మా నాన్న.. మీ దరిద్రాన్ని మోశాడు
– వ్యాపారులపై మంత్రి అఖిల అనుచిత వ్యాఖ్యలు
సాక్షి బృందం, నంద్యాల: నంద్యాల వ్యాపారులపై మంత్రి అఖిలప్రియ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు. ఆమె మాటలు విన్న వ్యాపారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదెక్కడి చోద్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నంద్యాలలోని గాంధీచౌక్ సమీపంలో ఉన్న కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి మంత్రులు అఖిలప్రియ, కాలవ శ్రీనివాసులు, చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరూక్, షరీఫ్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ నౌమన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ.. ‘మా నాన్న భూమా నాగిరెడ్డి మీ దరిద్రాన్ని మోశాడు. కావున మార్కెట్ వ్యాపారులంతా మా వెంట నిలబడాల’ంటూ వ్యాఖ్యానించారు. పైగా వారికి కొన్ని హామీలు కూడా ఇస్తూ మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు.