![Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/12/22/SRK.jpg.webp?itok=9uwQfSij)
సాక్షి, అమరావతి: ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు తెలంగాణ యాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబుకు ఏ విషయంపై కూడా క్లారిటీ లేదు. బాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేదు. బీజేపీకి దగ్గరవడానికి చంద్రబాబు తాపత్రయం’’అంటూ సజ్జల మండిపడ్డారు. ప్రభుత్వంపై కావాలనే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం. సంబంధం లేని అంశాలను ముడిపెట్టి అవాస్తవాలు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. చదువుల్లో డిజిటల్ విప్లవానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. పల్నాడులో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. దాడులు వారే చేసి మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.
చదవండి: చంద్రబాబుపై ఎమ్మెల్సీ కవిత షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment