Sajjala Ramakrishna Reddy Comments On CM KCR New BRS Party, Details Inside - Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు మద్దతుపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు

Published Mon, Dec 12 2022 3:12 PM | Last Updated on Mon, Dec 12 2022 4:00 PM

Sajjala Ramakrishna Reddy Comments On KCR BRS Party - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలను ప్రజలను గమనిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు సీఎంగా ఉండగా బెంజ్‌ సర్కిల్‌ను బ్లాక్‌ చేసేవారు.. ఇప్పటికీ చంద్రబాబు, పవన్‌ రోడ్‌షోలు చేస్తూనే ఉన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు.

‘‘భూ సర్వేతో రెవెన్యూ శాఖలో సీఎం జగన్‌ సంస్కరణలు చేస్తున్నారు. భూముల రీసర్వేపై ప్రతిపక్షాలు విమర్శలు సరికావు. చంద్రబాబు సైకో అని ప్రజలు భావిస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని సీఎం జగన్‌ బ్యాలెన్సింగ్‌ చేస్తున్నారు. సమైక్యం కోసం నిలబడ్డ ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ. 8 ఏళ్లైన విభజనపై విచారణ జరుగుతూనే ఉంది. నా వ్యాఖ్యలను రాజకీయం చేయాల్సిన అవసరం లేదు’’అని సజ్జల అన్నారు.

బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని అడిగితే ఏం చేయాలనే విషయంపై ఆలోచిస్తాం. దీనిపై అందరితో చర్చించి సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటారు. రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కర్ణాటక, తమిళనాడులో పోటీ చేసే ఉద్దేశం మాకు లేదు. ఏపీ సంక్షేమం, అభివృద్ధి తప్ప.. సీఎం జగన్‌కు వేరే ఆలోచన లేదు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
చదవండి: ఎక్కడా కూడా రైతులు నిరాశకు గురికాకూడదు: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement