scholar in HCU
-
నిజ నిర్థారణ కమిటీని వెనక్కి పంపారు..
-
నిజ నిర్థారణ కమిటీని వెనక్కి పంపారు..
హైదరాబాద్ : దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య, హెచ్‌సీయూలో పరిణామాలపై కేంద్ర మానవ వనరుల శాఖ వేసిన ఇద్దరు సభ్యుల నిజ నిర్థారణ కమిటీని వర్సిటీ విద్యార్థులు మంగళవారం వెనక్కి పంపారు. వైస్ ఛాన్సలర్ అప్పారావును సస్పెండ్ చేసిన తర్వాతే విచారణకు తమ వద్దకు రావాలని హెచ్‌సీయూ విద్యార్థులు తేల్చి చెప్పారు. రోహిత్ ఆత్మహత్యకు ఎన్హెచ్ఆర్డీయే కారణమని వాళ్లు ఆరోపించారు. అదే కమిటీనీ విచారణకు పంపడం హంతకులతో రాజీ పడటమే అని విద్యార్థులు ధ్వజమెత్తారు. కనీసం ఐఏఎస్ అధికారులను కాకుండా అండర్ సెక్షన్ అధికారులను కమిటీ సభ్యులుగా పంపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు. విద్యార్థుల ఆందోళనతో విచారణ చేపట్టకుండానే కమిటీ సభ్యులు వెనుదిరిగారు. మరోవైపు హెచ్‌సీయూలో మూడోరోజు కూడా విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. -
రోహిత్ మృతికి వీసీ, కేంద్రానిదే బాధ్యత
-
రోహిత్ మృతికి వీసీ, కేంద్రానిదే బాధ్యత: రాహుల్
హైదరాబాద్ : దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అతని మృతికి హెచ్‌సీయూ వైస్ ఛాన్సలర్, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో రాహుల్ గాంధీ మంగళవారం హెచ్‌సీయూ పర్యటించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాను రాజకీయాలు చేయడానికి ఇక్కడకు రాలేదని, యూనివర్సిటీల్లో పక్షపాత ధోరణి సరికాదన్నారు. వర్సిటీ విద్యార్థులు తమ భావాలను వెల్లడించే స్వేచ్ఛ విద్యార్థులకు ఉందన్నారు. అందుకు విశ్వవిద్యాలయాలు వేదికగా ఉండాలన్నారు. రోహిత్ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అలాగే అతని కుటుంబానికి పరిహారం చెల్లించడంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. విద్యార్థుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు హక్కులు కల్పించే చట్టాలను తీసుకురావాలన్నారు. ఎప్పుడు అవసరం అయినా విద్యార్థులకు తాము అండగా ఉంటామని రాహుల్ హామీ ఇచ్చారు. వీసీకి డీసెన్సీ, డిగ్నిటీ లేవని, యూనివర్సిటీ విద్యార్థి చనిపోతే పరామర్శించే బాధ్యత వీసీకి బాధ్యత లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. దళిత విద్యార్థులను వీసీ అణగదొక్కారని రాహుల్ ఆరోపించారు. అంతకు ముందు రాహుల్...రోహిత్ తల్లి రాధికను పరామర్శించారు. అనంతరం సస్పెండ్ అయిన పీహెచ్డీ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
రోహిత్ తల్లికి రాహుల్ పరామర్శ
-
రోహిత్ తల్లికి రాహుల్ పరామర్శ
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) పీహెచ్డీ విద్యార్థి రోహిత్ కుటుంబ సభ్యులను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. మంగళవారం హెచ్సీయూకు వచ్చిన రాహుల్.. రోహిత్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రోహిత్ తల్లి రాధికను ఓదార్చి, హెచ్‌సీయూలో జరిగిన ఘటనల గురించి అడిగితెలుసుకున్నారు. రాహుల్.. హెచ్‌సీయూ విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు హెచ్సీయూకు వచ్చారు. హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన పీహెచ్డీ విద్యార్థి, గుంటూరుకు చెందిన వేముల రోహిత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
హెచ్‌సీయూ చేరుకున్న రాహుల్
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేట విమానాశ్రయంలో దిగిన రాహుల్.. అక్కడి నుంచి నేరుగా హెచ్సీయూకు వెళ్లారు. ఆయన వెంట దిగ్విజయ్ సింగ్ వచ్చారు. బేగంపేటలో రాహుల్‌ను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. హెచ్‌సీయూలో రాహుల్.. విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడనున్నారు. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు గల కారణాలు, హెచ్‌సీయూలో జరిగిన పరిణామాల గురించి తెలుసుకోనున్నారు. రాహుల్ రాక సందర్భంగా హెచ్‌సీయూలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. -
రోహిత్ కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) పీహెచ్డీ విద్యార్థి రోహిత్ కుటుంబ సభ్యులకు మంగళవారం ఫోన్ చేసి పరామర్శించారు. యూనివర్సిటీలో జరిగిన ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన పీహెచ్డీ విద్యార్థి, గుంటూరుకు చెందిన వేముల రోహిత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన జగన్.. యూనివర్సిటీలో జరిగిన పరిణామాల గురించి రోహిత్ తల్లిని అడిగి తెలుసుకున్నారు. రోహిత్ కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకుని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
రోహిత్ ఆత్మహత్య కారకులను శిక్షించాలి: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(సెంట్రల్ యూనివర్సిటీ)లో దళితుడైన పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే కఠినంగా శిక్షించాలని సోమవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. యువ పరిశోధకుడైన రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన దురదృష్టకర పరిణామాలను జగన్ తీవ్రంగా పరిగణిస్తూ కారకులైన దుండగులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు