‌సీయూలో పరిణామాలపై కేంద్ర మానవ వనరుల శాఖ వేసిన ఇద్దరు సభ్యుల నిజ నిర్థారణ కమిటీని వర్సిటీ విద్యార్థులు మంగళవారం వెనక్కి పంపారు. వైస్ ఛాన్సలర్ అప్పారావును సస్పెండ్ చేసిన తర్వాతే విచారణకు తమ వద్దకు రావాలని హెచ్‌సీయూ విద్యార్థులు తేల్చి చెప్పారు. రోహిత్ ఆత్మహత్యకు ఎన్హెచ్ఆర్డీయే కారణమని వాళ్లు ఆరోపించారు. అదే కమిటీనీ విచారణకు పంపడం హంతకులతో రాజీ పడటమే అని విద్యార్థులు ధ్వజమెత్తారు. కనీసం ఐఏఎస్ అధికారులను కాకుండా అండర్ సెక్షన్ అధికారులను కమిటీ సభ్యులుగా పంపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు. విద్యార్థుల ఆందోళనతో విచారణ చేపట్టకుండానే కమిటీ సభ్యులు వెనుదిరిగారు. మరోవైపు హెచ్‌సీయూలో మూడోరోజు కూడా విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. -
రోహిత్ మృతికి వీసీ, కేంద్రానిదే బాధ్యత
-
రోహిత్ మృతికి వీసీ, కేంద్రానిదే బాధ్యత: రాహుల్
హైదరాబాద్ : దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అతని మృతికి హెచ్‌సీయూ వైస్ ఛాన్సలర్, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో రాహుల్ గాంధీ మంగళవారం హెచ్‌సీయూ పర్యటించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాను రాజకీయాలు చేయడానికి ఇక్కడకు రాలేదని, యూనివర్సిటీల్లో పక్షపాత ధోరణి సరికాదన్నారు. వర్సిటీ విద్యార్థులు తమ భావాలను వెల్లడించే స్వేచ్ఛ విద్యార్థులకు ఉందన్నారు. అందుకు విశ్వవిద్యాలయాలు వేదికగా ఉండాలన్నారు. రోహిత్ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అలాగే అతని కుటుంబానికి పరిహారం చెల్లించడంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. విద్యార్థుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు హక్కులు కల్పించే చట్టాలను తీసుకురావాలన్నారు. ఎప్పుడు అవసరం అయినా విద్యార్థులకు తాము అండగా ఉంటామని రాహుల్ హామీ ఇచ్చారు. వీసీకి డీసెన్సీ, డిగ్నిటీ లేవని, యూనివర్సిటీ విద్యార్థి చనిపోతే పరామర్శించే బాధ్యత వీసీకి బాధ్యత లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. దళిత విద్యార్థులను వీసీ అణగదొక్కారని రాహుల్ ఆరోపించారు. అంతకు ముందు రాహుల్...రోహిత్ తల్లి రాధికను పరామర్శించారు. అనంతరం సస్పెండ్ అయిన పీహెచ్డీ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
రోహిత్ తల్లికి రాహుల్ పరామర్శ
-
రోహిత్ తల్లికి రాహుల్ పరామర్శ
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) పీహెచ్డీ విద్యార్థి రోహిత్ కుటుంబ సభ్యులను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. మంగళవారం హెచ్సీయూకు వచ్చిన రాహుల్.. రోహిత్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రోహిత్ తల్లి రాధికను ఓదార్చి, హెచ్‌సీయూలో జరిగిన ఘటనల గురించి అడిగితెలుసుకున్నారు. రాహుల్.. హెచ్‌సీయూ విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు హెచ్సీయూకు వచ్చారు. హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన పీహెచ్డీ విద్యార్థి, గుంటూరుకు చెందిన వేముల రోహిత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
హెచ్‌సీయూ చేరుకున్న రాహుల్
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేట విమానాశ్రయంలో దిగిన రాహుల్.. అక్కడి నుంచి నేరుగా హెచ్సీయూకు వెళ్లారు. ఆయన వెంట దిగ్విజయ్ సింగ్ వచ్చారు. బేగంపేటలో రాహుల్‌ను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. హెచ్‌సీయూలో రాహుల్.. విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడనున్నారు. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు గల కారణాలు, హెచ్‌సీయూలో జరిగిన పరిణామాల గురించి తెలుసుకోనున్నారు. రాహుల్ రాక సందర్భంగా హెచ్‌సీయూలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. -
రోహిత్ కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) పీహెచ్డీ విద్యార్థి రోహిత్ కుటుంబ సభ్యులకు మంగళవారం ఫోన్ చేసి పరామర్శించారు. యూనివర్సిటీలో జరిగిన ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన పీహెచ్డీ విద్యార్థి, గుంటూరుకు చెందిన వేముల రోహిత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన జగన్.. యూనివర్సిటీలో జరిగిన పరిణామాల గురించి రోహిత్ తల్లిని అడిగి తెలుసుకున్నారు. రోహిత్ కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకుని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
రోహిత్ కుటుంబానికి జగన్ పరామర్శ
-
రోహిత్ ఆత్మహత్య కారకులను శిక్షించాలి: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(సెంట్రల్ యూనివర్సిటీ)లో దళితుడైన పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే కఠినంగా శిక్షించాలని సోమవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. యువ పరిశోధకుడైన రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన దురదృష్టకర పరిణామాలను జగన్ తీవ్రంగా పరిగణిస్తూ కారకులైన దుండగులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు -
రోహిత్ చావుకు ఎవరు బాధ్యులు?
