ఓటమి భయంతో దాడులకు తెగబడిన బనగానపల్లె టీడీపీ అభ్యర్థి
ఓట్ల కోసం అడ్డదారుల్లో డబ్బు పంపకాలు, ప్రలోభాలకు యత్నం
లేదంటే భౌతిక దాడులు, దౌర్జన్యాలు
ప్రశాంత నియోజకవర్గంలో అల్లర్లు సృష్టిస్తున్న వైనం
కోవెలకుంట్ల: ఓ వైపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటం.. మరో వైపు ప్రజల్లో సరైన ఆదరణ కనిపించకపోవడంతో టీడీపీ అభ్యర్థుల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో బనగానపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్‌రెడ్డి ఎలాగైనా ఓటర్లను నయానో.. భయానో తమ వైపు మళ్లించుకునేందుకు ప్రధాన అస్త్రాలను బయటకు తీస్తున్నాడు. ఇప్పటికే రెండు నెలల నుంచి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాడు.
వీటి ద్వారా గెలుపుసాధ్యం కాదని భావించి తాజాగా భౌతిక దాడులకు దిగాడు. మంగళవారం బనగానపల్లె పట్టణంలో కూరగాయల మార్కెట్ వద్ద బీసీ జనార్ధన్‌రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ సమక్షంలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. రౌడీయిజం ప్రదర్శిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కర్రలు, రాడ్లతో దాడిచేశాయి. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల వేళ ఓటమి భయంతో బరితెగింపు చర్యలకు పాల్పడటంతో ఓటర్లు భయాందోళన చెందుతున్నారు.
వ్యాపారవేత్తగా భూకబ్జాలతో కోట్లాది రూపాయలు గడించిన బీసీ జనార్దన్‌రెడ్డి 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేశాడు. ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలపై విశ్వరూపం చూపాడు. ప్రభుత్వ ఉద్యోగులకు నరకం చూపించాడు. ఐదేళ్లపాటు నీరు– చెట్టుపేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును దోచుకున్నాడు. దీంతో 2019 ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు బీసీకి బుద్ధి చెప్పి ఓడించారు. ఈ నెల 13వ తేదీన 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉండటంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో డబ్బులు, ప్రలోభాలు, భౌతిక దాడులను ఎన్నికల అ్రస్తాలుగా ఎంచుకున్నాడు.
ప్రజా బలం లేక..
2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమం, అభివృద్ధితో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి నవరత్న పథకాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యత కలి్పంచి పేదరిక నిర్మూలను కృషి చేశారు. పేదలు, పెత్తందారుల మధ్య జరుగుతున్న ఎన్నికల్లో పెత్తందారులు టీడీపీ వైపు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షాన పోరాటం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ బనగానపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డికి గ్రామాల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేక ఈ ఎన్నికల్లో మరలా ఓటమి తప్పదని భావించాడు. ఎలాగైనా గెలవాలన్న కుతంత్రంతో బరి తెగింపు చర్యలకు పాల్పడుతున్నాడు. నియోజకవర్గంలో ఆ పారీ్టకి ప్రజాబలం లేకపోవడంతో డబ్బును ప్రధాన అస్త్రం చేసుకుంది. అరకొరగా నిర్వహిస్తున్న ప్రచారానికి సైతం అద్దె కార్యకర్తలపై ఆధార పడాల్సి రావడంతో ఆ పార్టీ శ్రేణులను కలవర పరుస్తోంది.
సొంత నేతలకు వడ్డీ లేని రుణాలు..ఓటర్లకు టోకెన్లు
ఎన్నికలు సమీపిస్తుండంతో గెలుపుకోసం బీసీ కుయుక్తులకు తెరలేపాడు. పారీ్టలో చేరిన వైఎస్సార్‌సీపీ గ్రామ నాయకులకు కేడర్‌ను బట్టి రూ. 3 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు డబ్బులు ముట్టజెప్పాడు. ఇందులో ఎక్కువభాగం కొలిమిగుండ్ల మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీలో చేరిన వైఎస్సార్‌సీపీ నాయకులకు డబ్బులు అందజేశాడు. అలాగే టీడీపీలో కొనసాగుతున్న నాయకులకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నాడు.
ఒక్కో నాయకుడికి రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షలవరకు వడ్డీలేని రుణాలు ఇచ్చాడు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు ఓటరుస్లిప్‌లు అందజేస్తున్నారు. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్ గ్యారెంట్’ పేరుతో ఓటరు స్లిప్‌కు మరోవైపు టోకన్ ముద్రించిన స్లిప్‌లు పంపిణీ చేశారు. త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఓటుకు రూ. 3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2 వేల చొప్పున డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. డబ్బులు పంపిణీ చేసే రోజు ఓటర్‌స్లిప్‌కు ఉన్న టోకెన్ చూపించిన వారికి డబ్బులు అందజేయనున్నారు. టీడీపీ సానుభూతి పరులైన ఓటర్లు, తటస్ట ఓటర్లకు స్లిప్‌లు పంపిణీ చేశారు.
హత్యాయత్నం కేసులో జైలు..
మొదటి నుంచి బీసీ జనార్ధన్‌రెడ్డికి క్రూరస్వభావం ఉంది. ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకుని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టే నైజం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆ పారీ్టకి అనుకూలంగా ఉన్నాడన్న నెపంతో బనగానపల్లె పట్టణానికి చెందిన ఎస్టీ వర్గానికి చెందిన కోనేటి దుర్గ అనే వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ కేసులో బీసీ నెల రోజులపాటు కటకటాలపాలైన విషయం తెలిసిందే. ఆ క్రూరత్వాన్ని మళ్లీ ప్రదర్శిస్తున్నాడు. సామ, వేద, దండోపాయాలు ప్రదర్శించి ఎన్నికల్లో గెలవాలని కుతంత్రం చేస్తున్నాడు. ఎన్నికలకు ముందే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న బీసీ రాబోయే రోజుల్లో మరెంత బరి తెగిస్తాడని బనగానపల్లె ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వ్యక్తికి త్వరలో జరగబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లు నిర్ణయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment