సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం చంద్రబాబు పర్యటనకు ఏపీ మంత్రి హోదాలో ఉన్న భూమా అఖిలప్రియ
హాజరుకాలేదు. మంత్రి అఖిలప్రియ బాటలో నడుచుకుంటూ బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి, మరికొందరు టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనకు గైర్హాజరయ్యారు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై
అలకబూనిన జనార్ధన్‌రెడ్డి.. మొన్న మినీ మహానాడు, నిన్న మహానాడు, ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న నవనిర్మాణ దీక్షలకు హాజరు కాలేదు. ఏకంగా సీఎం చంద్రబాబు పర్యటనకు పార్టీ ఎమ్మెల్యే గైర్హాజరు కావడం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో నవనిర్మాణ దీక్షకు చంద్రబాబు హాజరైన విషయం తెలిసిందే.
చంద్రబాబు పర్యటనలో బయటపడ్డ విభేదాలు!
Published Sun, Jun 3 2018 3:26 PM | Last Updated on Sun, Jun 3 2018 4:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment