Raghurami reddy
-
లోకేశ్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం, నిధుల వృథా, ప్రభుత్వ సంపదకు, సహజ వనరులకు నష్టం కలిగించడం వంటి విషయాల్లో తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా అధీకృత అధికారుల నియామకం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ రఘురామిరెడ్డి రాసిన లేఖను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు వీలుగా నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం, నిధుల వృథా, ప్రభుత్వ సంపదకు, సహజ వనరులకు నష్టం కలిగించడం వంటి విషయాల్లో ఏ సంస్థలోకైనా వెళ్లేందుకు, సోదాలు చేసేందుకు, సమాచారం సేకరించేందుకు, రికార్డులను పరిశీలించేందుకు, జప్తు చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసేలా గెజిటెడ్ అధికారులందరినీ అధీకృత అధికారులుగా నియమించాలని కోరుతూ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ హోదాలో కొల్లి రఘురామిరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖను సవాల్ చేస్తూ టీడీపీ తరఫున నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా గురువారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ చీమలపాటి రవి విచారణ జరిపారు.న్యాయమూర్తి అసహనంలోకేశ్ తరఫు న్యాయవాది అఖిల్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. ఈ వ్యవహారంపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం గతంలో చెప్పిందని పేర్కొన్నారు. విధానపరమైన నిర్ణయం తీసుకున్నారా?, తీసుకోబోతున్నారా?, అసలు ఈ వ్యవహారంలో ఏం చేయబోతున్నారో తెలియచేస్తూ కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం ఏం చెప్పాలో మీరే పేరాల వారీగా కౌంటర్ దాఖలు చేసి ఇవ్వండి. దాన్నే ప్రభుత్వం దాఖలు చేస్తుంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏయే అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలో కోర్టు ఎలా చెబుతుందని ప్రశ్నించారు. కౌంటర్ దాఖలు నిమిత్తం విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేశారు. -
నామినేషన్ దాఖలు చేసిన శెట్టిపల్లె రఘురామిరెడ్డి
-
చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు
-
అదను దాట లేదు... ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ అదను దాటలేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు భరోసా ఇచ్చింది. పంటలను విత్తుకోవడానికి సమయం దాటిపోలేదని విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పి.రఘురామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీచేశారు. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. ఈ నెల ఒకటిన కేరళను తాకవలసిన రుతుపవనాలు 8వ తేదీకి వచ్చాయని, ఈ సమయంలో గుజరాత్ తీరంలో ఏర్పడిన తుపాను వల్ల మన రాష్ట్రానికి రుతుపవనాల రాక ఆలస్యమైందని పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడతాయన్న ఆయన.. పంటలవారీగా రైతులకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఏ పంట? ఎప్పటివరకు ? వరి: ఇప్పుడు నార్లు పోసుకోవాలనుకునే రైతులు కేవలం స్వల్పకాలిక (125 రోజుల కన్నా తక్కువ) వరి రకాలను మాత్రమే విత్తుకోవాలి. నేరుగా విత్తే పద్ధతులపై (దమ్ముచేసి లేదా దమ్ము చేయకుండా) రైతాంగం శ్రద్ధ పెట్టాలి. పత్తి: జూలై 20 వరకు విత్తుకోవచ్చు.ౖ తేలిక నేలల్లో 50–60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60–75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే పత్తిని విత్తుకోవాలి. పత్తిలో అంతరపంటగా కంది మంచి లాభాలు ఇస్తుంది. కాబట్టి అంతర పంటగా కందిని సాగు చేపట్టాలి. కంది పంట: సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా ఆగష్టు 15 వరకు కందిని విత్తుకోవచ్చు. పెసర, మినుము, వేరుశనగ, పత్తి, ఆముదం సహా ఇతర పంటలతో అంతర పంటగానూ విత్తుకోవచ్చు. సోయాచిక్కుడు: జూన్ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే జూలై మొదటి వారంలో విత్తినా సోయాలో మంచి దిగుబడులు సాధించవచ్చు. మొక్కజొన్న: జూలై 15 వరకు విత్తుకోవచ్చు. నీటి ఎద్దడిని మొక్కజొన్న తట్టుకోలేదు. కాబట్టి బోదె, సాళ్ళ పద్ధతి ఆచరించడం ద్వారా పంటకు ఎక్కువ కాలం తేమ అందుబాటులో ఉంచవచ్చు. పెసర, మినుము: ఈ పంటలనుౖ జూలై 15 వరకు విత్తుకోవచ్చు. సరైన మొక్కల సంఖ్యను పాటించడం ద్వారా ఆశించిన దిగుబడులు పొందవచ్చు. ఇతర ఆరుతడి పంటలైన ఆముదం, పొద్దు తిరుగుడు, ఉలువలను జూలై 31 వరకు సాగు చేసుకోవచ్చు. కాబట్టి రైతాంగం ఆందోళన పడవలసిన అవసరం లేదు. -
సీఎం జగన్ ను ఢీకొనే సత్తా ప్రతిపక్షాలకు లేదు : ఎమ్మెల్యే రఘురామి రెడ్డి
-
రైతులకు మరింత ధీమా
కడప సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్‌పుట్‌సబ్సిడీ రాయితీ పథకాలు అన్నదాతలకు మరింత ధీమాను ఇస్తున్నాయని కలెక్టర్ విజయరామరాజు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణిలు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2020–21 సంవత్సరానికి రబీ సీజన్‌కు సంబంధించి, 2021 ఖరీఫ్ కాలానికి వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాలు, 2022 ఖరీఫ్‌లో ఇన్పుట్ సబ్సిడీ కింద లబ్ధి మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి కలెక్టర్ విజయరామరాజుతోపాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నగర మేయర్ సురేష్‌బాబు, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లేల ఝాన్సీరాణి, జేసీ సాయకాంత్‌వర్మ, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పులివెందుల మార్కెట్‌యార్డు చైర్మన్ చిన్నప్ప, వ్యవసాయ సలహా మండలి సభ్యులు బలరామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. అన్నదాతలకు కొండంత అండ : కలెక్టర్ విజయరామరాజు ఈ సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ పథకాలు అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2020–21 రబీ సీజన్‌కు సంబంధించి రూ. లక్షలోపు పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన 12,112 మంది జిల్లా రైతులకు మంజూరైన రూ. 2.69 కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 24,920 మంది రైతులకు రూ. 6.05 కోట్లు, అలాగే 2020 ఖరీఫ్ సీజన్‌కుగాను సున్నా వడ్డీ కింద 30233 మంది వివిధ కారణాలతో జమకాని రైతులకుగాను రూ. 7.30 కోట్లు జమ అయిందన్నారు. మొత్తంగా జిల్లాలో 67,265 మంది రైతులకు రూ. 16.04 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. అలాగే 2022 ఖరీఫ్ కాలానికి ఇన్పుట్ సబ్సిడీ కింద జిల్లాలో 3855 మంది రైతులకు రూ. 4.33 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారని తెలిపారు. మెగా చెక్కు అందజేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీసీ అనంతరం సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన మెగా చెక్కులను కార్యక్రమానికి హాజరైన అతిథులందరూ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ►ఈ కార్యక్రమంలో వీరపునాయునిపల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగేశ్వరరావు, పశుసంవర్థకశాఖ జేడీ శారద, డీసీఓ సుభాషిణి, వ్యవసాయ ఏడీలు నరసింహారెడ్డి, సుబ్బారావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రైతు పక్షపాత ప్రభుత్వం: ఎస్.రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి రైతు తలెత్తుకుని జీవించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమన్నారు. రైతు దేశానికి వెన్నముక అని, రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం భావించి రైతులను అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు. అన్నదాతల కోసం అమూల్య పథకాలు : సురేష్‌బాబు, నగర మేయర్ అన్నదాతల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమూల్యమైన పథకాలను అమలు చేస్తున్నారని నగర మేయర్ సురేష్‌బాబు తెలిపారు. వరుసగా మూడవ సంవత్సరం సజావుగా సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీలను రైతులకు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిదేనన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : మల్లెల ఝాన్సీరాణి, ఆప్కాబ్ చైర్ పర్సన్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు కల్పతరువులు : సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు అన్ని విధాలా కల్పతరువుగా మారాయని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి పేర్కొ న్నారు. ప్రభుత్వం విత్తనం నుంచి అమ్మకం వరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సేవలు అందుతున్నాయన్నారు. రైతు బాంధవుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు బాంధవుడిగా మారి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన నాయకుడు జగనన్న. ప్రభుత్వ మద్దతు ధరతో పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా విక్రయించుకోగలిగాను. – భాస్కర్, రైతు, యల్లారెడ్డిపల్లె, కమలాపురం జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి వ్యవసాయ రంగంలో రైతుల అభ్యున్నతికి అనేక మార్పులు తెచ్చి ఆపన్నహస్తం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే ఉండాలని కోరుకుంటున్నాను. – పి.వీరారెడ్డి, చౌటపల్లె, కడప రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రిగా ఘనత సాధించారు. అనేక పథకాలను రైతుల కోసం ప్రవేశపెట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలన్నదే మా అందరి ఆకాంక్ష. – ఎం.సుబ్బిరెడ్డి, చౌటపల్లె, కడప -
స్పిన్నింగ్ పరిశ్రమపై మాంద్యం దెబ్బ
కొరిటెపాడు (గుంటూరు): కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఆ ప్రభావం స్పిన్నింగ్ మిల్లుల పరిశ్రమపై తీవ్రంగా ఉంది. కోవిడ్ విపత్తు తర్వాత ఆర్డర్లులేని పరిస్థితుల్లో ముడిసరుకు దూది ధరకంటే నూలు ధర తక్కువ కావడం, ఎగుమతులు క్షీణించడం.. స్వదేశీ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం వంటి వరుస పరిణామాలు పరిశ్రమను వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వం స్పిన్నింగ్ మిల్లులకు రూ.947 కోట్లు రాయితీలను బకాయి పెడితే కోవిడ్ కష్టాలను గమనించిన ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడేళ్లలో రూ.380 కోట్ల బకాయిలను చెల్లించింది. ఈ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టెక్స్టైల్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండంతో మిల్లులను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. మంగళవారం నుంచి 15 రోజుల పాటు స్పిన్నింగి మిల్లులను మూసివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లంకా రఘురామిరెడ్డి ప్రకటించారు. 50 శాతం ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ.. రాష్ట్ర స్పిన్నింగ్, టెక్స్టైల్ పరిశ్రమల అసోసియేషన్ గత సమావేశంలో అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తిలో 50 శాతం నిలిపివేయాలని తీర్మానం చేసిందని, కానీ.. ఇప్పుడు పరిస్థితులు మరింత క్షీణించిన దృష్ట్యా మొత్తం అన్ని పరిశ్రమలు పూర్తిగా మూసివేసి, నష్టాలబారి నుంచి బయటపడాలని నిర్ణయించినట్లు రఘురామిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలను, ఎంసీఎక్స్‌ను కట్టడిచేసి, పత్తి ధరలు నిలకడగా ఉండేలా చూడాలని కోరారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం కరోనా వేళ గతేడాది సెప్టెంబర్‌లో రూ.237 కోట్లు విడుదలచేసి ఆదుకుందన్నారు. అదే విధంగా ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను విడుదల చేయాలని రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండున్నర లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న ఈ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. -
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు ఆపాల్సిందే
కడప (సెవెన్ రోడ్స్): రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై వైఎస్సార్ జిల్లాలోని రైతు సంఘాలు, మేధావులు భగ్గుమంటున్నారు. ఎలాంటి నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్న తెలంగాణ ప్రభుత్వం నిత్య కరువు పీడిత రాయలసీమకు నీరందించే పథకాలపై అభ్యంతరాలు లేవనెత్తడాన్ని తప్పుబడుతున్నారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ వైఖరికి నిరసనగా ఈనెల 28వ తేదీన కడపలో ఆందోళన చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలవాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. శనివారం రాయలసీమ సాగునీటి సాధన సమితి జిల్లా కన్వీనర్ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, రైతు స్వరాజ్య వేదిక నాయకుడు శివారెడ్డి తదితరులు మైదుకూరు, కమలాపురం ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్.గోవర్దన్‌రెడ్డి, బి.హరిప్రసాద్, పీరయ్య తదితరులను కలిసి రైతుల ఆందోళనలో భాగస్వాములు కావాలని కోరారు. -
కొలిక్కి వచ్చిన మఠాధిపతి ఎంపిక
బ్రహ్మంగారిమఠం: వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం నూతన మఠాధిపతి విషయంలో నెల రోజులుగా కొనసాగుతున్న వివాదానికి తెర పడింది. ఇటీవల శివైక్యం పొందిన మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా ఎంపిక చేసినట్లు మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి తెలిపారు. శనివారం రాత్రి ఇరు కుటుంబాలతో దాదాపు 4 గంటలపాటు చర్చలు జరిపిన అనంతరం దేవదాయశాఖ సంయుక్త సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కందిమల్లాయపల్లె గ్రామస్తులు, భక్తులు అందరి సహకారంతో శనివారం వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా నిర్ణయించేందుకు పూర్వ మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ అంగీకరించారని తెలిపారు. అలాగే ఉత్తరాధికారిగా వీరభోగవసంత వేంకటేశ్వరస్వామి రెండో కుమారుడు వీరభద్రస్వామిని నియమించినట్లు చెప్పారు. వీరిద్దరి అనంతరం రెండో భార్య మహాలక్షుమ్మ పెద్ద కుమారుడు గోవిందస్వామిని మఠాధిపతిగా నియమించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. దేవదాయ శాఖ సహాయ కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మఠం అభివృద్ధికి దేవదాయశాఖ సహకరిస్తుందన్నారు. -
‘ఉద్యమ’ కేసులపై కోర్టుకు హాజరైన ఎమ్మెల్యేలు
గుంతకల్లు టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం 2018లో వైఎస్సార్సీపీ అధి ష్టానం ఇచ్చిన పిలుపు మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లు వైఎస్సార్ సీపీ నేతలు 11. 04.2018న రైల్‌రోకో నిర్వహించారు. దీనిపై ఆర్పీఎఫ్ పోలీసులు అప్పటి వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, ప్రస్తుత ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డితో పాటు పలువురిపై అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గురువారం వీరంతా గుంతకల్లులోని జేఎఫ్‌సీఎం కోర్టుకు హాజరయ్యారు. అలాగే, సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 2010లో గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో రైల్‌రోకో జరిగింది. దీనికి హాజరైన మైదుకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో పాటు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిపె అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ నిమిత్తం స్థానిక జేఎఫ్‌సీఎం కోర్టుకు హాజరయ్యారు. -
‘నిరూపించకపోతే సెంటర్లో నిలబడి లెంపలేసుకో’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అటవీ భూముల ఆక్రమణపై టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపణలను మైదుకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆసైన్మెంట్ కమిటీ ద్వారా ఎంతో మంది పేదలకు పట్టాలు ఇచ్చినట్లు, బి.మఠంలో తనకు ఒక్క సెంటు భూమి కూడా లేదని స్పష్టం చేశారు. తను అటవీశాఖ భూములను ఆక్రమించినట్లు చేసిన ఆరోపణలను నెల రోజుల్లో నిరూపించాలని పుట్టా సుధాకర్ యాదవ్‌కు సవాల్ విసిరారు. (బలమైన శక్తుల పేర్లు ఉన్నందు వల్లేనా!?) ఆక్రమణ జరిగినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపించని పక్షంలో మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో తప్పు ఒప్పుకొని లెంపలు వేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరంగా తీసుకొనే చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, అప్పట్లో ప్రభుత్వాన్ని మోసం చేసి కోట్లు సంపాదించారని విమర్శించారు. అలాంటి వ్యక్తికి తనను విమర్శించే హక్కు లేదన్నారు. తొందరలోనే సుధాకర్ యాదవ్ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని పేర్కొన్నారు. (ఏపీలో 5 లక్షలు దాటిన కరోనా విజేతలు!) -
ఓడించినా బాబుకు బుద్ధి రాలేదు
వైఎస్ఆర్ జిల్లా, దువ్వూరు/చాపాడు: ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి విమర్శించారు. అమరావతిలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ కార్యకర్తల దాడి, హత్యాయత్నాన్ని నిరసిస్తూ దువ్వూరు హైవే కూడలిలోని వైఎస్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు పద్దతి మార్చుకోవాలని, రాజకీయంగా ఎదుర్కొలేక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారన్నారు. అమరావతిలో ఎమ్మెల్యేలకే రక్షణ లేదని అలాంటి చోట అసెంబ్లీ ఎలా పెట్టాలని అన్నారు. అసెంబ్లీని విశాఖలోనే ఏర్పాటు చేయాలని శాసనసభ్యులందరికీ చెబుతామన్నారు. అక్కడ ఏ అభివృద్ది చేయలేదని కేవలం రాజకీయ బినామీలకు 4 వేల ఎకరాల్లో స్థలాలను కట్టబెట్టి కోట్ల రూపాయలు ఆర్జించాలని చూశారని, అందుకే టీడీపీ నేతలు ప్రజల తిరస్కారానికి గురయ్యారన్నారు. పాదయాత్ర సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన వైఎస్‌జగన్‌పై కత్తితో దాడి చేసి చంపాలని చూసింది కూడా చంద్రబాబే అన్నారు. ఎందుకంటే జగన్ సీఎం అవుతాడని బాబు ముందే తెలుసునని అందుకే అలాంటి కుట్ర పన్నాడన్నారు. అమరావతి అన్ని విధాల అభివృద్ది చేస్తామని చెబుతున్నా అక్కడ మాత్రమే అభివృద్ది చేయాలని, మిగిలిన జిల్లాల్లో అభివృద్ది వద్దన్న విధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు ఆందోళన పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దువ్వూరు కానాల జయంద్రారెడ్డి, గుర్రాల మునిరెడ్డి, నడిపి ఓబయ్య, అంకిరెడ్డి, రామసుబ్బారెడ్డి, వీవీ స్వామి, ఓబుళ్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, రాజశేఖరరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వీరారెడ్డి, కిరన్‌రెడ్డి, గౌస్, అమీ ర్, నాయభ్, మైదుకూరుకు చెందిన జ్వాలా నరసింహాశర్మ, మాచనూరు చంద్ర, కటారి వీరన్న, చాపాడు మండలం మాజీ జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, లక్షుమయ్య, నరసింహారెడ్డి, జయరామిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, జైనుల్లా, గంగులయ్య, ఖాజీపేటకు చెందిన గంగాధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నివేదికను ఎందుకు బయటపెట్టలేదు?
సాక్షి, అమరావతి: ఎవరైతే హేళన చేశారో వాళ్ల నోళ్లు మూయించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగుతోందని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. సీఎం జగన్ గెలిచాక ప్రకృతి కూడా సహకరిస్తుందన్నారు. రాష్ట్రంలో వాగులు, వంకలు, ప్రాజెక్టులు అన్నీ జలకళను సంతరించుకున్నాయన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రజలకు గ్రాఫిక్స్ చూపించి మభ్యపెట్టారని వ్యాఖ్యానించారు. శివరామకృష్ణన్ ఇచ్చిన నివేదికను టీడీపీ ఎందుకు బయట పెట్టలేదని, వాళ్ల సూచనలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన మొత్తం నామమాత్ర బిల్డింగుల నిర్మాణానికే సరిపోయిందని రఘురామిరెడ్డి విమర్శించారు. ఆయన పాలనలో చేపట్టిన నిర్మాణాల్లో ఒక్కటీ శాశ్వత నిర్మాణం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమరావతిలోని అసెంబ్లీ, సచివాలయం అసౌకర్యాల మధ్య ఉన్నాయన్నారు. అన్ని సౌకర్యాలతోపాటు అభివృద్ధి చెందిన విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంపై ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
సీమలో తాగునీటి సమస్య తీరనుంది: ఎంపీ అవినాష్
సాక్షి, వైఎస్సార్ కడప : కేసీ, తెలుగుగంగ ఆయకట్ట స్థిరీకరణ చారిత్రాత్మకమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లాలో సోమవారం కుందు నదిపై మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే మైదుకురు నియోజకవర్గంలో మౌలిక సదుపాయల కల్పన, జొలదరాసి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంలో రిజర్వయర్, రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్, జొన్నవరం వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. కరువు ప్రాంతాలపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఎంపీ అవినాష్ తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కన్న కలలను వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారని, రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అనేక ఉద్యమాలు చేసినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రాజోలి, జలదరాసి, కందు ప్రాజెక్టులు చరిత్రలో నిలిచిపోతాయని, రాయలసీమలో తాగునీటి సమస్యలు తీరనున్నాయని ఆయన అన్నారు. చదవండి : రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్ సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని బనగానపల్లి ఎమ్మెల్యే రామిరెడ్డి పేర్కొన్నారు. తమ నియోజకవర్గంలో నెలకొన్న తాగు, సాగు నీటి కష్టాలను వైఎస్ జగన్ గుర్తించారని, జలదరాసి ప్రాజెక్టు వల్ల రైతులకు మేలు జరుగుతందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల పక్షపాతి అని, 2400 కోట్లతో కుందూ నదిపై మూడు రిజర్వాయర్ల నిర్మాణం హర్షనీయమని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతి రాజ్యమేలిందని, వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని మైదుకురు ఎమ్మెల్యే రుఘురామిరెడ్డి దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్టుల వల్ల మైదుకురు, బద్వేలు, ప్రొద్దుటూరులో తాగునీటి సమస్య తీరనుందని ఆయన స్పష్టం చేశారు. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తాం : సీఎం జగన్ -
బచావత్ తీర్పు అర్థంకాకే టీడీపీ రాద్ధాంతం: బుగ్గన
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అర్థం కాకపోవడంతోనే టీడీపీ రాద్ధాంతం చేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు తన పాలనలో ఏనాడూ సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. అసెంబ్లీలో ఈ అంశంపై బుగ్గన మాట్లాడుతూ ఏమన్నారంటే.. ‘ టీడీపీ సభ్యులు ప్రతిసారి ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ (ఐఏ) వేసిన దాన్నే ప్రస్తావిస్తున్నారు. మనకు కృష్ణా జలాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూటీ-1) బచావత్ అవార్డులో నదీ జలాలను 2,130 టీఎంసీలుగా నిర్ధారించి.. ఏపీకి 800కుపైగా టీఎంసీలు, కర్ణాటకకు 700కుపైగా టీఎంసీలు, మహారాష్ట్రకు 500కుపైగా టీఎంసీల నీటిని కేటాయించారు. అంతకుమించి వచ్చే మిగులు జలాలకు సంబంధించి, ప్రాజెక్టులు కట్టుకుంటే వాటికి హక్కు రాదని బచావత్ అవార్డులో స్పష్టం చేశారు. ఆ తర్వాత బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు ఏదీ పట్టించుకోలేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, ఆ పనులు మొదలుపెట్టడంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కోర్టుతోపాటు, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. మిగులు జలాలపై ఎలాంటి హక్కు లేనప్పుడు ప్రాజెక్టులు ఎలా చేపడతారని ఆ రాష్ట్రాలు ప్రశ్నించాయి. దీంతో అప్పుడు ప్రభుత్వం ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ (ఐఏ) వేసింది. తమకు మిగులు జలాలపై హక్కు లేదని, ఆ విషయం అంగీకరిస్తున్నామని, అయినప్పటికీ 5 ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసింది. వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి వంటి ఐదు ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఆ ప్రాజెక్టులకు కోర్టు, ట్రిబ్యునల్ అడ్డుపడకుండా ఉండాలంటూ, బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కోట్ చేస్తూ, దాన్నే చూపుతూ, ఆ చట్టం పరిధిలోనే అప్పుడు వైఎస్సార్ ప్రభుత్వం ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసింది’ అని బుగ్గన వివరించారు. ‘ఇక రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి టీడీపీ చేసిన పనులు చూస్తే.. హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.5 వేల కోట్లు కాగా, 9 ఏళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.13 కోట్లు మాత్రమే. అదే ప్రాజెక్టుపై దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రూ.3 వేలకోట్లకుపైగా ఖర్చు చేసింది. ఇంకా గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టుపై 2004 నుంచి 2014 వరకు చేసిన ఖర్చు రూ.5036 కోట్లు చేయగా, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుపై రూ.6593 కోట్లు ఖర్చు చేశారు. అయితే అందులోనూ నిజానికి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వమే 2004-09 మధ్య ఆ ప్రాజెక్టులపై చాలా ఖర్చు చేసింది. రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఆ ప్రాజెక్టులపై ఒకవేళ దృష్టి పెట్టి ఉంటే, కేవలం ఒక ఏడాదిలోనే అవి పూర్తయి ఉండేవి’ అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. చంద్రబాబే సమాధానం చెప్పలి రాయలసీమ ప్రాజెక్టుల గురించి టీడీపీ నేతల ప్రశ్నలకు చంద్రబాబే సమాధానం చెప్పాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. గండికోట ప్రాజెక్టులో నీరు ఎందుకు నింపలేదని ప్రజలు అడుగుతున్నారని, ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాయలసీమ ప్రాజెక్టుల కాలువలకు కనీసం మరమ్మతులు కూడా చేయలేదని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులకు భూసేకరణ చేసి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఉంటే నీరు నిల్వ ఉండేవాళ్లమని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతులు ఆయనను కలిసేందుకు వెళ్లినా పట్టించుకోలేదని, అరెస్టులు చేయించి.. కేసులు పెట్టించారని గుర్తు చేశారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి రాయలసీమలో మూడు సీట్లే ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. పొత్తిరెడ్డిపాడు విస్తరణ పనులు చేపట్టింది వైఎస్సారేనని కొనియాడారు. రాయలసీమను అన్నిరకాలుగా ఆదుకోవాల్సిన టీడీపీ ఆ రోజు నిద్రపోయిందని అన్నారు. -
కడప జిల్లాలో టీడీపీ ఖాళీ
సాక్షి, కడప : జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయిందని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన వారంతా నేడు బీజేపీలోకి ఫిరాయించారని ఎద్దేవా చేశారు. శుక్రవారం కడపలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 24,25, 26 తేదీల్లో ప్రతిపక్షనేత చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తున్నట్లు చెబుతున్నారని, ఆయన పర్యటన ఖరారై రెండు సార్లు రద్దయిందన్నారు. ఎంపీ సీఎం రమేష్ బీజేపీలోకి వెళ్లడంతో మొదటిసారి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పార్టీ మారడంతో మరోసారి రద్దయిందని చెప్పారు. కడప పర్యటన చంద్రబాబుకు అచ్చి రావడం లేదని ఎద్దేవా చేశారు. జిల్లా అభివృద్ధిని పట్టించుకోకుండా, అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు మూడు రోజులు పర్యటించని ఆయన ఇప్పుడు మూడు రోజులు పర్యటించడానికి గల కారణాలేమిటో చెప్పాలన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైఎస్ఆర్సీపీ నాయకులను హతమార్చి, అనేక మందిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఆనాడు తీవ్రంగా నష్టపోయి అన్యాయానికి గురైన వారు నేడు స్పందన కార్యక్రమంలో అధికారులకు మొరపెట్టుకుంటున్నారని, పోలీసులు వారి అర్జీలపై నిష్పాక్షికంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కోడెల శివప్రసాద్‌రావు, చింతమనేనిపై పెట్టిన కేసులు ఈ కోవలోకే వస్తాయన్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక కాలువగట్లపై పడుకొని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ మాటను గాలికొదిలేసి ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లిస్తున్నామని చెప్పి ఒక్క చుక్క ఇవ్వకపోయినా రూ.1600కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అన్న బాబు ఎంపీ సీఎం రమేష్‌తో 12 రోజులు దొంగ దీక్ష చేయించారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది రైతులు, అగ్రిగోల్డ్, కాల్‌మనీ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోచుకుతిన్నారని, సామాన్య రైతులకు ఎక్కడా ఇసుక ఉచితంగా లభించలేదన్నారు. తమ ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చి నూతన ఇసుక పాలసీ అమలు చేస్తుంటే నాడు ఇసుక మాఫియా వ్యవహించిన వారంతా ఇబ్బంది పడుతూ రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు.వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 1.50లక్షల సచివాలయ ఉద్యోగాలు అత్యంత పారదర్శకంగా భర్తీ చేసినట్లు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హెల్త్ డ్రింక్ పేరుతో మద్యాన్ని ఏరులై పారిస్తే సీఎం వైఎస్ జగన్ నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి మద్యం దుకాణాలు, బార్లను తగ్గించి, సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు. కేపీ ఉల్లిని ఎగుమతి చేసేందుకు కేంద్రానికి వినతి జిల్లాలో పండిస్తున్న కేపీ ఉల్లిని ఎగుమతి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి లేఖ రాసినట్లు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, కరిముల్లా పాల్గొన్నారు. -
‘దద్దమ్మల పార్టీ ఏదైనా ఉంటే అది టీడీపీనే’
సాక్షి, కడప : క్రిమినల్ కేసులు నమోదైన టీడీపీ కార్యకర్తకు మాజీ సీఎం చంద్రబాబు వంత పాడటం విడ్డురంగా ఉందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా దుయ్యబట్టారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, పార్లమెంటరీ అధ్యక్షుడు సురేశ్‌బాబులతో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మైదుకూరు బి.మఠంకు చెందిన టీడీపీ కార్యకర్త ముద్దు కృష్ణంనాయుడుపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడులు చేశారని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ముద్దు కృష్ణంనాయుడుపై ఎన్నో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అలాంటి వ్యక్తికి బాబు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిన కృష్ణంనాయుడిని మైదుకూరు టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ముద్దు కృష్ణంనాయుడుపై ఉన్న ఆరోపణలు రుజువు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామంలో జరిగిన చిన్న ఘర్షణపై సీఎం స్పందించాలని కోరడం విడ్డురంగా ఉందన్నారు. గత ఐదు సంవత్సరాలలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా టీడీపీ వ్యవహరించిందని.. దద్దమ్మల పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ మాత్రమేని అంజాద్ బాషా విమర్శించారు. టీడీపీ పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చంద్రబాబు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. గతంలో టీడీపీలో ఉన్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని అన్నారు. సచివాలయ ఉద్యోగాల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని, సీఎం జగన్‌కు పెరిగిపోతున్న ప్రజాదరణ ఓర్వలేకే టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తోందన్నారు. -
టీడీపీ ఉనికి కోసమే డ్రామాలు
సాక్షి, కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వంద రోజుల పాలనకు ప్రజల నుంచి వస్తున్న ప్రశంసలు, మన్ననలను ఓర్వలేకే ప్రతిపక్షనేత చంద్రబాబు పక్కదారి పట్టించేందుకు ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమం చేపట్టారని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి విమర్శించారు. బుధవారం ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ వంద రోజులు విజయవంతంగా పాలన అందించారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు సంబంధించి 20 అంశాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి 19 తీర్మాణాలు ఆమోదించారన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 75 శాతం హామీలను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. గ్రామ సచివాలయాల పరీక్షలు 8 రోజుల పాటు ఎక్కడా ఒక్క విమర్శ రాకుండా యూపీపీఎస్సీ తరహాలో నిర్వహించారని చెప్పారు. ఇంటర్వ్యూలు నిర్వహిస్తే తప్పులు జరుగుతాయని, ఎమ్మెల్యేలు, నాయకులు ఒత్తిడి తెచ్చినా మెరిట్ ప్రాతిపదికన పారదర్శకంగా ఉద్యోగాలిస్తున్నారని, తద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని అక్టోబర్ నుంచి తెస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులు గుర్తించి ఆ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటూ, అన్ని సామాజిక వర్గాలకు మేలు చేకూరే విధంగా ప్రతినెలలో ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు వీలుగా షడ్యూల్ ప్రకటించారన్నారు. వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై అన్ని వర్గాల ప్రజల మన్ననలు, ప్రశంసలు ఓర్వలేక ప్రతిపక్షనేత చంద్రబాబు ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. దళిత ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టి ఈడ్చినప్పుడు, యరపతినేని ఆధ్వర్యంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయినప్పుడు, కోడెల, ఆయన కుమార్తె, కుమారుడు విచ్చలవిడిగా అక్రమాలు చేస్తున్నప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో లెక్కలేనన్ని అరాచకాలు, అక్రమాలు చేశారని ఇప్పుడు అవన్నీ వెలుగులోకి వస్తుంటే తట్టుకోలేకపోతున్నారన్నారు. ఆత్మకూరులో 40 ఏళ్లుగా ఫ్యాక్షన్ ఉందని, అక్కడ ఏడుగురిని హత్య చేశారన్నారు. దీన్ని బూచిగా చూపి ప్రజలను పక్కదారి పట్టించాలనుకోవడం దారుణమన్నారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేస్తే చంద్రబాబు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమన్నారు. ఇదంతా నీవు నేర్పిన విద్యే కదా అని వారు ఎద్దేవా చేశారు. ఆత్మకూరులో నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నాయని, అందుకే చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేశారన్నారు. కానీ గత ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి ఎప్పుడు జిల్లాకు వచ్చినా నిషేధాజ్ఞలు అమల్లో లేకపోయినా వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్టులు చేసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నీవు ప్రవేశపెట్టిన సంప్రదాయంపై ప్రశ్నించే హక్కు నీకుందా అని వారు నిలదీశారు. టీడీపీ హయాంలో వేలకోట్ల కాంట్రాక్టులు చేసి సంపాదించిన వారంతా ఏ పార్టీలో ఉన్నారో అందరీ తెలుసన్నారు. టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరింది నీ అనుమతితో కాదా అని వారు సూటిగా ప్రశ్నించారు. బ్రహ్మం సాగర్‌లో నీటిని నింపాలని ఎంపీ, ఎమ్మెల్యేలమంతా ఎన్ని ఆందోళనలు, ధర్నాలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, 0–18 కీ.మీ కాలువ పనులను పూర్తి చేసి 5వేల క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చే వీలున్నా ఆ పని చేయలేదన్నారు. డిసెంబర్ 26న ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన, కుందూ నుంచి తెలుగుంగకు లిఫ్ట్ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని తీసుకురావడానికి రూ.500కోట్లతో పనులు చేపట్టనున్నారని వివరించారు. మాజీ జెడ్పీ వైస్ ఛైర్మెన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, బీసీ విభాçV ం జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్, చీర్ల సురేష్‌యాదవ్ పాల్గొన్నారు. -
‘ఏం జరిగిందని చలో ఆత్మకూరు?’
సాక్షి, వైఎస్సార్: రాష్ట్రంలో ఏం జరిగిందని టీడీపీ నేతలు ‘చలో ఆత్మకూరు’ అంటూ పిలుపునిచ్చారని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ప్రశ్నించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తోన్న జనాదరణ చూసి ఓర్వలేకే టీడీపీ నేతలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారని మండి పడ్డారు. రాష్ట్రంలో ఏం జరగకపోయినా చలో ఆత్మకూరు అంటూ పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు. గతంలో టీడీపీ హయాంలో మహిళా ఎమ్మార్వోపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడి చేస్తే చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారని రఘురామి రెడ్డి ప్రశ్నించారు. త్వరలోనే అవినీతి టీడీపీ నాయకుల బండారం బయటపెడతామని ఆయన హెచ్చరించారు. గతంలో చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారి.. ఇక్కడి వైసీపీ నేతలను అక్రమ అరెస్ట్ చేయలేదా అని రఘురామి రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ద్వారా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు చేసుకున్న నేతలు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారో అందరికి తెలుసన్నారు. చంద్రబాబు అనుమతితోనే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లారని ఆయన ఆరోపించారు. ప్రజలకు మేలు కలిగిలే సీఎం జగన్ పాలన ఉందన్నారు రఘురామి రెడ్డి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దాదాపు 75శాతం హమీలను అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్ అని ప్రశంసించారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేలా అవకాశాలు కల్పించడం హర్షించదగ్గ విషయం అన్నారు. అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి 19 చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టారన్నారు. -
వైఎస్ చొరవతో సీమకు కృష్ణా జలాలు
సాక్షి, కడప : రాయలసీమ ప్రాంతానికి కృష్ణజలాలు వస్తున్నాయంటే ఆది కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషేనని ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం మైలవరం జలాశయం నుంచి రెండు గేట్ల ద్వార 1000 క్యూసెక్కుల నీటిని పెన్నానదిలోనికి విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ నేడు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో వ్యవహరించి శ్రీశైలంతో గండికోటకు కృష్ణజలాలు తరలించే ఏర్పాటు చేశారన్నారు. పెన్నానదిలోనికి నీరు వదలడం ద్వారా కుందూ పెన్నా నదులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఉన్న పరివాహక ప్రాంతాలకు తాగునీటి సమస్య ఉత్పన్నం కాదన్నారు. రాయలసీమలో వర్షాలు పడకపోయినా కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రలలో వర్షాలు విస్తారంగా వర్షాలు పడటంతో అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండుకుండాలా మారిపోయి అదనంగా పైనుంచి ఇంకా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోనికి వదులుతున్నారన్నారు. దీని ద్వారా రైతుల పంటలసాగుకు నీరు అందే అవకాశం ఉందన్నారు. 2005లో దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలో అన్నిపార్టీల సమావేశాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని ఒక్కసారిగా తీసుకుని వెళ్లేవిధంగా చర్యలు చేపడితే అప్పట్లో మాజీ మంత్రి దేవినేని ఉమ ఇలా తీసుకుని పోవడం వల్ల నాగార్జున సాగర్‌కు నీరు వచ్చే అవకాశంలేదంటూ అడ్డుకోవడం జరిగిందన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ వాసులు తాగు,సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మొండిగా హెడ్‌రెగ్యులేటర్ స్థాయిని పెంచి గాలేరు–నగరి సుజలస్రవంతి ద్వార గండికోట ప్రాజెక్టుకు నీటిని రప్పించే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంలోరాజన్నరాజ్యం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలనలో రాజన్నరాజ్యం ఆవిష్కృతమవుతోందన్నారు. గతంలో టీడీపీ హాయంలో ఒక్కసారి మాత్రమే ఎన్నికల ముందు కృష్ణజలాలను గండికోటకు నీటిని రప్పించారన్నారు. జగన్ పాలనలో మూడు నెలల కాలంలోనే గండికోట, మైలవరం, పైడిపాలెం, సర్వారాయసాగర్, వామికొండ ప్రాజెక్టులలో సైతం నీటిని నింప డం జరుగుతుందన్నారు. ఇది చదవండి : వైఎస్ హయాంలో రైతే రాజు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం ప్రాం తాల ప్రజలకు తాగునీటికి ఇబ్బందిలేకుండా చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో కరు వు కాటకాలతో ప్రజలు అల్లాడిపోయారన్నారు. నేడు జగన్ పాలనలో ప్రాజెక్టులన్ని నీటితో కళకళలాడుతున్నాయన్నారు. మరో రెండునెలల కాలంలో వర్షాలు పడే అవకాశం ఉందని తిరిగి శ్రీశైలం నిండిపోయి మరోసారి గండికోట, మైలవరం జలాశయాలలోనీటిని నింపుతామన్నారు. -
మానవత్వం చాటిన ఎమ్మెల్యే
సాక్షి, మైదుకూరు(కడప) : బ్రహ్మంగారిమఠం మండలంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి వెళుతూ అప్పుడే జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడి పట్ల మానవత్వం చూపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బి.మఠం మండలంలోని పెద్దిరాజుపల్లెలో రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి జీవీ సత్రం మీదుగా కారులో వెళుతున్నారు. జెడ్పీ హైస్కూల్ సమీపంలో మోటారు సైకిల్‌ను లారీ ఢీ కొనడంతో మోటారు సైకిల్‌పై వెళుతున్న ఇద్దరిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన జరిగిన కొద్ది నిమిషాలకే అటుగా వెళుతున్న ఎమ్మెల్యే కారును ఆపి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. బాధితుడి వివరాలు తెలుసుకున్నారు. బి.కోడూరు మండలం మేకవారిపల్లెకు చెందిన గురవయ్య అని తెలుసుకున్నారు. బాధితుడి పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చికిత్స కోసం రూ.10వేలు నగదును అందజేశారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న పరిసరాల్లోని ప్రజలు ఎమ్మెల్యే ఔదార్యాన్ని ప్రశంసించారు. -
టీడీపీ ఇన్చార్జి పుట్టాకు పెద్ద షాక్..!
సాక్షి, చాపాడు : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ను ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఊహించని పెద్ద షాక్ తగిలింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన మండల టీడీపీ నాయకుడు వెంకటసుబ్బయ్య అనుచరగణంతో సోమవారం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేసి మెజార్టీ ఓట్లు తెప్పించిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.మండలంలోని నక్కలదిన్నె పంచాయతీలోని తిప్పిరెడ్డిపల్లెకు చెందిన మల్లెం వెంకటసుబ్బయ్య యాదవ్‌తో పాటు 80 కుటుంబాలకు చెందిన టీడీపీ వర్గీయులు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాలను వేసిన వెంకటసుబ్బయ్య వర్గీయులను ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటసుబ్బయ్యతో పాటు చిన్న ఎల్లయ్య, గంగరాజు, పామిడి రామసిద్దయ్య, కొండయ్య, ఓబయ్య, సి, విజయుడు, బిర్రు ఆంజనేయులుతో 80 కుటుంబాలకు చెందిన టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు రాజకీయాల్లో వచ్చిన పుట్టా సుధాకర్‌యాదవ్ తమ సామాజిక వర్గానికి చెందిన వాడనే అభిమానంలో రఘురామిరెడ్డిని కాదని టీడీపీలో చేరారు. ఎన్నికల సమయంలో వెంకటసుబ్బయ్యపై దాడులు కూడా జరిగాయి. ఎన్నికల్లో చిన్న గ్రామమైన తిప్పిరెడ్డిపల్లె టీడీపీకి మెజార్టీ ఓట్లు తెప్పించారు. అనుచరులతో కలిసి టీడీపీలో చేరడాన్ని పుట్టా వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిసింది. రెండేళ్లుగా అవమానాలు భరిస్తూ వచ్చానని ఇక విలువల్లేని పుట్టా వద్ద వద్దనుకుని వైఎస్సార్సీపీలో చేరినట్లు వెంటకసుబ్బయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎంపీపీ వెంకటలక్షమ్మ భర్త లక్షుమయ్య, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, నాయకులు రామచంద్రయ్య, సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, రాజు, మురళీ, కిట్టయ్య, రమణారెడ్డి, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
‘అన్యాయంగా మా కార్యకర్తల పేర్లు చేర్చారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఓట్ల తొలగింపు వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేర్లు ఉండటం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే రఘురామ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం మరో ఎమ్మెల్యే అంజాద్ భాషా, కడప మేయర్ సురేష్ బాబుతో కలిసి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను కలిశారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో కావాలనే తమ కార్యకర్తల పేర్లను చేర్చారని ఎస్పీకి తెలిపారు. నేర చరిత్ర చూశాకే బైండోవర్ కేసులు పెట్టాలని విన్నవించారు. ఓట్ల తొలగింపు దొంగలను పట్టుకుని శిక్షించాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అయితే ఓట్ల తొలగింపు వ్యవహారంలో వైఎస్సార్సీపీ శ్రేణులను కేవలం విచారణ మాత్రమే చేస్తున్నామని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
‘అతడు లోకేష్‌కు ప్రియ శిష్యుడు’
వైఎస్సార్ జిల్లా: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు చూస్తుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్లాన్ చేసి చంపేందుకు ప్రయత్నించినట్లుగా స్పష్టంగా తెలుస్తోందని కడప వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంజద్ బాష తెలిపారు. మంగళవారం మైదుకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, రాజంపేట పార్లమెంటు వైస్సార్సీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలతో కలిసి పార్టీ కార్యాలయంలో అంజద్ బాష విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబులోని రాక్షసత్వం ఇప్పుడు బయటపడిందని అంజద్ భాషా వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులకి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అడ్డుగా ఉన్నారు.. అందుకే పథకం ప్రకారం ఆయన్ను తుదముట్టించాలని చూశారని పేర్కొన్నారు. మా కార్యకర్తలను రెచ్చగొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.. టీడీపీ నాయకులు ఎన్ని చేసినా మా కార్యకర్తలు సంయమనంతో ఉన్నారు, ఉంటారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి షర్మిల చేయించారనడానికి సిగ్గుండాలని తీవ్రంగా మండిపడ్డారు. అలిపిరి సంఘటన వెనక నారా భువనేశ్వరీ, లోకేష్‌లు ఉన్నారని అంటే మీరు ఒప్పుకుంటారా అని సూటిగా అడిగారు. ఆపరేషన్ గరుడ కర్త, కర్మ, క్రియ ఎవరో రాష్ట్ర ప్రజలకి తెలియాలని కోరారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడు కత్తితో దాడి చేస్తే టీడీపీ నేతలు ఫోర్క్ అనడం ఏమిటని ప్రశ్నించారు. దాడి జరిగిన విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సీసీ కెమెరాలు కూడా లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏదైనా జరిగితే అడిగే హక్కు గవర్నర్‌కు లేదా అని సూటిగా టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఈ కేసులో కీలక నిందితుడు హర్షవర్దన్ చౌదరీ, లోకేష్‌కు ప్రియ శిష్యుడని వెల్లడించారు. అందుకే చర్యలు లేవని చెప్పారు. ఘటన జరిగిన గంటకే ఎలాంటి విచారణ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి నిందితుడు వైఎస్ఆర్సీపీ వీరాభిమాని అని చెప్పిన డీజీపీతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు రావని, స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడి కులం పేరు చెప్పడం దారుణమన్నారు. వైఎస్జగన్ హైదరాబాద్ చేరకముందే డీజీపీ స్పందించడంపై అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే బాధ్యత తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి అవహేళనగా మాట్లాడటం హేయమైన చర్య అని అన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తే ఆ విజ్ఞత మన ముఖ్యమంత్రికి లేకుండా పోయిందన్నారు. కేంద్రం మీద నెట్టే దానికే పాదయాత్రలో కాకుండా ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం చేశారని వెల్లడించారు. -
చంద్రబాబు దర్శకత్వం.. శివాజీ నటనతో
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడితో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మాట్లాడుతూ..ఎమ్మెల్యేలను రూ.30 కోట్లకు కొనుగోలు చేసిన చంద్రబాబు, శ్రీనివాసరావుకు రూ.100 కోట్లు ఆఫర్ చేసినా చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కుటుంబం లేకపోతే తనకు తిరుగులేదని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. రాజారెడ్డిని హత్య చేయించింది నువ్వు కాదా..దోషులకు ఆశ్రయం కల్పించింది నువ్వు కాదా? అని సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. వైఎస్సార్ మరణం వెనక కూడా అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇంత వరకు ఆ కేసు గురించి నిజాలు బయటకు రాలేదని తెలిపారు. చిచ్చరపిడుగులా ఎదుగుతున్న వైఎస్ జగన్‌పై కచ్చితంగా చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు తప్ప అన్ని పార్టీలు దాడిని ఖండించాయని తెలిపారు.ఇతర పార్టీలు ఖండించినా జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తెలుగు దేశం నేతల స్పందన ఎంత జుగుప్సాకరంగా ఉందో ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. జగన్ ఎంత హుందాగా వ్యహరించారో గమనించాలని కోరారు. చంద్రబాబు దర్శకత్వంలో..సినీ నటుడు శివాజీ నటనతో గరుడపురాణం నడుస్తున్నదని అన్నారు. శివాజీని అరెస్ట్ చేస్తే ఆపరేషన్ గరుడ సూత్రధారులు ఎవరో బయటకు వస్తారని చెప్పారు. దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ..మూడు నెలల నుంచి ఈ కుట్ర జరుగుతోందని స్పష్టం అవుతోందని వ్యాక్యానించారు. శివాజీ గరుడ లీక్ దీనికి నాంది అని వివరించారు. దీని వెనక ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఒక మీడియా అధిపతి ఉన్నారని వెల్లడించారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. శివాజీ ఇప్పుడే అమెరికా వెళ్లడంపై కూడా అనుమానాలకు తావిస్తుందని అన్నారు. ఇది అంతా ఒక పథకంలో భాగంగానే జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. మీలా తాము దిగజారదలచుకోలేదని చెప్పారు. వారి మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. మేధావులు, ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. అప్పుడు పెరుగువడ అన్నాను కానీ..ఇప్పుడు అసలు కథ అర్ధం అవుతోందని పరోక్షంగా టీడీపీ కుట్రల గురించి ప్రస్తావించారు. ఇలానే వదిలేస్తే చాలా ఘోరాలు జరుగుతాయని పేర్కొన్నారు. తాము అడ్డదారిలో గద్దెనెక్కే వాళ్లం కాదని, భయపడి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయవద్దని కోరారు. టీడీపీ నేతలు తమ భాషను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించారు. -
2019 ఎన్నికలే టీడీపీకి చివరివి
కడప కార్పొరేషన్: తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికలే చివరి ఎన్నికలని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి అన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో కడపలోని అంబేడ్కర్ సర్కిల్లో చేపట్టిన 48 గంటల నిరుద్యోగ దీక్ష గురువారం ఉదయం ముగిసింది. నగర మేయర్ కె. సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాలతో కలిసి రఘురామిరెడ్డి దీక్ష చేస్తున్న వారికి పండ్ల రసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి అంటూ ప్రభుత్వం నిరుద్యోగులకు పంగనామాలు పెడుతోందన్నారు. కేవలం 5 శాతం మందే భృతికి అర్హులయ్యారని, మిగిలిన 95 శాతం మందికి రాలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల 8 నెలలైందని , ఇప్పటికి ఒక్కో నిరుద్యోగ అభ్యర్థికి నెలకు రెండువేల చొప్పున ప్రభుత్వం లక్షకు పైగా బాకీ ఉందన్నారు. అదంతా ఇవ్వకుండా నాలుగు నెలల్లో ఎన్నికలొస్తున్నాయని, నాలుగువేలు ఇచ్చి ఓట్లు దండుకోవడానికే ఈ డ్రామా అడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు కుమారుడికి తప్ప మరెవరికీ ఉద్యోగం రాలేదన్నారు. రాజధానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని చెబుతున్నారని, వాస్తవానికి అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకొని మోదీకి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్నారు. ఈరోజు యూ టర్న్ తీసుకొని హోదా కావాలని చంద్రబాబు అడిగినాప్రజలు విశ్వసించరని తెలిపారు. 2014లో టీడీపీకి పవన్ అండ లేకపోయి ఉంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు రైతులు, మహిళలు, ఉపాధ్యాయులు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని, వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా మాట్లాడుతూ ముఖ్య మంత్రి తాగే నీళ్ల బాటిల్ విలువ రూ.750 అని, ఇటీవల టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష సందర్భంగా తాగిన నీళ్ల బాటిల్ విలువ రూ.1500 అన్నారు. నిరుద్యోగుల జీవితాలు ఆ మాత్రం విలువ చేయవా అని ఆయన ప్రశ్నించారు. రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే యువత తిరగబడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర నాయకులు తుమ్మలకుంట శివశంకర్, నగ ర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, మాజీ అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు పాకా సురేష్, ఎస్ఏ షంషీర్‌బాషా, నాయకులు మధువర్థన్‌రెడ్డి, కోటా శ్రీనివాసులు పాల్గొన్నారు. -
అభ్యర్థులను ప్రకటించే దమ్ము ఉందా?
సాక్షి, వైఎస్సార్ : సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా అభివృద్ది కోసం కాదని, పార్టీ అంతర్గత కలహాలను అరికట్టేందుకు మాత్రమే కడప వస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి, మేయర్ సురేష్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు కడప పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మంగళవారం వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఇప్పటి వరకు 25 సార్లు జిల్లాకు వచ్చారు. నాలుగేళ్లలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలైనా చేశారా? అభివృద్ది కాలేదు కాని అప్పులు మాత్రం అయ్యాయి. నెల్లూరు ప్రజలు ఛీ కొడితే దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ జిల్లాపై పెత్తనం చెలాయించడం దుర్మార్గం. రైతులను మంత్రి సోమిరెడ్డి నిలువునా మోసం చేశారు. రాయలసీమ పట్ల చంద్రబాబు ఎందుకంత వివక్ష చూపుతున్నారు. ఇప్పటికిప్పుడు జిల్లాలోని జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిని ప్రకటించే దమ్ము చంద్రబాబుకు ఉందా? తెలంగాణలో సీఎం కేసీఆర్ సెప్టెంబర్‌లోపు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తామని అంటున్నారు. ఆ ధైర్యం మన సీఎంకి ఉందా?’ అని పేర్కొన్నారు. -
కేసీ కెనాల్‌కు నీళ్లిచ్చే ఆలోచన చంద్రబాబుకు ఉందా?
-
‘ఆనాడే దీక్ష చేస్తే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ వచ్చేది’
సాక్షి, కడప : ఎన్నికల కోసమే టీడీపీ దీక్ష చేస్తోంది కానీ జిల్లా ప్రజలపై ప్రేమతో కాదని వైఎస్సార్ సీసీ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో చేపడుతున్న పోరాటంలో భాగంగా జమ్మలమడుగులో వైఎస్సార్ పీపీ ఆధ్వర్యంలో ఉక్కు సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశంతో ప్రత్యేక హోదా, విభజన హామీలైన ఉక్కు పరిశ్రమ కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేశామన్నారు. ఆనాడే తమతోపాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే కేంద్రం దిగొచ్చెదన్నారు. టీడీపీ ఇప్పుడు దీక్ష చేస్తే ఏం ఫలితం ఉంటుందని విమర్శించారు. ఉపఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి బుద్ది వచ్చేలా తీర్పునివ్వాలని ప్రజలను కోరారు. సీఎం రమేష్‌ది కార్పొరేట్ దీక్ష : అంజాద్ బాషా ఆనాడు వైయస్సార్ తలపెట్టిన స్టీల్ ప్లాంట్ అడ్డుకోకుండా ఉంటే లక్ష మందికి ఉపాధి లభించేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ అన్నారు.దీక్షలో ఆయన మాట్లాడుతూ..సీఎం రమేష్ రోజుకు రూ. కోటి ఖర్చు పెట్టి దీక్ష చేస్తున్నారని..అది కార్పొరేట్ దీక్ష అని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ తప్పా ఎవరికీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీజేపీతో వైఎస్సార్సీపీ జతకట్టే ప్రసక్తే లేదన్నారు. కొద్ది రోజుల్లో మైరారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. కప్పం కట్టందే పథకం రాదు : రఘురామి రెడ్డి జన్మభూమి కమిటీకి కప్పం కట్టందే సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని మైదుకూరు ఎమ్మెల్యే రుఘురామి రెడ్డి ఆరోపించారు. టీడీపీ వాళ్ల సొంత అభివృద్ధి తప్పా రాష్ట్రం అభివృద్ధే లేదని ఎద్దేవా చేశారు. జమ్మలమడుగు అభివృద్ధి ఉక్కు ఫ్యాక్టరీతో ముడిపడి ఉందన్నారు. వైయస్సార్ బతికి ఉండిఉంటే జమ్మలమడుగు పరిస్థితి ఇలా ఉండకపోవునని వ్యాఖ్యానించారు. టీడీపీకి బుద్ది చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు -
ట్రాక్టర్ల ర్యాలీతో కదం తొక్కిన వైఎస్సార్సీపీ
-
500 ట్రాక్టర్లతో వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ
సాక్షి, మైదుకూరు/వైఎస్సార్ కడప: రైతుల సంక్షేమం పట్ల టీడీపీ నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులతో కలిసి కదం తొక్కింది. జిల్లాలోని రాజోలి ఆనకట్టను నిర్మించాలనీ, కేసీ కెనాల్‌కు సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్లతో రైతులు, వెఎస్సార్ సీపీ నాయకులు రాజోలి ఆనకట్ట నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. రాజోలి ఆనకట్టను నిర్మించి కేసీ కెనాల్ రైతులకు న్యాయం చేయాలన్నారు. 2008లో వైఎస్సార్ శంకుస్థాపన చేసిన రాజోలి ఆనకట్టను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా ఆనకట్టను నిర్మించడం లేదని మండిపడ్డారు. జిల్లాలోని సగం నియోజకవర్గాలకు నీరందించే రాజోలి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం తగదని వ్యాఖ్యానించారు. బుధవారం కడపలో పర్యటించనున్న చంద్రబాబుకు కనువిప్పు కలిగేందుకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించామని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. -
‘బాబు బినామీలకు రూ.240 కోట్ల భూమి’
సాక్షి, కడప: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ప్రతి పనుల్లో లక్షల కోట్ల రూపాయలలో అవినీతి చేశారని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. రూ. 240 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని జీఓ నెంబర్.523, 547 ద్వారా చంద్రబాబు తన బంధువులకు, బినామీలకు కారుచౌకగా, అప్పనంగా అప్పజెప్పారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమలాపురం, మైదుకూరు ఎమ్మెల్యేలు రవీంద్రనాధ్ రెడ్డి, రఘురామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేశ్‌బాబు సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మూడేళ్లు సంసారం చేసి ఇప్పుడు మూడు పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని టీడీపీ, బీజేపీ, జనసేనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లక్షల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసి ఈరోజు కేంద్రం ఇవ్వలేదని టీడీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మొదటి నుంచి హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ప్రత్యేక హోదాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామన్నారే తప్ప బీజేపీకి మద్దతు ఇస్తామని వైఎస్ జగన్ ఎప్పుడూ చెప్పలేదని గుర్తుచేశారు. జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలకు మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిందీ ఏమీ లేదన్నారు. గండికోట ముంపు బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని, కేంద్రం అడుగుతున్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి కేవలం వసూళ్ల కోసమే చంద్రబాబు పని చేస్తున్నారని ఆరోపించారు. -
కౌన్సిలర్ పదవికి రాజీనామా
ప్రొద్దుటూరులోని 20 వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఆశం రఘరామి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డికి అందజేశారు. ప్రస్తుతం ఉన్న చైర్మన్ ఉండేల గురివిరెడ్డి తన పదవీకాలం ముగిసినా రాజీనామా చేయకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో మున్సిపల్ చైర్మన్ పదవి ఉండేల గురివిరెడ్డికి2 సంవత్సరాలు, ఆశం రఘరామిరెడ్డికి 3 సంవత్సరాలు పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు సంవత్సరాలు గడిచి నెలరోజులు అవుతున్నా గురివిరెడ్డి రాజీనామా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
అవినీతిపై పోరాడుతున్నందునే అక్రమ కేసులు
♦ అవినీతి అధికారులను వదిలే ప్రసక్తే లేదు ♦ ఉద్యమించైనా హక్కులను కాపాడుకుంటాం ♦ పిలిచి అవమానించడం న్యాయమేనా..? ♦ ప్రొటోకాల్ ఉల్లంఘించే వారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలి ♦ అధికారుల తీరుపై విరుచుకుపడిన ♦ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కడప కార్పొరేషన్: అవినీతిపై పోరాడుతున్నందునే వ్యవసాయ శాఖ ఏడీ, ఏఓలు తనపై అక్రమ కేసు నమోదు చేయించారని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వ్యవసాయశాఖ అధికారులు అవలంబించిన తీరుపై నిప్పులు చెరిగారు. ఏరువాక కార్యక్రమం ఉందని వ్యవసాయ శాఖ ఏడీ, ఏఓ పిలిస్తేనే వెళ్లానని, తాను ఎంపీడీఓ కార్యాలయంలో ఉండగానే టీడీపీ నాయకులు సుధాకర్ యాదవ్, రెడ్యం వెంకటసుబ్బారెడ్డిలతో కార్యక్రమం ప్రారంభించి, పరికరాలు పంపిణీ చేశారన్నారు. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా... సీనియర్ శాసన సభ్యుడినైన తన పట్ల అధికారులు వ్యవహించే తీరు ఇదేనా అని ధ్వజమెత్తారు. మైదుకూరు వ్యవసాయ శాఖ అవినీతిలో ముందుందని, విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఏడీ అవినీతిపై గత ఏడాది డిసెంబర్లో ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశానన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు బాధ్యతలతోపాటు ప్రొటోకాల్ ఉంద ని, దాన్ని రక్షించే బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఆయన చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉందన్నారు. తన హక్కుల కోసం ఏరకమైన పోరాటాలు చేసేందుకైనా సిద్ధమన్నారు. దూషించే తత్వం మాకు లేదు అధికారులను దూషించే మనస్తత్వం, బెదిరించే సంస్కృతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తెలిపారు. తహసీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టి ఈడ్చిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని లాంటివారు టీడీపీలోనే ఉన్నారని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులు ఏ పార్టీకి చెందినవారైనా వారిని గౌరవించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ రాక, ఇన్స్యూరెన్స్ రాక రైతులు అష్టకష్టాలు పడుతుంటే ‘ఏరువాక’ అంటూ ఏ మొఖం పెట్టుకొని రైతుల వద్దకు వస్తున్నారని నిలదీశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై నేడు వైఎస్ఆర్ సీపీ ర్యాలీ కడప కార్పొరేషన్: ప్రజా ప్రతినిధులను, ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి ఓడిపోయిన వారితో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తున్న జిల్లా అధికారయంత్రాంగం చర్యలకు నిరసనగా బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతనిధులందరూ పాల్గొనాలని ఆయన కోరారు. -
అగ్గి సోకితే.. బుగ్గే
దుగ్గొండి : రబీలో నీటి వసతి ఉన్న రైతులు అక్కడక్కడా వరి పంట సాగు చేశారు. కొందరు సా ధారణ రకాలయిన 1010, ఎర్రమల్లెలు, ఐ ఈర్-64 రకాలు సాగు వేయగా మరికొందరు బేయర్, పయనీర్ కంపెనీలకు చెందిన ఆడమగ వరి సాగు చేశారు. ప్రస్తుతం పంట చిరుపొట్టదశ ప్రారంభంలో ఉంది. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అగ్గితెగులు లక్షణాలు కనబడుతున్నాయి. నిర్లక్ష్యం చేస్తే తెగులు ఉధృతి చెంది పంటకు తీవ్ర నష్టం కలుగుతుందని వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెగులు లక్షణాలు-నివారణ చర్యలు వివరించారు. కారణాలు రాత్రిపూట చలి ఉండి పొద్దంతా వేడి వాతావరణం ఉండడం వల్ల అగ్గి తెగులు సోకుతుంది. పంట పెరుగుదల లేదని భావించి కొందరు రైతులు నత్రజనిని మోతాదుకు మించి వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల తెగులు వస్తుంది.నారు పోసే ముందు విత్తనశుద్ధి చేయకపోరుునా.. తెగులు అవశేషాలు ఉన్న విత్తనాలతో నారు పోసినా అగ్గి తెగులు సోకుతుంది. లక్షణాలు వరి ఆకులపై మొదట నూలు కండె ఆకారంలో చిన్న చిన్న మ చ్చలు ఏర్పడతాయి. {Mమేణా మచ్చలు పెద్దగా మారి ఆకు మొత్తం వ్యాపిస్తుంది. ఆకుతో సహా కుదురు ఎండిపోతుంది.తెగులు ఆరంభ దశలో నిర్లక్ష్యంగా ఉంటే వరి గొలుసులు బయటికి వచ్చాక మెడవి రుపు వచ్చి గింజలన్నీ తాలుగా మారిపోయి 70 శాతం దిగుబడి తగ్గిపోతుంది. నివారణ ఆకులపై నూలు కండె మచ్చలు వచ్చినట్లు గమనించగానే లీటరు నీటికి 0.6 గ్రాములు ట్రైసైక్లోజోల్ మందును కలిపి ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి. తెగులు లక్షణాలు గమనించిన వెంటనే నత్రజని వాడకం నిలిపి వేయాలి.నీటిని అధికంగా కాకుండా పలుచగా పెట్టాలి.చౌడు నేలల్లో అధికంగాా అగ్గితెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తీవ్రత తగ్గించు కోవడానికి కూలీల చేత భూమిని కదిలించాలి. దీంతో వేర్లకు గాలి ధారళంగా అంది తెగులు కొంత వరకు తగ్గుతుంది. డాక్టర్ రఘురామిరెడ్డి 99896 25223 -
సీఐ మురళీకృష్ణ సస్పెన్షన్
-
సీఐ మురళీకృష్ణ సస్పెన్షన్
ఏలూరు: ఏలూరు నగర వన్‌టౌన్ సీఐ మురళీకృష్ణను సస్పెండ్ చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఏలూరులో ఎస్పీ రఘురామిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... విధుల పట్ల సీఐ మురళీకృష్ణ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహారించారని తెలిపారు. పెద్ద అవుటపల్లి కాల్పు ఘటనలో సీఐ మురళీకృష్ణ పాత్రపై అనుమానాలు ఉన్నాయని... వాటిని నిర్థారించాల్సి ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా సీఐ మురళీకృష్ణతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వివిధ దొంగతనాల కేసుల్లో దొంగల నుంచి భారీగా బంగారం, నగదు సీఐ మురళీకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును ఆయన కోర్టులో డిపాజిట్ చేయకుండా అతడి వద్దే ఉంచుకున్నారు. అలాగే నగదును తన సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయం పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులుగా వెళ్లాయి. దీంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మురళీకృష్ణపై ఆరోపణలు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేస్తూ డీఐజీ హరికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అదికాక గత వారం విజయవాడ సమీపంలో మద్రాసు - కోల్కత్తా జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులపై దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా పెద్దవేగి మండలం పినమడక గ్రామస్తులుగా నిర్థారించారు. పాత కక్షలే ఈ హత్యలకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో సీఐ మురళీకృష్ణ హస్తం ఉందేమోనని... ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
20 ఏళ్లైనా ప్రాజెక్టులు పూర్తికావు
* సాగునీటి పద్దుపై జరిగిన చర్చలో ప్రభుత్వ తీరును తూర్పారబట్టిన విపక్ష సభ్యులు * తుది దశలో ఉన్న ప్రాజెక్టులకూ నిధులివ్వలేదు * విధానాలు మార్చుకొని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి * చంద్రబాబు శంకుస్థాపనలు మాత్రమే చేశారు * కాటన్ తర్వాత ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన నేత వైఎస్సే * చంద్రబాబు చేసిందేమీ లేకే జలయజ్ఞంపై ఆరోపణలు * 2004 ధరలతో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? సాక్షి, హైదరాబాద్: ఈ బడ్జెట్లో సాగునీటి శాఖ కేటాయింపులను చూస్తే 20 సంవత్సరాలైనా ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి లేదని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఏ ప్రాజెక్టుకు ఏ నాయకుడు నిధులిచ్చి పూర్తిచేశారనే విషయం ప్రజలకు తెలుసని, శంకుస్థాపనలతో మభ్యపెట్టిన నాయకుడు ఎవరో కూడా ప్రజలకు అవగాహన ఉందనే అంశాన్ని ప్రభుత్వ పెద్దలు మరిచిపోకూడదని హితవు చెప్పారు. చంద్రబాబు తన తొమ్మిది సంవత్సరాల పాలనతో ఇంకుడుగుంతలతో సరిపెట్టారని, ఫలితంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత జగన్‌ను చూసి భయపడుతున్నారని విమర్శించారు. అందుకే 2004 తర్వాత 23 లక్షల ఎకరాలను సాగులోకి వచ్చిందని బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక మంత్రి, 2004కు ముందు సాగులోకి వచ్చిన భూమి గురించి చెప్పడానికి మనసు రాలేదని ఎద్దేవా చేశారు. సాగునీటి పద్దుపై శాసనసభలో శుక్రవారం చర్చ జరిగింది. చర్చలో ఎవరేం మాట్లాడారంటే.. నిరాశ కలిగించిన బడ్జెట్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి - బడ్జెట్లో సాగునీటి కేటాయింపులు రైతులను తీవ్ర నిరాశ, నిస్పృహలు కలిగించాయి. వైఎస్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు కొన్ని తుది దశకు వచ్చాయి. 10 శాతం పనులు మిగిలిన ప్రాజెక్టులు తక్కువ ఖర్చులో పూర్తి చేయవచ్చు. తద్వారా కొన్ని వేల ఎకరాలకు నీరందించవచ్చు. కానీ ప్రభుత్వం దీన్ని విస్మరించింది. ఈ బడ్జెట్లో తెలుగుగంగ ప్రాజెక్టుకు రూ. 89 కోట్లు, గాలేరు- నగరికి రూ.55కోట్లు ఇచ్చారు. ఇలా నిధులిస్తే 20 ఏళ్లయినా ప్రాజెక్టులు పూర్తికావు. బాబు విధానాలు మార్చుకొని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి. - వైఎస్ హయాంలో సృష్టించిన అదనపు ఆయకట్టు వల్ల ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ప్రపంచ జనాభాలో 17 శాతం మన దేశంలోనే ఉన్నారు. విస్తీర్ణంలో మనది రెండు శాతమే. మరి అందరికీ ఆహారం అందించాలంటే ప్రతి ఎకరాకూ నీరివ్వాలి. - 2001కి ముందు తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ మినహా మరో ప్రాజెక్టునే చేపట్టలేదు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃపరిశీలన జరుగుందని తెలిసినా.. చంద్రబాబు ప్రాజెక్టులు నిర్మించాలనే ప్రయత్నమే చేయలేదు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిర్మించుకొని బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డులో నికర జలాలు పొందగలిగారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు నిబంధలకు విరుద్ధంగా రూ. 200 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆ రికార్డులను స్పీకర్ ముందు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు 10 లక్షల ఎకరాలకు నీరిచ్చారు: చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు - చంద్రబాబు హయాంలో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసి 10 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. వైఎస్ రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలే సాగులోకి తెచ్చారు. సీమ ప్రాజెక్టులకు నికర జలాలు లేకుండా మిగుల జలాలపై ఆధారపడే పరిస్థితి రావడానికి వైఎస్ అప్పట్లో దాఖలు చేసిన మెమో కారణం. ప్రాజెక్టులు పూర్తైతే రైతుల ఆత్మహత్యలు ఉండేవి కావు: టీడీపీసభ్యుడు ఆంజనేయులు - జలయజ్ఞంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే 2004-14 మధ్య రైతుల ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదు. జలయజ్ఞంలో అవినీతివల్లే ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కాంగ్రెస్ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి నిధులు దోచుకున్నారు. కాటన్ తర్వాత వైఎస్సే: జగ్గిరెడ్డి, వైఎస్సార్సీపీ సభ్యుడు - గోదావరి జిల్లాల్లో సర్ ఆర్ధర్ కాటన్ పట్ల ఆరాధనా భావం ఉంటుంది. నీళ్లిచ్చిన వారిని మరిచిపోని తత్వం గోదావరి జిల్లాల ప్రజలకు ఉంది. కాటన్ తర్వాత ఆ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు వైఎస్. కాటన్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ఆధునీకరణకు వైఎస్ నిధులిచ్చారు. - 2004 తర్వాత 23 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందని బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2004కు ముందు సాగులోకి వచ్చిన భూమి గురించి చెప్పడానికి ఆర్థిక మంత్రికి మనసు రాలేదు. - చంద్రబాబు తన తొమ్మిది సంవత్సరాల పాలనతో ఇంకుడుగుంతలతో సరిపెట్టారు. సాగునీటి రంగానికి ఆయన చేసిందేమీ లేకపోవడం వల్లే.. జలయజ్ఞం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత జగన్ పట్ల ఉన్న భయాన్ని బయటపెట్టుకుంటున్నారు. జలయజ్ఞాన్ని విమర్శించేది అందుకే. ఏం చేస్తారో చెప్పండని ప్రజలు అధికారం ఇస్తే.. లేనిపోని ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. - స్థూల సాగు విస్తీర్ణం చంద్రబాబు హయాంలో 41.59 శాతం నుంచి 38.28 శాతానికి తగ్గిపోయింది. వైఎస్ దాన్ని 46.19 శాతానికి పెంచారు. సాగునీటి ప్రాజెక్టులు లాభదాయకం కాదని చంద్రబాబు తన ‘మనసులో మాట’ పుస్తకం 125 పేజీలో పేర్కొన్నారు. అంచనా వ్యయం పెంచారని టీడీపీ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. 2004 ధరలతో ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేయగలమని చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? రూ. 91.12 కోట్ల అంచనా వ్యయంతో నాగార్జున సాగర్‌ను ప్రారంభిస్తే.. పూర్తయ్యే నాటికి రూ. 1300 కోట్లు ఖర్చయింది. హంద్రీనీవాకు ఎన్ని శంకుస్థాపనలు చేశారు?: ఎస్వీ మోహన్‌రెడ్డి - హంద్రీనీవా సుజల స్రవంతికి ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు. తర్వాత చంద్రబాబూ చేశారు. రూ. 6,850 కోట్ల అంచనా వ్యయం ఉండగా, చంద్రబాబు ఇచ్చింది కేవలం రూ. 13 కోట్లే. వైఎస్ 2004-10 మధ్య రూ.3,996 కోట్లు నిధులు విడుదల చేశారు. తర్వాత ప్రభుత్వాలు రూ. 1800 కోట్లు ఇచ్చాయి. హంద్రీనీవాను కూడా చంద్రబాబు తన ఖాతాలోనే వేసుకుంటున్నారు. ప్రాజెక్టును ఎవరు పూర్తి చేసినట్లు? - రూ. 391 కోట్ల అంచనా వ్యయంతో రూపొందిన గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు కూడా చంద్రబాబే శంకుస్థాపన చేశారు. ఇచ్చిన నిధులు రూ. 3 కోట్లే. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 142 కోట్లు ఖర్చు చేసి 6,718 ఎకరాలను సాగులోకి తెచ్చారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు కూడా ఎక్కువ నిధులిచ్చిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. - గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తానని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ బడ్జెట్లో నిధులివ్వలేదు. కర్నూలుకు దిగువన తుంగభద్ర మీద ‘చెక్‌డ్యాం కమ్ బ్రిడ్జి’ నిర్మించాలని చిన్ననీటి పారుదల శాఖ గతంలో ప్రతిపాదనలు రూపొందించింది. కర్నూలుకు ఎగువన నిర్మిస్తే తాగునీటికి కూడా ఉపయోగపడుతుంది. -
‘సీమ’లోనే రాజధాని
లేదంటే మరో విభజనకు పోరు శివరామకృష్ణన్ కమిటీ ఎదుట నేతల స్పష్టీకరణ నవ్యాంధ్ర రాజధానిని రాయలసీమ జిల్లాల్లోనే ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన పలువురు నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరో విభజనకు పోరు మొదలవుతుందని స్పష్టంచేశారు. రాజధాని అంశంపై సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన కమిటీ సభ్యులు అరోమర్ రేవి, కేటీ రవీంద్రన్ కడప కలెక్టరేట్ సభా భవనంలో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఇంకా కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు ఎ.రఘునాథరెడ్డి, మహా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నోలు సుబ్బరాయుడు, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు కె.వెంకట్రామిరెడ్డి, బి.ఎన్. బాబు, చిన్న సుబ్బయ్య యాదవ్, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు పులిమి ప్రసాద్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మీగడ నారాయణరెడ్డి, మైదుకూరు రైతు సేవా సమితి అధ్యక్షుడు డి.ఎన్. నారాయణ, తదితరులు తమ అభిప్రాయాలను కమిటీకి తెలిపారు. నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే... - కడప సెవెన్‌రోడ్స్ కడప ఎడ్యుకేషన్: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ స్టూడెంట్ యూనియన్ నాయకులు శివరామకృష్ణన్ కమిటీని కోరారు. సోమవారం కడపకు వచ్చిన కమిటీని ఆర్ఎస్యూ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చి వినతిపత్రం అందజేశారు. 1953 నుంచి 1956 వరకు రాయలసీమలోని కర్నూలు రాజధానిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆర్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రవి శంకర్‌రెడ్డి అన్నారు. అప్పుడు రాజధానిని త్యాగం చే సిన కర్నూలులోనే ఇప్పుడు రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్యూ అధ్యక్షుడు జయవర్దన్, కోశాధికారి నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఓబయ్య పాల్గొన్నారు. ప్రభుత్వ భూములున్న చోటే .. ప్రభుత్వ భూములు లభ్యమయ్యేచోటే రాజధాని ఏర్పాటు చేయాలి. రాజధానికి సేకరించిన భూమిలో కొంత భాగాన్ని ప్రభుత్వం వినియోగించుకొని మిగిలిన భూమిని వేలం ద్వారా అమ్మితే రూ.లక్ష కోట్లు వచ్చేందుకు అవకాశముంది. ఆ డబ్బుతో రాజధానిని బ్రహ్మాండంగా నిర్మించుకోవచ్చు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కోస్తాలో భూసేకరణ తలకు మించిన భారమే. - రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు కాదంటే మరో ఉద్యమమే.. కోస్తాలో రాజధాని ఏర్పాటు చేస్తే ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తలెత్తే అవకాశం ఉంంది. ఇప్పటికే సీమ అన్ని విధాలా మోసపోయింది. రాజధాని ఏర్పాటుకు కనీసం 50 నుంచి 60 వేల ఎకరాల భూమి సేకరించడం కోస్తాలో సాధ్యపడదు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన భూములు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌పోర్టు, కొత్త కలెక్టరేట్, రిమ్స్, రవాణా తదితర సౌకర్యాలన్నీ జిల్లాలో ఉన్నాయి. - గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే, రాయచోటి మరో విభజనకు ఆస్కారమివ్వొద్దు రాజధాని ఏర్పాటు అంశం మరో విభజనకు ఆస్కారం లేకుండా ఎంపిక చేయాల్సిన బాధ్యత పాలక పక్షానిదే. రాజధానికి కడప అన్ని రకాల యోగ్యకరంగా ఉంది. రాజధాని ఏర్పాటు రాయలసీమ హక్కు. ఇవన్నీ విస్మరించి ఓ వైపు కమిటీ వేస్తూనే మరోవైపు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. తెలుగు ప్రజల భవిష్యత్తు దృష్ట్యా మరోసారి విభజన కాకుండా నిర్ణయం తీసుకోవాలి. - పి.రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే, కమలాపురం -
ప్రజల భద్రతే ప్రథమ లక్ష్యం
కర్నూలు: ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తన తొలి కర్తవ్యమని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ఆకె రవికృష్ణ స్పష్టం చేశారు. గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా, ఎప్పుడైనా తనను కలవవచ్చని, ఏ క్షణంలోనైనా ఫోన్‌కు అందుబాటులో ఉంటానన్నారు. పోలీస్ అంటే ప్రజలకు మిత్రుడనే భావన కలిగించేలా వ్యవహరిస్తామని చెప్పారు. సిబ్బంది అలసత్వాన్ని సహించనన్నారు. పోలీస్ సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీల్లో ఎస్పీ రఘురామిరెడ్డిని పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో రవికృష్ణ నియమితులయ్యారు. 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన నల్గొండ జిల్లాలో శిక్షణ పొందారు. మొట్ట మొదట 2009లో మహబూబ్‌నగర్ జిల్లా పార్వతీపురం, తరువాత విశాఖ జిల్లా చింతపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో ఏఎస్పీ హోదాలో పని చేశారు. 2012లో ఎస్పీగా పదోన్నతి పొందారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగం నుంచి బదిలీపై కర్నూలుకు వచ్చారు. రాజస్థాన్ పోలీస్ అకాడమీలో యాంటీ టైజమ్‌పై శిక్షణను ఒకరోజు ముందే ముగించుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హుటాహుటిన కర్నూలు చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో క్యాంప్ కార్యాలయానికి వెళ్లడంతో రఘురామిరెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. గురువారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. సాక్షి : కర్నూలు జిల్లా ఎస్పీగా కొత్తగా వచ్చారు.. ఎలా ఫీలవుతున్నారు ? ఎస్పీ: జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా భావిస్తున్నాను. ఈ జిల్లాపై కొంత అవగాహన ఉంది. ఎస్పీ రఘురామిరెడ్డి సమర్థంగా పని చేశారని సిబ్బంది చెబుతున్నారు. ఆయన బాటలో నడిచి క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది సహకారంతో శాంతిభద్రతలను గాడిలో పెడతాను. సాక్షి : శాంతి భద్రతల పరిరక్షణలో మీ ప్రాధాన్య అంశాలేమిటి ? ఎస్పీ : ప్రజల భద్రత, మత సామరస్యం, రోడ్డు ప్రమాదాల నివారణ ప్రాధాన్యతాంశాలు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రధాన దృష్టి సారిస్తా. రోడ్డు ప్రమాదాల్లో యువత మృత్యువాత పడుతున్నారు. రహదారి భద్రతపై మరింత చైతన్యం రావాల్సి ఉంది. జాతీయ రహదారులపై దృష్టి సారించి రహదారి భద్రతకు ప్రణాళిక రూపొందిస్తాం. గతంలో నేను పని చేసిన చోట ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రమాదాల రేటు తగ్గించాను. సాక్షి : మీ గత అనుభవాలు జిల్లాలో రాణించడానికి ఎంత మేరకు ఉపయోగపడుతాయని భావిస్తున్నారు ? ఎస్పీ : శిక్షణలో ఉన్నప్పుడు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించాను. జిల్లాలో జరిగే నేరాలపై అవగాహన ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా పార్వతీపురం, విశాఖ జిల్లా చింతపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో ఏఎస్పీ హోదాలో పని చేశాను. ఈ అనుభవాలన్నీ సమర్థ విధి నిర్వహణకు ఉపయోగపడుతాయని భావిస్తున్నా. సాక్షి : శాంతి భద్రతల పరిరక్షణకు, సమర్థ పౌర సేవల అమలుకు మీ ప్రణాళిక ఏమిటి ? ఎస్పీ : క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందితో మాట్లాడి జిల్లాపై అవగాహన పెంచుకుంటా. సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తా. ఫిర్యాదిదారులు పోలీస్ స్టేషన్‌కు వస్తే న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయి అధికారులపై ఉంది. ఒక స్నేహితుడిగా పోలీసులు పని చేయాలి. నేరస్తులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తేలేదు. -
కొత్త ఎస్పీ రవికృష్ణ
కర్నూలు: కర్నూలు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) రఘురామిరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసాధికారులకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. కొత్త నియామకాలకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా ఎస్పీగా రవికృష్ణను నియమించింది. 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రవికృష్ణ ముఖ్యమంత్రి భద్రతా విభాగం ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం శాఖా పరమైన శిక్షణలో భాగంగా జైపూర్‌లో ఉంటున్నారు. పది రోజుల్లో శిక్షణ పూర్తి కానుంది. ఆ తర్వాత ఆయన కర్నూలులో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈయన అదే జిల్లాలోని చింతపల్లి ఏఎస్పీగా మొదట విధుల్లో చేరారు. 2011లో ఎస్పీగా పదోన్నతి పొందారు. శ్రీకాకుళంలో పని చేసేటప్పుడు మావోయిస్టులను జన జీవన స్రవంతిలోకి రప్పించడానికి ‘అమ్మ పిలుపు’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా కూడా పని చేశారు. ట్రాఫిక్ విధుల్లో పని చేసే సిబ్బంది నిజాయతీగా ఉండాలని, అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేయించారు. అలాగే వాహనాల్లో తల్లిదండ్రులు బయటికి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ‘నాన్న కోసం’ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. 2011 నుంచి జూలై 2013 వరకు గుంటూరు అర్బన్ ఎస్పీగా సేవలందించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ అనాధలు, ఆపరేషన్ వీధి బాలలు, బాధితులకు భరోస, ఆపరేషన్ యాచకులు వంటి సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. వీధుల్లో ఉంటున్న యాచకులు, బాలల కోసం పునరావాసం కల్పించడం రాత్రి వేళల్లో పడుకోవడానికి ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేయించడం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. సొంత శాఖలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని ఈయనకు పేరుంది. -
బనగానపల్లే ఎమ్మెల్యేపై మండిపడ్డ కాటసాని రాంరెడ్డి!
కర్నూలు: తన వర్గీయులపై బనగానపల్లే ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ఫిర్యాదు చేయడంపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా తిరిగి ఫిర్యాదు చేయడాన్నిఎస్పీ రాఘురామిరెడ్డి దృష్టికి కాటసాని రామిరెడ్డి తీసుకువెళ్లారు. బీసీ జనార్ధనరెడ్డి ఫిర్యాదును పరిశిలీంచి తగిన విచారణ జరిపిస్తామని కాటసానికి ఎస్పీ రఘురామిరెడ్డి హామీ ఇచ్చారు. తను ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టేందుకు యత్నించారని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ ఎంఎల్ఏ బీసీ జనార్దనరెడ్డి కర్నూలు జిల్లా బేతంచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. -
ఈ ఏడాది పోలీస్ శాఖ కొన్ని మరకలను మూటగట్టుకొంది
కర్నూలు, న్యూస్‌లైన్: శాంతిభద్రతల పరిరక్షణలో ఈ ఏడాది పోలీస్ శాఖ కొన్ని మరకలను మూటగట్టుకొంది. ప్రధానంగా దోపిడీలు, చైన్‌స్నాచింగ్ వంటి నేరాలను అదుపు చేయలేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. అయితే చోరీ సొమ్ము రికవరీలో మాత్రం రెండేళ్ల కంటే కాస్త ఊరట కల్పించారు. దొంగల పాలైన సొత్తు రూ.6.50 కోట్లు కాగా, రూ.4.50 కోట్లు రికవరీ చేశారు. రోడ్డు ప్రమాదాలు గతంలో మాదిరే ఈ ఏడాదీ పునరావృతమయ్యాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే వాటి సంఖ్య ఈ ఏడాది కాస్తతగ్గింది. రాజకీయ నాయకులతో కొంతమంది పోలీస్ అధికారులు సన్నిహిత సంబంధాలు పెంచుకున్నట్లు ఆరోపణలు వచ్చా యి. ముఖ్యంగా ఫ్యాక్షనిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన నిఘా విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్న విమర్శలు లేకపోలేదు. సల్కాపురం సమీపంలో కోడుమూరుకు చెందిన ఎరుకలి రామాంజనేయులు, ఆయన కుమారుడు వెంకట్రాముడు, కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన సహకార సంఘం అధ్యక్షుడు ఆలం బాషా దారుణ హత్యలు పోలీసుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేశాయి. క్రిష్ణగిరి సహకార బ్యాంకు సీఈఓ చిన్నసోమన్న అదృశ్యం కేసును ఇప్పటికీ ఛేదించలేకపోయారు. ఈ ఏడాదిలో ఆరునెలలపాటు ఎస్పీగా చంద్రశేఖర్ రెడ్డి పనిచేశారు. ఆయన తరువాత రఘరామిరెడ్డి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎస్పీ రఘురామి రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఒక్క పోలింగ్ బూత్‌లో కూడా రీపోలింగ్ జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్యాక్షనిస్టులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతోపాటు ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి సంబంధించిన సెల్ఫోన్లకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి బందోబస్తును పర్యవేక్షించారు. పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. ఉద్యమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెల్లెలు ఆస్తికి రక్షణగా ఉన్నాడన్న కోపంతో డోన్ మం డలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డిని బంధువు లే దారుణంగా హత్య చేశారు. కర్నూలు నుంచి చిన్నమల్కాపురం వెళ్తుండగా ఎర్రగుంట్ల బ్రిడ్జి వద్ద స్కార్పియో వాహనాన్ని అడ్డగించి కత్తులతో నరికి చంపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సల్కాపురం సమీపంలో జంట హత్యలు పోలీసు శాఖను కుదిపేశాయి. ఎరుకలి వెంకట్రాముడు, ఆయన కుమారుడు రామాంజనేయులు గూడూరు నుంచి కర్నూలు కోర్టుకు వెళ్తుండగా ప్రత్యర్థులు వెంబడించి దారుణంగా హత్య చేశారు. జిల్లాలో వైఎస్సార్సీపీకి లభిస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేక డోన్ పట్టణానికి చెందిన కడిమెట్ల కృష్ణ అలియాస్ కిట్టును ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. కిట్టు తండ్రి లక్ష్మన్న సహకార సంఘం ఎన్నికల్లో డోన్ ఒకటవ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి డెరైక్టర్‌గా పోటీ చేశారు. అధికార పార్టీ నాయకులకు మింగుడుపడక కిరాయి హంతకుల చేత హత్య చేయించారు. అవుకు మండలం గుండ్ల శింగవరం సబ్‌స్టేషన్ వద్ద తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆలమూరు రాముడు, బనగానపల్లె మద్దిలేటి, ఇమ్రాన్, ఆటోడ్రైవర్ మొదీన్ బాషా మృతిచెందారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ముద్ర ఉన్న నేరస్తులపై ఎస్పీ రఘురాం రెడ్డి కఠినంగా వ్యవహరించారు. పోటీలో ఉన్న అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడ్డారనే కారణంపై కప్పట్రాళ్ల మద్దిలేటి నాయుడు, మరికొంతమంది అనుచరులను పత్తికొండ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. కర్నూలు కేంద్రంగా పెద్ద ఎత్తున పేకాట జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు బుధవారపేటకు చెంది న మట్కాడాన్ స్థావరంపై దాడి చేశారు. వివిధ జిల్లాలకు చెందిన 58 మందిని అదుపులోకి తీసుకుని రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రఘురాం రెడ్డి జిల్లాలో ‘మీతో మీ ఎస్పీ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు శాంతిభద్రతల పరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై చెప్పుకునే అవకాశం కల్పించారు. కొంతమంది సిబ్బంది దీని నీరుగారుస్తున్నారు. అయ్యలూరు గ్రామానికి చెందిన న్యాయవాది సర్వేశ్వరరెడ్డికి, గంగవరం గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డికి మధ్య ఉన్న పొలం తగాదా కారణంగా కోర్టుకు వెళ్లి వస్తున్న సర్వేశ్వరరెడ్డి వాహనాన్ని జీపుతో ఢీకొట్టి వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. నిరుద్యోగ యువత ఫ్యాక్షన్ బారిన పడకుండా ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో ఫ్యాక్షన్ విస్తరించడానికియువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడమేనని గుర్తించారు. కృష్ణపట్నం పోర్టులో సెక్యూరిటీ ఉద్యోగాల ఎంపికకు చర్యలు తీసుకున్నారు. పోలీసు శాఖపై అధికార పార్టీ పెత్తనంపై కఠినంగా వ్యవహరిం చిన ఎస్పీ రఘురామి రెడ్డిని హైదరాబాదు సౌత్‌జోన్ డీసీపీగా బదిలీ చేసి శంషాబాద్ డీసీపీగా ఉన్న రమేష్‌నాయుడును నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిం చారంటూ ఎస్పీ క్యాట్‌ను ఆశ్రయించి తాత్కాలికంగా నిలుపుదల చేయించుకున్నారు. క్రికెట్ బెట్టింగ్, జల్సాల కోసం చేసిన అప్పులు తీర్చడానికి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి ఇంజనీరింగ్ విద్యార్థులు హకీం సమీర్, జయసూర్య సింహారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు కటాకటాలపాలయ్యారు. గుప్త నిధుల వేటలో రంగారెడ్డి జిల్లా పాల్మాకుల గ్రామానికి చెందిన బుర్ర నాగరాజు, రమాదేవి మృత్యు ఒడి చేరారు. డోన్ మండలం వెంకటాపురం బొంతిరాళ్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జీవితంలో ఒకేసారి ధనవంతులమైపోదామన్న దురాశతో తమ జీవితాలనే బలి తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోలీస్ దర్బార్ సొంతశాఖ సిబ్బంది సమస్యలపై ఎస్పీ రఘురామిరెడ్డి దృష్టి సారించారు. జిల్లా కేంద్రంతో పాటు సబ్ డివిజన్ స్థాయిలో పోలీసు దర్బార్ నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించేవారితో పాటు అవినీతికి పాల్పడేవారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సొంత శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఖాళీలను బట్టి అడిగిన చోటుకే పోస్టింగ్‌లు ఇస్తూ పైరవీలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. -
అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తా
సాక్షి, కర్నూలు: ‘‘అసాంఘిక శక్తులను వదిలే ప్రసక్తే లేదు. పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం లభిస్తుందనే భావన కలిగించేలా పోలీసులు తమ విధులు నిర్వర్తించాలి. ఆ దిశగా ప్రయత్నాలు చేపడుతున్నా. విధి నిర్వహణలో రాజకీయ జోక్యానికి తావులేకుండా చూస్తున్నా. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే సిబ్బందికి రక్షణగా నిలుస్తా. తోక జాడించే సిబ్బందిపై నిఘా కొనసాగుతుంది. ముఖ్యంగా మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కర్నూలు నగరంలో హైదరాబాద్ తరహా పోలీసు హెల్ప్ కంట్రోల్ రూమ్స్‌ను అమల్లోకి తీసుకురానున్నాం’’ అని జిల్లా ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డి అన్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా.. ఈ ఏడాది చోటు చేసుకున్న ఘటనలు, వాటిపై తీసుకుంటున్న చర్యలు, వ్యూహాలపై శనివారం ‘సాక్షి’ ఎస్పీతో ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలివి.. సాక్షి: మహిళలపై దాడులు అధికమయ్యాయి. వారికి ధైర్యం, భరోసా కల్పించడంతో పాటు నేరాల అదుపునకు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఎస్పీ: మహిళలపై దాడుల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాం. అన్నివేళల వారికి అందుబాటులో ఉంటాం. దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవు. నిందితుల్ని దోషులుగా నిరూపించేందుకు.. ఆధారాల సేకరణ తదితర అంశాలపై నిక్కచ్చిగా వ్యవహరిస్తాం. సాక్షి: మహిళలపై దాడులు, ఇతర ఘటనలకు ఎక్కువ శాతం ఆటోవాలాలే కారణమని తెలుస్తోంది. మీరేమంటారు? ఎస్పీ: ఆటోవాలాలపై ఓ కన్నేసి ఉంచాం. ఆర్టీఏ అధికారులతో కలిసి సంయుక్తంగా చర్యలు చేపడుతున్నాం. జనవరి 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టబోతున్నాం. ఆటోల్లోని సౌండ్ సిస్టం బాక్స్‌లను తొలగించడంతో పాటు.. వాటి వెనుకాల ప్రకటనల పోస్టర్లను, స్టిక్కర్లను అతికించరాదని ఆదేశించాం. ఆటోల్లో ఎలాంటి మారణాయుధాలు ఉన్నా జరిమానా విధించడంతో పాటు సీజ్ చేస్తాం. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న పోలీసు హెల్ప్ కంట్రోల్ రూమ్స్‌ను నగర పోలీసులు, రైల్వే పోలీసుల సహకారంతో కర్నూలులోనూ ఏర్పాటు చేయబోతున్నాం. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ఈ పద్ధతిని అమల్లోకి తీసుకొస్తున్నాం. ఈ విధానంతో ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల వివరాలు, వారి ఫోన్ నంబర్లను పోలీసు సిబ్బంది సేకరిస్తారు. తద్వారా ఆటోవాలాలు చార్జీ ఎంత వసూలు చేస్తున్నారు? ప్రయాణికులు సురక్షితంగా ఇళ్లకు చేరారా? అనే వివరాలను పోలీసులు తెలుసుకుంటారు. సాక్షి: కొందరు పోలీసు అధికారులు రాజకీయ నేతలకు తలొగ్గి పనిచేస్తున్నారు. ఆ ప్రభావం కేసులపై ఉంటోంది. వీరి పట్ల మీ వైఖరి? ఎస్పీ: కొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లు వాస్తవమే. అయితే న్యాయబద్ధంగా పని చేయాలని సిబ్బందికి సూచిస్తున్నాం. మితిమీరితే బదిలీ చేయడానికీ వెనుకాడబోం. అప్పుడు రాజకీయ నాయకులు చెప్పినా వినే ప్రసక్తే లేదు. వృత్తి పట్ల నిబద్ధతతో పని చేసే సిబ్బందికి అండగా ఉంటా. నేతల అండదండలు ఉంటేనే మంచి స్థానాల్లో విధులు నిర్వహించవచ్చనుకుంటున్న అధికారులపై ప్రత్యేక దృష్టి సారించాం. పనితీరు ఆధారంగా వీరిపై చర్యలు చేపడతాం. సాక్షి: జిల్లాలో మీ మార్కు పోలిసింగ్ ఏలా ఉండబోతోంది? ఎస్పీ: పోలిసింగ్ ఓ వ్యక్తి మీద ఆధారపడకూడదు. వ్యవస్థకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా పోలీసులు పరిశోధన ప్రమాణాలు పెంచుకోవాలి. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో గౌరవప్రదంగా వ్యవహరించేలా.. అసాంఘిక శక్తులే మా శత్రువులని భావించేలా పోలిసింగ్‌ను తీర్చిదిద్దుతా. జిల్లాలో ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన వారిపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో వారి కదలికలను నిరంతరం పరిశీలిస్తుంటాం. ఫ్యాక్షనిస్టులకు, రౌడీషీటర్లకు తరచూ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తాం. సాక్షి: పోలీసుల సంక్షేమం.. వారి పిల్లల కెరీర్ గెడైన్స్‌పై మీ ప్లానింగ్? ఎస్పీ: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటేనే.. కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. పోలీసులందరికీ హౌసింగ్ ప్లాట్లు ఇచ్చే అంశం సుప్రీం కోర్టులో ఉన్నందున జాప్యం జరుగుతోంది. ప్రయాణ భత్యం(టీఏ) రూ.3.70 కోట్లు అందజేసేందుకు ఉన్నతాధికారులతో చర్చించా. పోలీసుల పిల్లలకు కేరీర్ గెడైన్స్‌పై ప్రణాళిక రూపొందించాం. ఏప్రిల్, మే నెలల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుంది. సాక్షి: దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లను అరికట్టేందుకు మీ వ్యూహం? ఎస్పీ: సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో జిల్లాకు వచ్చిన అదనపు బలగాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశాం. గత రెండు నెలలుగా చైన్‌స్నాచింగ్ కేసులు 8 మాత్రమే నమోదయ్యాయి. పాత నేరస్తుల కన్నా.. వ్యసనాలకు లోనవుతున్న విద్యార్థుల వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల పలువుర్ని అరెస్టు చేయడంతో ఈ తరహా నేరాలు తగ్గుముఖం పట్టాయి. సాక్షి: మట్కా, పేకాట నియంత్రణకు చేపట్టిన చర్యలేంటి? ఎస్పీ: మట్కా, పేకాటతో ఎన్నో కుంటుంబాలు నష్టపోతున్నాయి. సబ్ డివిజన్ల పరిధిలో నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకున్నాం. వీటి వెనుక ఉండే ఎలాంటి శక్తులను వదలబోం. -
ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు, న్యూస్‌లైన్: రాబోవు సాధారణ ఎన్నికల దృష్ట్యా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. అర్ధవార్షిక నేర సమీక్షలో భాగంగా బుధవారం సబ్ డివిజన్ అధికారులతో పాటు సీఐలు, ఎస్సైలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని డ్వామా సమావేశ మందిరంలో ఎస్పీ రఘురామిరెడ్డి, అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ రుషికేశవరెడ్డి, ఆర్ఐలు రంగముని, రెడ్డప్పరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ విభాగం సీఐలు వెంకటరమణ, శ్రీనివాసరెడ్డి, తేజేశ్వర్, కమ్యూనికేషన్ సీఐ రామాంజనేయులుతో పాటు పీపీలు, ఏపీపీలు పాల్గొన్నారు. సబ్ డివిజన్ అధికారులతో పాటు సీఐలు, ఎస్సైలు వారి వారి ప్రాంతాల్లోని తహశీల్దార్ల కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కర్నూలు సబ్ డివిజన్‌కు సంబంధించి డీఎస్పీ వైవీ రమణకుమార్తో పాటు పట్టణంలోని సీఐలు, కర్నూలు తహశీల్దార్ కార్యాలయం, మరికొంత మంది కల్లూరు, కోడుమూరు తహశీల్దార్ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్షన్, సమస్యాత్మక గ్రామాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా హింసాత్మక సంఘటనలకు అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని సబ్ డివిజన్ అధికారులను ఆదేశించారు. ఎవరి పరిధిలో వారు గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వైరి వర్గాలకు సంబంధించిన కదలికలపై సమాచారం రాబట్టాలని సూచించారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లు జోరందుకున్నాయని, నిఘాను తీవ్రతరం చేయాలని ఆదేశించారు. మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై కూడా నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వస్తే వారి పట్ల గౌరవంగా మసులుకొని కచ్చితంంగా ఫిర్యాదును రిజిష్టర్ చేయాలని ఆదేశించారు. -
డబ్బులు ఇప్పించి న్యాయం చేయండి
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్ : కర్నూలు ఆర్టీవో కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి రూ.25 వేలు తీసుకున్నాడని, ఇప్పుడు ఉద్యోగం చూపించకపోగా డబ్బులు కూడా ఇవ్వడం లేదని నగరంలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన షెహన్షా అనే వ్యక్తి ఎస్పీ రఘురామ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు. ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమాని(94407 95567)కి జిల్లా నుంచి 46 ఫోన్ కాల్స్ వచ్చాయి. కోడుమూరు మండలం అనుగొండ్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేమటూరు నుంచి ఇద ్దరు వ్యక్తులు వచ్చి నాటుసారా ప్యాకెట్లు, చీప్ లిక్కర్ బాటిళ్లను అమ్ముతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నాటుసారా వ్యాపారాన్ని నిరోధించి గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ గ్రామంలో విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఇలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలను జిల్లా ఎస్పీ నమోదు చేసుకున్నారు. ఎస్ఐ కుటుంబానికి చెక్కు పంపిణీ నీటిలో కొట్టుకుపోయే వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో నందివర్గం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ సాయిప్రసాద్ మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని జిల్లా ఎస్పీ ఆదుకున్నారు. ప్రమాద బీమా కింద రూ.10 లక్షలు చెక్కును బాధిత కుటుంబానికి అందించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి సలాం, నందివర్గం ఎస్ఐ గోపాల్‌రెడ్డి, మృతిచెందిన ఎస్ఐ తల్లి రమణమ్మ, చెల్లెలు అనితలు పాల్గొన్నారు. -
న్యాయ పోరాటం
కర్నూలు, న్యూస్‌లైన్: నిజాయితీ.. నిరంకుశత్వం మధ్య పోరాటం కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి బదిలీ మరో రెండు వారాలు వాయిదా పడింది. శాంతి భద్రతల పరిరక్షణకు నిబద్ధతతో పని చేస్తున్న ఆయనను స్వార్థ రాజకీయాలు బదిలీతో సన్మానించడం తెలిసిందే. అయితే కర్నూలులో బాధ్యతలు తీసుకొని మూడున్నర మాసాలు గడవక మునుపే నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారంటూ ఎస్పీ క్యాట్‌ను ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశించింది. ఆ మేరకు ఆయన సమర్థవంతమైన అధికారి అయినందునే హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా బదిలీ చేసినట్లు ప్రభుత్వం బుధవారం నివేదించింది. అందుకు క్యాట్ సంతృప్తి చెందకపోగా కర్నూలు జిల్లాకు సమర్థుడైన అధికారి అవసరం లేదా అంటూ ప్రశ్నించింది. బదిలీకి స్పష్టమైన కారణాలను తెలపాలని కోరింది. అందుకు ప్రభుత్వం రెండు వారాల గడువు కోరడంతో అప్పటి వరకు ఎస్పీని కర్నూలులోనే కొనసాగించాలని క్యాట్ ఆదేశించింది. ఇదిలాఉండగా రఘురామిరెడ్డి జిల్లాను వదిలి వెళుతున్నారని ఇప్పటి వరకు సంబరాలు చేసుకున్న సొంత శాఖలోని ఆయన వ్యతిరేకులకు ఈ విషయం మింగుడుపడటం లేదు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కూడా ఎస్పీ బదిలీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫలితంగా ఈ విషయం అధికార పార్టీని కుదిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీలో ఇరువురు మంత్రుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. తనను మాట మాత్రం కూడా సంప్రదించకుండా ఓ జిల్లా స్థాయి అధికారిని బదిలీ చేయడం పట్ల ఆయన గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ‘‘ఆయన బాగానే పని చేస్తున్నారు కదా.. ఎందుకు బదిలీ చేయాలి. మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతా’నంటూ సన్నిహితులతో కోట్ల అన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ఎస్పీకి మద్దతుగా మూడు రోజుల నుంచి ప్రజలు, ప్రజాసంఘాలు అండగా నిలుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా క్యాట్‌లో తీర్పు వచ్చిన విషయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
మేమున్నాం
కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లాలో శాంతిభద్రతలను గాడిలో పెడుతున్న తరుణంలో చోటు చేసుకున్న ఎస్పీ రఘురామిరెడ్డి రాజకీయ బదిలీపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. జిల్లాకు చెందిన మంత్రి పట్టుబట్టి ముఖ్యమంత్రి వద్ద పంచాయితీ పెట్టి బదిలీ చేయించడం వివాదాస్పదమవుతోంది. రెండో రోజు మంగళవారం కూడా ఆయన పక్షాన వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. బాధ్యతలు చేపట్టి నాలుగు మాసాలు గడవక మునుపే హైదరాబాద్ సౌత్ జోన్(దక్షిణ మండలం) డీసీపీగా రఘురామిరెడ్డిని బదిలీ చేయడం తెలిసిందే. అయితే ఎలాంటి ఆరోపణలు లేని ఐపీఎస్ అధికారిని రెండేళ్ల లోపు బదిలీ చేయరాదనే నిబంధన నేపథ్యంలో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. సరైన కారణం లేకుండా తనను బదిలీ చేశారంటూ ఎస్పీ న్యాయ పోరాటానికి సిద్ధమవడంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా ఎస్పీ బదిలీ అంశం ఓ కొలిక్కి రానుంది. ఇదిలాఉండగా జిల్లాలో నేర ఘటనల తీరుతెన్నులను అతి తక్కువ సమయంలో అధ్యయనం చేసి అక్రమార్కులకు ఎస్పీ రఘురామిరెడ్డి అడ్డుకట్ట వేయగలిగారు. ఆయన బదిలీని నిలుపుదల చేయకపోతే జిల్లాలో మట్కా, పేకాట, చీకటి వ్యాపారాలు, వ్యభిచారం తదితర అసాంఘిక కార్యకలాపాలు పేట్రేగి ప్రజా జీవనానికి ఆటంకమవుతాయని సాధారణ జనం మొదలుకొని ఇంజినీర్లు, డాక్టర్లు, ఉద్యోగులు, మహిళలు, విద్యా సంస్థల అధినేతలు డీజీపికి రాష్ట్ర గవర్నర్‌కు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారాన్ని చేరవేశారు. పోలీసు యంత్రాంగంపై రాాజకీయ నాయకుల పెత్తనం లేకుండా నిబంధనలు విధిస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని, రాజకీయ దురుద్దేశంతో చేసిన రఘురామిరెడ్డి బదిలీని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ వివిధ విద్యా సంస్థల విద్యార్థులు పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బీజేవైఎం నగర అధ్యక్షుడు పూర్ణచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్ బాస్‌కు వీటిని పంపారు. ప్రజా చైతన్యయువజన సంఘం ఆధ్వర్యంలో కల్లూరు మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, యువజనులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఎస్పీ బదిలీని ముక్తకంఠంతో ఖండించారు. నిజాయితీకి బహుమానం బదిలీనా అంటూ కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణలకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా సీపీఐ, ఎమ్మార్పీఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలు వేర్వేరుగా ఎస్పీ బదిలీకి నిరసనగా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మంత్రి టీజీ స్వార్థ ప్రయోజనాలకు ఎస్పీని బలి చేయడం దుర్మార్గమైన చర్యగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి రాంభూపాల్ చౌదరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మట్కా మాఫియాపై ఎస్పీ ఉక్కుపాదం మోపడాన్ని జీర్ణించుకోలేక అధికార పార్టీ నాయకులు ఆయనను బదిలీ చేయించారని ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ, ఆవాజ్ కమిటీలు పేర్కొన్నాయి. నిజాయితీ గల అధికారిని రాజకీయాలకు బలి చేయడం తగదంటూ ఆలూరులో మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. ఎస్పీ బదిలీ నిలుపుదల కోరుతూ లోక్‌సత్తా ఆదోని డివిజన్ కార్యదర్శి సుబ్రమణ్యం శర్మ రాష్ట్ర డీజీపీకి పంపిన ఫ్యాక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాజకీయ కుట్రలో భాగమే ఎస్పీ బదిలీ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ పేర్కొన్నారు. -
రఘు‘రాముడే’
కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి రాజకీయ బదిలీపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆయన బదిలీని తప్పుపడుతున్నాయి. కుల, విద్యార్థి, యువజన సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలోనే శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. సొంత శాఖ ప్రక్షాళనపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి అవసరమైతే ఇంటికి పంపేందుకూ వెనుకాడబోనని ఘాటుగా హెచ్చరించారు. పేరు మోసిన ఫ్యాక్షనిస్టులకు కౌన్సెలింగ్ ఇస్తూ గీత దాటితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. రఘురామిరెడ్డి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో శాంతి భద్రతలు గాడిలో పడ్డాయి. రౌడీలు, ఫ్యాక్షనిస్టుల్లో వెన్నులో వణుకు పట్టించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ప్రజల్లో నమ్మకం కల్పించారు. మీతో మీఎస్పీ కార్యక్రమం ప్రవేశపెట్టి ఆపన్నులకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేత స్వార్థానికి ఆయనకు బదిలీ కావడం పట్ల టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి అధికారులను కాపాడుకోవాల్సింది పోయి ఈ తీరున వ్యవహరించడం తగదన్నారు. నంద్యాలలోనూ వివిధ ప్రజా సంఘాలు ఎస్పీ బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడంలో ఎస్పీ విఫలమయ్యారని అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పలు ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని బన్ని ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల రక్షణకు మొదటి సారిగా హెల్మెట్లు కూడా ఆయన పంపిణీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. ఇదిలాఉండగా తన బదిలీని నిలిపివేయాలంటూ ఎస్పీ రఘురామిరెడ్డి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. పిటిషన్ విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్) రఘురామిరెడ్డి బదిలీని నిలిపివేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామం కొందరు పోలీసు అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. -
రాజకీయ బదిలి
కర్నూలు, న్యూస్‌లైన్: పోలీసు శాఖను అధికార కాంగ్రెస్ పార్టీ శాసిస్తోంది. పార్టీలోని ప్రజాప్రతినిధులు రెండు, మూడు గ్రూపులుగా విడిపోయినా ఈ శాఖను టార్గెట్ చేయడం జిల్లాలో సర్వసాధారణమైంది. జిల్లాలో ఎస్పీగా పని చేయడం అధికారులకు కత్తి మీద సాముగా మారుతోంది. కనిపించని నాలుగో సింహంలా ఉంటానంటే ఇక్కడ కుదరదని మరోసారి నిరూపితమైంది. ఇందుకు తాజా ఉదాహరణ జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి బదిలీ. నాలుగు మాసాల క్రితం(జులై 2వ తేదీ) ఎస్పీగా వచ్చిన ఆయన నేతల ఒత్తిళ్ల మధ్యే తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ పెత్తనం మితిమీరినా పలు విషయాల్లో కఠినంగా వ్యవహరించారు. ముఖ్యంగా జిల్లాకు చెందిన ఓ మంత్రి మాటలను ఖాతరు చేయక అక్రమార్కులతో పాటు సొంత శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. తన తెగువతో ప్రజల నమ్మకాన్ని చూరగొనడం నేతలకు మింగుడుపడలేదు. ఇదే సమయంలో పోలీసు శాఖ అధికారులు కొందరు తమపై వేటు పడకుండా ఆయననే బలిపెట్టే ప్రయత్నం చేశారు. ఇంకేముందు.. కొరకరాని కొయ్యలా మారిన ఎస్పీ బదిలీకి ఈయనంటే గిట్టని మంత్రి వద్ద పంచాయితీ పెట్టారు. ఆయన ముఖ్యమంత్రి వద్ద తన పలుకుబడిని ఉపయోగించి ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. చిన్న ఘటనలను సైతం భూతద్దంలో చూపి.. ముఖ్యంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ ఎస్పీపై బదిలీ వేటు వేయించారు. పంచాయతీ ఎన్నికల్లో చెప్పిన మాట వినని ఆయనను కొనసాగిస్తే సాధారణ ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని సీఎంకు ఆయన నూరిపోసినట్లు చర్చ జరుగుతోంది. సమర్థుడైన అధికారిగా రఘురామిరెడ్డికి గుర్తింపు... రఘురామిరెడ్డి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఫ్యాక్షన్ ఖిల్లాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలో చిన్న ఘటన కూడా చోటు చేసుకోకుండా మూడు విడతల పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించగలిగారు. శాంతిభద్రతల విషయంలో జిల్లా కేంద్రానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బందులు పడే ప్రజానీకం కోసం ప్రత్యేకంగా మీతో మీ ఎస్పీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి శుక్రవారం 10.30 నుంచి 12 గంటల వరకు స్వయంగా ఆయనే ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. చదువుకున్న వారు ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో కక్షలు, కార్పణ్యాల్లో ఇరుక్కుపోయి ఆర్థికంగా చితికిపోతున్నారని తెలుసుకుని ఉద్యోగాలు కల్పించేందుకు చొరవ చూపారు. ఆదోని, కోసిగి ప్రాంత యువకులు దాదాపు 600 మందికి శిక్షణనిప్పించి 34 మందికి కృష్ణపట్నం పోర్టులో మొదటి విడతగా ఉద్యోగాలు ఇప్పించారు. రెండో విడతగా కర్నూలు నగరంలో ముస్లిం యువకులకు ఉద్యోగావకాశం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుంటున్న ఫ్యాక్షనిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కట్టడి చేశారు. మట్కా, పేకాట నిర్వాహకులపైనా ఉక్కుపాదం మోపారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కప్పట్రాళ్ల మద్దిలేటి నాయుడు, ఆదోనిలో పేరు మోసిన మట్కా కింగ్ ఈరన్న ఆస్తుల విషయంలో విచారణ జరిపించాలని ఈడీకి లేఖ రాసి సంచలనం సృష్టించారు. కర్నూలులో మట్కా డాన్‌గా పేరొందిన వ్యక్తికి సంబంధించిన ఆస్తులపైనా విచారణ జరిపించాలని కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే ఆయన బదిలీ కావడం గమనార్హం. ఏదేమైనా జిల్లా మరో సమర్థుడైన అధికారిని కోల్పోయింది.