టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి(పాత చిత్రంం)
సాక్షి, కర్నూలు జిల్లా : రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణలో టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి హల్‌చల్ చేశారు. వివరాలు..కొలిమిగుండ్ల మండలం మీర్జాపురంలో జరుగుతున్న ప్రజాభిప్రాయసేకరణలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు స్వాగతించారు. అయితే సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడని ప్రజలు ఆరోపించారు. తన స్వార్థం కోసం ఫ్యాక్టరీని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని ప్రజలు హెచ్చరించారు.
అదే విధంగా స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లుగా నిరుద్యోగ భృతి రావడం లేదంటూ అధికారులను, ప్రభుత్వాన్ని వైఎస్సార్సీప నాయకులు నిలదీశారు. దాంతో కలెక్టర్ ముందే టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి రెచ్చిపోయారు. టీడీపీ ప్రభుత్వ చొరవతోనే పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని ఎమ్మెల్యే ఎదురు దాడికి దిగి తీవ్రవిమర్శలు చేశారు. దీంతో ప్రజలు ఎదురుతిరిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రంగ ప్రవేవంతో వివాదం సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment