BC Janardhan Reddy
-
Banaganapalle: ఓటమి భయంతో దాడులకు తెగబడిన బీసీ జనార్ధన్‌రెడ్డి
కోవెలకుంట్ల: ఓ వైపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటం.. మరో వైపు ప్రజల్లో సరైన ఆదరణ కనిపించకపోవడంతో టీడీపీ అభ్యర్థుల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో బనగానపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్‌రెడ్డి ఎలాగైనా ఓటర్లను నయానో.. భయానో తమ వైపు మళ్లించుకునేందుకు ప్రధాన అస్త్రాలను బయటకు తీస్తున్నాడు. ఇప్పటికే రెండు నెలల నుంచి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. వీటి ద్వారా గెలుపుసాధ్యం కాదని భావించి తాజాగా భౌతిక దాడులకు దిగాడు. మంగళవారం బనగానపల్లె పట్టణంలో కూరగాయల మార్కెట్ వద్ద బీసీ జనార్ధన్‌రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ సమక్షంలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. రౌడీయిజం ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై కర్రలు, రాడ్లతో దాడిచేశాయి. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల వేళ ఓటమి భయంతో బరితెగింపు చర్యలకు పాల్పడటంతో ఓటర్లు భయాందోళన చెందుతున్నారు. వ్యాపారవేత్తగా భూకబ్జాలతో కోట్లాది రూపాయలు గడించిన బీసీ జనార్దన్‌రెడ్డి 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేశాడు. ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలపై విశ్వరూపం చూపాడు. ప్రభుత్వ ఉద్యోగులకు నరకం చూపించాడు. ఐదేళ్లపాటు నీరు– చెట్టుపేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును దోచుకున్నాడు. దీంతో 2019 ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు బీసీకి బుద్ధి చెప్పి ఓడించారు. ఈ నెల 13వ తేదీన 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉండటంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో డబ్బులు, ప్రలోభాలు, భౌతిక దాడులను ఎన్నికల అ్రస్తాలుగా ఎంచుకున్నాడు.ప్రజా బలం లేక.. 2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమం, అభివృద్ధితో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి నవరత్న పథకాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యత కలి్పంచి పేదరిక నిర్మూలను కృషి చేశారు. పేదలు, పెత్తందారుల మధ్య జరుగుతున్న ఎన్నికల్లో పెత్తందారులు టీడీపీ వైపు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల పక్షాన పోరాటం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్సార్సీపీ బనగానపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డికి గ్రామాల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేక ఈ ఎన్నికల్లో మరలా ఓటమి తప్పదని భావించాడు. ఎలాగైనా గెలవాలన్న కుతంత్రంతో బరి తెగింపు చర్యలకు పాల్పడుతున్నాడు. నియోజకవర్గంలో ఆ పారీ్టకి ప్రజాబలం లేకపోవడంతో డబ్బును ప్రధాన అస్త్రం చేసుకుంది. అరకొరగా నిర్వహిస్తున్న ప్రచారానికి సైతం అద్దె కార్యకర్తలపై ఆధార పడాల్సి రావడంతో ఆ పార్టీ శ్రేణులను కలవర పరుస్తోంది. సొంత నేతలకు వడ్డీ లేని రుణాలు..ఓటర్లకు టోకెన్లు ఎన్నికలు సమీపిస్తుండంతో గెలుపుకోసం బీసీ కుయుక్తులకు తెరలేపాడు. పారీ్టలో చేరిన వైఎస్సార్సీపీ గ్రామ నాయకులకు కేడర్‌ను బట్టి రూ. 3 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు డబ్బులు ముట్టజెప్పాడు. ఇందులో ఎక్కువభాగం కొలిమిగుండ్ల మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ నాయకులకు డబ్బులు అందజేశాడు. అలాగే టీడీపీలో కొనసాగుతున్న నాయకులకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నాడు. ఒక్కో నాయకుడికి రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షలవరకు వడ్డీలేని రుణాలు ఇచ్చాడు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు ఓటరుస్లిప్‌లు అందజేస్తున్నారు. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్ గ్యారెంట్’ పేరుతో ఓటరు స్లిప్‌కు మరోవైపు టోకన్ ముద్రించిన స్లిప్‌లు పంపిణీ చేశారు. త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఓటుకు రూ. 3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2 వేల చొప్పున డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. డబ్బులు పంపిణీ చేసే రోజు ఓటర్స్లిప్కు ఉన్న టోకెన్ చూపించిన వారికి డబ్బులు అందజేయనున్నారు. టీడీపీ సానుభూతి పరులైన ఓటర్లు, తటస్ట ఓటర్లకు స్లిప్‌లు పంపిణీ చేశారు. హత్యాయత్నం కేసులో జైలు..మొదటి నుంచి బీసీ జనార్ధన్‌రెడ్డికి క్రూరస్వభావం ఉంది. ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకుని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టే నైజం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ పారీ్టకి అనుకూలంగా ఉన్నాడన్న నెపంతో బనగానపల్లె పట్టణానికి చెందిన ఎస్టీ వర్గానికి చెందిన కోనేటి దుర్గ అనే వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ కేసులో బీసీ నెల రోజులపాటు కటకటాలపాలైన విషయం తెలిసిందే. ఆ క్రూరత్వాన్ని మళ్లీ ప్రదర్శిస్తున్నాడు. సామ, వేద, దండోపాయాలు ప్రదర్శించి ఎన్నికల్లో గెలవాలని కుతంత్రం చేస్తున్నాడు. ఎన్నికలకు ముందే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న బీసీ రాబోయే రోజుల్లో మరెంత బరి తెగిస్తాడని బనగానపల్లె ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వ్యక్తికి త్వరలో జరగబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లు నిర్ణయించుకున్నారు. -
40 ఏళ్లుగా పార్టీకి సేవ చేశా.. కేఈ ప్రభాకర్ ఆవేదన
నంద్యాల: ఇప్పటికే ప్రజాదరణ లేని తెలుగు దేశం పార్టీలో నాయకుల మధ్య అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకుంటోంది. ఇటీవల వరుస సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. 40 ఏళ్లుగా పార్టీకి సేవలు చేసిన తమను సంప్రదించకుండానే డోన్ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జ్గా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును ప్రకటించడం పెద్ద తప్పిదమని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఇటీవల తన జన్మదిన వేడుకల్లో అధినేత చంద్రబాబును తీరును తప్పుబట్టారు. దీంతో కేఈ ప్రకటన ఇచ్చిన మరునాడే నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ డోన్‌కు వచ్చి టీడీపీ ఇన్చార్జ్గా ధర్మవరం సుబ్బారెడ్డే కొనసాగుతారని, అది పార్టీ నిర్ణయమని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు చేయాలే తప్పా పత్రికలకు ఎక్కరాదని ఆయన పరోక్షంగా కేఈ ప్రభాకర్‌తో పాటు ఆయన వర్గీయులను తీవ్రంగా హెచ్చరించారు. మల్లెల రాజశేఖర్‌తో ప్రెస్‌మీట్ నిర్వహించిన వారిపై సోషల్‌మీడియాలో కేఈ వర్గీయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా వారి గ్రామాల్లో సర్పంచుగా గెలవలేని దద్దమ్మలని దుమ్మెత్తిపోశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వీరిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని కేఈ వర్గీయులు ఘాటు విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఇచ్చే ప్యాకేజీ కోసం ఆశపడి ఇక్కడ ఇన్‌చార్జ్‌ను నియమించారని గుమ్మకొండ సర్పంచ్ దశరథ రామిరెడ్డి ఆరోపించారు. ఏ ఒక్కరితో సంప్రదించకుండా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్గా ధర్మవరం సుబ్బారెడ్డిని ఎలా నియమిస్తారని చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌పై కూడా కేఈ వర్గీయులు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. మరోసారి మల్లెల రాజశేఖర్ ప్రెస్‌మీట్ నిర్వహించడానికి డోన్‌కు వస్తే అడుగు పెట్టనివ్వమని కేఈ వర్గీయులు తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు. -
Kurnool, Nandyal: టీడీపీలో రగులుతున్న అసమ్మతి మంటలు
తెలుగుదేశం పార్టీలో అసమ్మతి మంటలు రగులుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఆ పార్టీ అధిష్టానంపై ధిక్కారస్వరం వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డోన్ అభ్యరి్థగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు ప్రకటించిన తర్వాత వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా డోన్ నుంచి కేఈ కుటుంబం పోటీ చేస్తుందని కేఈ వ్యాఖ్యానించడం చూస్తే నేరుగా అధిష్టానంతోనే అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారనేది స్పష్టమవుతోంది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో టీడీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం ఈ అంశమే తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షిప్రతినిధి కర్నూలు: టీడీపీలోని బలమైన కుటుంబాల్లో కేఈ కుటుంబం ఒకటి. ముఖ్యంగా డోన్ నియోజకవర్గాన్ని 40 ఏళ్లుగా తమ గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 2014 నుంచి కేఈ ప్రతాప్ టీడీపీ ఇన్చార్జ్గా కొనసాగారు. 2014, 2019లో డోన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఈ క్రమంలో ఏడాది కిందట ధర్మవరం సుబ్బారెడ్డిని టీడీపీ ఇన్చార్జ్గా నియమించారు. ఆపై డోన్ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఏకంగా సుబ్బారెడ్డిని అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటనపై కేఈ కుటుంబం తీవ్రంగా రగిలిపోయింది. కేఈ వర్గీయులు బహిరంగంగా సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించారు. బహిరంగ విమర్శలు చేశారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయినా చంద్రబాబు తీరు మారలేదు. రాజకీయంగా బలపడే ఉద్దేశంతోనే ‘బీసీ’ పావులు కర్నూలు, నంద్యాల జిల్లా టీడీపీలో కేఈ, భూమా కుటుంబాల పెత్తనం సాగుతోంది. 2019 ఎన్నికల్లో కోట్ల కుటుంబం కూడా సైకిలెక్కింది. ఈ మూడు కుటుంబాల పెత్తనమే సాగుతుందని, వీరికి చెక్ పెట్టి రెండు జిల్లాల రాజకీయాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనేది టీడీపీ బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండటంతో చంద్రబాబుకు కూడా బీసీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్చార్జ్గా కూడా నియమించారు. అధిష్టానం వద్ద ఉన్న చొరవతో జిల్లాలో బలమైన కుటుంబాలను బలహీన పరిచేలా పావులు కదుపుతున్నారు. తొలుత కేఈ కుటుంబం బలం తగ్గించేందుకు పత్తికొండకే పరిమితం చేసి డోన్ టిక్కెట్ దక్కకుండా ధర్మవరం సుబ్బారెడ్డి వెనుక తానే ఉండి వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ ఖర్చు కూడా తానే భరిస్తానని బీసీ ఇచ్చిన హామీతోనే సుబ్బారెడ్డిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భూమా, కేఈ కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నారు. వీరిని దెబ్బతీసేందుకు కుటుంబానికి ఒకే టిక్కెట్ ప్రతిపాదన బీసీనే చంద్రబాబు వద్ద పదే పదే ప్రతిపాదించారని తెలుస్తోంది. దీంతో కుటుంబానికి ఒకే టిక్కెట్ అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. ఆళ్లగడ్డలో అఖిలకు టిక్కెట్ ఇస్తే, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డికి కాకుండా మైనార్టీ కోటాలో ఫరూక్ కుమారుడు ఫిరోజ్‌కు టిక్కెట్ ఇస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. అలాగే కోట్ల సుజాతమ్మకు టిక్కెట్ దక్కకుండా ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి బోయ, కురబలను బరిలోకి దింపితే బాగుంటుందని బీసీనే ప్రతిపాదించారని సమాచారం. ఈ దెబ్బతో కోట్ల కుటుంబం నుంచి కూడా సుజాతమ్మకు టిక్కెట్ దక్కే అవకాశాలు ఉండవు. దీంతో కేఈ, భూమా, కోట్ల కుటుంబాల బలం తగ్గించడంతో పాటు తాను ప్రతిపాదించిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తే ఎన్నికల ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బీసీ తనకంటూ కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉండి, ఉమ్మడి జిల్లాలో బలమైన నేతగా ఎదగాలని పథకం రచించారు. దీన్ని అమలు చేయడంలో భాగంగానే ఒక్కొక్క పావు కదుపుతున్నారని టీడీపీలోని కీలక నేతలు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా డోన్ నుంచే పోటీ కేఈ ప్రభాకర్ జన్మదినాన్ని బుధవారం డోన్‌లోని ఓ ఫంక్షన్‌హాలులో ఘనంగా నిర్వహించారు. ఓరకంగా కేఈ బలపరీక్ష నిర్వహించారు. ఈ వేదికపై నుంచి కేఈ ప్రభాకర్ ఏకంగా చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేశారు. ‘జనబలం లేనివారిని ఇన్చార్జ్గా నియమించారు. వీరితో పారీ్టకి ప్రయోజనం లేదు. వచ్చే ఎన్నికల్లో కేఈ కుటుంబం కచ్చితంగా పోటీలో ఉంటుంది’ అని తేలి్చచెప్పారు. అంతటితో ఆగకుండా తనకు జనబలంతో పాటు ధనబలం కూడా ఉందనే సంగతి మరవొద్దన్నారు. టిక్కెట్ ఇవ్వకపోతే జన, ధన బలంతో ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతామని కేఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆపార్టీ తో పాటు అన్ని పారీ్టల్లో తీవ్ర చర్చకు తెరలేపాయి. అసలు ఈ వివాదానికి ఆద్యుడు బీసీ జనార్దన్‌రెడ్డి అని కేఈ కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దిగజారుతున్న ప్రతిష్ట కర్నూలుకు వచ్చిన ‘న్యాయరాజధాని’కి వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబుకు జిల్లా వాసుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత ఉధృతం కానుంది. ప్రజలంతా ‘న్యాయరాజధాని’ కావాలనే భావనలో ఉండటం, చంద్రబాబు దానికి భిన్నంగా వ్యవహరించడం టీడీపీకి పెద్ద అడ్డంకి. దీన్ని దాటుకుని ముందుకు వెళ్లడమే కష్టమనే భావనలో ఉన్న టీడీపీని అంతర్గత రాజకీయాలు, నేతల ధిక్కారస్వరాలు మరింత దిగజారుస్తున్నాయి. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ కార్యకర్త దుర్గాప్రసాద్‌పై హత్యాయత్నం కేసు విచారణ నిమిత్తం సోమవారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని వర్చువల్ ద్వారా ఆళ్లగడ్డ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరిచారు. జనార్ధన్‌రెడ్డికి14 రోజుల రిమాండ్ విధిస్తూ కర్నూలు సబ్‌జైలుకు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. కాగా బనగానపల్లె పాత బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్‌పై దాడి కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనుచరులతో కలిసి దుర్గాప్రసాద్‌పై రాడ్లతో జనార్ధన్‌రెడ్డి దాడికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడైన జనార్ధన్‌రెడ్డి సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రగాయాల పాలైన దుర్గా ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: Munna Gang: హైవే కిల్లర్‌తో పాటు 10 మందికి ఉరిశిక్ష -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్
సాక్షి, కర్నూలు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బనగానపల్లె పాత బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్‌పై దాడి కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనుచరులతో కలిసి దుర్గాప్రసాద్‌పై రాడ్లతో జనార్ధన్‌రెడ్డి దాడికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు జనార్ధన్‌రెడ్డి సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రగాయాల పాలైన దుర్గా ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ నేతల దాడి ఈ–పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి -
ఎన్నికలలో ఖాకీల పైసా వసూల్
సాక్షి, కర్నూలు: ఎన్నికలు ఓటర్లకే కాదు..పోలీసులకూ పండుగగా మారాయా? సహకారం పేరిట భారీగా వివిధ పార్టీల నేతల వద్ద మామూళ్లు తీసుకున్నారా? ఏకంగా ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి కోటి రూపాయలకుపైగా వసూలు చేశారా? అనే విచిత్ర ప్రశ్నలకు అంతే చిత్రంగా అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఎన్నికల సమయంలో స్టేషన్ల వారీగా పోలీసులు ఎంత మొత్తాన్ని వివిధ పార్టీల నుంచి తీసుకున్నారంటూ సేకరించిన వివరాల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు మొదలుకుని కానిస్టేబుళ్ల వరకూ వివిధ పార్టీ నేతల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వివరాలను పోలీసు ఉన్నతాధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో స్టేషన్లో ఒక్కో కథ బయటకు వచ్చినట్టు సమాచారం. అయితే, బనగానపల్లె నియోజకవర్గంలో మాత్రం ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుంచి కోటి రూపాయల మేర తీసుకున్నట్టు తేలడంతో ఉన్నతాధికారులే నోరెళ్లబెట్టినట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోని ప్రతీ స్టేషన్‌లోని పోలీసు సిబ్బందికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నుంచి భారీగా నగదు ముట్టినట్టు విచారణలో తేలింది. అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా కూడా ఇందుకు అనుగుణంగా సదరు అభ్యర్థికి సహకరించారు. వీరంతా ఎన్నికల ఫలితాల తర్వాత బాధపడినట్టు కూడా సమాచారం. ఇక జిల్లాల్లో కొన్ని మినహా మెజార్టీ స్టేషన్లలో ఈ మేరకు వసూళ్ల పర్వం నడిచినట్టు తేలింది. ఈ నివేదికను ఉన్నతాధికారులకు జిల్లా పోలీసు యంత్రాంగం రహస్యంగా అంజేసింది. ఇందుకు అనుగుణంగా సదరు అధికారులపై చర్యలుండే అవకాశం ఉందని కూడా పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడే అత్యధికం...! వాస్తవానికి ఎన్నికలు అంటేనే కోట్ల రూపాయలు డబ్బు వరదలా పారే పరిస్థితి నడుస్తోంది. అందులోనూ అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డంగా దోచుకున్న కోట్ల డబ్బును ఖర్చు చేసి అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఓటర్లతో పాటు పోలీసులకు కూడా భారీగా డబ్బును వెదజల్లారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పోలీసులు ఎంత మేర వసూలు చేశారన్న అంశంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఏయే డీఎస్సీ, సీఐ, ఎస్ఐలు ఎంత మేర వసూలు చేశారన్న అంశంపై ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారుల ద్వారా పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఇందులో ఆశ్చర్యకరంగా బనగానపల్లె నియోజకవర్గంలోని పోలీసు అధికారులు ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నుంచి ఏకంగా రూ.కోటి మేర మామూళ్లు తీసుకున్నట్టు తేలింది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల్లో కూడా విధులు సక్రమంగా నిర్వర్తించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ముగ్గురు డీఎస్పీలు మినహా మిగిలిన వారందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయడంతో పాటు తమ విధులను నిర్లక్ష్యం చేశారన్న నివేదికలు కూడా పోలీసు ఉన్నతాధికారులు చేరాయి. మొత్తం మీద ఎన్నికల ఫలితాల కంటే ఇప్పుడు ఈ వసూళ్ల ఫలితాలే పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయనడంలో అతిశయోక్తి లేదు. -
బనగానపల్లెలో టీడీపీకి షాక్
-
కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్
సాక్షి, కర్నూలు: ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీని వీడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అధికార పార్టీ నేతలు మధ్య రోజు రోజుకు విభేదాలు పెరుగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చెర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి సోమవారం పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు తన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇష్టపూర్వకంగా రాజీనామా సమర్పిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, చల్లా రామకృష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. -
ఎమ్మెల్యే ప్రొగ్రెస్ రిపోర్ట్ బి సి జనార్థన్ రెడ్డి
-
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ బీ.సీ. జనార్థన్‌రెడ్డి
-
సీఎం వద్దకు కర్నూలు నేతల పంచాయితీ..
సాక్షి, అమరావతి : టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా నేతల రాజకీయాలు రాజధానికి చేరాయి. గత కొంతకాలంగా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి మంత్రి అఖిల ప్రియ, ఎమ్మెల్యే భుమా బ్రహ్మనందరెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల వారిద్దరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా ఫిర్యాదు చేశారు. అమరావతిలోని సీఎం నివాసంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు కర్నూల్ జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశంలోపార్టీ బలోపేతంపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక అఖిల ప్రియ, జనార్థన్ రెడ్డి వ్యవహారంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. గతంలో బీసీ జనార్థన్ రెడ్డి సీఎంను కలిసి తన బాధను వివరించినట్లు తెలిసింది. వారి మధ్య విభేదాల కారణంగా మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్‌కు సైతం జనార్థన్ రెడ్డి గైర్హాజరయిన విషయం తెలిసిందే. గతంలో మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలు సీఎం వద్దకు చేరిన విషయం విదితమే. -
చంద్రబాబు పర్యటనలో బయటపడ్డ విభేదాలు!
సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం చంద్రబాబు పర్యటనకు ఏపీ మంత్రి హోదాలో ఉన్న భూమా అఖిలప్రియ హాజరుకాలేదు. మంత్రి అఖిలప్రియ బాటలో నడుచుకుంటూ బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి, మరికొందరు టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనకు గైర్హాజరయ్యారు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అలకబూనిన జనార్ధన్‌రెడ్డి.. మొన్న మినీ మహానాడు, నిన్న మహానాడు, ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న నవనిర్మాణ దీక్షలకు హాజరు కాలేదు. ఏకంగా సీఎం చంద్రబాబు పర్యటనకు పార్టీ ఎమ్మెల్యే గైర్హాజరు కావడం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో నవనిర్మాణ దీక్షకు చంద్రబాబు హాజరైన విషయం తెలిసిందే. -
ప్రజాభిప్రాయ సేకరణలో టీడీపీ ఎమ్మెల్యే హల్చల్
సాక్షి, కర్నూలు జిల్లా : రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణలో టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి హల్చల్ చేశారు. వివరాలు..కొలిమిగుండ్ల మండలం మీర్జాపురంలో జరుగుతున్న ప్రజాభిప్రాయసేకరణలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు స్వాగతించారు. అయితే సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడని ప్రజలు ఆరోపించారు. తన స్వార్థం కోసం ఫ్యాక్టరీని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని ప్రజలు హెచ్చరించారు. అదే విధంగా స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లుగా నిరుద్యోగ భృతి రావడం లేదంటూ అధికారులను, ప్రభుత్వాన్ని వైఎస్సార్సీప నాయకులు నిలదీశారు. దాంతో కలెక్టర్ ముందే టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి రెచ్చిపోయారు. టీడీపీ ప్రభుత్వ చొరవతోనే పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని ఎమ్మెల్యే ఎదురు దాడికి దిగి తీవ్రవిమర్శలు చేశారు. దీంతో ప్రజలు ఎదురుతిరిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రంగ ప్రవేవంతో వివాదం సద్దుమణిగింది. -
ఆ ఊరికి రోడ్డొద్దు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సాధారణంగా ఫలానా గ్రామానికి రోడ్డు వేయండి అని ప్రతిపాదించడం ప్రజా ప్రతినిధుల విధి. అయితే, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఫలానా గ్రామానికి రోడ్డు వేయవద్దంటూ నాలుగేళ్లుగా అడ్డుపడుతున్నారు. తన సంస్థకు కాకుండా మరో కాంట్రాక్టు సంస్థకు పనులు దక్కడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మూడేళ్లుగా ఏదో ఒక కొర్రీ వేస్తూ.. అధికారులను బెదిరిస్తూ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాకుండా అధికారపార్టీకి చెందిన బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. వాస్తవానికి అవుకు మండల కేంద్రం నుంచి గుండ్ల శింగవరం గ్రామానికి 13 కిలోమీటర్ల రోడ్డు వేసేందుకు కేంద్ర ప్రభుత్వంప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద రూ.7.48 కోట్లు మంజూరు చేసింది. ఇందుకోసం 2014 సెప్టెంబరులో పంచాయతీరాజ్‌శాఖ టెండర్లను పిలిచింది. ఈ టెండర్లను శ్రీలక్ష్మీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ సంస్థ తక్కువ ధరకే (లెస్‌కు) కోట్ చేసి దక్కించుకుంది. అయితే, సంస్థకు టెండర్ నిబంధనల మేరకు అర్హత లేదని మొదట్లో కొర్రీలు వేసిన ఎమ్మెల్యే.... ఆ తర్వాత భూ సేకరణ సమస్య పేరుతో రోడ్డు వేయకుండా అడ్డుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఈ గ్రామాల పరిధిలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలముండటమే కాకుండా... తన సంస్థకు పనులు దక్కకపోవడమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టు అప్పగించినా....! బనగానపల్లె నియోజకవర్గంలోని అవుకు మండల కేంద్రం నుంచి జి. శింగవరం గ్రామానికి రోడ్డు వేసేందుకు 2015లోనే టెండర్లను పిలిచారు. అయితే, వివిధ కొర్రీలు వేస్తూ ఎమ్మెల్యే ఈ టెండర్లను అడ్డుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకు కారణం ఈ టెండర్ తన సంస్థకు కాకుండా మరో సంస్థకు రావడమే. సుమారు రూ.8 కోట్ల విలువ చేసే ఈ రోడ్డు పనులను మరో కాంట్రాక్టు సంస్థకు దక్కడంతో అడ్డుకుని... కాంట్రాక్టు రద్దు చేయించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే, సదరు కాంట్రాక్టు సంస్థ కోర్టుకు వెళ్లి మరీ ఆదేశాలు తెచ్చుకోవడంతో ఇప్పుడు భూ సేకరణ సమస్యను ఎమ్మెల్యే తెరమీదకు తెస్తున్నట్టు తెలుస్తోంది. మొదట్లో టెండర్ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్వోఏ) ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. తీరా కోర్టు నుంచి అక్షింతలు రావడంతో అధికారులు ఎల్వోఏ ఇవ్వాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు పనులు ప్రారంభించకుండా నంద్యాల డివిజన్ పరిధిలోని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఈఈ)పై ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకోసం భూమిని కోల్పోయే రైతులు.. 2017లో కోర్టును ఆశ్రయించారని, దానిపై ఆదేశాలు వచ్చే వరకూ పనులు ప్రారంభించవద్దని ఒత్తిళ్లు తెస్తున్నారు. ఒకవేళ పనులు ప్రారంభిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఏకంగా ఈ నెల 3వ తేదీన ఆయన లేఖ రాయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఒత్తిళ్లతో పనులు ప్రారంభించకుండా అధికారులు అడ్డుకుంటున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు వేయకపోతే రానున్న వర్షాకాలంలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మెట్టుపల్లె, రామవరం, గుండ్ల శింగవరం గ్రామ ప్రజలు వాపోతున్నారు. రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది వర్షాకాలంలో మా గ్రామానికి చేరుకోవాలంటే నరకం చూడాల్సి వస్తోంది. బీటీ రోడ్డు పూర్తయితే నాలుగు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. అంతేగాక రైతులు పంట ఉత్పత్తులు ఇళ్లకు, మార్కెట్‌కు తరలించేందుకు ఇబ్బందులు తొలగుతాయి.దేవరకొండ శివశంకర్, గడ్డమేకలపల్లె -
బనగానపల్లె ఎమ్మెల్యేకు షాక్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/బనగానపల్లె రూరల్: బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డికి సొంతూరులో షాక్ తగిలింది. గ్రామంలోని బంధువులంతా సోమవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరి షాక్ ఇచ్చారు. 13వ రోజు ప్రజా సంకల్పయాత్రను జగన్మోహన్రెడ్డి సోమవారం బనగానపల్లె నుంచి ప్రారంభించారు. బత్తులూరుపాడు మీదుగా ఎమ్మెల్యే సొంతూరు యనకండ్లకు చేరుకోగా ఆయన బంధువర్గంలోని రామ్మోహన్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి, సాధుల శివశంకర్‌రెడ్డి, మరో 20 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనకండ్ల గ్రామం జన సంద్రాన్ని తలపించింది. గ్రామస్తులు పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పూల వర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి బారులు తీరి కనిపించారు. -
బనగానపల్లే ఎమ్మెల్యేపై మండిపడ్డ కాటసాని రాంరెడ్డి!
కర్నూలు: తన వర్గీయులపై బనగానపల్లే ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ఫిర్యాదు చేయడంపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా తిరిగి ఫిర్యాదు చేయడాన్నిఎస్పీ రాఘురామిరెడ్డి దృష్టికి కాటసాని రామిరెడ్డి తీసుకువెళ్లారు. బీసీ జనార్ధనరెడ్డి ఫిర్యాదును పరిశిలీంచి తగిన విచారణ జరిపిస్తామని కాటసానికి ఎస్పీ రఘురామిరెడ్డి హామీ ఇచ్చారు. తను ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టేందుకు యత్నించారని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ ఎంఎల్ఏ బీసీ జనార్దనరెడ్డి కర్నూలు జిల్లా బేతంచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.