
చల్లా రామకృష్ణారెడ్డి
సాక్షి, కర్నూలు: ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీని వీడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అధికార పార్టీ నేతలు మధ్య రోజు రోజుకు విభేదాలు పెరుగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
టీడీపీకి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చెర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి సోమవారం పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు తన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇష్టపూర్వకంగా రాజీనామా సమర్పిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, చల్లా రామకృష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment