హైదరాబాద్ : పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ మరణం తీరని లోటు అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం హెచ్సీయూ సందర్శించి, ధర్నా చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ హెచ్సీయూ యూనివర్సిటీలో దళతుల పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించిన వైస్ ఛాన్సరలర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను సంఘ విద్రోహుల్లా చిత్రీకరిస్తున్న తీరు బాధాకరమన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ దళితులకు యూనివర్సిటీలో చట్ట రక్షణ కల్పించాలన్నారు. టీఆర్ఎస్కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ యూనివర్సిటీ ఘటనపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీలో దళితులకు రక్షణ కల్పించాలని, కేంద్రం ఈ విధంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు.
రోహిత్ మరణం తీరని లోటు: జైపాల్ రెడ్డి
Published Sat, Jan 23 2016 2:38 PM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM
Advertisement
Advertisement