minister akhila priya
-
కేటీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి అఖిల ప్రియ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులతో పాటు మంగళవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లను కలిశారు. ఈనెల 29న జరగనున్న తన పెళ్లికి రావాలని వారిని స్వయంగా ఆహ్వానించారు. పారిశ్రామికవేత్త భార్గవ్‌రామ్ నాయుడితో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఆమె వివాహం జరగనుంది. రాజకీయ, సినిమా ప్రముఖులను మంత్రి అఖిలప్రియ ఆహ్వానించేందుకు ఆమె హైదరాబాద్ వచ్చారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వివాహ విందు ఇవ్వనున్నారు. అఖిలప్రియ, భార్గవ్ రామ్‌లకు మే 12న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. -
సీఎం వద్దకు కర్నూలు నేతల పంచాయితీ..
సాక్షి, అమరావతి : టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా నేతల రాజకీయాలు రాజధానికి చేరాయి. గత కొంతకాలంగా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి మంత్రి అఖిల ప్రియ, ఎమ్మెల్యే భుమా బ్రహ్మనందరెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల వారిద్దరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా ఫిర్యాదు చేశారు. అమరావతిలోని సీఎం నివాసంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు కర్నూల్ జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశంలోపార్టీ బలోపేతంపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక అఖిల ప్రియ, జనార్థన్ రెడ్డి వ్యవహారంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. గతంలో బీసీ జనార్థన్ రెడ్డి సీఎంను కలిసి తన బాధను వివరించినట్లు తెలిసింది. వారి మధ్య విభేదాల కారణంగా మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్‌కు సైతం జనార్థన్ రెడ్డి గైర్హాజరయిన విషయం తెలిసిందే. గతంలో మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలు సీఎం వద్దకు చేరిన విషయం విదితమే. -
అఖిలప్రియకు ఇగో సమస్యే..!
-
చంద్రబాబు వ్యాఖ్యలతో కంగుతిన్న అఖిలప్రియ
సాక్షి, అమరావతి : ఇప్పటికే శాఖపరంగా పలు విమర్శలు ఎదుర్కొంటున్న పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి అఖిలప్రియ.. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతో కంగుతిన్నట్లు సమాచారం. కృష్ణానది పవిత్ర సంగమం వద్ద టూరిజం బోటు ప్రమాదంపై ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే 22 మంది చనిపోయారన్న ముఖ్యమంత్రి... గతంలో శాఖపరమైన వైఫల్యాలకు మంత్రులు రాజీనామాలు చేసేవారని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆ దుర్ఘటనకు మంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా అంటూ మంత్రి అఖిలప్రియను ఉద్దేశించి చంద్రబాబు అనడంతో ఆమె ఒక్కసారిగా కంగుతిన్నారు. అంతేకాకుండా సహచర మంత్రులు, అధికారుల సమక్షంలోనే చంద్రబాబు ఈ సూచనలు చేయడం గమనార్హం. అఖిలప్రియను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చర్చకు దారి తీసింది. అంతేకాకుండా అఖిల ప్రియను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ వైపు బోటు ప్రమాద ఘటనపై పార్టీలో బ్లేమ్ గేమ్ జరుగుతోంది. ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు న్యాయం చేయకుండా... టీడీపీలో తాపీగా తప్పొప్పులపై వాదనలు జరుగుతున్నాయి. 22 మంది చనిపోవడంతో పాటు, బినామీ పేర్లతో ఇద్దరు మంత్రులకు బోట్లు ఉన్నాయన్న వార్తలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా, టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి మూడేళ్ల పాటు టూరిజం శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఆయన హయాంలోనే బోట్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. తన నుంచి దృష్టి మరల్చడానికే మంత్రిపై నెపం నెట్టేసే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోతే ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోని విషయం తెలిసిందే. కాగా కృష్ణానదిలో పడవ బోల్తా దుర్ఘటనకు పర్యాటక శాఖ మంత్రే బాధ్యత వహించాలని టీడీపీలో ఓ వర్గం వాదిస్తుంటే... మరోవైపు ఇరిగేషన్ శాఖే బాధ్యత వహించాలని మంత్రి అఖిలప్రియ వర్గం వాదిస్తోంది. బెదిరించి, ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్న అధినేత తమను పట్టించుకోవట్లేదని భూమా వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా ఏమాత్రం విలువ లేని శాఖను అఖిలప్రియకు ఇచ్చారని, పార్టీలో చేరేముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, ఆ అసంతృప్తితోనే అఖిలప్రియ బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోతున్నారని చెబుతోంది. ఏరు దాటాక తెప్ప తగలెస్తారా అంటూ అఖిల వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలకు అడపాదడపా హాజరవడం తప్పితే, పనులను ఏమాత్రం పట్టించుకోవట్లేదని మంత్రి అఖిలప్రియపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు పార్టీలో సీనియర్ నాయకులను సైతం ఏమాత్రం గౌరవించట్లేదని, మంత్రి పదవి చేపట్టాక జిల్లా సీనియర్ నాయకులను మర్యాద పూర్వకంగానైనా కలవకపోవడం పట్ల పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షల్లోను మంత్రి పనితీరుకు మైనస్ మార్కులు పడినట్లు తెలుస్తోంది. -
చంద్రబాబు వ్యాఖ్యలతో అఖిలప్రియ షాక్
-
మరో వివాదంలో మంత్రి అఖిలప్రియ
సాక్షి, అమరావతి : ఇటీవలే జరిగిన పడవ బోల్తా వివాదం నుంచి బయట పడక ముందే పర్యాటక శాఖా మంత్రి అఖిలప్రియ మరో వివారంలో చిక్కుకున్నారు. అదే ఆదివారం జరిగిన ‘ సోషల్ మీడియా సమ్మిట్ 2017 అవార్డు’ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు విషయమే మరో వివాదానికి తెరతీసింది. ఆదివారం ఏపీ రాజధాని అమరావతిలో సోషల్ మీడియా సమ్మిట్-2017 జరిగింది. ఈ సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె, టాలీవుడ్ హీరో రానా, సంగీత దర్శకుడు అనిరుధ్, షార్ట్ ఫిల్మ్ హాస్యనటుడు వైవా హర్షలకు అవార్డులు అందజేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అక్కడే సమస్య మొదలైంది. ఏపీ నిర్వహించిన కార్యక్రమం కాబట్టి టాలీవుడ్ నటులకు ఇవ్వాలికానీ, బాలీవుడ్ నటికి ఎలా ఇస్తారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ విషయంపై నెటిజన్లు సైతం ఘాటుగానే విమర్శిస్తున్నారు. తాజాగా దీపిక నటించిన పద్మావతి సినిమా వివాదాల్లో ఉంది. అలాంటిది ప్రత్యేకంగా దీపికకు అవార్డు ఇవ్వడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ లో దీపిక స్థాయిలో ఎవరూ కనిపించలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నంది అవార్డుల వివాదంలో సతమతమౌతున్న ప్రభుత్వానికి, మంత్రి అఖిల ప్రియ మరో తలనొప్పి తెచ్చిపెట్టారంటూ సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. -
ప్రైవేట్ బోటు ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్నారు
-
అఖిలప్రియకు పదవీ గండం?
సాక్షి, అమరావతి: కొత్తగా మంత్రివర్గంలో చేరిన ఆ యువ మహిళా మంత్రికి పదవీ గండం పొంచిఉందనే వార్తలు ఏపీ తెలుగుదేశంలో గుప్పు మంటున్నాయి. విధులను సక్రమంగా నిర్వహించట్లేదనే నెపంతో బాధ్యతలనుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. సమీక్షా సమావేశాల్లో ఆ యువ మంత్రి పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయంట. అయితే కొత్త మోజు పాత బూజు అన్న చందంగా అఖిల ప్రియ పనితీరు ఉందని పార్టీ అధిస్టానంతో పాటు, సీనియర్లు భావిస్తున్నారు. గత కొంత కాలంగా అఖిల ప్రియ బాధ్యతలను సరిగా పట్టించుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది. మంత్రి కార్యాలయంలో ఫైళ్లు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని వాటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు. ఇన్ని రోజులు నంద్యాల ఉపఎన్నికల ప్రచార, నిర్వహణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారనుకుంటే, ఎన్నికలు అయిపోయి ఒకటిన్నర నెలలవుతున్నా చేయాల్సిన పనులపై ఏమాత్రం దృష్టి పెట్టట్లేదని సమాచారం. ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలకు అడపాదడపా హాజరవడం తప్పితే, పనులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంతేకాదు పార్టీలో సీనియర్ నాయకులను సైతం ఏమాత్రం గౌరవించట్లేదని, మంత్రి పదవి చేపట్టాక జిల్లా సీనియర్ నాయకులను మర్యాద పూర్వకంగానైనా కలవకపోవడం పట్ల పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ప్రారంభంలో ప్రసంశించిన ముఖ్య మంత్రి సైతం అఖిల ప్రియ తీరుపై కోపంగా ఉన్నారని సమాచారం. కాన్ఫరెన్స్ మీటింగులకు కూడా మొక్కుబడిగా హాజరవుతున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షల్లోను మంత్రి పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయి. దీంతో అఖిల ప్రియను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే భూమా వర్గం వాదన మరోలా ఉంది. బెదిరించి, ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్న అధినేత తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏమాత్రం విలువ లేని శాఖను అఖిల ప్రియకు ఇచ్చారని విమర్శించారు. పార్టీలో చేరేముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, ఆ అసంతృప్తితోనే అఖిల ప్రియ బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోతోందని చెబుతున్నారు. ఏరు దాటాక తెప్ప తగలెస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో అధికార పార్టీ వేధింపులు, ప్రలోభాలకు పార్టీ మారిన భూమానాగిరెడ్డి మంత్రిపదవి రాకుండానే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పార్టీలో చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే సమయంలో నంద్యాల ఉపఎన్నికల్లో గెలవడానికి భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియకు మంత్రివర్గ విస్తరణలో పర్యాటక శాఖ కేటాయించారు. పదవి చేపట్టిన తొలినాళ్లలో శాఖా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అఖిలప్రియను మెచ్చుకున్నారు. -
మా నాన్న.. మీ దరిద్రాన్ని మోశాడు
– వ్యాపారులపై మంత్రి అఖిల అనుచిత వ్యాఖ్యలు సాక్షి బృందం, నంద్యాల: నంద్యాల వ్యాపారులపై మంత్రి అఖిలప్రియ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు. ఆమె మాటలు విన్న వ్యాపారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదెక్కడి చోద్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నంద్యాలలోని గాంధీచౌక్ సమీపంలో ఉన్న కూరగాయల మార్కెట్లో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు అఖిలప్రియ, కాలవ శ్రీనివాసులు, చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరూక్, షరీఫ్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ నౌమన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ.. ‘మా నాన్న భూమా నాగిరెడ్డి మీ దరిద్రాన్ని మోశాడు. కావున మార్కెట్ వ్యాపారులంతా మా వెంట నిలబడాల’ంటూ వ్యాఖ్యానించారు. పైగా వారికి కొన్ని హామీలు కూడా ఇస్తూ మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. -
టీడీపీలో చేరికల లొల్లి !
► ఇంతియాజ్ చేరికతో అలిగిన రామకృష్ణారెడ్డి ►బుజ్జగించేందుకు మంత్రి విఫలయత్నం ►ఏవీ సుబ్బారెడ్డితో రాయబారం పంపాలని ప్రయత్నం ►ససేమిరా అన్న ఏవీ కర్నూలు: అధికార పార్టీలో చేరికల లొల్లి మొదలైంది. మొదటి నుంచీ పార్టీలో ఉన్న తమను కనీసం సంప్రదించకుండానే కొత్త వారిని చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల నేషనల్ కాలేజీ అధినేత ఇంతియాజ్ అహ్మద్‌ను అధికార పార్టీ చేర్చుకుంది. నేరుగా సీఎం సమక్షంలో ఆయన్ను చేర్చుకోవడం, తమను కనీసం సంప్రదించకపోవడంపై రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి అలిగినట్టు తెలుస్తోంది. మొదటి నుంచీ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. పార్టీకి కట్టుబడి ఉన్న తనను కనీసం అడగకుండానే ఇంతియాజ్‌ను చేర్చుకోవడంపై రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురికావడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మంగళవారం