దళితుడైన పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే కఠినంగా శిక్షించాలని సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(సెంట్రల్ యూనివర్సిటీ)లో దళితుడైన పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే కఠినంగా శిక్షించాలని సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
యువ పరిశోధకుడైన రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన దురదృష్టకర పరిణామాలను జగన్ తీవ్రంగా పరిగణిస్తూ కారకులైన దుండగులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు