హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఆందోళన కొనసాగుతూనే ఉంది.
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్కి న్యాయం జరగాలంటూ హెచ్సీయూలో విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష శనివారం నాలుగోరోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న విద్యార్థులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వారికి బీపీ, షుగర్ లెవల్స్ తగ్గినట్టు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఆందోళకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థులు నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.