‘చావు లాంఛనాల గురించి రాయడం మర్చిపోయాను. ఎవరూ నా ఆత్మహత్యకు బాధ్యులు కాదు. వారి చర్యల ద్వారాగానీ, మాటల ద్వారాగానీ నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించలేదు. ఇది పూర్తిగా నా స్వనిర్ణయం. నా చావుకు నేనే బాధ్యుడిని. నా స్నేహితులనుగానీ, నా శత్రువులగానీ నా ఆత్మహత్య కారణంగా వేధించకూడదు’ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి వేముల రోహిత్ సూసైడ్ నోట్ సారాంశం ఇదీ. ఓ దళిత విద్యార్థి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల నుంచి అతడితో గొడవ పడిన ఏబీవీపీ, నాడు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి స్వయంగా లేఖ రాసిన సాక్షాత్తు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తప్పించుకునేందుకు ఈ సూసైడ్ నోట్ రక్షణ కవచంలా ఉపయోగపడొచ్చు. బోల్డంతా భవిష్యత్తుకు తిలోదకాలిచ్చి అర్ధాంతరంగా వెళ్లిపోయిన వేముల ఆత్మహత్యలో దాగున్న వేదన, వాస్తవ పరిస్థితులు మనందరిని వేటాడుతూనే ఉంటాయి. మన పిరికితనం వల్ల వేముల చనిపోయాడు. తోటి అకాడమిక్ విద్యార్థుల పిరికితనం. యూనివర్శిటీ అధికారుల పిరికితనం. రోహిత్, అతడి సహచరులను క్యాంపస్ నుంచి వెళ్లగొట్టాల్సిందిగా వచ్చిన ఆదేశాలకు లొంగిపోయిన పిరికితనం, ఓ బీజేపీ కార్యకర్తను గాయపరిచారనే ఆరోపణలకు సంబంధించి ఎలాంటి బలమైన ఆధారాలు లేవని విచారణ కమిటీ నిగ్గు తేల్చినా పట్టించుకోని యూనివర్శిటీ అధికారుల పిరికితనం ఇవన్నీ కారణమే. రోహిత్ తోపాటు మరో నలుగురు అనుచరులను క్యాంపస్ నుంచి తరిమేసిన అధికారుల చర్యా కారణం. ఆత్మహత్య చేసుకోవాలని విపరీత నిర్ణయానికి రావడానికి దోహదం చేసిన పరిణామాలేమిటో వేముల రోహిత్ తన సూసైడ్ నోట్లో వెల్లడించకపోవచ్చు. అలాగే, ముంబై బాంబు పేలుళ్ల కేసులో మరణ శిక్ష పడిన యాకూబ్ మెమన్ ను గత ఏడాది ఉరితీయవద్దంటూ తన గ్రూప్ ప్రదర్శన జరపలేదని చెప్పలేదు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మతహింసపై ‘ముజఫర్ నగర్ బాకీ హై’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదనీ చెప్పలేదు. ఈ చర్యల కారణంగా ఏబీవీపీ విద్యార్థులకు కోపం వచ్చిన విషయాన్ని చెప్పలేదు. వారి ప్రోద్బలంతో ఈ జాతి విద్రోహులపై చర్య తీసుకోమంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి బండారు దత్తాత్రేయ లేఖ రాసిని విషయాన్నీ చెప్పలేదు. గత రెండు వారాలుగా క్యాంపస్ ఆరుబయట నిద్రిస్తున్న విషయాన్నీ రోహిత్ చెప్పలేదు. దానికి బదులుగా ‘ఈ క్షణంలో నేను బాధ పడటం లేదు. విచారించడమూ లేదు. నా హృదయం ఖాళీ. నా పట్ల నాకు ఆందోళన లేదు. నేనెందుకు ఇలా చేస్తున్నాను’ అని లోలోన బాధపడిన రోహిత్, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడన్న విషయం చెప్పలేదు. కానీ ప్రేమ, బాధ, జీవితం, చావు గురించి చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు, ఈ క్షణం తన గుర్తింపు ఏమిటీ అన్న స్థాయికి పడిపోయిన ప్రపంచ విలువల గురించి చెప్పాడు. మనిషి మేథస్సును కాకుండా, ఒక ఓటరుగా, జనాభాలో ఒక అంకెగా, ఓ వస్తువుగా మనిషి మారిపోయిన విషయాన్ని చెప్పాడు. తోటి మనుషులను ఓ మేధస్సు కలిగిన వ్యక్తులుగా చూడాలని చెప్పాడు. నక్షత్ర ధూళి నుంచి చదువులో, వీధుల్లో, జీవితాల్లో, ఆఖరికి చావులోనూ అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని చెప్పాడు. ఓ దళితుడిగా వేముల రోహిత్ చనిపోదల్చుకోలేదు. సైన్స్ రైటర్ కావాలనుకున్నాడు. నక్షత్రాలను తాకాలనుకున్నాడు. అంబేడ్కర్ విద్యార్థుల సంఘం సభ్యుడిగా జాతీయ స్ఫూర్తికి కట్టుబడ్డాడు. భారతీయ ముస్లింల తరఫున నిలబడ్డాడు. అన్ని వర్గాల నుంచి సంఘీభావాన్ని కూడగట్టాలనుకున్నాడు. అతడితో నడిచేందుకు ప్రపంచం విఫలమైంది. అందుకని రోహిత్ తన తనువు చాలించుకున్నాడు. వేముల రోహిత్ వంటి కలలను నిజం చేయాలని తపన పడేవారికి ఒక్క హైదరాబాద్ యూనివర్శిటీలోనే కాదు, ఏ యూనివర్శిటీలోనూ చోటు ఉండకపోవచ్చు. మనలాంటి పిరికివాళ్లు ఉన్న ఈ ప్రపంచంలో ఒంటరినని, తానొక ఖాళీ అని వేముల రోహిత్ ఎందుక భావించారు?