మొత్తం ఇంటికే పరిమితమైనట్లు సమాచారం. ఆయన్ను బుజ్జగించేందుకు మంత్రి అఖిలప్రియ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డితో మాట్లాడించాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నించగా.. ఇందుకు ఏవీ విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డి కూడా అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఫలించని బుజ్జగింపులు స్థానిక పరిస్థితులు తెలియకుండా బయటి నుంచి వచ్చిన వ్యక్తులతో కలిసి మంత్రి అఖిలప్రియ పార్టీలో చేరికలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఇదే తరహాలో ఇంతియాజ్ చేరికపై రామకృష్ణారెడ్డి గుర్రుగా ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు మంత్రి మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకూ ప్రయత్నించారు. అయితే, ఆయన చల్లబడలేదని సమాచారం. ఇదే తీరు కొనసాగితే రానున్న రోజుల్లో తమకు ఏమి విలువ ఉంటుందని వాపోతున్నారు. అదే బాటలో ఏవీ.. రామకృష్ణారెడ్డిని మంత్రి ఎంతగా బుజ్జగించినా ఫలితం లేకపోవడంతో తుదకు ఏవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దించేందుకు టీడీపీ పెద్దలు ప్రయత్నించారు. అయితే, ఇందుకు ఏవీ అంగీకరించలేదని తెలిసింది. తనకు కూడా ఇదే తరహాలో అవమానం జరుగుతుంటే.. ఇక తాను ఏ విధంగా రామకృష్ణారెడ్డిని బుజ్జగించగలనని ఆయన వాపోయినట్టు సమాచారం. స్థానిక నేతలను పూర్తిగా పక్కనపెట్టి.. బయటి నుంచి వచ్చిన మంత్రులతో మొత్తం వ్యవహారాలు నడిపిస్తుంటే ఇక తామెందుకు ఉండటమన్న రీతిలో పలువురు అధికార పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని గ్రామాలతో పాటు నంద్యాల పట్టణంలో కూడా పలువురు నేతల మధ్య విభేదాలు ప్రారంభమైనట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ విభేదాలతో అసలుకే మోసం వచ్చి పాత నేతలు జారుకునే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. -
వేడెక్కుతున్న నంద్యాల రాజకీయాలు
-
మంత్రిగారి ఓవరాక్షన్
-
పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయండి
- మంత్రి భూమా అఖిలప్రియ ఆదేశం - కలెక్టర్‌తో కలిసి అధికారులతో సమీక్ష కర్నూలు(అర్బన్): నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి భూమా అఖిలప్రియ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్ ఎస్.సత్యనారాయణతో కలసి శనివారం రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి పనుల విషయంలో సమస్యలుంటే కలెక్టర్‌తోపాటు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నంద్యాలలో రహదారి విస్తరణకు సెంట్రల్ లైనింగ్ మార్క్ పనుల ఆలస్యంపై మున్సిపల్ కమిషనర్‌ను ఆరా తీశారు. స్ట్రక్చర్ల వాల్యుయేషన్ పూర్తి చేసి సంబంధీకులకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆళ్లగడ్డకు మంజూరైన రూ.43 లక్షల పనులను ప్రారంభించాలన్నారు. నంద్యాల మురికివాడల్లో వీధి లైట్లు ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులు తీర్చాలన్నారు. గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరై కట్టుకోకుండా ఉన్న వారిని గుర్తించి ఇతరులకు కేటాయించాలన్నారు. ఏడాది కాలంగా పూర్తి కాని గృహనిర్మాణాలను రద్దు చేయాలని జిల్లాకలెక్టర్ ఎస్.సత్యనారాయణ హౌసింగ్ పీడీని ఆదేశించారు. రుద్రవరం, శిరివెళ్ల, దొర్నిపాడు, ఆళ్లగడ్డ మండలాల్లో గృహనిర్మాణాల కోసం భూమి కొనుగోలు చేసినా అర్హులైన లబ్ధిదారులకు గృహాలు కేటాయించడంలో అధికారులు అలక్ష్యం చేస్తున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాలు మంజూరు చేసిన వారికి ముందుగా నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, నంద్యాల ఆర్డీఓ రాంప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది
– మంత్రితో ఇండోర్ సబ్ స్టేషన్‌కు భూమి పూజ చేయించాలని అధికారపార్టీ నేతల యత్నం – అడ్డుకున్న కేసీ కెనాల్ అధికారులు, స్థానికులు నంద్యాల: పొన్నాపురంలో ఇళ్ల మధ్య, పంచాయతీ అనుమతి లేకుండా కేసీ కెనాల్ పాత భవనాన్ని కూల్చి ఇండోర్ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాలనే మంత్రి భూమా అఖిలప్రియ వర్గం ప్రయత్నం బెడిసికొట్టింది. మంత్రి అఖిలప్రియతో భూమిపూజ చేయించాలని ఆమె వర్గీయులు యత్నించగా సోమవారం స్థానికులు, కేసీ కెనాల్ అధికారులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో మంత్రి అఖిలప్రియ నంద్యాలపై దృష్టి పెట్టి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రారంభోత్సవాలు, భూమి పూజలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల బైపాస్‌రోడ్డు ప్రారంభం, నాబార్డు నిధుల కింద మంజూరైన అబాండంతాండ–పెద్దకొట్టాల–అయ్యలూరు మెట్ట వరకు నిర్మించే బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో అధికారపార్టీకి చెందిన కౌన్సిలర్ సోదరుడికి పొన్నాపురంలో రూ.13 కోట్లతో 33/11 కేవీ సామర్థ్యం గల ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి సబ్ కాంట్రాక్ట్ దక్కింది. ఉప ఎన్నిక దృష్ట్యా ఈ నేత మంత్రి అఖిలప్రియతో భూమిపూజ చేయించాలని యత్నించి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణపై ఒత్తిడి తెచ్చారు. స్థానికుల్లో వ్యతిరేకత... పొన్నాపురంలోని ప్రభుత్వ స్థలంలో లస్కర్ల కోసం కేసీ కెనాల్ అధికారులు గదులను నిర్మించారు. ఈ గదులు శిథిలావస్థకు చేరినందున గ్రామ సచివాలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని పంచాయతీ చేసిన తీర్మానం పెండింగ్‌లో ఉంది. అయితే, రెవెన్యూ అధికారులు దీనికి అనుమతి ఇవ్వకుండా, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఇండోర్ విదు్యత్ సబ్ స్టేషన్నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. రెవెన్యూ అధికారుల మౌఖికి ఆదేశాలతో కేసీ కెనాల్ గదులను ప్రొక్లైన్‌తో కూల్చడానికి వెళ్లిన ట్రాన్స్‌కో అధికారులను కేసీ కెనాల్ అధికారులు, స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. చివరకు కేసీ కెనాల్పాత భవన కూల్చివేత పనులు మధ్య ఆపేసి వెళ్లిపోయారు. కాగా అందరికీ అనుకూలంగా, ఎలాంటి వివాదం లేని స్థలంలో ఇండోర్ సబ్‌స్టేషన్‌ను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. -
మరోసారి భూమా, శిల్పా వర్గాల మధ్య విభేదాలు
-
మరోసారి భూమా, శిల్పా వర్గాల మధ్య విభేదాలు
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో భూమా, శిల్పా వర్గాల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారశైలిలపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల మున్సిపాలటీ అధికారులు, కౌన్సిలర్లతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తొలిసారి మంత్రి అఖిలప్రియ పాల్గొన్నారు. అయితే చైర్పర్సన్ దేశం సులోచన రాకముందే భూమా అఖిల ప్రియ సమావేశం ప్రారంభించారు. కాస్త ఆలస్యంగా సమావేశంలో పాల్గొన్న చైర్‌పర్సన్‌కు మంత్రి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో తమ వర్గానికి మాట్లాడే అవకాశం ఎందుకివ్వరని సులోచన అఖిలప్రియను ప్రశ్నించారు. చైర్ పర్సన్ రాకముందే మీటింగ్ ప్రారంభించడం కాకుంగా చైర్పర్సన్ పట్ల అఖిల ప్రియ కనీస మర్యాద లేకుండా ప్రవర్తించడంతో చైర్ పర్సన్ భర్త, కోఆప్షన్ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. భూమా అఖిల ప్రియ తమ వార్డులలో సమస్యలు ఉంటే చెప్పాలని అడుగుతున్నారే తప్ప చైర్పర్సన్ కు అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సమావేశంలో ఉండగానే తనకు కర్నూల్ వెళ్లాల్సి ఉందని, మీరు మాట్లాడుకోండి అని అఖిలప్రియ అనడంతో సుధాకర్ రెడ్డి వెంటనే లేచి మంత్రి గారు మీకు ఇది సబబుకాదని.. చైర్ పర్సన్ కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అలా ఎలా వెళ్లిపోతారని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌ను అఖిల ప్రియ అవమానించారని సుధాకర్ రెడ్డి తెలిపారు. మంత్రి అయి ఉండి ఇలా చేయడం చాలా భాధ కలిగించిందని.. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. అలాగే చైర్పర్సన్ అనుమతి లేకుండా సమావేశానికి వస్తే సహించేది లేదని ఘాటుగా స్పందించారు.