
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులతో పాటు మంగళవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లను కలిశారు. ఈనెల 29న జరగనున్న తన పెళ్లికి రావాలని వారిని స్వయంగా ఆహ్వానించారు. పారిశ్రామికవేత్త భార్గవ్‌రామ్ నాయుడితో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఆమె వివాహం జరగనుంది. రాజకీయ, సినిమా ప్రముఖులను మంత్రి అఖిలప్రియ ఆహ్వానించేందుకు ఆమె హైదరాబాద్ వచ్చారు.
సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వివాహ విందు ఇవ్వనున్నారు. అఖిలప్రియ, భార్గవ్ రామ్‌లకు మే 12న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment