
సాక్షి, అమరావతి : టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా నేతల రాజకీయాలు రాజధానికి చేరాయి. గత కొంతకాలంగా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి మంత్రి అఖిల ప్రియ, ఎమ్మెల్యే భుమా బ్రహ్మనందరెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల వారిద్దరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా ఫిర్యాదు చేశారు. అమరావతిలోని సీఎం నివాసంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు కర్నూల్ జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
ఈ సమావేశంలోపార్టీ బలోపేతంపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక అఖిల ప్రియ, జనార్థన్ రెడ్డి వ్యవహారంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. గతంలో బీసీ జనార్థన్ రెడ్డి సీఎంను కలిసి తన బాధను వివరించినట్లు తెలిసింది. వారి మధ్య విభేదాల కారణంగా మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్‌కు సైతం జనార్థన్ రెడ్డి గైర్హాజరయిన విషయం తెలిసిందే. గతంలో మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలు సీఎం వద్దకు చేరిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment