
రోహిత్ కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ కుటుంబ సభ్యులకు మంగళవారం ఫోన్ చేసి పరామర్శించారు. యూనివర్సిటీలో జరిగిన ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెచ్‌సీయూలో సస్పెన్షన్కు గురైన పీహెచ్‌డీ విద్యార్థి, గుంటూరుకు చెందిన వేముల రోహిత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన జగన్.. యూనివర్సిటీలో జరిగిన పరిణామాల గురించి రోహిత్ తల్లిని అడిగి తెలుసుకున్నారు. రోహిత్ కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకుని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.