
సాక్షి, అమరావతి: అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా చివరి దశలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. విశాఖ, కర్నూలు నగరాలపై విద్వేషం చిమ్మడం మానేయాలని హితవు పలికారు. టీడీపీ గెలిచిన 23 చోట్ల కూడా చంద్రబాబు పేరు చెబితే ప్రజలు భగ్గుమంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పైశాచిక ఎత్తుగడలు రచించడం, కుళ్లు, కుతంత్రాలు చేయడం సహా అనుకూల మీడియాతో కల్లబొల్లి కథనాలు వండి వార్చే పద్ధతులకు స్వస్తి పలికితే బాగుంటుందన్నారు.(చదవండి: ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపండి: సజ్జల)
ఈ మేరకు.. ‘‘చంద్రబాబుగారూ.. ఎన్నికలు జరిగి 14నెలలు కూడా ముగియలేదు. మీరు గెలిచిన ఆ 23 చోట్లకూడా మీపేరు చెప్తే భగ్గుమంటున్నారు. అలాంటి మీరు అమరావతి పేరు మీద దొంగపోల్స్ పెడుతున్నారు. మీ టీవీలు, మీ పేపర్లు, మీ వెబ్‌సైట్లలో పెట్టే పోల్స్‌లో ఫలితాలు ఎలా వస్తాయో అందరికీ తెలుసు’’ అని సజ్జల ట్విటర్ వేదికగా మంగళవారం ఎద్దేవా చేశారు. (చదవండి: చంద్రబాబుకు అమరావతి అక్షరాలా కామధేనువే)
రాజకీయంగా చివరిదశలో ఉన్నమీరు ఇప్పటికైనా కళ్లు తెరవండి.ఈ పైశాచిక ఎత్తుగడలు మానేయండి. కుళ్లు, కుతంత్రాలు విడిచిపెట్టండి.మీ మీడియాతో కల్లబొల్లి కథనాలు వండి వార్చేపద్ధతులు వదిలేయండి.విశాఖ, కర్నూలు నగరాలపై ద్వేషాన్ని చిమ్మకండి. అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతు ఇవ్వండి.2/2
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) August 25, 2020