నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి
సాక్షి, కడప : రాయలసీమ ప్రాంతానికి కృష్ణజలాలు వస్తున్నాయంటే ఆది కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషేనని ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం మైలవరం జలాశయం నుంచి రెండు గేట్ల ద్వార 1000 క్యూసెక్కుల నీటిని పెన్నానదిలోనికి విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ నేడు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో వ్యవహరించి శ్రీశైలంతో గండికోటకు కృష్ణజలాలు తరలించే ఏర్పాటు చేశారన్నారు.
పెన్నానదిలోనికి నీరు వదలడం ద్వారా కుందూ పెన్నా నదులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఉన్న పరివాహక ప్రాంతాలకు తాగునీటి సమస్య ఉత్పన్నం కాదన్నారు. రాయలసీమలో వర్షాలు పడకపోయినా కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రలలో వర్షాలు విస్తారంగా వర్షాలు పడటంతో అల్‌మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండుకుండాలా మారిపోయి అదనంగా పైనుంచి ఇంకా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోనికి వదులుతున్నారన్నారు. దీని ద్వారా రైతుల పంటలసాగుకు నీరు అందే అవకాశం ఉందన్నారు. 2005లో దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలో అన్నిపార్టీల సమావేశాన్ని నిర్వహించారని గుర్తు చేశారు.
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని ఒక్కసారిగా తీసుకుని వెళ్లేవిధంగా చర్యలు చేపడితే అప్పట్లో మాజీ మంత్రి దేవినేని ఉమ ఇలా తీసుకుని పోవడం వల్ల నాగార్జున సాగర్‌కు నీరు వచ్చే అవకాశంలేదంటూ అడ్డుకోవడం జరిగిందన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ వాసులు తాగు,సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మొండిగా హెడ్‌రెగ్యులేటర్ స్థాయిని పెంచి గాలేరు–నగరి సుజలస్రవంతి ద్వార గండికోట ప్రాజెక్టుకు నీటిని రప్పించే ప్రయత్నం చేశారన్నారు.
రాష్ట్రంలోరాజన్నరాజ్యం
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలనలో రాజన్నరాజ్యం ఆవిష్కృతమవుతోందన్నారు. గతంలో టీడీపీ హాయంలో ఒక్కసారి మాత్రమే ఎన్నికల ముందు కృష్ణజలాలను గండికోటకు నీటిని రప్పించారన్నారు. జగన్ పాలనలో మూడు నెలల కాలంలోనే గండికోట, మైలవరం, పైడిపాలెం, సర్వారాయసాగర్, వామికొండ ప్రాజెక్టులలో సైతం నీటిని నింప డం జరుగుతుందన్నారు. ఇది చదవండి : వైఎస్ హయాంలో రైతే రాజు
జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం ప్రాం తాల ప్రజలకు తాగునీటికి ఇబ్బందిలేకుండా చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో కరు వు కాటకాలతో ప్రజలు అల్లాడిపోయారన్నారు. నేడు జగన్ పాలనలో ప్రాజెక్టులన్ని నీటితో కళకళలాడుతున్నాయన్నారు. మరో రెండునెలల కాలంలో వర్షాలు పడే అవకాశం ఉందని తిరిగి శ్రీశైలం నిండిపోయి మరోసారి గండికోట, మైలవరం జలాశయాలలోనీటిని నింపుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment