‘ఉద్యమ’ కేసులపై కోర్టుకు హాజరైన ఎమ్మెల్యేలు | Guntakal YSRCP Leaders Attend JFCM Court | Sakshi
Sakshi News home page

‘ఉద్యమ’ కేసులపై కోర్టుకు హాజరైన ఎమ్మెల్యేలు

Published Fri, Jan 22 2021 11:29 AM | Last Updated on Fri, Jan 22 2021 11:38 AM

Guntakal YSRCP Leaders Attend JFCM Court - Sakshi

సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 2010లో గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలోని ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో రైల్‌రోకో జరిగింది. దీనికి హాజరైన మైదుకూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో పాటు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిపె అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.

గుంతకల్లు టౌన్‌: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం 2018లో వైఎస్సార్‌సీపీ అధి ష్టానం ఇచ్చిన పిలుపు మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లు వైఎస్సార్‌ సీపీ  నేతలు 11. 04.2018న రైల్‌రోకో నిర్వహించారు. దీనిపై ఆర్‌పీఎఫ్‌ పోలీసులు అప్పటి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ప్రస్తుత ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డితో పాటు పలువురిపై అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గురువారం వీరంతా గుంతకల్లులోని జేఎఫ్‌సీఎం కోర్టుకు హాజరయ్యారు. అలాగే, సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 2010లో గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలోని ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో రైల్‌రోకో జరిగింది. దీనికి హాజరైన మైదుకూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో పాటు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిపె అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ నిమిత్తం  స్థానిక జేఎఫ్‌సీఎం కోర్టుకు హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement