సాక్షి, తాడేపల్లి: వరద సాయంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ప్రభుత్వానికి మంచి ఫీడ్ బ్యాక్ ఉందన్నారు. చంద్రబాబు చెప్పేదంతా అబద్ధమని తేలిపోయిందని.. పరామర్శ కంటే ప్రచారానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని సజ్జల అన్నారు.
చదవండి: ‘గోదారమ్మ శాంతించింది కాబట్టే.. టీడీపీ నేతలు బతికి బయటపడ్డారు’
‘‘ఎలాంటి సాయం అందలేదని ప్రూవ్ చేయడం కోసం చంద్రబాబు వరద పర్యటన చేశాడు. కానీ అక్కడ మాకు సాయం అందలేదని ఎవరూ చెప్పలేదు. ఆయన వరద పర్యటనకు వెళ్లారా...ప్రచారానికి వెళ్లారా?. పూర్తిగా పచ్చి అబద్ధాలను చెప్తూ పోతున్నారు. 40 ఏళ్ల చంద్రబాబు అబద్ధపు జీవితాన్ని ఇంకా కొనసాగిస్తూ చివరి స్థాయికి చేరారు. అబద్ధాలే నిజమనుకునే స్థాయి నుంచి అబద్దమే జీవితం అన్నట్లుగా మారాడు. అధికారం అనేది తన హక్కు అని భావించి, దానికి భంగం కలిగితే తట్టుకోలేకపోతున్నాడు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు.
టీడీపీ హయాంలో వచ్చిన విపత్తులకు చంద్రబాబు ఏ రోజైనా ఒక్క పైసా తక్షణ సాయం చేశాడా. విపత్తులో చీపురు పట్టుకుని ఫోజులు ఇచ్చారు.. తప్ప చేసిందేమీ లేదు. ప్రజలకు ఎలా అండగా ఉండాలనేది వదిలి.. స్క్రీన్ పై నేనుండాలి అనుకున్నాడు. మీడియాలో కనపడాలనే యావ ఆయన్ని అలా తయారు చేసిందని’’ సజ్జల ఎద్దేవా చేశారు.
‘‘వ్యవస్థ వికేంద్రీకరణ జరిగి అధికారులు చాలా బాగా పనిచేశారు. 12వ తేదీనే సీఎం వైఎస్ జగన్ ముందస్తు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అప్రమత్తం చేశారు. వెంటనే వరద ప్రభావిత జిల్లాలకు 9.4 కోట్లు చొప్పున విడుదల చేశారు. నీ జన్మకు ఏ రోజైనా ముందస్తు నిధులు ఇచ్చి అధికారులను అప్రమత్తం చేశావా...?’ అంటూ చంద్రబాబును సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment