విష ప్రచారం.. బురద జల్లడమే ‘ఈనాడు’ పని.. | Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

విష ప్రచారం.. బురద జల్లడమే ‘ఈనాడు’ పని..

Published Thu, Jul 21 2022 4:33 PM | Last Updated on Thu, Jul 21 2022 10:10 PM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్‌ నెరవేరుస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీలో పాలన కొనసాగుతోందన్నారు. గురువారం ఆయన ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మాజీ సీఎం చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోయారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చదవండి: పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం: సీఎం జగన్‌

‘‘టీడీపీ హయాంలో లక్షా 10 వేల కోట్లకు లెక్కలు లేవు. టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. రాష్ట్రంలో ఏదో తప్పు జరిగిపోతోందన్న తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని’’ సజ్జల దుయ్యబట్టారు.

‘‘వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయ యాత్ర చేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. సీఎం జగన్‌ పాలనపై బురద జల్లడమే ఈనాడు పని. చంద్రబాబు కుర్చీలో కూర్చోబెట్టడానికి తాపత్రయం అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement