సాక్షి, కడప : ఎన్నికల కోసమే టీడీపీ దీక్ష చేస్తోంది కానీ జిల్లా ప్రజలపై ప్రేమతో కాదని వైఎస్సార్ సీసీ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో చేపడుతున్న పోరాటంలో భాగంగా జమ్మలమడుగులో వైఎస్సార్ పీపీ ఆధ్వర్యంలో ఉక్కు సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశంతో ప్రత్యేక హోదా, విభజన హామీలైన ఉక్కు పరిశ్రమ కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేశామన్నారు. ఆనాడే తమతోపాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే కేంద్రం దిగొచ్చెదన్నారు. టీడీపీ ఇప్పుడు దీక్ష చేస్తే ఏం ఫలితం ఉంటుందని విమర్శించారు. ఉపఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి బుద్ది వచ్చేలా తీర్పునివ్వాలని ప్రజలను కోరారు.
సీఎం రమేష్‌ది కార్పొరేట్ దీక్ష : అంజాద్ బాషా
ఆనాడు వైయస్సార్ తలపెట్టిన స్టీల్ ప్లాంట్ అడ్డుకోకుండా ఉంటే లక్ష మందికి ఉపాధి లభించేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్ అన్నారు.దీక్షలో ఆయన మాట్లాడుతూ..సీఎం రమేష్ రోజుకు రూ. కోటి ఖర్చు పెట్టి దీక్ష చేస్తున్నారని..అది కార్పొరేట్ దీక్ష అని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ తప్పా ఎవరికీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీజేపీతో వైఎస్సార్‌సీపీ జతకట్టే ప్రసక్తే లేదన్నారు. కొద్ది రోజుల్లో మైరారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు.
కప్పం కట్టందే పథకం రాదు : రఘురామి రెడ్డి
జన్మభూమి కమిటీకి కప్పం కట్టందే సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని మైదుకూరు ఎమ్మెల్యే రుఘురామి రెడ్డి ఆరోపించారు. టీడీపీ వాళ్ల సొంత అభివృద్ధి తప్పా రాష్ట్రం అభివృద్ధే లేదని ఎద్దేవా చేశారు. జమ్మలమడుగు అభివృద్ధి ఉక్కు ఫ్యాక్టరీతో ముడిపడి ఉందన్నారు. వైయస్సార్ బతికి ఉండిఉంటే జమ్మలమడుగు పరిస్థితి ఇలా ఉండకపోవునని వ్యాఖ్యానించారు. టీడీపీకి బుద్ది చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు
Comments
Please login to add a commentAdd a comment