బనగానపల్లే ఎమ్మెల్యేపై మండిపడ్డ కాటసాని రాంరెడ్డి!
Published Fri, May 23 2014 7:30 PM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM
కర్నూలు: తన వర్గీయులపై బనగానపల్లే ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ఫిర్యాదు చేయడంపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా తిరిగి ఫిర్యాదు చేయడాన్నిఎస్పీ రాఘురామిరెడ్డి దృష్టికి కాటసాని రామిరెడ్డి తీసుకువెళ్లారు. బీసీ జనార్ధనరెడ్డి ఫిర్యాదును పరిశిలీంచి తగిన విచారణ జరిపిస్తామని కాటసానికి ఎస్పీ రఘురామిరెడ్డి హామీ ఇచ్చారు.
తను ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టేందుకు యత్నించారని వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ ఎంఎల్ఏ బీసీ జనార్దనరెడ్డి కర్నూలు జిల్లా బేతంచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement